కథ చెప్పిన పద్ధతి నాకు బాగా నచ్చింది. సిగరెట్ల పై డాలీ కొచ్చిన ఫీలింగ్స్ చక్కగా చెప్పారు.
చెప్పేపద్ధతిలో ” కృతకం, కృత్రిమం, వికృతం ” ఏమీ స్ఫురించ లేదే!
“యాంత్రికంగా ” లేనే లేదు.
ఈ రచయిత అంటే ఈ పై విమర్శకుడికి ఏమంత ఇష్టం లేనట్టు కనిపిస్తోంది; కానీ, రచనపై లేని అభాండాలు రుద్దడం ఏమంత నాగరీకం కాదేమో!
యస్. భారతి
అంధకారం గురించి తిరునగరి సత్యనారాయణ గారి అభిప్రాయం:
04/06/2010 12:21 pm
రెండు ప్రశ్నలు:
1. ఇది కవిత్వమా? ఇందులో కవిత్వం అని చెప్పుకోదగ్గదేమైనా ఉన్నదా? మంచి కాదు కదా కనీస సాహిత్య స్థాయి కానీ కవిత్వ స్థాయి కానీ లేని దీన్ని (ఏమనాలో తెలియడం లేదు) ప్రచురించి ఈ మాట తన స్థాయి మరచి పోయిందా? ఏ సాహిత్య ప్రమాణాలు దీనికి వర్తిస్తాయో, ఎట్లా ఇది కవిత్వమవుతుందో ఎవరైనా విడమర్చితే సంతోషిస్తాను.
2. ఇది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు వ్యతిరేకంగా రాసినట్టుంది. కవిత బలహీనత వల్ల అది తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఇంత చవకబారు కవిత్వంతో అవమాన పర్చడం సమంజసమా? ఈ మాట సంపాదక వర్గానికి అభిప్రాయాలెట్లున్నా, తెలంగాణ ఆకాంక్ష ప్రజలది అనీనూ, ఏదో స్వార్థ రాజకీయ నాయకులది కాదనీ చాలా స్పష్టంగా తెలుసనే అనుకుంటున్నాను. స్వార్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఎన్ని సార్లు మోసపోయినా తెలంగాణ ప్రజలు తమ ప్రజాస్వామిక ఆకాంక్షను పదే పదే వ్యక్తం చేస్త్తూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. అట్లాంటప్పుడు ఇది ప్రచురించడం ఆ ఆకాంక్షను అవమానపర్చడం కాదా?
తెలగాణెము గురించి తిరునగరి సత్యనారాయణ గారి అభిప్రాయం:
04/05/2010 8:14 pm
కవి గారు సిసలైన తెలంగాణ వాడినని చెబుతూనే తెలంగాణా ప్రజానీకం ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కవిత్వం చెప్పారు. ఇవాళ్ళ తెలంగాణా పల్లె పలెనా ప్రతి మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవి కావని కవిగారు గుర్తెరిగారా? లేక గుర్తించినా తమ అభిప్రాయంగా, ప్రజల అభీష్టానికి భిన్నంగా పద్యం చెప్పారా? పద్యం ఎంత అందంగా చెప్పినా, అది రాయప్రోలు వారిని గుర్తు తెచ్చినా పద్యం లోని భావం (వస్తువు) రాజకీయ పరమైనది, అదీనూ తెలంగాణ ప్రజల రాజకీయానికి వ్యతిరేకమైనది. బహుశ అందుకేనేమో ఈ వస్తువు పద్య రూపాన్ని ఎంచుకున్నది . తెలంగాణ కోరుతూ సమకాలీన కవిత్వం రాస్తున్న వారంతా జానపదుల పాటను (వచన కవిత్వం తో పాటు) ప్రధానంగా ఎంచుకుంటున్నారు. వస్తువు రూపాన్ని నిర్ణయిస్తుంది అనడానికి ఇది మంచి ఉదాహరణ.
రసతంత్రులను మీటి సర్వాత్మాన పాత్రలొ లీనమై సభ్య సమాజాన్ని దాటిపోని రచన ఉత్తమరచన అనిపించుకుంటుంది. ద్రౌపది నవలలో ఈ ఉత్తమరచనకు ఆస్కారము లేదని విమర్శించినవారిది కుసంస్కారమనే వారికి నమస్కరించడము తప్ప చేయగలిగిందేమీలేదు. డా.వెన్నావల్లభరావు మొదలైన 19మంది రచయితలు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ద్వారా సంయుక్త ప్రకటనలొ ఇది దుష్టసంప్రదాయమని భావప్రకటన స్వేచ్చను అవహేళన చేశారు.
రచయిత సమర్థతను,అంతరంగభావాలను మనోహరంగావెల్లడించిన ద్రౌపదికి… యార్లగడ్డ శైలిపట్ల విరుచుకుపడే ప్రయత్నము కోసము రచయితలెవరూ కంకణము కట్టుకోలేదు. మరోనవల సత్యభామను రాయకుండా అడ్దుకునే ప్రయత్నమూ చేయలేదు. “రామాయణ కల్పవృక్షము” జ్ఞానపీఠము నెక్కింది. హేతు దృక్పధంతొ,అవ్యక్త అంతరంగభావనతో మానసిక విశ్లేషణ దృష్టితొ, స్త్రీవాద దృక్కోణంతో, రామాయణ విషవృక్ష రచన కూడ చదివి ఆనందించినవారున్నారు. పవిత్రతకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి దుయ్యబట్టిన వారున్నారు. ఆ నవల చదివి రామాయణ కల్పవృక్షమును జ్ఞానపీఠమునుండి దింపేయాలన్న సంయుక్త విమర్శలు రాలెదు.
ద్రౌపది మహారాణి. తన్నోడినన్నోడెనాలేక నన్నోడితన్నోడెనా అన్న ప్రశ్నకు గుడ్డి దృతరాష్ట్రుడు కూడ చలించాడు కనుకనె పుత్ర వ్యామోహాన్ని విడిచి ద్రౌపది మహారాజ్నీత్వాన్ని ఉత్తమ కోడలివని అభినందించి తిరిగి ఇచ్చేశాడు. మరి తిరిగి జూదమాడి అడవులు పట్టిపోయిన పాండవులకు రాజ్యమెక్కడిది? అందుచేతనె కుంతి హస్తినలొ ఆగిపొయి రాజ్యభాగ సమస్యను సజీవంగా నిలిపే ప్రయత్నము చేసింది. పాండవులమీది ద్వేషము తప్ప దుర్యోధనుడిది దుష్ట పరిపాలన అనేపిర్యాదు భారతంలో కనబడదు.
రాజ్యభాగము ఇస్తే మంచిది అన్నారుకాని …ఇవ్వకపొతే అంటూ పాండవుల తరపున కురుగురు వృద్ధులెవరూ ఆకారణంచేత దుర్యొధనుని విడిచి పెట్టకపోవడము గమనార్హము. కాని పాంచాలికి జరిగిన పరాభవము ద్రౌపది ప్రశ్నలొ వెన్నాడి ఆ మహాఇల్లాలికి మహారాణిత్వము సిద్దించాలని కర్ణుడితొసహా మన:స్ఫూర్తిగ యుద్దము చేయలేక నేలకొరిగారు. భీముడంతటి భర్త ప్రతిజ్ఞలు మర్చిపోయాడు. ఒక ఆడదానికి జరిగిన పరాభవము ఏయుగములోను జరగకూడదని ఆశించి భర్తల కనుసన్నలలొ ఉండి గొప్పయుద్దము జరిపించి పుత్ర విహీనయై కూడ అపాండవము కోరుకున్న అశ్వథ్థామను క్షమించి మహారాణీత్వాన్ని చాటుకుంది. ఆ మహారాణిలొని నవలా నాయికలక్షణాలు “‘కొత్త అవిష్కరణగ” రచించిన యార్లగడ్డ రచన అభినందనీయము. అంతేతప్ప సాహిత్య అకాడమీ అవార్డు నిబంధనలకు తగినట్లు లేదన్న వారు ద్వేషంతొ పనిగట్టుకుని విమర్శించి రచ్చకీడ్చారన్న ధోరణితొ విమర్శించేవారిని బుద్దిహీనులనడము బుద్దిగలవారు వేసుకోవలసిన ప్రశ్న. డా.జొన్నలగడ్డ మార్కండేయులు.
‘శ్రీ శ్రీ రచనలపై కేవీయార్ ‘శీర్షికతో — ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 5 – వివిధ పేజీ (నాలుగో పేజీ) లో 1985 లో కడియాల రామమోహన రాయి – కేవీయార్ తో చేసిన ఇంటర్వ్యూ వుంది. ఈ పేపర్ ద్వారా PDF డౌన్ లోడ్ చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి.
కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Lakshmi Nageswar Dasari గారి అభిప్రాయం:
04/07/2010 6:14 am
చాలా బాగుంది.
ప్రేమ కవితలు గురించి Ram sai ganesh గారి అభిప్రాయం:
04/07/2010 2:52 am
చాల చక్కగా ఉంది మీ కవిత
ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి bhaarati గారి అభిప్రాయం:
04/06/2010 6:08 pm
కథ చెప్పిన పద్ధతి నాకు బాగా నచ్చింది. సిగరెట్ల పై డాలీ కొచ్చిన ఫీలింగ్స్ చక్కగా చెప్పారు.
చెప్పేపద్ధతిలో ” కృతకం, కృత్రిమం, వికృతం ” ఏమీ స్ఫురించ లేదే!
“యాంత్రికంగా ” లేనే లేదు.
ఈ రచయిత అంటే ఈ పై విమర్శకుడికి ఏమంత ఇష్టం లేనట్టు కనిపిస్తోంది; కానీ, రచనపై లేని అభాండాలు రుద్దడం ఏమంత నాగరీకం కాదేమో!
యస్. భారతి
అంధకారం గురించి తిరునగరి సత్యనారాయణ గారి అభిప్రాయం:
04/06/2010 12:21 pm
రెండు ప్రశ్నలు:
1. ఇది కవిత్వమా? ఇందులో కవిత్వం అని చెప్పుకోదగ్గదేమైనా ఉన్నదా? మంచి కాదు కదా కనీస సాహిత్య స్థాయి కానీ కవిత్వ స్థాయి కానీ లేని దీన్ని (ఏమనాలో తెలియడం లేదు) ప్రచురించి ఈ మాట తన స్థాయి మరచి పోయిందా? ఏ సాహిత్య ప్రమాణాలు దీనికి వర్తిస్తాయో, ఎట్లా ఇది కవిత్వమవుతుందో ఎవరైనా విడమర్చితే సంతోషిస్తాను.
2. ఇది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు వ్యతిరేకంగా రాసినట్టుంది. కవిత బలహీనత వల్ల అది తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఇంత చవకబారు కవిత్వంతో అవమాన పర్చడం సమంజసమా? ఈ మాట సంపాదక వర్గానికి అభిప్రాయాలెట్లున్నా, తెలంగాణ ఆకాంక్ష ప్రజలది అనీనూ, ఏదో స్వార్థ రాజకీయ నాయకులది కాదనీ చాలా స్పష్టంగా తెలుసనే అనుకుంటున్నాను. స్వార్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఎన్ని సార్లు మోసపోయినా తెలంగాణ ప్రజలు తమ ప్రజాస్వామిక ఆకాంక్షను పదే పదే వ్యక్తం చేస్త్తూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. అట్లాంటప్పుడు ఇది ప్రచురించడం ఆ ఆకాంక్షను అవమానపర్చడం కాదా?
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
04/06/2010 10:44 am
మీ కవిత ఏదైనా మనసుకు హత్తుకునేలా ఉంటుంది….మంచి పద చిత్రాలు వేస్తారు మీరు..
నాయినమ్మ యిల్లు గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
04/06/2010 10:39 am
చాలా బాగుందండి…. lovely expresion
తెలగాణెము గురించి తిరునగరి సత్యనారాయణ గారి అభిప్రాయం:
04/05/2010 8:14 pm
కవి గారు సిసలైన తెలంగాణ వాడినని చెబుతూనే తెలంగాణా ప్రజానీకం ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కవిత్వం చెప్పారు. ఇవాళ్ళ తెలంగాణా పల్లె పలెనా ప్రతి మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవి కావని కవిగారు గుర్తెరిగారా? లేక గుర్తించినా తమ అభిప్రాయంగా, ప్రజల అభీష్టానికి భిన్నంగా పద్యం చెప్పారా? పద్యం ఎంత అందంగా చెప్పినా, అది రాయప్రోలు వారిని గుర్తు తెచ్చినా పద్యం లోని భావం (వస్తువు) రాజకీయ పరమైనది, అదీనూ తెలంగాణ ప్రజల రాజకీయానికి వ్యతిరేకమైనది. బహుశ అందుకేనేమో ఈ వస్తువు పద్య రూపాన్ని ఎంచుకున్నది . తెలంగాణ కోరుతూ సమకాలీన కవిత్వం రాస్తున్న వారంతా జానపదుల పాటను (వచన కవిత్వం తో పాటు) ప్రధానంగా ఎంచుకుంటున్నారు. వస్తువు రూపాన్ని నిర్ణయిస్తుంది అనడానికి ఇది మంచి ఉదాహరణ.
వానా వానా… గురించి telugu4kids గారి అభిప్రాయం:
04/05/2010 12:21 pm
ఈ కవిత వీడియోగా ఇక్కడ చూడగలరు. తొందరలోనే తెలుగు4కిడ్స్ వెబ్ సైటులో ఆణిముత్యాలలో చేరుస్తాను.
తెలుగు4కిడ్స్ లో కొన్ని పేజీలు ఇంకా ఆకర్షణీయంగానూ, అనువుగానూ తయారు చేయవలసి ఉంది. మాలతి గారి సాయంతో ఈ మధ్యే సామెత కథలు మొదలు పెట్టాము.
చిత్రీకరణ పై మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలుగు4కిడ్స్ ద్వారా తెలియ చేయగలరు.
ఇతిహాసాలూ, ప్రబంధాలూ గురించి DR.Jonnalgadda Markandeyulu గారి అభిప్రాయం:
04/05/2010 7:24 am
రసతంత్రులను మీటి సర్వాత్మాన పాత్రలొ లీనమై సభ్య సమాజాన్ని దాటిపోని రచన ఉత్తమరచన అనిపించుకుంటుంది. ద్రౌపది నవలలో ఈ ఉత్తమరచనకు ఆస్కారము లేదని విమర్శించినవారిది కుసంస్కారమనే వారికి నమస్కరించడము తప్ప చేయగలిగిందేమీలేదు. డా.వెన్నావల్లభరావు మొదలైన 19మంది రచయితలు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ద్వారా సంయుక్త ప్రకటనలొ ఇది దుష్టసంప్రదాయమని భావప్రకటన స్వేచ్చను అవహేళన చేశారు.
రచయిత సమర్థతను,అంతరంగభావాలను మనోహరంగావెల్లడించిన ద్రౌపదికి… యార్లగడ్డ శైలిపట్ల విరుచుకుపడే ప్రయత్నము కోసము రచయితలెవరూ కంకణము కట్టుకోలేదు. మరోనవల సత్యభామను రాయకుండా అడ్దుకునే ప్రయత్నమూ చేయలేదు. “రామాయణ కల్పవృక్షము” జ్ఞానపీఠము నెక్కింది. హేతు దృక్పధంతొ,అవ్యక్త అంతరంగభావనతో మానసిక విశ్లేషణ దృష్టితొ, స్త్రీవాద దృక్కోణంతో, రామాయణ విషవృక్ష రచన కూడ చదివి ఆనందించినవారున్నారు. పవిత్రతకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి దుయ్యబట్టిన వారున్నారు. ఆ నవల చదివి రామాయణ కల్పవృక్షమును జ్ఞానపీఠమునుండి దింపేయాలన్న సంయుక్త విమర్శలు రాలెదు.
ద్రౌపది మహారాణి. తన్నోడినన్నోడెనాలేక నన్నోడితన్నోడెనా అన్న ప్రశ్నకు గుడ్డి దృతరాష్ట్రుడు కూడ చలించాడు కనుకనె పుత్ర వ్యామోహాన్ని విడిచి ద్రౌపది మహారాజ్నీత్వాన్ని ఉత్తమ కోడలివని అభినందించి తిరిగి ఇచ్చేశాడు. మరి తిరిగి జూదమాడి అడవులు పట్టిపోయిన పాండవులకు రాజ్యమెక్కడిది? అందుచేతనె కుంతి హస్తినలొ ఆగిపొయి రాజ్యభాగ సమస్యను సజీవంగా నిలిపే ప్రయత్నము చేసింది. పాండవులమీది ద్వేషము తప్ప దుర్యోధనుడిది దుష్ట పరిపాలన అనేపిర్యాదు భారతంలో కనబడదు.
రాజ్యభాగము ఇస్తే మంచిది అన్నారుకాని …ఇవ్వకపొతే అంటూ పాండవుల తరపున కురుగురు వృద్ధులెవరూ ఆకారణంచేత దుర్యొధనుని విడిచి పెట్టకపోవడము గమనార్హము. కాని పాంచాలికి జరిగిన పరాభవము ద్రౌపది ప్రశ్నలొ వెన్నాడి ఆ మహాఇల్లాలికి మహారాణిత్వము సిద్దించాలని కర్ణుడితొసహా మన:స్ఫూర్తిగ యుద్దము చేయలేక నేలకొరిగారు. భీముడంతటి భర్త ప్రతిజ్ఞలు మర్చిపోయాడు. ఒక ఆడదానికి జరిగిన పరాభవము ఏయుగములోను జరగకూడదని ఆశించి భర్తల కనుసన్నలలొ ఉండి గొప్పయుద్దము జరిపించి పుత్ర విహీనయై కూడ అపాండవము కోరుకున్న అశ్వథ్థామను క్షమించి మహారాణీత్వాన్ని చాటుకుంది. ఆ మహారాణిలొని నవలా నాయికలక్షణాలు “‘కొత్త అవిష్కరణగ” రచించిన యార్లగడ్డ రచన అభినందనీయము. అంతేతప్ప సాహిత్య అకాడమీ అవార్డు నిబంధనలకు తగినట్లు లేదన్న వారు ద్వేషంతొ పనిగట్టుకుని విమర్శించి రచ్చకీడ్చారన్న ధోరణితొ విమర్శించేవారిని బుద్దిహీనులనడము బుద్దిగలవారు వేసుకోవలసిన ప్రశ్న. డా.జొన్నలగడ్డ మార్కండేయులు.
తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
04/04/2010 10:40 pm
‘శ్రీ శ్రీ రచనలపై కేవీయార్ ‘శీర్షికతో — ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 5 – వివిధ పేజీ (నాలుగో పేజీ) లో 1985 లో కడియాల రామమోహన రాయి – కేవీయార్ తో చేసిన ఇంటర్వ్యూ వుంది.
ఈ పేపర్ ద్వారా PDF డౌన్ లోడ్ చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి.
l