Comment navigation


15820

« 1 ... 1157 1158 1159 1160 1161 ... 1582 »

  1. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి సౌమ్య గారి అభిప్రాయం:

    05/05/2010 1:23 pm

    పెద్దల చర్చల్లో తల దూర్చే ఉద్దేశ్యం నాకు లేదు కానీ, ఒక పాఠకురాలిగా, ఈమాటలో గత నాలుగేళ్ళలో నాలుగైదు కథలు రాసిన వ్యక్తిగా, నా అభిప్రాయం ఇదీ:

    ఈమాట పీర్ రివ్యూ కాన్సెప్ట్ ఒక్కటే నాకు ఈ పత్రికపై ఉన్న ప్రత్యేక గౌరవానికి కారణం. ఒక సంపాదకవర్గం – వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై మాత్రమే నా కథ అచ్చవడం ఆధారపడదు – అన్న ఆలోచన దానికి కారణమేమో. ఇదివరలో కొన్ని సార్లు రాసినవి తిరిగొచ్చినా, మధ్యమధ్యలో చిన్న చిన్న మెయిల్వాదోపవాదాలైనా – మళ్ళీ ఈమాటకి తిరిగి వస్తూనే ఉండడానికి గల కారణం – పీర్ రివ్యూ అనే నా నమ్మకం. పెద్ద పెద్ద కాన్ఫరెన్సులకి బోలెడు పేపర్లొస్తాయి….బోలెడు రివ్యూవర్లు కూడా ఉంటారు..కనుక, సవివర రివ్యూలొస్తాయి – నిజమే. ఈమాటలో రివ్యూవర్ల సంఖ్య-రచనల రేషియో నాకు తెలీదు కానీ – మరీ అంత దారుణమైన పరిస్థితేమీ లేదనుకుంటాను….

    ఉపేంద్ర గారు అన్నట్లు: అప్పుడప్పుడూ రివ్యూవర్ల గురించి కూడా తెలిపితే బాగుంటుంది. అలాగే, చిన్న నవలల ఆలోచన కూడా బాగుంది.

    నాకున్న ఏకైక కంప్లైంటు: కథలు ఎక్కువ ఉండట్లేదని. నేను చూస్తున్న నాలుగేళ్ళలో – స్టిక్ అయే కథలు తగ్గిపోతూ వచ్చాయి అనిపిస్తోంది.

    ఈమాట మరిన్ని మంచి సంచికలతో ముందుకు రావాలని ఆశిస్తూ…

    సౌమ్య.

    [సౌమ్య గారూ, ఈమాట రచయితలే ఈమాట రచనలకి రివ్యూయర్లు కూడా. మీరు కూడా మాకు ఒక పొటెన్షియల్ రివ్యూయరే – సం.]

  2. చాపల్యం గురించి సౌమ్య గారి అభిప్రాయం:

    05/05/2010 12:59 pm

    :)) ఉన్నట్లుండి ముగిసిపోయినట్లనిపించింది కానీ, ముగింపు దాకా మటుకు – చదివింపజేసింది. కథలోని పాత్రలతో ఐడెంటిఫై చేస్కోగలరనుకుంటాను చాలా మంది.

  3. మధ్య వ్యవధిలో నీడలు గురించి naveen గారి అభిప్రాయం:

    05/05/2010 9:42 am

    ఏమైంది గురూ చివరకి? ఇది నిజమైన కథా లేక కల్పితమా ? మీ సమాధానం కోసం వేచి చూస్తూ…..

  4. భవబంధాల సాక్షిగా… గురించి సౌమ్య గారి అభిప్రాయం:

    05/05/2010 8:37 am

    వ్యాఖ్యలు రాసిన వారందరికీ ధన్యవాదాలు.
    వెంకట్ గారికి: కొత్త పదజాలం అంటారా? కొన్నేళ్ళౌతోంది కదా – ఇలాంటివన్నీ మన జీవితాల్లో ప్రవేశించి..
    భవాని గారికి: డిప్రెషన్ కి మూలం – విషయం కావాలనే చర్చించలేదు. నా మటుకు నేను ఆలోచించిందిదీ:
    – మూలం అంటూ ఒకటి చెబితే – చర్చ పక్కదారికెళ్ళి – అసలా మూలం డిప్రెస్ అయ్యేంత సీరియస్సా… అన్న విషయం పై కేంద్రీకృతమౌతుంది అన్న భయం ఒకటి ఉండింది.
    -రెండో కారణం, అసలు కారణం: నేనీ కథలో ఫోకస్ చేయదల్చుకున్నది – ఆ డిప్రెస్ అయే ప్రాసెస్, దానితోపాటు అలాంటి సమయంలో ఉండే ఆలోచనాతీరుపై కానీ – అసలెందుకీ డిప్రెషన్? అన్న విషయంపై కాదు… ఆలోచనాతీర్లు కూడా రకరకాలుగా ఉండొచ్చనుకోండి,..అది వేరే సంగతి 🙂

  5. సంగీత పట్నం – కదనకుతూహలం గురించి Akella Suryanarayana Murthy గారి అభిప్రాయం:

    05/05/2010 8:34 am

    పై పాట శ్రీవారికి ప్రేమలేఖ జంధ్యాల సినిమాలో నరేశ్ మీద తీశారు కదా !

  6. భవబంధాల సాక్షిగా… గురించి bhavani గారి అభిప్రాయం:

    05/05/2010 4:42 am

    కధలో కధకురాలి డిప్రెషన్ కి మూలమేంటో ఎక్కడైనా సూచిస్తారనుకునే లోపే కధ మలుపు తిరిగింది. మరీ ఇంత సూక్ష్మాంశం మీద టెలిస్కోప్ పెట్టడం సౌమ్య గారికి ప్రత్యేకమైన రచనాశిల్పం అనుకుంటా.

  7. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి వంశీ గారి అభిప్రాయం:

    05/05/2010 12:42 am

    ఉపేంద్ర గారూ

    వ్యాసం బాగుంది. శైలిదేముంది లెండి, ఒకరికి మామూలు అన్నం,ఇంకోడికి పరమాన్నం, ఇంకొకరికి రాళ్ళతోకూడిన నూకన్నం.

    ప్రతివారూ తానూ మాట్లాడే ప్రతి విషయంలోనూ, రాసే ప్రతి రాతలోనూ ఒక విధమైన అనుభవం ఉండబట్టి మాట్టాడతారు, రాస్తారు. కానీ ఆమాటల్లో, రాతల్లో సారం పాఠకులకు వారి వారి యోగ్యతానుసారం, గ్రహణశక్తానుసారం నివేదన చేసిన విషయం గ్రహణమవుతూ ఉంటుందని భవదీయుడి అభిప్రాయం. మీరు మటుకు ఇలాగే రాస్తూ ఉండండి. సానపెడుతూనే ఉండండి. కొద్దిరోజుల్లోనే కొంతమందికి వజ్రాల గని దొరుకుతుంది.

    ఒకమాట చెప్పాలె – అంత గొప్పకవిగా ప్రశంశలు అందుకున్న నాగార్జున కవిగారి గురించి ఇతర పాఠకులకి తెలిసినంతగా ఇప్పటిదాకా నాకు తెలియదు. నిజం చెప్పాలంటే అసలలాటాయన ఒకడున్నాడని కూడా తెలియదు. 🙂 .. కానీ మీ వ్యాసం చదివాక నా అభిప్రాయం మారింది. ఎటువైపుకు దారితీస్తుందో తెలియదుకానీ… ధన్యవాదాలు

    భవదీయుడు
    వంశీ

    [ఈ కామెంట్ ఎడిట్ చేయబడింది – సం.]

  8. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/05/2010 12:06 am

    ఇంగ్లీషు పత్రికలని చూసి ఆ పధ్ధతిలో తెలుగు పత్రికలలో రచయితలూ కవులూ అనబడువారికి కొంత నాగరికతని నేర్పుదామని ఈమాట వారి ఊహ కావొచ్చు. ఈ “పీర్ రివ్యూ” పధ్ధతిని పరిచయం చేయడం!!

    ఇంగ్లీషులో కుప్పలు తెప్పలుగా రచనలు వచ్చి పడతాయి. అందులో ఎంపికకి కావలసినంత వీలుంటుంది. అంగీకరించడానికీ..లేదా తిరస్కరించడానికీనూ!! కానీ తెలుగున రచనలు చేయగల్గిన వారి సంఖ్య వేళ్ళమీదలెఖ్ఖపెట్టవలిసిందే!! ఇందులో ఇంక ఎంపిక కి అవకాశం బహు తక్కువ. ఇంక వడపోత కార్యక్రమానికి దిగితే గనక మిగిలేదెవ్వరూ ఉండరు. అదే జరిగింది ఈమాట లో!! ఇంకో ముఖ్య మైన విషయం సీరియస్ రచయితలలాగే తెలుగున నిజానికి కమర్షియల్ రచనలు చేసే వారికీ కొరతే అని చెప్పాలి. ఆ మల్లాది ..యండమూరి..లేదా పట్టాభిరామ్ వంటీ మనస్తత్వ విశ్లేషకులు వంటి వారే ఉన్న కుర్చీలని ఆక్రమించుకుని కూర్చున్నవారు. అంటే తెనుగు అటువంటి రచయితలకి కూడా చాలా కొరత ఉందనే అర్ధం!! అసలు రాసేవాళ్ళే తక్కువ. అందునా మనసుని ఆకట్టుకునేలా రాయగల చతురత కల్గిన వారు ఇంకా తక్కువ. అన్ని రంగాలలోనూ కూడా!! ముందు ఈ సంగతిని గుర్తిస్తే అప్పుడు ఇంగ్లీషు పత్రికలలోని నమూనాని యధావిధిగా అమలు చేయలేమన్నది ఈమాట వారు గమనించవచ్చు.

    అలాగే ఇంగ్లీషు పత్రికలవారిచ్చే రెమ్యునరేషన్ ని ఈమాట అనుసరించదలుచుకోలేదు. కారణాలు ఏమైనా!! మేము మాకు కావలసిన పధ్ధతిలో మాత్రమే విషయాలని నిర్ణయిస్తామూ ..మేము తెలుగు పాఠకులనీ రచయితలనీ సంస్క్కరిస్తామూ అంటే మరి వీటి విషయంలో మీ నాగరికత ఏమైందన్న విషయాన్ని అడగడం లో ఎవరైనా గానీ తప్పులేదు. గనక ముందు ఈమాట తన బాటని స్పస్టపరుచుకుంటే అటుపిమ్మట తెలుగు రచయితలకి వారెవరైనా గానీ ..రాయడంలో విధినిషేధాలు విధించే అర్హతని సంపాదించవచ్చును.

    రమ.

  9. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/04/2010 11:41 pm

    ఉపేంద్రగారూ!!

    తెలుగున అదేదో ఒక మోటు సామెత ఉంది ..అందరికీ తెలిసినదే గనక నేను దానిని ప్రస్తావన చేయ పనిలేదు కానీ.. నాకు తెలుగు వారి కి మహా కవులని గురించి పరిచయం చేసే శక్తీ ..ఆసక్తీ రెండూ లేవు. అందుకే మీరు చేసే ప్రయత్నాన్ని అభినందించాను. ఆ పని మీరు మరింత శ్రధ్ధగా చేయగలిగితే బాగుంటుందని సూచన చేసాను. కవిత్వాన్ని అనువాదంచేసే భాష విషయంలో!! కవితా వాక్యాలు చాలా శక్తిమంతమైనవి గనక..వాటి విషయంలో శ్రధ్ధ అవసరం..కానీ ఇది వారి శక్తికి సంబంధించిన విషయమ్ నిజానికి. అందువలన ఆశించగలమే గానీ నిజంగా ఎంత చక్కగా రాయగలరూ.. అన్నది సందేహాస్పదమే!! ఔను.. నాకు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి కొన్నిటి విషయంలో . అందులో ముఖ్యమైనది “చదివించే గుణం” అన్నది. వచనంలో విషయమ్ క్లుప్తంగా..సూటిగా ఉండాలి అన్నది. నస వాక్యాలని నేను చదవలేను. నాకు విసుగు . గనక సాధారణంగా చదవడానికి అంత ఉత్సాహం చూపించను. అందునా విప్లవ సంఘాల వారి తెలుగు వచనం అంటే చెప్పలేని చికాకు. వారు నలుగురికీ తెలియవలసిన ముఖ్య విషయాలని కూడా తమ పడికట్టు వాక్యాలతో పాఠకులని విషయానికి దూరంచేసి పారిపోయేలా చేయగల సమర్ధులు మరి.

    రమ.

  10. ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి T.Raja gopal గారి అభిప్రాయం:

    05/04/2010 10:14 pm

    Rare collection. Enjoyed. Thanks for posting.

    Raja gopal

« 1 ... 1157 1158 1159 1160 1161 ... 1582 »