Comment navigation


15820

« 1 ... 1168 1169 1170 1171 1172 ... 1582 »

  1. సా విరహే తవ దీనా గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    04/15/2010 10:43 am

    వ్యాసం ఆపాత మధురం. ఎంతో శ్రమతో ఓపికతో అందించిన వివరాలు ఒకెత్తు. ఇంకేంతో పరిశ్రమతో ఒక్క చోట కూర్చిన పాటలు వినాలనికుతూహలంగాఉంది. సంస్కృత శార్దూలవిక్రీడితాన్ని తెలుగుశార్దూలంలోఅనువదించడం సమంజసంగా ఉంది. తెలుగు అనువాదాలలో పదాలు సరళంగా హాయిగున్నాయి.
    ” వ్యాసం మధురం
    భావం మధురం
    చిత్రం మధురం
    అనువాదం మధురం
    వ్యాఖ్యానం సర్వం మధురం”
    =======
    విధేయుడు
    -Srinivas

  2. ఈమాట గురించి గురించి jayaprabha గారి అభిప్రాయం:

    04/15/2010 8:00 am

    సంపాదకులకి! భారతీయ భాషలలొ వచ్చిన కవిత్వాన్ని జర్మనీ భాషలోకి అనువాదమ్ చేసి తెచ్చిన కవితా సంకలనమ్ వచ్చింది. దాని పేరు “Nachtregen”[ night rain అని అర్ధం.] ఈ పుస్తకంలో శ్రీశ్రీవి, నావీ కవితలున్నాయి. మిగతా భారతీయ భాషలకి సంబంధించి ఆయా భాషల్లో ప్రసిధ్ధులైన కవులు కూడా ఈ సంకలనం లో ఉన్నారు. ఇది హైడెల్ బెర్గ్ నించి వచ్చింది. అనువాదమూ.. సంపాదకత్వమూ draupadi verlag, ఇంకా jose punnamparambil చేసారు.

    జయప్రభ.

  3. “చందమామ” జ్ఞాపకాలు గురించి Buttegowda గారి అభిప్రాయం:

    04/13/2010 8:16 pm

    This article is fabulous. Brought lots of memories. I read chandamama as a kid ( as well as today ) and collected almost all of them published between 1948 – 1972.

    Great to know the history of the artists as well as writers.

  4. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి Srinath గారి అభిప్రాయం:

    04/13/2010 11:25 am

    దయ చెసి నవతరంగము లొ వచ్చిన ఈ వ్యాసానికి మీ అబిప్రాయము తెలుపగలరు! –

  5. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    04/13/2010 10:07 am

    BSRAO గారూ:

    ఈ వ్యాసం తెలుగులో చదవటానికి ఈమాట సంపాదకులు సాయపడగలరు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  6. తడిస్తే కదా తెలిసేది! గురించి తవ్వా ఓబుల్ రెడ్డి. గారి అభిప్రాయం:

    04/13/2010 8:05 am

    మండుటెండలో మంచు బిందువులను కురిపించింది, మీ కవిత. అభినందనలు!

  7. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి ellanki.bhaskaranaidu గారి అభిప్రాయం:

    04/12/2010 10:19 pm

    చాల బాగున్నది. ధన్యవాదాలు.

  8. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి chakirevu upendra గారి అభిప్రాయం:

    04/11/2010 10:36 pm

    ఈ మాటనూ, ఇలాంటిదే మరొక వెబ్ పత్రిక ప్రాణహితనూ కొంత కాలంగా గమనిస్తుంటే ఈ విషయం తట్టింది. ఈ రెండు పత్రికలలోనూ పాఠకులు పాల్గొనడానికి రెండు మార్గాలు ఏర్పాటు అయినాయి. 1) ప్రచురణల క్రింద వ్యాఖ్యలద్వారా , 2) చర్చా వేదికల ద్వారా. సర్వ సాధారణంగా ప్రచురణ చదివిన తరువాత వెంటనే తట్టిన విషయాలని ఆ క్రింద వ్యాఖ్యల రూపంలో పాఠకులు వ్రాసేస్తారు. ఈ వ్యాఖ్యలే చర్చలకి దారి తీస్తుంటాయి. చర్చా వేదికలని వుపయోగించుకోవాలంటే ఫోరంలో సభ్యత్వం రిజిస్టర్ చేసుకోవాలి. ఫోరంలో సభ్యులు తమంత తాముగా పత్రిక సంచికల్లో ప్రచురితమైన రచనలతో సంబంధం లేకుండానే స్వతంత్రంగా చర్చ మొదలు పెట్టే అవకాశం ఉన్నా, సభ్యత్వం లాగిన్, రచననించి దూరంగా మరో పేజీ లోకి వెళ్ళటం అనే ఒక చిన్న చిన్న సాంకేతిక అడ్డంకులు వుండటం వల్లనో లేక పూర్తి స్థాయి చర్చ నడపడానికి కావలసిన చొరవా, ఆసక్తీ , సావకాశమూ లేక పోవటం చేతనో – పాఠకులు ఎవరూ పెద్దగా వీటిని ఉపయోగించుకుంటున్నట్టు కనపడదు. ఎవరూ ఉపయోగించుకోని చర్చా వేదికలు – ఇంట్లో పనికిరాని సామాన్ల గది లాగా, సింగపూర్ లో ‘స్పీకర్స్ కార్నర్’ లాగా కనపడతాయి. దీన్ని సవరించడానికి రెండు సలహాలు –

    1) పత్రిక లాండింగ్ పేజీ లోనే – ప్రశ్నలూ జవాబులూ లాంటి ఒక శీర్షికని ప్రారంభించవచ్చు. దాని క్రింద ఉప శీర్షికలు పెట్టుకునే అవకాశం కల్పిస్తే – ప్రచురితమైన రచనలతో నేరుగా సంబంధం లేని వ్యాఖ్యలన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఎవరో ఒకరో ఇద్దరో ఎక్స్పర్టులు మాత్రమే జవాబులు చెప్పాలన్న నియమమేమీ వుండకుండా అందరూ పాల్గొనే వీలుంటుంది కాబట్టి — ప్రశ్నలూ , జవాబులే ఒక చర్చా వేదికగా ఉపయోగ పడుతుంది.

    2) చర్చా వేదికలలో ‘ప్రచురితమైన రచనలపై చర్చలు’ అన్న పేరుతో ఒక వేదికని ఏర్పాటు చేసి – ప్రస్తుతం ప్రచురణల కింద వ్రాయబడుతున్న వ్యాఖ్యలని దానిలోకి నేరుగా ఇంపోర్ట్ చేసెయ్యవచ్చు.

    ఈ రెండు మార్గాలకీ వుద్దేశ్యం ఒకటే – వ్యాఖ్యలూ, చర్చలూ అన్న రెండు రెండు శీర్షికలనూ కలిపి వేయటం. సాధ్యా సాధ్యాలు మీరు ఉపయోగిస్తున్న కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్ మీద ఆధార పడి వుంటాయనుకుంటాను. ఆలోచించ గలరు.

  9. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి BSRAO గారి అభిప్రాయం:

    04/11/2010 6:18 am

    I am not able to read since every thing is in english letters

  10. అంధకారం గురించి జి ఎన్ గారి అభిప్రాయం:

    04/10/2010 7:58 pm

    రవి బాబు గారు,

    ధన్యవాదాలు.
    మీ ప్రోత్సాహం, నాకు తప్పకుండా కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

« 1 ... 1168 1169 1170 1171 1172 ... 1582 »