Comment navigation


15820

« 1 ... 1162 1163 1164 1165 1166 ... 1582 »

  1. సా విరహే తవ దీనా గురించి mOhana గారి అభిప్రాయం:

    04/26/2010 8:12 am

    సంస్కృత నిఘంటువులలో కొలోన్ నిఘంటువులో మాత్రమే సహోదరీ అనే పదము కనబడుతుంది. ఆప్తే, కొలోన్ నిఘంటువులలో స్త్రీ లింగములో సహోదరా అనే పదము ఉన్నది. ఈ సహోదరా పదము తెలుగులో సహోదర అవుతుంది (మాత, సీత లాటి పదాలవలె). కాబట్టి ఇది స్త్రీలింగము బహువచనములో సహోదరలు అవుతుంది.. మీకు సహోదరులు స్త్రీ లింగములో నచ్చకపోతే సహోదరలు అని పిలువవచ్చు. నా ఉద్దేశములో మణి అనే శ్రేష్ఠవాచక పదము అనవసరము.
    విధేయుడు – మోహన

  2. సా విరహే తవ దీనా గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    04/26/2010 1:22 am

    “ఎందుకంటే నేను “సావిరహే తవదీనా రాధా” అని జయదేవుని పల్లవిని అందుకుని పాడుకుని పరవశిస్తానే గానీ లైలాగారి అనువాదంతో నాకు పనిలేదు. మాతృక గొప్పగా ఉండగా దానిముందు పసలేని అనువాదం నాకు రుచించదు. – -rama bharadwaj

    నిజంగా.
    ఐతే ఎవరి గొంతుకలో పాడుకుని ఆనందిస్తారు? మీ సొంత గొంతుతోనే? మీ గొంతుకన్నా, ఇంతకు ముందు పాడిన గాయకుల గొంతులు గొప్పగా ఉంటే, మరి మీ గొంతు మీకు రుచిస్తుందా?

    జయదేవుడేమంటాడో? ఆయనకు మీ పాట రుచిస్తుందా? ఆయన పరవశిస్తాడా?

    ‘చెలం’ రాసిన జయదేవ నాటికలో తనను చూసుకుని ఆయన ఇంకా అలమటిస్తూనే ఉన్నాడో! అన్నమయ్య, నా సంగతేం చెప్పమన్నావ్ -అని ఆయన్ను ఓదారుస్తున్నాడో?

    చలం నాటిక “జయదేవ” చివరలో జయదేవుని కొన్ని మాటలు:

    ” రాధా! మాటాడవా? ఎలా పరిహారం చెయ్యను? మరణిస్తే మాత్రం నన్ను ఒదులుతుందా ఈ జాడ్యం? రాధా! నీ చిన్ని పాదాలు తాకనీ, నీ పాదా లేవీ?”

    ఆ తర్వాత ఆ నాటిక అలా ముగించాడేం చలం? ఆ పుస్తకంలోని జయదేవుడూ, అష్టపదులు రాసిన జయదేవుడూ ఒకరేనా?

    మీ లేఖలో ఎందుకో నాలుగు సార్లు నా నామం జపించారని, ఈ ఉత్తరం రాస్తున్నా.

    లైలా

  3. About eemaata గురించి geyamala గారి అభిప్రాయం:

    04/26/2010 12:19 am

    భారతి లేదు అనుకునే వారికి మీ పత్రిక ఒక అందమైన సమాధానం .
    my earnest appeal to you is to publish detailed critical analysis of writings of vaddera chandi das and on keelubommalu by g.v.krishna rao
    i hope what mallinadha suri said about magha and kalidasa would be applicable to your web edition.

  4. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి geyamala గారి అభిప్రాయం:

    04/26/2010 12:00 am

    the poet chooses those words which alight on the hearts of readers like a dove.
    if one wants to enjoy the poetry, one is to strive hard. even for viewing a cinema, we are standing in queues for hours and spending a lot of time in traffic, then why can’t we take pains to understand what the poet has written. How many people could understand what was the actual meaning of the words written in his poem “sahasi”?
    “KADILINCHAKU SUPTA BHUJANGALANU”
    MANTRANAGARI SARIHADDULU MUTTAKU.”

    Unless the reader has authority on Freudian psychology, it was difficult to understand what was in SRI SRI’s mind.

  5. అసమర్థుని జీవయాత్రేనా? గురించి geyamala గారి అభిప్రాయం:

    04/25/2010 11:44 pm

    Gopichand clearly failed in moulding the character of seetharama rao. the entire lecture of ramayya tata was plagiarized from M..N.ROY’s New humanism.
    Another thing is people who have inferiority complex will not become psychotics. Gopichand should have studied abnormal psychology. though it might have influenced Telugu readers some decades back, now , i feel it would not create any feeling after reading that novel. Actually, G.V.Krishna rao very powerfully utilised Marxism and psychology in his magnum opus ” keelu bommalu”. Why gopichand failed? because in those days, telugu writers were influenced by Freud only. they did not read Adler.

  6. సా విరహే తవ దీనా గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    04/25/2010 1:47 pm

    మోహన బ్రహ్మానందం ఒక లైనులో ‘గాయనీ మణులు’ అంటూనే ‘బాంబే సహోదరుల’ అన్నారు. అది తప్పు అన్న వారికి బాల వ్యాకరణం లోని నియమాన్ని చూపించి, తప్పని గానీ సరి అని గానీ చెప్పక తప్పని సరిగా అవే మాటల్ని ఉంచేసారు. బూదరాజు రాధాకృష్ణ గారు వార్తా పత్రికల్లో వాడే భాషా నియమాలను తన ‘తెలుగు భాషా స్వరూపం’ ( పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం, 2001 ) పుస్తకంలో ఎంతో చక్కగా వివరించారు. వాడుకలో ‘బాంబే సిస్టర్స్’, ‘బేలూరు సిస్టర్స్’, ‘సికిల్ సిస్టర్స్’, హైదరాబాద్ బ్రదర్స్’ అని ఉన్నప్పుడు వాటిని తెలుగులోకి మార్చేయడం అనుచితం కాదు. ‘గాయనీ మణులు సౌమ్య,బాంబే సిస్టర్స్ ల’ అనే వాక్యం సరిపోతుంది. ఇలాగే నటుడు, నటి అనే పదాల బహువచనం లోనూ (నటులు) ఇబ్బంది ఉన్న కారణంగా ‘నటీ మణులు’ వాడవలసి వస్తోంది. అందర్నీ ఒకే త్రాట కట్టదలచుకుంటే ‘నటీ నటులు’ అన వచ్చు. ఇలాగే ‘గాయనీ గాయకులు’ కూడా. స్త్రీ, పురుష వ్యత్యాసం చూప దలుచుకుంటే మాత్రం ఈ స్త్రీ మూర్తులు బహు వచనంలో ‘మణి’ ధారులే. విజయవాడ నుంచి ఆ కాలంలో విడుదలయ్యే సినిమా పాటల పుస్తకాల్లో గాయని అనే మాట మచ్చుకైనా కనపడదు. ఘంటసాల,శ్రీనివాస్,సుశీల,జానకి,పిఠాపురం,బాల సుబ్రహ్మణ్యం – అందర్నీ ‘గాయకులు’ అనే హెడ్డింగ్ కింద చూపించేవారు. ఎంతటి అభ్యుదయమో చూడండి. కొన్ని శబ్దార్ధ రత్నాకరాల్లో ‘గాయకుడు’ అనే మాట తో బాటూ ‘గాయనుడు’ అనే పదం కూడా ఉంటుంది. గాయని ఉంది కానీ గాయకి లేదు.

  7. సా విరహే తవ దీనా గురించి naresh Nunna గారి అభిప్రాయం:

    04/25/2010 8:08 am

    Dear బ్రహ్మానందం గొర్తి garu and particularly జెజ్జాల కృష్ణ మోహన రావు garu,

    I am really grateful to u for a wonderful article and the information with translations of సా విరహే… It is really commendable as ur article is an intuitive discovery of intricacies of Sanskrit verses of Jayadeva. That Intuition has been added by profound knowledge and experiential implications of verses into life. Ur readers must be certainly benefited by ur writings.

    But, personally, I detested the allusion, rather a reference to ‘A Midsummer night’s dream’ of William Shakespeare.

    One dare not compare

    ధ్యానలయేన పురః పరికల్ప్య భవంత మతీవ దురాపం
    విలపతి హసతి విషీదతి రోదితి చంచతి ముంచతి తాపం

    and

    More strange than true: I never may believe
    These antic fables, nor these fairy toys…..

    blah… blah..

    The latter is an objective comment, though an erudite one, by a world Master. But, the former is a kind of lyrical compliance, subjective surrender, emotional submission, irrational giving in and an unconditional kneeling before the manifestation of Love.

    Even the nicest translation by George Keyt, Kutub:

    Full of seductive art she makes and prepares,
    as a rite, a bed of flowers,
    A couch for the rapture of your embrace,
    of flowers like heads of the arrows of Love.

    ………. is very very far from the original…. :

    కుసుమవిశిఖశరతల్ప మనల్ప విలాస కలా కమనీయం
    వ్రత మివ తవ పరిరంభసుఖాయ కరోతి కుసుమ శయనీయం!

    When I first heard of Goethe, who received Abhijñāna śākuntalam of Kalidasa with wonder and fascination, that he danced on the street while reading the verses, I thought that his bliss would have been hyped manifold, if he had read Kalidasa text in original Sanskrit. So, that chasm would be always be there between any two languages, particularly between oriental and occidental languages.

    However, I personally owe you a lot for providing very erudite information. I also request you to give similar kind of profound information about ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే and రాధిక కృష్ణా రాధిక తవ విరహే కేశవా… Ashtapadis…

    regards,
    Naresh Nunna.

  8. తడిస్తే కదా తెలిసేది! గురించి Gannavarapu Narasimha Murty గారి అభిప్రాయం:

    04/25/2010 1:38 am

    ధీరులు సాహితీ ప్రియులు దియ్యని దేనియ పల్కు ధారలున్
    బారగ నాల్గు దిక్కులనుఁ బ్రాజ్ఞతఁ బద్యము గద్యమందుటల్
    భూరి విశేష కల్పనలుఁ బూనికఁ జేయగ నాత్మ మెచ్చదే
    భారతి పెక్కు భంగిమల, భాగ్యమె పల్కుట తెల్గు నందుటన్ !

    తెలుగు భాష భవిష్యత్తు యేమిటి అని బెంగ పడవలసిన యీ రోజులలో తెలుగులో ఎవ రేమి వ్రాసినా చెప్పినా మనమంతా ఆనందించాలి. భారతి భావాంబర వీధి విశృత విహారి. వైవిధ్యంలో అందం ఉంది.

  9. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి bhaarati గారి అభిప్రాయం:

    04/24/2010 11:07 pm

    బాలరాజు సినిమాలో ” రూపమునీయరయా,” అన్న రాగమాలిక శ్రీనివాస్‌ గారికి దొరకలేదా? లేదా, ఆపాట పాడింది వరలక్ష్మిగారు కాదా, చెప్మా?
    సందేహనివృత్తికోసం వేచి చూస్తూ,

    భారతి

  10. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి bhaarati గారి అభిప్రాయం:

    04/24/2010 9:05 pm

    dear editors:

    the first part of this message is in response to geyamala.

    superlatives like greatest symbolist poet etcetera are impossible to justify. personal adorations should not not become a part of critical appreciation.

    in re: einstein’s relativity theory. as one who studied physics and poetry, i can only say that your analogy is hilarious, if not thoroughly ridiculous.

    there was a guy by name aristotle said that analogies are dangerous. i concur with that old fellow!

    secondly, jayaprabha,knowingly or unknowingly, simply repeated t s eliot’s cliche. and, alas! cliche it is! no more, no less!

    all the telugu literary stalwarts, poets and selfstyled “critics”, marxist and nonmarxist alike, go ape over it, viz.,
    ” poetry communicates before it is understood.” it is a bunch of hog wash.

    if one understands the meaning of the words, one can appreciate poetry as it should be appreciated. i mean critically appreciated. doting is not appreciation! it is that simple.

    if anyone demands what eliot’s statement really means, these scholars put a pale dumb face. try it; you might like it, as the commercial goes!

    essentially, is it not what veluri’s essay is conveying?

    best regards.

    bharati

« 1 ... 1162 1163 1164 1165 1166 ... 1582 »