Comment navigation


15820

« 1 ... 1159 1160 1161 1162 1163 ... 1582 »

  1. భవబంధాల సాక్షిగా… గురించి nagesh గారి అభిప్రాయం:

    05/04/2010 7:05 am

    సౌమ్య,
    అచ్చంగా నా మనస్సుకు అద్దమ్ పట్టారు. అభినందనలు.

  2. భవబంధాల సాక్షిగా… గురించి seenu గారి అభిప్రాయం:

    05/04/2010 2:09 am

    చాలా బాగ రాసారండీ!!!

    enjoyed a lot!!!

  3. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/03/2010 2:40 pm

    మీ అన్ని బాధలూ చదివిన తర్వాత కూడా “పీర్ రివ్యూ” అన్న పధ్ధతి ఒకటి మీరు అమలు చేస్తూ ముగ్గురు మహామహుల వడపోత తరవాత కూడా ఈమాటలో చెత్త కవితలూ నాసిరకం వ్యాసాలూ ..కధ అన్న పేరులోకి, ఆ పరిధి లోకి కూడా రాని “కధలు” మరి ఎందుకు వస్తున్నట్టూ?? ఎక్కడ లోపం?. మీ లక్ష్యం మంచి రచనలు కదా అచ్చువేయడం? కానీ మీ స్థాయి ప్రకారం పీర్ రివ్యూ లో అంతమంది పాల్గొని రచనలని సంస్కరించి వాటిని ప్రచురణార్హం చేసిన తరవాత కూడా ఇంకా మరి పస లేని రచనలే ఎక్కువగా ఉంటున్నాయీ అంటే ఆ రివ్యూ చేసే వాళ్ళకి ఆ కళ పట్టుబడనట్టా..లేక అసలా “పీర్ రివ్యూ” విధానం లోనే ఒక ఫైల్యూర్ ఏదో ఉన్నట్టా??

    ఇత్యాది ప్రశ్నలు మీరూ మీ ఇతర సంపాదక మిత్రులూ మరి ఆలోచించలేదా?? వెంకటేశ్వర రావు గారూ!! ఆశయం ఉన్నతమైనదిగా ఉండటం వేరు..దాన్ని అమలు చేయడంలో మీరు ఎక్కడ బోల్తాపడుతున్నారో తెలుసుకోవడం వేరు. ఆశయం మరీ బరువైనదైపోతే ఆచరణ సాధ్యం కాకపోతే అసలు లక్ష్యమే దెబ్బతినగలదు. ఈ కోణంలోకూడా చూడండి ఓ సారి మరి.

    చదివించే గుణం రచన అది ఏ ప్రక్రియ అయినా కూడా దానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. అది లేనప్పుడు మీరు ఎన్ని మార్పులు చేసినా ఫలితం ఏముంటుంది. మీరు రాయండర్రా అని అడిగి రాసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా?? రచయితలని మీరు తయారు చేయగలం అనే నమ్మకంతో ఉన్నారా?? మీ పత్రిక మీ ఆశయాలనీ.. దానికి సరిపడిన పీర్ గ్రూప్ నీ అలాగే మంచి రచయితలనీ కవులనీ తయారు చేయగలిగిందా?? అది సాధ్యమో..అసాధ్యమో మీకు మీ ఇన్నాళ్ళ అనుభవం ఏమీ చెప్పనే లేదా?? ఇవి మీ మాటలు చదివాకా నాకొచ్చిన అనుమానాలు. చిత్తగించగలరు.

    రమ.

  4. భవబంధాల సాక్షిగా… గురించి BPhaniBabu గారి అభిప్రాయం:

    05/03/2010 11:59 am

    కథ మరీ సీరియస్సుగా ఉన్నట్లనిపించింది.

  5. నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి sridhar గారి అభిప్రాయం:

    05/03/2010 10:03 am

    పద్యం, వివరణ చాలా బాగున్నది. ధన్యవాదములు

  6. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి Giri గారి అభిప్రాయం:

    05/03/2010 7:29 am

    Very interesting and good article.

  7. భవబంధాల సాక్షిగా… గురించి sireesha గారి అభిప్రాయం:

    05/03/2010 4:50 am

    Dear Soumya,

    when i am reading this story i felt i am reading about my feelings. how exactly you have writen my feelings? some times may be every one like loneliness.

  8. త్రిల్‌ గురించి PVSMURTHY గారి అభిప్రాయం:

    05/03/2010 3:32 am

    కథ బాగా ఉంది, కాని , ముగింపు సరిగా లేదండీ. శేఖర్ ఎవరితో తిరిగాడో రాధ తెలుసుకుంటీ త్రిల్ ఉండేది. ఇంకో మాట. రాథ ని చెడ్డదాన్ని చెయ్యడం అనవసరం. ఒకవేళ చెయ్య దల్చుకొంటే రాధను కూడా శేఖర్ని లాగా చంపాల్సింది.

  9. దారి కాదు గురించి సుబ్రహ్మణ్యం మూలా గారి అభిప్రాయం:

    05/03/2010 2:52 am

    చాలా బావుంది. మీ “భ్రంశధార” కవితకి దగ్గరగా ఉంది.

    కవితలో ఒక మాండలికాన్ని వాడేటప్పుడు అన్ని వాడుకలూ అదే మాండలికంలో ఉంటే బావుంటుందేమో

    గుడి కూలిపోయింది — గుడు కూలిపోనాది
    తోవ లేదు — తోవ నేదు

  10. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/03/2010 1:22 am

    ఉపేంద్ర గారూ!!

    మైథిలీ భాష అనే కాదు భారతీయ భాషలలోనే నాగార్జున చాలా గొప్పకవి. ఆయన కవితా ప్రపంచం గురించి తెలుగు వారికి తెలిసింది ఏమీలేదు. ఆ మాటకొస్తే చాలా మంది మంచి కవులని గురించి తెలుగు సాహిత్య ప్రియులకి నిజంగా తెలిసింది తక్కువ. అసలు తెలుగులో వచ్చిన మంచి కవిత్వం గురించి మాత్రం ఏమంత తెలుసు గనకా?? మీరు నాగార్జునని గురించి పరిచయం చేయడానికి పూనుకోడం సంతోషించవలసిన విషయం. ఐతే మీ కవితా భాష అనువాద శైలీ తెలుగు కవిత్వానికి అంతగా ఒదగలేదు. సాధన వల్ల మరింత సాధ్య పడొచ్చును.

    ఇంక బాలగోపాల్ ని గురించి మీరు రాసిన భాగం అస్సలు చదవనిచ్చేలా లేదే?? విసుగు కలిగించేలా ఉంది. ఇకపోతే బాలగోపాల్ ని గురించి తెలుగు కవులు పట్టించుకోలేదని మీరు అనడానికి ముందు తెలుగు కవులనీ తెలుగు కవిత్వాన్నీ బాలగోపాల్ ఏమాత్రం పట్టించుకున్నాడని మీరు ఆలోచించలేదే!? ఆశ్చర్యం!!

    వ్యాసం రాయడం ముఖ్యమే కానీ వాక్యాలలో స్పస్టతా.. ఎడిటింగూ.. కూడా అంతే ముఖ్యం కదా?? అది మీ ఈ వ్యాసమ్ లో స్పష్టంగా కన్పిస్తున్న లోపం. మీరు రాయబోయే ముందటి వ్యాసాలు ఈ లోపాలతో లేకుండా ఉండాలని కోరుకుంటాను.

    రమ.

« 1 ... 1159 1160 1161 1162 1163 ... 1582 »