Comment navigation


15818

« 1 ... 1175 1176 1177 1178 1179 ... 1582 »

  1. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/11/2010 7:40 am

    బృందావనరావు గారూ!! జాషువా గారి మీద ” మార్గమూ-మార్గణమూ” అన్న సాహిత్య వ్యాసాల సంకలనంలో జయప్రభ గారు విశ్లేషణాత్మకమైన వ్యాసం రాసేరు. మీరు దాన్ని చదివినట్టులేదు. అది అందరూ తప్పక చదవవలసిన విశ్లేషణ. అటువంటి వ్యాసాలని ఈమాట వాళ్ళు మరోసారి పరిచయం చేయడం వలన కూడా మరి నలుగురికి తెలిసే అవకాశం వుంది.

    మీ పత్రికలోని సాహిత్యాభిప్రాయాలలో ఇటీవలి సాహిత్య విమర్శలని ఎవరూ చదివినట్టుగా అన్పించని ధోరణులు తరుచూ కనిపిస్తాయి. అందువలన నలుగురికీ తెలిసేందుకు వీలుగా ఈ సమాచారాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు ఆ పుస్తకాన్ని చదవగలరు. ఆమె గుర్రం జాషువా గారిని గురించి రాసిన వ్యాసం ఇదివరకటి ఏ విమర్శకులూ స్పృశించని కోణాలని చర్చించడం విశేషం!!

    రమ.

  2. *ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి damodara గారి అభిప్రాయం:

    03/11/2010 5:46 am

    మీ వివరణ వ్యాసం చాలా బాగున్నది. ఈ నవలను ఎంపిక చెసిన త్రిమూర్తులకు ఒక చురక. వారు తప్పక జాతికి క్షమాపణ చెప్పలి. వివరణ ఇవ్వాలి.

  3. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి Vadapalli SeshatalpaSayee గారి అభిప్రాయం:

    03/11/2010 5:43 am

    హరిశ్చంద్ర కథ ఏ వేదములో ఉన్నది.

    ఋగ్వేద – ఐతరేయ బ్రాహ్మణములో.

    విశ్వనాథవారు “వేదహరిశ్చంద్రము” “కావ్యహరిశ్చంద్రము” అనే నాటకములు వ్రాశారు.

    ఈ హరిశ్చంద్రునికథకూ ఆంధ్రులకూ కొంత సంబంధం ఉంది.
    విశ్వనాథవారి “పురాణవైరగ్రంథమాల” ఉపోద్ఘాతములో ప్రశంసింపబడిన కోట వెంకటాచలముగారు “ఆంధ్రులెవరు” అనే గ్రంథాన్ని 1949లో ప్రచురించారు.
    http://www.new.dli.ernet.in/ లో “andhrulevaru” చదువుకోవచ్చు.

    “కాటిసీను”ను ఇక్కడ చదువుకోవచ్చు.

    జాషువాగారి ఖండకావ్యము “శ్మశానవాటి” పద్యాలు ఇక్కడ చదుకోవచ్చు.

    విధేయుడు,
    వాడపల్లి శేషతల్పశాయి.

  4. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    03/10/2010 2:37 pm

    “నేను హరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకాన్ని కనీసం ఇరవైసార్లు చూసి వుంటాను. తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలతో సమానంగా ప్రజాదరణ పొందిన నాటకం హరిశ్చంద్ర.”-
    చీమలమర్రి బృందావనరావు

    శ్రీనాథుని “శృంగార నైషధము” కు (emesco classics) పీఠిక రాస్తూ – “ఒక రామాయణ కథ, ఒక పాండవుల కథ, బహు ప్రసిద్ధి కల కథలు. ఒక హరిశ్చంద్ర కథ, ఈ నల చరిత్రము రెండు నించుమించుగా రామాయణ కథ, ప్రధాన భారత కథ -ఎంత ప్రశస్తి కలవో అంత ప్రశస్తి కల కథలు.” అన్నారు విశ్వనాథ .
    “హరిశ్చంద్ర కథ యున్నది. ఈ కథ వేదములో ఉన్నది. పురాణములలో నెక్కువ కనిపించదు. వేదములో నున్న హరిశ్చంద్ర కథకు, లోకములో ప్రసిద్థి పొందిన హరిశంద్ర కథకు సంబంధము లేదు.” – అనీ చెప్పారు.

    హరిశ్చంద్ర కథ ఏ వేదములో ఉన్నది. ఎలా మార్చబడినదీ – ఈ విషయాలను గూర్చి తెలియ చెప్పగలరా.

    Thanks
    lyla

  5. తెలగాణెము గురించి raja sankar kasinadhuni గారి అభిప్రాయం:

    03/10/2010 11:31 am

    రాజశేఖర్ గారు, మీకు కింది పద్యం ఉపయోగపడుతుందేమో చూడండి.

    పాల కొమ్మీగడల్ పచ్చి వెన్నయి విచ్చి తీయని నునుపూసలాయెనేమొ?
    కమని మకరంద కణములు స్నేహించి చిన్నారి పలుకులై చిక్కెనేమొ?
    పూల లావణ్యంబు పొంగి చక్కదనాల పిందెలై రుచులెక్కి పెరిగెనేమొ?
    సెలయేటి యుయ్యాల కులుకుటొయ్యారముల్ ముద్దు ముచ్చటలయి ముదిరెనేమొ?

    పాటకు పద్యమునకు నబ్రముగ నొదిగి
    చవికి చాతుర్యమునకు సాజముగ సాగి
    పోరునకు పొత్తునకు చాలి పొంది పొసగు
    మా తెనుగుతల్లి మెడ కిదే మల్లెదండ

    శంకరంబాడి వారి “మా తెలుగు తల్లికీ మల్లెపూదండ” గేయానికి స్ఫూర్తి ఈ పద్యం నుంచి వచ్చిందని కొందరి పెద్దల అభిప్రాయం.

    కారాశం

  6. అమ్మ గురించి jaideep గారి అభిప్రాయం:

    03/10/2010 11:24 am

    మంజు గారు – నిజంగా ఈ కవిత చాలా బాగుంది.

  7. తడిస్తే కదా తెలిసేది! గురించి SADASIVARAO గారి అభిప్రాయం:

    03/10/2010 11:03 am

    వాస్తవమ్ చెప్పారు. కవిత చాలా బాగు.

  8. వానా వానా… గురించి telugu4kids గారి అభిప్రాయం:

    03/10/2010 9:34 am

    Thanks.
    పేరు చెప్పి లంకె ఇచ్చి ప్రచురిస్తాను.

  9. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి jagadeeshwar reddy గారి అభిప్రాయం:

    03/10/2010 3:42 am

    శ్రీనివాస్‌గార్కి నమస్కారాలు.
    చానాళ్లయింది … మిమ్మల్ని చూసి, పలకరించి కూడా. ఎస్‌.వరలక్ష్మిగారిపై మీ మనసులోని మాట చదివి చాలా సంతోషం కల్గింది. ముఖ్యంగా (ఈ మాటలో) ఆమె ఫోటో అపురూపమైంది. చివరి దశలో ఆమెను ఎవరూ చూడలేదు. దాదాపు ఇలాగే ఉంటారనిపించింది. అందుకుగాను ఆ ఫోటోని సంపాదించినవారిని ముందుగా అభినందించాలి.
    ఇప్పటికీ రాత్రుళ్లు పడుకోబోయేముందు హెచ్‌.ఎం.వి. వాళ్లేసిన వరలక్ష్మిగారి ‘గోల్డెన్‌ హవర్‌’ కేసెట్‌ పెట్టుకుని వింటూ అలౌకిక ఆనందాన్ని స్వంతం చేసుకుంటాను. ఆ పాటల్ని మధుసూధన శర్మగారు (హెచ్‌.ఎం.వి. వారికి) అందించడం … మనం శర్మగార్కి ఋణపడివున్నాం అనిపించింది. (అన్నట్లు ఆ మధ్య శర్మగారి జ్ఞాపకాలు ఆంధ్రజ్యోతి ఆదివారంలో వచ్చాయి. వీలుంటే సంగీతాభిమానులకోసం ఈమాటలో ఆ జ్ఞాపకాల లింకు ఇవ్వగలరా…)
    ఆ కేసెట్లోంచి ఒక్క పాట తీసేయలేం. ఏ పాటవిన్నా… మల్లీశ్వరిలో చేదబావి దగ్గర మల్లితో కమలాబాయి అంటుందే ‘కయ్యిమని పచ్చిరాగంలా పాడేయడమే’ అని… అలా ఉంటాయన్నీ. నాకు తెలిసి ఆమెలా పాడేవారు లేరు … ఆమె పాటల్ని ఇమిటేట్‌ చేయడం సాహసం కూడా. ‘చందమామా … ఓ చందమామా జాలిలేదా నీకు నాపైనా… ‘పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు నాకు.
    అభినందనలతో …
    మీ గొరుసు

  10. తెలగాణెము గురించి rajashekhar గారి అభిప్రాయం:

    03/10/2010 3:29 am

    అందరికి నమస్కారములు
    నాకు తెలుగు గొప్పతనం గురించి తెలిపే ఒక పద్యం కావాలి
    ఎవరైనా help చేయండి please…………..

« 1 ... 1175 1176 1177 1178 1179 ... 1582 »