Comment navigation


15820

« 1 ... 1160 1161 1162 1163 1164 ... 1582 »

  1. ‘వికృతి’ ఉగాది గురించి నాగమురళి గారి అభిప్రాయం:

    05/03/2010 1:21 am

    వికర్షించడం అంటే మనందరికీ అర్థం తెలుసు. కానీ ‘విశేషంగా ఆకర్షించడం’ అన్న అర్థంలో ఈ పదాన్ని కిరాతార్జునీయంలో వాడడం చూసి ఆశ్చర్యం కలిగింది.

    కాబట్టి వికృతి అంటే విశిష్టమైన కృతి అని అర్థం చెప్పుకోవచ్చేమో! పండితులెవరైనా వివరిస్తే బాగుంటుంది..

  2. ‘వికృతి’ ఉగాది గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/03/2010 1:05 am

    ” కవితలల్లుటన్న తీపి భేషజమా వాదరమా
    మాటల మూటలని విప్పి పేర్చుటలా వదరుటలా”

    ఈ మాటలు బాగున్నాయి. ఈ కవితకి చక్కగా సరిపోతున్నాయి.

    రమ.

  3. ‘వికృతి’ ఉగాది గురించి mOhana గారి అభిప్రాయం:

    05/02/2010 7:48 pm

    బాగుంది కవిత! ఈ వి పదాలతో వచ్చిన గొడవే ఇది. మల అంటే కుళ్లు, కాని విమల, అమల రెంటికీ ఒకటే అర్థము. అదే విధంగా వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. కానీ కృతికి వి చేరిస్తే విశిష్టమైన కృతి కాక వికారమయింది. కానీ జ్ఞానికి వి చేరిస్తే వచ్చిన విజ్ఞానము విశేషమైన జ్ఞానమే. ఒహొరే ఒహొరే బ్రహ్మ దేవుడా, నీవెంత బుద్ధిశాలివయ్యా బ్రహ్మదేవుడా! విధేయుడు – మోహన

  4. శరణాగతి గురించి Dr. Gannavarapu Varaha Narasimha Murty గారి అభిప్రాయం:

    05/02/2010 11:52 am

    సరసిజ నేత్రి శారదయు చారువు రూపిణి వీణ పాణియై
    విరళిత పత్ర రాశులను విశ్రుత మాధురి గంధ రాశులన్
    దరళిత తామరంబులను దాల్చుచుఁ సన్నిధిఁ జేరి నిల్వగాఁ
    దిరుమల కృష్ణ దేశికుఁడు దేటయి గ్రోలెనె దీపి తేనియల్ !

  5. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి సౌమ్య గారి అభిప్రాయం:

    05/02/2010 9:41 am

    “సత్యభామ సరసపు నగవు” -ఇవన్నీ సినిమాకోసం పాడినవా ఐతే! మా ఇంట్లో ఆ కేసెట్ ఉండేది. మా నాన్నగారు తరుచుగా వింటూ ఉండేవారు. అలా మాకు కూడా ఆ పాటలూ…ఆశాభోంస్లే తెలుగులో పాడ్డం తెలిసాయి…

    ‘కల్యాణి’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’ వంటి సినిమాల్లో ఈయన పాటలు విని, ఆ తర్వాత కొన్ని జంధ్యాల సినిమాల్లో విన్నాక, మిగితా ఏమేం సినిమాలకి చేశారో అనుకుని వెదుక్కుంటే – అప్పటి మా కాలేజీ LAN లో కనబడక వదిలేశాను.

    మీరు అందించిన వ్యాసానికి చాలా థాంక్స్ 🙂

  6. గుండుగొమ్ములనుమానం – 3 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/02/2010 1:24 am

    హమ్మయ్య!! మీ గుండుగొమ్ముల అనుమానమ్ ఇప్పటికైనా తీరీ తీరక తీరినందుకు ఆనందం కలిగింది. సృజనని గురించిన చర్చ సృజన కాదు గనక చర్చకి లోబడని సంగతులు సైతం ఉంటాయి… అని మీ గురువులు మీకు బోధించడం ముదావహం!! అంతర్లీనంగా ఉన్న దుఖం సహజమైనదీ..స్వచ్చమైనదీనూ!! ఎవరెంత చెప్పినా చెప్పకపోయినా సృజనకి ప్రేరణ అదే!! నామినికైనా ఇంకొకరికైనా కూడా!! ఇక మిగిలినవన్నీ రకరకాల ఆర్భాటాలే!! పిడికిలి విప్పితే ఏముంటుంది కనక ప్రసాద్ గారూ ?? ఆస్వాదనకి ప్రమాణమ్ ఆస్వాదన మాత్రమే!! మీరు ఆస్వాదించలేనిది మీకు కావలసిన అక్షరం కాదు. బహుశా అది మరొకరికి ఆనందాన్నివ్వవచ్చును. నారాయణరావు గారు చెప్పింది ఇదే!!

    రమ.

  7. మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/02/2010 12:55 am

    జ్ఞాపకాల మిణుగురులు అంటుకుని దీపాలు వెలగవు.ఆడంబరం ఎక్కువ తప్ప అనుభవం అందివ్వని కవిత ఇది.

    రమ.

  8. సుగమం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/02/2010 12:51 am

    రాధికా!! మనసు బరువయ్యింది. మార్గం సుగమం చేసిన తరవాత ఆ కన్న తల్లి ఏమనుకున్నా పిల్లలు ఎంత సిగ్గుపడాలో కదా!!
    కవిత బాగుందని చెప్పనా?? కలిగిన బాధ బాగులేదని చెప్పనా??
    రమ.

  9. గుండుగొమ్ములనుమానం – 3 గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    05/01/2010 11:54 pm

    కనక ప్రసాద్ గారూ,
    రచనలు చేసిన వారూ, చేయదల్చుకున్నవారూ తప్పకుండా చదవాల్సిన అనుమానాలు మీవి.
    చాలాబాగా రాసారు. ఇప్పటికి నాలుగైదు సార్లు మొత్తం చదువుకున్నాను.
    మొదటి భాగం చదివి – “అదేవిటి? మధ్యలో ఆపేసారు అనుకున్నాను. రెండోది చదివి, చెప్పాల్సిందంతా చెప్పారు కదా? ఇంకేం చెబురానుకున్నాను. మూడోది చదివేకా “ఇంకాస్త చెప్పచ్చుకదా? ఆయన సొమ్మేం పోయిందని” నిరాశ పడ్డాను.
    రుచిగా ఉన్నది ఎక్కువ తిని అరాయించుకునే శక్తి లేకపోయినా ఇంకా తినాలన్న ఆబ, అంతే!
    మీకొచ్చినవే ( అను-మానాలు ) రాసే ప్రతీ వారికీ వస్తే ఎంత బావుండును?

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  10. కళావసంతము గురించి ధేశికాచారి గారి అభిప్రాయం:

    05/01/2010 10:57 pm

    కృష్ణమోహనరావుగారూ,
    మీరు సాహిత్యసంగీతచిత్రలేఖనసంప్రదాయాలను జోడించి వసంతపరంగా వ్రాసిన వ్యాసం ఆసక్తికరంగాను, విజ్ఞానప్రదంగాను ఉన్నది. మీవలె నేను హిందీతమిళకన్నడాదిభాషల నెరుగని వాడను గాని, నేను కాళిదాసు ఋతుసంహారాన్ని సమగ్రంగా తెనుగులోనికి అనువాదం చేసినాను. ఈ పుస్తకం ప్రతి పూర్తిగా నా వెబ్ సైటులో (http://kavya-nandanam.com) ఉన్నది. మీరు పేర్కొనిన కాళిదాసు రెండు శ్లోకాలకు నా అనువాదాలు వరుసగా ఈ విధంగా అందులో నున్నవి.
    చిత్రపుఁ బత్రభంగములఁ జెన్నగు భామల హేమపద్మపు
    న్మిత్రములైన వక్త్రముల మెండగు స్వేదకణంబు లింపగున్,
    చిత్రతరాన్యరత్నగణచిత్రిత మండలమధ్యనీత స
    న్మిత్రసితప్రభాకలిత నిర్మలమౌక్తికపంక్తియో యనన్.

    ఎవ్వని విండ్లు కింశుకము లెవ్వని బాణము లామ్రమంజరుల్,
    ఎవ్వని మౌర్వి తేఁటిగమి, యెవ్వని తెల్లని ఛత్ర మిందుఁడున్,
    ఎవ్వని దంతి గంధవహుఁ డెవ్వని బంట్లు పికాళి, లోకజి
    త్తెవ్వఁడు తత్స్మరుండు ప్రజ కిమ్ము లొసంగుతఁ జైత్రయుక్తుఁడై.

« 1 ... 1160 1161 1162 1163 1164 ... 1582 »