Comment navigation


15818

« 1 ... 1174 1175 1176 1177 1178 ... 1582 »

  1. తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి Ravi Kumar గారి అభిప్రాయం:

    03/19/2010 2:00 am

    ఇదే రచయిత ఇతర కథలు / రచనల లింకులు తెలియజేయగలరు
    mula.ravi@gmail.com

  2. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి Shiva kumar గారి అభిప్రాయం:

    03/18/2010 12:27 am

    ఇది నిజంగా చాలా బాగుంది. ఇటు వంటి వాటిని మీరు ఇంకా ఆదరించాలని కోరుతు..మీ అభిమాని.

  3. సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి Rama Madarapu గారి అభిప్రాయం:

    03/17/2010 12:08 pm

    చాలా బాగా వ్రాసారది… సున్నితమైన కధనము ….. మరిన్ని కధల కోసము ఎదురు చూస్తూ….

  4. *ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    03/15/2010 10:21 pm

    And of course, they are honorable people, అన్న ముక్తాయింపు చూశాక ఇక్కడ సీజర్ ఎవరు, బ్రూటస్ ఎవరు, మార్క్ ఆంటోనీ వుద్దేశ్యమేమిటి అన్న కుతూహలం కలిగి వెతికితే సాహిత్య అకాడెమీ ప్రెస్ రిలీజులో జూరీ సభ్యుల పేర్లు వి ఎస్ రమాదేవి, బేతవోలు రామబ్రహ్మం, కాళీపట్నం రామారావు అని వుంది. అక్కిరాజు రమాపతి రావు గారు సాహిత్య అకాడెమీ కి తెలుగు ఎద్వైజరీ బోర్డు కన్వీనర్ . అంటే జూరీ ఎంపిక ఆయన సలహా ప్రకారం జరిగి వుండవచ్చు. తెర వెనుక ఎంపికలో ఆయన పాత్ర వుండి వుండ వచ్చును.
    వేలూరు గారన్నట్లా జూరీ నిర్ణయాన్ని బాహాటంగా చర్చించటానికి వీలుగా ఒక ప్రకటన వచ్చేలా జాగ్రత పడవలసిన బాధ్యత ఆయనదే కానీ , నిర్ణయానికి బాధ్యత మాత్రం ఆయనది కాదనుకుంటాను.
    ద్రౌపది నవలనీ దాని మీద జరిగిన రభసనీ పెద్దగా పట్టించుకోక పోవడం వలన నా గమనింపులోకి రాని సమాచారం ఏమైనా వుంటే క్షంతవ్యుణ్ణి.

  5. *ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి nagamurali గారి అభిప్రాయం:

    03/15/2010 12:44 pm

    ఆంధ్రజ్యోతిలో మీ వ్యాసం చదివినా అక్కడ వ్యాఖ్య రాసే అవకాశం లేక అప్పుడు అసంతృప్తి చెందాను. ఇప్పుడు మళ్ళీ మీ వ్యాసం శ్రద్ధగా చదివేను. అద్భుతం. ద్రౌపది నవల గురించి జరుగుతున్న చర్చల పరంపరలో నాకు అమితంగా నచ్చిన వ్యాసం ఇదే.

  6. పెదవి దాటనివి గురించి గోపాల్ కోడూరి గారి అభిప్రాయం:

    03/12/2010 12:22 pm

    కథ చాలా సహజంగా ఉంది… చాలా బావుంది!

  7. ఓహో యాత్రికుడా.. గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    03/12/2010 8:09 am

    రాజేశ్వరరావు, హనుమంతరావుల గురించిన కొండలరావుగారి వ్యాసం ఆసక్తికరంగా ఉంది.

  8. తెలగాణెము గురించి ధేశికాచారి గారి అభిప్రాయం:

    03/12/2010 12:37 am

    రాజశేఖర్ గారూ,
    పైనుదాహరించిన పద్యం రాయప్రోలు సుబ్బారావుగారి “ఆఁద్రావళి” ఖండకావ్యంలో “తెనుగు మాన్యము” అనే శీర్షిక లోనిది. ఐతే, పైన వ్రాసిన తీరులో వ్రాత దోషాలున్నాయి. “పాలక్రొమ్మీగడల్”, “కమ్మని మకరందకణములు” అని మొదటి రెండు చరణాలల్లో ఉండాలి. అందులోదే మఱొక పద్యం:\

    వంశిన్ వంచి, మృణాళమున్ మెలిచి, పక్వద్రాక్ష నెండించి, వా
    గంశల్ మార్దవమాధురీ సుభగ విన్యాసంబు జిల్కన్, దశ
    త్రింశల్లక్షణ జనప్రసన్న రసనా దేవాలయాభ్యంతర
    ప్రాంశు ప్రార్థనగీతమైన తెనుగుం బల్కున్ ప్రశంసించెదన్.

    ఇట్టివే ఇన్నో చక్కని పద్యాలు “ఆంద్రావళి”లోనున్నవి. వీలైన ఆ పుస్తకాన్ని సంపాదించి అందులో మీకు నచ్చిన పద్యాన్ని ఎన్నుకొనండి. నా దగ్గర 1972లో ఎమెస్కో వారు ప్రచురించిన ఈ పుస్తకం ప్రతి ఉన్నది.

  9. *ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/11/2010 2:47 pm

    నేను ద్రొపది నవలని గురిచి మట్లాడటమ్ లేదు. మాట్లాడే ఆసక్థి కూడా లేదు. ఎదుకో ఒక కారణమ్ చెప్తాను. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఒక చవకబారు వ్యవహారమ్ గా మారిపోయేయి ఎప్పటినుంచో!! సాజహిత్య అకాడెమీ ఇచ్చిన బహుమతులలో ఎక్కువ శాతం నాసిరకం కవి రచయితలకి రావడాన్ని గమనించండి! కాళీపట్నం రామారావు గారిలాంటివాళ్ళకి మరి ఇవ్వక పోతే పరువు పోతుందని అనుకున్నాకా లేటు గా ఇచ్చారు. అదే ఒక్కోసారి వాళ్ళు అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు గమనించి చూస్తే అసలు ఇలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఎలా ఇచ్చారన్న సందేహం ఎవరికైనా వస్తుంది. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులకీ ..అవార్డ్స్ కమిటీ వాళ్ళ సంకుచిత దృష్టీ ..ఆశ్రిత పక్షపాత వైఖరీ కారణాలుగా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది.

    ఇలాంటి పరిస్థితి బెంగాల్ , కేరళ్ ఇంకా మరాటీ చివరికి అస్సామీ వంటి భాషల్లో కనిపించదు. ఎందుకంటే అక్కడ అవకతవకలు జరిగితే మీడియాలో ఏకిపడేస్తారు. కానీ అదే మన భాషలో ఇదేమిటి అని అడిగిన సందర్భమ్ ఒక్కటి కనిపించదు. మంచి రచయితలకి చాలామందికి బహుమతులు రాకపోవడమూ..అదే మీడియోకర్ కవి రచయితలకి లాబీయింగ్ చేసుకోవడం వల్ల మాత్రమే అవార్డ్స్ రావడమూ సర్వ సాధారణమైపోయింది.

    ఆధునిక కవిత్వం గురించి ఓనామ రాని ఒక భాషా శాస్త్రజ్ఞుడో..కల్పన గురించి కనీసంగా తెలియని మరొక యూనివర్సిటీ ప్రబుద్ధుడో అక్కడ ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని కూర్చుని సాహిత్య రాజకీయాలు నడుపుతూ తమతమ కుర్చీలు ఎలా కాపాడుకోవాలా అని అన్నిరకాల కుయుక్తులు చేస్తుంటారు. ఇది బహిరంగ రహస్యం. ఢిల్లీ లో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళగురించి తెలుసు. తెలుగు వాళ్ళు నిలదీసి అడగందే మేమేం చేయగలం అంటారు వాళ్ళు. ఒక జాతి గౌరవాన్ని తమతమ చిన్నపాటి బుధ్ధులతో ప్రతీసారీ రచ్చకీడుస్తున్న కమిటీలని ముందు ప్రశ్నించే వీలుండాలి.లాబీలు చేసుకుంటేనే బహుమతులు వస్తాయి మీకు అన్న ఒక అప్రకిటిత విధానం తెలుగున స్థిరపడేలా చేసేరు. బయటికి చూడడానికి ప్రజాస్వామ్య పంథాలో నడుస్తున్నట్టు ఒక ముసుగు ఉంటుంది. కానీ అదంతా బూటకమేనన్నది అందరూ ఎరిగిన సంగతి! ! unfortunately we are celebrating mediocrity.

    రమ.

  10. About eemaata గురించి Rama Madarapu గారి అభిప్రాయం:

    03/11/2010 9:54 am

    మొదటగా ఈమాట కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు…
    తెలుగు భాష మీద మమకారం ఉండడం వేరు… సామాన్య శాస్త్రాన్ని కూడా తెలుగు లో వివరించడడం నేను మొట్టమొదటి సరిగా చూస్తున్నాను. నాకు తెలిసి ఇంత ఓపిక, ఇంత బాష పైన మరియు విషయం పైన పట్టు ఉన్న వారు లోకంలో చాలా అరుదు. ఈ వ్యాసాల్ని పదిమందికి పంచాలని ఆశపడుతున్నాను. దయచేసి మీ అనుమతితో మా వెబ్ సైట్ లో మరియు నా బ్లాగ్ లో మీ వ్యాసాల్ని ప్రచురించాలని అనుకుంటున్నాను.
    మీ అనుమతి కోసం వేచి చూస్తూ,

    రామా మాదారపు

    [మీ అభిమానానికి కృతజ్ఞతలు. పూర్తి నిడివి వ్యాసాన్ని మళ్ళీ మీ వెబ్‌సైట్లో ప్రచురించుకోడానికి ఈమాట నిబంధనలు ఒప్పుకోవు. వ్యాసం నుంచి రెండు, మూడు పేరాలు ఉటంకించి, పూర్తి పాఠం కోసం ఈమాటలో వ్యాసానికి లింక్ ఇవ్వగలరు. – సం.]

« 1 ... 1174 1175 1176 1177 1178 ... 1582 »