Comment navigation


15818

« 1 ... 1176 1177 1178 1179 1180 ... 1582 »

  1. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి chinna గారి అభిప్రాయం:

    03/09/2010 12:01 pm

    నాకు నచ్చిన ఓ బుజ్జి కుక్క పిల్ల ఇదీ ఒకటీ.

  2. వానా వానా… గురించి telugu4kids గారి అభిప్రాయం:

    03/09/2010 10:36 am

    చాలా బావుంది. ఇలా రాయాలి కదా పిల్లల కోసం!
    ఈ కవితను telugu4kids లో పరిచయం చెయ్య వచ్చా?
    http://telugu4kids.com/TeluguPaatalu.aspx లో “పాప”, “పువ్వులు”, “హరివిల్లు” పరిచయం చేసినట్లు?

    [ఈమాట నుంచి తీసుకోబడింది అని లింకు ద్వారా ప్రస్తావించి మీరు మీ వెబ్‌సైట్లో ఈ కవితను పరిచయం చేసుకోవచ్చును – సం.]

  3. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    03/08/2010 5:03 pm

    ఈ కథానిక పూర్తిగా చదవలేదు. కాబట్టి కథల గురించి రాయడం లేదు. చదివినంత మేరా నిబద్ధత లోపించిన సంకలనంలా అనిపించింది. ముఖ్యంగా ఈ కథానికకి రాసిన ముందుమాట చదివాక ఇది మరీ బలంగా స్థిరపడింది. ఇటువంటి సంకలనాలు ప్రచురించేటప్పుడు ముందుమాట ఎలా రాయకూడదో ఈ కథానిక ముందుమాట చదివితే తెలుస్తుంది. అంతా సోత్కర్షే! అంతా అస్మదీయుల ప్రశంసే!

    అమెరికా కథకి అమెరికా జీవితాన్ని అనుభవించిన వారు కాక, అమెరికన్ ఫ్రెండ్సున్న ఇండియా వాస్తవ్యుల చేత ముందుమాట రాయిస్తే ఎలావుంటుందో ఇది చదివితే స్పష్టంగా తెలుస్తుంది. ముందుమాట రాసిన వారు ఇందులో వచ్చిన కథలన్నీ చదివినట్లుగా అనిపించదు. “ముందుమాట రాయమన్నారు – ఏదో ఒహటి రాయాలి కదా?” అన్నంత తేలిగ్గా రాసిపడేసినట్లనిపించింది. కథల గురించీ, సమస్యల గురించీ, లేదా అమెరికన్ జీవితం గురించీ ఒక్క వాక్యం లేదు.

    తెలుగు సాహిత్యాన్ని అనువాదాల పేరుతో ప్రపంచానికందించిన వెల్చేరు గారి పేరు ఎక్కడా ప్రస్తావించినట్లు లేదు. ఎంతసేపూ ఇండియా రచయితల గోలే!

    బృహత్తరాశయంగా అమెరికా రచయితల కథలు ప్రచురిస్తూ, కనీసం అమెరికాలో చాలా కాలంగా రచనా వ్యాసంగం చేస్తున్న ఒకరిద్దరి చేతయినా ముందు మాట రాయించాలన్న అతి చిన్న ఆలోచన కూడా వంగూరి ఫౌండేషన్ వారికి తట్టలేదంటే ఆశ్చర్యంగా వుంది. వందేళ్ళ కథ సందర్భంగా పుస్తకం అచ్చేసేయాలన్న హడావిడి ప్రతీ పేజీలోనూ కనిపించింది.

    -సాయి బ్రహ్మానందం

  4. అనువాద కళ నా అనుభవాలు గురించి సౌమ్య గారి అభిప్రాయం:

    03/08/2010 5:35 am

    విలువైన వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు!!

  5. సా విరహే తవ దీనా గురించి mOhana గారి అభిప్రాయం:

    03/07/2010 3:29 pm

    బాలవ్యాకరణములో తత్సమ పరిచ్ఛేదములో 45వ సూత్రము – ఇత్తునకు బహువచనంబు పరంబగునపుడు డుత్వంబగు. దానికి ఇచ్చిన ఉదాహరణలు: హరులు – గిరులు – కవులు – రవులు – యామినులు – భామినులు . కాని పదము ఈ-కారముతో అంతమయినయెడల దీర్ఘంబున కుత్వంబు లేదు. ఉదా: శ్రీ – శ్రీలు, స్త్రీ – స్త్రీలు. మీరు చెప్పిన మణి పదము కూడా ఇ-కారాంతమే. కాని సహోదరికి ఒక శ్రేష్ఠత్వాన్ని ఇచ్చే పదము అది. నేను మొట్టమొదట సహోదరీమణులు అని వాడాలని అనుకొన్నా, సహోదరులు అనే పదమే సరియైనదని భావించి దానిని వాడాను. ఈ పదము కూడా భామినిలాటి పదమే. మీ ప్రశ్నకు సమాధానము పై సూత్రములో ఉన్నది. విధేయుడు – మోహన

  6. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/07/2010 2:58 pm

    ఉపేంద్రగారూ!!

    ఈ విషయం మీద మనమిద్దరమే కాకుండా ఇంకెవరైనా అభిప్రాయాలు చెప్థారేమో చూద్దాం!! ఉన్న కధల గురించే మాట్లాడగలం గానీ రాయని కధల్ని గురించి మాట్లాడలేం! నేనన్నది కధలో సిధ్ధాంతం సూటిగా కన్పించకూడదు అని. నేను యజ్ఞం కధలో సూటిగా సిధ్ధాంతం చొరబడి ఉన్నదని అనుకోవడమ్ లేదు. మార్క్సిస్ట్ రచయితని మీకు తెలుసు గనక మాత్రమే వర్గీకరిస్తున్నారు. అంతే గానీ కధలోంచి మనకి నేరుగా పార్టీ పలుకులు ఏమీ వినిపించవు. నేనన్న విషయం అదీ!! గాబ్రియల్ మార్కస్ కధల్లాంటివి తెలుగులో రాలేదు ఇంకా! ఊహలో పేరెన్నికగన్నవారు కన్పించడంలేదు మరి.

    అవును తెలుగువాళ్ళు పట్టణ వాతావరణాన్ని వంటబట్టించుకున్నవాళ్ళు కారు. తెలుగుదేశంలో మాత్రమే కాదు. డయాస్పోరా సైతమ్ తెలుగులో ఇంగ్లాండ్ లో ఉన్నా ..లేక న్యూయార్క్ లొనే ఉన్నా కూడా! పల్లెటూరుకి కొనసాగింపే!![పొట్టి పాంట్లు..జీన్ లూ గట్రా వేసుకున్నా కూడా అది బయటి వేషం మాత్రమేస్మీ!!]! కాస్మోపోలిటిన్ సంస్క్రుతి ఇంకా తెలుగు వాళ్ళలో కనీసం సాహిత్యమ్ సాక్ష్యం గా అయితే మాత్రం కనబడదు.విప్లవ భావజాలాలు ఎన్నో మాత్రం ఇటు కవిత్వాల్లోనూ అటు కధల్లోనూ కూడా నిజాయితితో కాక అలవాటుగానూ..బోలుగానూ.. కృతకంగానూ భేషజంతోనూ[pompus] ఇప్పటికీ కనిపిస్తాయి.

    వస్తువైవిధ్యం లేకపోయినా..లేక వ్యక్తీకరణలొ వైవిధ్యమ్ లేకపోయినా నేను దాన్ని సృజనలేమి గానే చూస్తాను.

    ఇటీవల ఖదీర్ బాబు కధ “కిందనేల ఉంది” అన్నది. డయాస్పోరాకి భిన్నమైన తెలుగు కధ. మొగుడు బయటి దేశంలోనూ పెళ్ళాం తెలుగు నగరంలోనూ ఉన్నప్పుడు ఏర్పడిన మానసిక క్లిష్టతలని చాలా బలంగా చెప్పిన కధగా నేను ఆ కధని గురించి అనుకుంటున్నాను.

    తెలుగు సాహిత్యంలో ఈ ప్రత్యక్ష ‘విప్లవ’ పరిభాష పోయినప్పుడూ.. రచయిత తాను లక్ష్యంగా కాక కేవలమ్ పాఠకులు అనే వాళ్ళని దృష్టిలో ఉంచుకుని రాసే అలవాటుని వదులుకున్నప్పుడూ బహుశా మంచి సాహిత్యం రాడానికి అవకాశమ్ ఉంటుంది. expected stories తగ్గుతాయన్నది ఇక్కడ నా భావం! లేదా మీరన్నట్టూ ఒక కొత్త పాఠకవర్గాన్ని ఏర్పరుచుకుందికి కూడా బలమైన వస్తు వ్యక్తీకరణతోనూ కాల్పనికతతోనూ.. శైలి తోనూ రచయతలు సొంతనేల మీద అది తెలుగు దేశమైనా లేక వేరే దేశమైనా కూడా నిజాయితీగా ప్రయత్నమ్ చెస్తే కూడా మంచి కధలు వచ్చే వీలుంది. అంటే అత్యధికంగా ఇవాళ రాస్తున్న వాళ్ళ నిజాయితీని అలాగే వారి సాహిత్యనిబధ్ధతనీ మీరు అనుమానిస్తున్నారా? అని మళ్ళీ ఎవరన్నా నా వాక్యాల్ని బట్టి తిరిగి నన్ను ప్రశ్నిస్తే మాత్రం ఇప్పటిమటుకు నేను ఔను అనే అంటూ సెలవు తీసుకుంటున్నాను.

    రమ.

  7. సా విరహే తవ దీనా గురించి nagaraju raveender గారి అభిప్రాయం:

    03/07/2010 12:37 pm

    మీ “సా విరహే తవ దీనా” వ్యాసం చాలా బాగుంది. ముఖ్యంగా వివిధ గాయక గాయకీ మణులు పాడిన పాటలను ఒక చోట చేర్చిన మీ కృషి అభినందనీయం. కాని ఒక చిన్న అచ్చుతప్పు దొర్లింది. బాంబే సోదరీమణుల అనడానికి బదులు బాంబే సహోదరుల అని అచ్చయింది.

  8. వానకూడా వింతే! గురించి మారేపల్లి భిక్షం గారి అభిప్రాయం:

    03/07/2010 6:21 am

    నేను ఒక సాహిత్యాభిమానిని.ఎంత కాలమో ఈ అన్వేషణ ఇలాంటి వెబ్ సైట్ కోసం అనుకున్నాను .కాని చాల అ తొందరగా లభించింది.నేను ఇలాంటి సుందర వర్ణణాతితమైన కవితల కోసం ఎదురుచూస్తున్నాను.
    వాన గురించి వర్ణన ఒక వింతగా అనిపించింది.చాలా చక్కటి వర్ణనలతో వర్ణించారు.

  9. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    03/07/2010 5:02 am

    రమ గారూ,

    విషయం సరళంగా క్లుప్తంగా సోదాహరణంగా చెప్పుకోవలసిన అవసరం వుంది కానీ చాలా అడ్డంకులున్నాయి. వొక్క మాటలో చెప్పాలంటే – క్లిష్టమైన విషయాన్ని చెప్పటానికి కావలసిన వాడుక భాష లేదు. వాడుకగా క్లిష్టమయిన విషయాలను వోపికగా చర్చించే సంప్రదాయం మనం పోగొట్టుకున్నాము. దాని స్థానంలో మాయాబజారు సినిమాలో రాక్షస గురువు బోధించిన అస్మదీయులా తస్మదీయులా అన్న వొక్క విషయం తేల్చుకుంటే సరిపోతుందనే సిద్ధాంతం మనలో చాలా మందిమి ఫాలో అవుతున్నాము. మహా అయితే పవర్ పాయింటు బుల్లెట్ల రూపంలో విషయం అర్ధం చేసుకుంటాము. దాని నించి బయట పడి కొత్త సాంప్రదాయాలను నిర్మించుకోవటం ఒక్కరితో, ఒక్క రోజులో అయ్యే పని కాదు.

    అయినా ప్రయత్నం చేయవచ్చును కానీ, నా వుద్దేశ్యం పూర్తి స్థాయి వ్యాసం వ్రాయటం కాదు. వేలూరు గారు వ్రాసిన వ్యాసం మీద ఆలోచించ వలసిన కొన్ని విషయాలను హైలైట్ చెయ్యటమే కాబట్టి, పెద్దగా టైమ్ వెచ్చించకుండా రాసేశాను.

    తెలుగు డయాస్పోరా జీవితాన్ని అర్ధం చేసుకోవాలంటే – తెలుగు భాష మాట్లాడే వాళ్లంతా ఒక జాతికి చెందిన వారు అన్న అభిప్రాయం ఎక్కడినించి వచ్చింది – అన్న దగ్గర మొదలు పెట్టుకోవచ్చును అని అన్నాను నేను. దీనికి సమాధానం చెప్పడం చరిత్రలు రాసే వాళ్ళూ, సాహిత్య విమర్శలు వ్రాసే వారూ చేయ వలసిన పని. విశాలాంధ్ర రాష్ట్రావతరణకి అటూ ఇటూగా జరిగిన సామాజిక చరిత్ర గురించి కథలు ఎవరూ రాయలేదు. పాటలూ పద్యాలూ రాసినట్టు కనపడుతోంది. అవి కూడా వాద ప్రతివాదాల్లో ప్రత్యర్ధులని అవహేళన చేయటానికి మాత్రమే. ఆ సమయానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ ఇప్పుడు జరుగుతున్నా , అస్మదీయులూ తస్మదీయులూ అన్న ప్రశ్నకి అతీతంగా మాట్లాడే వారు వేళ్లమీద లెక్కించడానికి కూడా ఎవరూ లేరు. ఇదంతా తెలుగు భాష గురించి ఆలోచించే వాళ్ళు భాషనీ దాని వుపయోగాలనీ చాలా ఇరుకుగా అర్ధం చేసుకోవటం వలన వచ్చి పడిన నష్టం అని నాకనిపిస్తుంది. ఈ సందర్భంలో సాహిత్య పరంగా నిర్మాణాత్మకమైన పని చేయవలసిన అవసరం ఎంతో వున్నా చేయగలిగిన మనుషులు ప్రస్తుతానికి లేరు. అటువంటి మనుషులు రావటానికి కావలసిన మార్గాలు ఏర్పాటు చేయవలసిన పని ఈ రోజున పాఠకుల బాధ్యతే (పాఠకులు కాకుండా ఎవరూ రచయితలు కాలేరు కాబట్టి – రచయితలను ఇందులోంచి వదిలెస్తున్నాననుకోనవసరమ్ లేదు. చెప్పొచ్చిందేమంటే, క్రిటికల్ రీడింగ్ స్కిల్స్ వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళలో చాలా తక్కువ వుంటారు అని. )

    నేను మొదటిసారి రాసినప్పుడు వుదాహరణలు చెప్పకపోవటానికి ఇదీ ఒక కారణమే. సరళంగా, వుదాహరణలతో వున్న వ్యాసాలు చదవటం అలవాటయిపోయిన చాలా మంది చదువరులు ఇన్స్టంట్ జడ్జ్ మెంటులకి అలవాటు పడి పోయారు. చదివిన తరువాత కొంచెం ఆలోచించి చదివిన దాన్ని స్వంతం చేసుకునే ఓపిక ఎవరికీ లేక పోవటంతో — వుదాహరణల మీదే దృష్టి కేంద్రితమైపోయి రెడీ మేడ్ అభిప్రాయాలతో టేబుల్ టెన్నిస్ ఆట మొదలవుతుంది. అది జరగకుండా ఎట్లా రాయాలి అన్నది నాకూ తెలియదు.

    వుదాహరణకి – సిద్ధాంతాన్ని సృజనలోకి యధా తధంగా తీసుకు రాకూడదు అన్న మీ అభిప్రాయమే తీసుకుందాము. నిజానికి మీరు మంచి కథల్లో లెక్క వేసిన కాళీపట్నం రామారావు గారు యజ్ఞం కథలో చేసినది – ఒక మార్క్సిస్టు సిద్ధాంతాన్ని యధా తధంగా కథ రూపంలో చెప్పటమే. కథకుడిగా ఆయనకి వున్న నైపుణ్యం వల్లనా, పాఠకులలో ఆ సిద్ధాంతమేమిటో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది వుండటం వల్లనా ఆ విషయం ఎవరికీ తెలియక పోయి వుండవచ్చు. ప్రీమిటివ్ అక్యూములేషన్ – అంటే ఫ్యూడల్ సంబంధాల ద్వారా పోగు పడిన వ్యవసాయరంగంలోని మిగులు ధనం పెట్టుబడిగా మారే క్రమం – అందులో మన స్థల కాల పరిస్థితులలో ఏ భావజాలాలు ఏ పాత్ర వహిస్తున్నాయి – ఎక్కడ నించి మొదలు పెట్టుకుంటే ఈ క్రమాన్ని విరగకొట్ట వచ్చును అన్న ఆలోచన ఆ కధ రాసే నాటికి – సీపీయెమ్ పార్టీలో నాయకత్వానికీ కార్యకర్తలకీ మధ్య తీవ్ర వైరుధ్యాలకి దారి తీసింది. రామారావు గారు – ఆ వైరుధ్యాలలో ఒక పక్షం వహించి – ఆ సిద్ధాంతానికి కధ రూపం ఇచ్చారు. కాబట్టే, ఆ కధకి పెద్ద యోగ్యతా పత్రం ఇచ్చింది కథకులో సాహిత్య విమర్శకులో కాదు. ఆ పని చేసినది ఆ సిద్ధాంతాలను బలంగా నమ్మిన ఆర్ధిక శాస్త్రవేత్త – ఆర్ ఎస్ రావు గారు. అంటే – కధ వెనకాతల పరిణతి చెందుతున్న ఒక రాజకీయ లక్ష్యమూ, ఒక తాత్విక దృక్పధము వున్నాయి. మొగ్గ తొడుగుతున్న మావోయిస్టు సిద్ధాంతం వుంది (అది పుబ్బలో మాడి పోయిందన్నది వేరే విషయం).

    ఈ కధ గురించి, కధకుడి గురించి తెలుసుకోవలసిన విషయం మరొకటుంది. రామారావు గారు, ఈ కధ వ్రాసిన తరువాత ఇరవయ్యేళ్లు పైగా మళ్ళీ ఒక్క కధ కూడా రాయలేదు. ఆ వ్యవధిలో ఆయన వ్రాసిన వాటిలో చెప్పుకోదగ్గదేమయినా వుంటే , అది – ‘నేనేందుకు వ్రాయటం లేదు’ అన్న వ్యాసమే. అందులో కూడా ఆయన ఏవో వ్యక్తిగతమైన కారణాలు చెప్తారే కానీ నమ్మదగిన కారణమేమీ స్పష్టంగా చెప్పరు. ఇరవయ్యేళ్ళ తరువాత, మావోయిస్టు వుద్యమంలో మళ్ళీ నాయకత్వం- కార్యకర్తల మధ్య వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయని అనిపిస్తున్న రోజుల్లో ‘సంకల్పం’ అనే కధ రాశారు. ఈ కధకి సన్నివేశం ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెద్దరికం చేతులు మారటం. యజ్ఞమ్ కధ సిద్ధాంతాన్ని కధలోకి అనువదిస్తే, సంకల్పం కుటుంబంలో జరిగే ఘర్షణలో ఒక వ్యక్తి సమాధాన పడిన తీరు చెప్పటం ద్వారా వుద్యమంలో వస్తున్న ఘర్షణకి పరిష్కారం సూచిస్తుంది. యజ్ఞమ్ కధకి వచ్చినంత ప్రాచుర్యం సంకల్పానికి రాలేదంటే దానికి కారణమేమిటో మనకి వివరించి చెప్పిన వారెవరూ లేరు.

    ఈ రెండు కధల మధ్య వ్యవధిలో — యజ్ఞమ్ లాంటి కధలు చాలా వచ్చాయి కానీ, అదే పరిణతి చెందిన రాజకీయ లక్ష్యం, తాత్విక చింతనతో వ్రాసిన కధ గా చెప్పుకోదగినది — అల్లం రాజయ్య వ్రాసిన ‘మనిషిలోపలి విధ్వంసం’. యజ్ఞమ్ లో లాగానే — ‘మనిషి లోపలి విధ్వంసం’లో కూడా వస్తువు – తండ్రి కొడుకుల మధ్య సంబంధం. వేయి తలల రాక్కసిగా ఎదిగి పోయిన ప్రీమిటివ్ ఎక్యూమూలేషన్ — మనిషి పరాయీకరణకి సమాధానం చెప్పలేని వుద్యమ నేపధ్యం – ఇవీ ఈ కధకుఉన్న రాజకీయ తాత్విక నేపథ్యాలు. యజ్ఞమ్, మనిషి లోపలి విధ్వంసం – ఈ రెండు కథలలో మొదటిది తెలుగు కథా సాహిత్యగమనంలో ఒక అంకానికి తెర తీస్తే రెండోది తెర వేయటంగా అర్థం చేసుకోవచ్చును. ఈ మధ్యలో తెలుగు కధా సాహిత్యంలో చిన్న చిన్న అంతర్నాటకాలు చాలానే జరిగాయి. యండమూరి వీరేంద్రనాథ్ అనే ఒక కామిక్ రిలీఫ్ చాలా సంవత్సరాల పాటు సాగింది. అది అటు సాగుతుండగానే, యజ్ఞమ్ లాటి కథలని ఫార్ములాగా తీసుకుని రాసేసిన సాహిత్యం ఒక పక్కన సాగింది. మధ్యలో కొన్ని సంవత్సరాలు బాలగోపాల్ సాహిత్య విమర్శ చేసినా — పౌరహక్కుల కార్యకర్తగా ఆయన పేరు పడిపోవటం వలన ఆయన రచనల్లో వున్న సాంస్కృతిక విమర్శని ఎవరూ పట్టించుకోలేదు.(ఎవరూ పట్టించుకోలేదు అంటే లిస్టు చెప్పుకోవాలంటే — ముఖ్యంగా విప్లవ రచయితల సంఘం వారే పట్టించుకోలేదు అని చెప్పుకోవాలి). ఆ ఇరవై ఇరవయ్యయిదు సంవత్సరాలలో విరసం సాహిత్యానికి రాజకీయానికి మధ్యన వుండే సున్నితమయిన సంబంధాన్ని మొరటుగా బండగా ట్రీట్ చేసి పెద్ద నేరమే చేసినట్టు కనపడుతోంది కానీ ఇదమిత్థంగా తేల్చి చెప్పిన వాళ్లెవరూ వున్నట్లు కనపడదు.

    జరిగిన చరిత్ర గురించి రాయవలసిన కథలు ఎందుకు రాయబడలేదు అన్నది ఒక కీలకమైన ప్రశ్న అయితే ప్రస్తుతానికి పైన చెప్పిన మూడు కథలూ – యజ్ఞమ్, సంకల్పం, మనిషిలోపలి విధ్వంసం — గ్రామీణ వాతావరణం లోనే చెప్పబడ్డాయి అనిన్నూ, మొదట కాళీపట్నం రామారావు గారు, తరువాత అల్లం రాజయ్య కథకులుగా విజయవంతులు కావటానికి వెనక – రచయితలను సోషలైజ్ చేసే సామాజిక నిర్మాణాలు వున్నాయి అనిన్నూ గుర్తు పెట్టుకుంటే, ఆ ప్రశ్నకి సమాధానాలు మళ్ళీ ఎప్పుడయినా వివరంగా చెప్పుకోవచ్చును.

    ఇక పోతే, తెలుగు కథల్లో గ్రామీణ వాతావరణం వాసనలు పోక పోవటానికి పెద్ద కారణం – విశాలాంధ్ర రాష్ట్రావతరణ తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో నిజానికి నగర జీవితం – నగర సంస్కృతీ పెద్దగా ఎవరికీ అనుభవం లోకి రాక పోవటమే అని నాకనిపిస్తుంది. కాలాతీత వ్యక్తులు, హిమజ్వాల ఇలా ఒ కటో రెండో తప్ప ఎవరూ ఆంధ్ర ప్రదేశ్ లోని నగర జీవితాన్ని తరచి చూసిన వారు లేక పోవటానికి కారణం రచయితల్లో వ్యక్తిగతంగా వూహా శక్తి లోపించటమే అంటే నేను నమ్మలేను. నగర జీవితాన్ని తరచి చూసి కధలు నవలలూ రాయటానికి కావలసిన సామాజిక సందర్భం లేక పోవటం కూడా వొక పెద్ద కారణం. అటువంటి సందర్భాన్ని నిర్మించుకోవటానికి కావలసిన సరంజామా రెండవ ప్రపంచ యుద్ధానికి అటూ ఇటూగా కొడవటిగంటి కుటుంబ రావు గారి సృష్టించిన సాహిత్యంలో పుష్కలంగా వున్నప్పటికీ, ఎవరూ ప్రయత్నం చేయక పోవటానికి కారణం పాఠకులు లేక పోవటమేనని కూడా నేనంటాను.

    సినిమా నిర్మాణం హైదరాబాదుకి వచ్చిన తర్వాత పైకి నగరంలాగా ఎంత కనపడినా, హైదరాబాదు లో సామాజిక జీవితం పూర్తిగా గ్రామీణ జీవితానికి ఒక ఎక్స్ టెన్షన్ మాత్రమే. హైదరాబాదులో పేరున్న రచయితలెవరూ కూడా ఈ నగరంతో చాలా కాలంగా సజీవ సంబంధాలున్న వారు కాదు. ఇందులో తెలుగు భాష ప్రాంతీయతా పలుకుబళ్ళకి సంబంధించిన రాజకీయాలు చాలా ప్రముఖ పాత్రే వహించాయి.. హైదరాబాదులో వుండి రచయితలము అని చెప్పుకునే వాళ్ళలో ఎంత మందికి వాళ్ల వార్డు కార్పొరేటర్ మొహమయినా తెలిసి వుంటుందా, హైదరాబాదులో వాళ్ళు వుండే ప్రాంతం పేరు ఒక పాతిక సంవత్సరాల క్రితం ఏమయి వుంటుందో, ఆ పక్కనే వున్న గుడిలో దేవత పేరయినా తెలుస్తుందా అని ఆలోచిస్తే సమాధానం తేలికగా దొరకదు. అంటే వొక రకంగా చెప్పాలంటే – డయాస్పోరా జీవితం గురించి వేలూరు గారు చెప్పిన అంశాలలో ముఖ్యమైనవి – హైదరాబాదులో వున్న తెలుగు వారికి కూడా వర్తిస్తాయి.

    నగర జీవితాన్ని పూర్తి గా వంట పట్టించుకుని రాసిన రచయితగా కనపడేది – కుప్పిలి పద్మ వొక్కతే. అది కూడా , వస్తువు, సన్నివేశమూ ఒక యువతి అంతరంగానికి మాత్రమే పరిమితమయి వుండటంతో ఎంతో ముందుకు పోలేక ఆగి పోయింది. అక్కడినించి ముందుకు వెళ్ళటానికి దారి చూపించే తాత్విక దృక్పథమో, నిర్మాణ రూపమో ఇచ్చే బాధ్యత ఎవరిదయినట్టు?

    మొత్తమ్మీద క్లుప్తంగా – పవర్ పాయింటు బుల్లెట్ల రూపంలో చెప్పుకోవాలంటే — మీరు కధలు రాయండి – మేము వొడ్డున కూచుని ఎవరు బాగా ఈత కొడుతున్నారో మార్కులేస్తాము అనే పద్ధతిలో విమర్శ సాగుతుండటం తెలుగు కథ ఈడిగిల పడటానికి ఒక పెద్ద కారణం. వూహా శక్తిని ఛాలెంజీ చేసే విమర్శకులూ, భాష్యకారులూ, దానిని పదును పెట్టే సామాజిక నిర్మాణాలు తయారు చేసుకోవటం అన్నది పాఠకులకీ , విమర్శకులకీ, రచయితలకీ ఒక ఉమ్మడి బాధ్యత.

    వాల్ స్ట్రీటు లో అంతర్జాతీయ బాంకు కుప్ప కూలితే, కువైట్ ఎయిర్ పోర్టులో తారస పడ్డ పని పిల్ల తమ్ముడు నర్సీ పట్నంలో గొల్లు మంటాడు. టాంకు బండ్ మీద సాయంత్రం ఆరుగంటలకి మనమల్ని తీసుకుని వచ్చే వృద్ధ దంపతులకి అల్లుడు కొత్త సాఫ్టువేర్ నేర్చుకోకుండా టైం వేస్టు చేస్తున్నాడేమో నని అనుమానం వస్తోంది. ఆకలేస్తోందని అత్త మామలకి ఎట్లా చెప్పాలో తెలియడం లేదని అమెరికాలో వుద్యోగం చేస్తున్న మొగుడికి చెప్తే కోపం వస్తుందేమోనని కొత్త కోడలు భయ పడుతోంది. అపార్టుమెంటు కాంప్లెక్సులో పొరుగువాళ్ళ గొడవలు పట్టించుకునే పిన్ని గార్లు కూడా దొరకటం లేదు. ఆ కోడలు ఏదో ఒక రకంగా బతకడం నేర్చుకుంటోంది. లేక పోతే బుద్ధ పూర్ణిమ ఆఫీసు పక్కనించో సంజీవయ్య పార్కు మూలనించో హుసేన్ సాగర్లో దూకేస్తోంది. మూసిన తలుపుల వెనక అమెరికన్ సబర్బియాలోనూ, ఐటి కంపెనీల హెడ్ క్వార్టర్లలోనూ, హైదరాబాదు ఫిలిం నగర్లోనూ, ఋషికొండ వెనక రిసార్టు లోనూ ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. వీటన్నిటిమీదా బహిరంగంగా భాష్యం చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. బాపట్ల నించో, జనగామ నించో , సంతనూతల పాడునించో రక రకాల మనుషులు చేసే ప్రయాణాలకధలు ఎన్నయినా చెప్పవచ్చును. కానీ వినే వారిని తయారు చేసే బాధ్యత కూడా ఎవరో వొకరు తీసుకోవాలి కదా ? చెప్ప గలిగే రచయితలకి కావలసిన ధైర్యాన్ని ఇచ్చి, సోషలైజ్ చేసే నిర్మాణం ఎవరో ఒకరు చేయాలి కదా ?

    వుదాహరణలు ఇస్తే ఇంకా బాగుండేదన్నారు కాబట్టి — ఒక పుస్తకం పేరు చెప్తున్నాను. “Global Bodyshopping An Indian Labour System in the Information Technology Industry”
    Author : Xiang Biao Publisher: Princeton University Press. ఈ పుస్తకం చదవడానికి క్లిష్టంగా అనిపించినప్పటికీ ప్రయత్నం చేసి చదవ దగిన పుస్తకం. ఈ పుస్తకం జియాంగ్ బియావ్ మొదట పీహెచ్ డీ థీసిస్ గా వ్రాసినది. హైదరాబాదు నించి –ఒక వైపు ఐటి వుద్యోగుల సొంత వూళ్ళకీ , మరొక పక్క వాళ్ళు విదేశాలలో వాళ్ళు వుద్యోగాలు చేసుకోవటానికి వెళ్ళే వూళ్ళకీ ప్రయాణం చేస్తూ, ఈ వుద్యోగుల జీవితాలు ఎట్లా మారుతున్నాయో వివరించే పుస్తకం ఇది. నాకు తెలిసినంతలో తెలుగు వారి జీవితాలలొ 1995 తరువాత వచ్చిన మార్పులని ఈ మాత్రంగానయినా పరిశీలించిన పుస్తకం ఈ కోణం నించి పరిశీలించే పుస్తకం మరొకటి లేదు.

  10. సా విరహే తవ దీనా గురించి Himabindu.S గారి అభిప్రాయం:

    03/06/2010 1:04 pm

    Wonderful article! I Thanks a million for giving the links to songs.

« 1 ... 1176 1177 1178 1179 1180 ... 1582 »