Comment navigation


15821

« 1 ... 1146 1147 1148 1149 1150 ... 1583 »

  1. ఉత్తమాయిల్లాలు గురించి నిడదవోలు మాలతి గారి అభిప్రాయం:

    06/04/2010 5:13 pm

    సత్యగారూ,

    థాంక్స్. నాకు సినీభార్యలని కోరుతున్నారని నాకు తెలీదు. ఇటువంటి మనస్తత్త్వాలు ఉన్నాయని చెప్పడమే నాఉద్దేశ్యం. ప్రాథమికంగా నేను అనేది మీరంటున్నదే – ఒక వ్యక్తి మరొకరినుండి ఆశించే సేవలూ, ఆ సేవలని పొగడ్తలరూపంలో తమకి అనుకూలంగా ఎలా manipulate చేసి చూపించగలరో చిత్రించడమే నాధ్యేయం.

    మిగతా విషయాలన్నీ చాలా చిన్నవిషయాలు. ఉదాహరణకి పైన ఆయన చెప్పినట్టు మారిస్తే మాత్రం అడగడానికి ప్రశ్నలుండవా? శ్రీరంగశయనం నెలరోజులూ అన్నానికీ, బాత్రూంకీ అయినా లేవకుండా కీర్తించారా అని అడగొచ్చు. లేచేడంటే మూడుపూట్లా మూడు కంచాలూ చెల్లించి, తీరికసమయాల్లో చేసాడా భజన అనొచ్చు. .. .. ఇలాటివి నాచిన్ని బుర్రకి తట్టవులెండి. చిన్నకథకి అవసరం అని కూడా అనుకోను. మీకూ, ఇంకా కొంతమందికీ ఇది అర్థమయనందుకు నాకు సంతోషంగా ఉంది.
    – మాలతి

  2. జనరంజని: మహానటి సావిత్రి గురించి vijay గారి అభిప్రాయం:

    06/04/2010 4:27 am

    hmmm

    swachhamaina nirmalamaina…
    teta telugu padalatho koodina maataalu

    oka close family member ga
    jeevichatame kaani natinchadam teliyani

    maha nati saavitri gaari maatalu vinta unte.. asru nayanaalu malla alaanti gopaa nati
    manchi manasu kala vallu puttaremo…

    paruchuri sreenivas gaariki abinandanalu.

  3. శరణాగతి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    06/03/2010 4:28 pm

    “మదాళిరవంబులు” అంటే సరిగ్గా అర్థం కాలేదు. మత్‌ + ఆళి + రవంబులు అనుకుంటే,”ఆళి”కి నిఘంటువులో “పఙ్క్తి, చెలికత్తె, అడ్డకట్ట” అర్థాలున్నాయి. దయచేసి చెప్ప మనవి.
    =======
    విధేయుడు
    శ్రీనివాస్‌

  4. శరణాగతి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    06/03/2010 11:31 am

    నమస్కారం
    మంచి ధారతో పద్యాలందించినందుకు కృతజ్ఞతలు.

    “వాణి! కల్యాణి! గీర్వాణి! పద్మపాణి!” అన్న సంబోధన చాలా బాగుంది.
    “కవిరాజికావ్యముల్ కనకంపు రవణంబు లేదేవి కాదేవియే దాత్రి నాకు” లో “దాత్రి” అన్నది టైపో అనుకుంటాను, “దాత, ధాత్రి” తెలిసినా.

    అమ్మవారి సంబోధనలో కనిపించిన సహజత్వం నిర్మలత్వం,మిగితా పద్యాలలో లోపించి, ఎందుకో కొంత అసహజత్వ పదప్రయోగం ఉన్నట్టు వెలితి.

    “ఇట్లు పృచ్ఛించి పృచ్ఛించి యింతి జాడ” అంటే అర్థమవుతుంది బాగానే. ఆకట్టుకోదు బాగా.”ప్రశ్నించి ప్రశ్నించి” లేక “అడుగుతూ అడుగుతూ” అన్నవి వదిలేసి, ఏదో బల్మిటికి పట్టుకొని తెచ్చిపెట్టిన పదపొందికల లాగుంది.

    నారికేళ పాకం అంటేనే అర్థం కాక,కొబ్బరికాయ సరే, కోకోనట్‌ అంటే ఓహో అని ఊపే తలలన్నీ ఇటువంటి పద్యాలు,కాదు పల్కులు చూసి పల్కులతల్లికి శిరసొంచి “శరణాగతి” చేస్తాయేమో అనిపిస్తుంది,సార్థకంగా.
    ========
    విధేయుడు
    శ్రీనివాస్‌

  5. శరణాగతి గురించి ధేశికాచారి గారి అభిప్రాయం:

    06/01/2010 10:23 pm

    వరాహనరసింహమూర్తిగారూ, “వేదాదివిద్యలే” అనే పద్యంయొక్క అసలు రూపాన్ని గ్రహించి, నాకంటె ముందుగానే సరియైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించినందుకు ధన్యవాదాలు. ఛందస్సులో నేను చేసిన ప్రయోగాలు,ఛందస్సుపై నాకు గల దృష్టి నా వెబ్ సైటులోని “హనుమప్పనాయకుడు” అనే కావ్యంలోని “ప్రస్తావన”ను చదివితే బాగుగా వ్యక్తమౌతాయి. పోతే, ప్రసాదుగారికి వ్రాసిన సమాధానంలో నా అనవధానతవల్ల “నూతనచ్ఛందో ప్రయోగాలు” అని అసాధుప్రయోగం పడింది. దీనిని “నూతనచ్ఛందః ప్రయోగాలు” అని చదువుకొనగలరని మనవిచేస్తున్నాను.

  6. ఇంకా ఎందుకు మిగిలావు గురించి Raghuram గారి అభిప్రాయం:

    06/01/2010 3:18 pm

    ఇస్మాయిల్ కవిత్వపు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయొ చెప్పగలరా దయచేసి…!!

  7. శరణాగతి గురించి Geddapu Lakshmi Prasad గారి అభిప్రాయం:

    06/01/2010 11:32 am

    సీస పద్యం రాసే సామర్థ్యం లేక మీరలా రాసారనే ధ్వని నా అభిప్రాయంలో లేదే!!! ఒకవేళ అలా అన్పిస్తే క్షంతవ్యుణ్ణీ. ఏమైనా సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.

  8. శరణాగతి గురించి ధేశికాచారి గారి అభిప్రాయం:

    06/01/2010 12:08 am

    లక్ష్మీప్రసాదుగారికి,
    సీసపద్యం ఛందస్సు తెలియక,లేదా సీసపద్యం వ్రాసే సామర్థ్యం లే క అట్లా వ్రాయలేదు. ఇది బుద్ధి పూర్వకంగా సీసపద్యంలోని ఉత్తరార్థంలో 3 ఇంద్రగణాలపైన ఒక సూర్యగణం వేసి, ద్విపదలాగా నడిపించాలని చేసిన ప్రయోగం. ఈ విధంగా సీసపద్యంపై కొద్దిపాటి మార్పులతో సీసపద్యం లాగ నడిచే ఛందస్సులకు నేను పెట్టుకున్న పేరు సీసతుల్యములని. మీకు ఓపిక ఉంటే ఇట్లాంటి నూతనచ్ఛందో ప్రయోగాలు నా వెబ్ సైటులో నా జక్కనచరిత్ర కావ్యంలోచూడగలరు. పైగా అది సీసపద్యమని నేను పైఖండికలో దానిని లేబుల్ చేయలేదు. ఒకవేళ అట్లా చేయాలంటే దానిని సీ.తు. (సీసతుల్యము) అని నా జక్కనచరిత్రలో చేసిన విధంగా చేస్తాను కాని, సీ (సీసము) అని చేయను. మీరు సూచించిన “సొంపుల” అనే మార్పు బాగుందని అంగీకరిస్తాను. కాని రెండవ సూచనతో నేనంగీకరించలేను.”నిధులీనుచు” అనేప్రయోగం అఖండయతిని తొలగించుకొనడానికి చేసిన కృత్రిమయత్నం లాగ ఉంటుందే కాని పద్యం యొక్క సొగసును గాని, అర్థాన్నిగాని పెంపొందింపజేయదు. ఇక్కడ అఖండయతి పడుతున్నదని గుర్తున్నా, దానిని తొలగించడానికి చేసే వికృతయత్నాలకంటే దానిని ఉంచుకోవడమే ఉత్తమపక్షమని నేను ఆవిధంగా వ్రాసినాను.

  9. శరణాగతి గురించి Dr.Gannavarapu Vraha Narasimha Murty గారి అభిప్రాయం:

    05/31/2010 6:05 pm

    వేదాది విద్యలే అను పద్యము సీసం కాదు. ఇందులో ఏడు ఇంద్ర గణములు ఒక సూర్య గణం ప్రతి పాదంలోను ఉన్నాయి. తిరుమల కృష్ణదేశికాచారి గారు దీనిని సీసం అనలేదు. అందుచే ఆయన ఛందస్సును తప్పు పట్టలేము. ఇది క్రొత్త ప్రక్రియో లేక మరో పేరున్న ఉపజాతి వర్గమో అవుతొంది. పద్యం బాగుంది. దీనికో పేరుంటే ఎవరైనా తెలియ పరుచ గలరు. ఒక పేరు లేకపోతే దీనిని తిరుమల అందాము.

  10. శరణాగతి గురించి Geddapu Lakshmi Prasad గారి అభిప్రాయం:

    05/31/2010 12:59 pm

    సీస పద్యంలో ఛందస్సు సవరించుకోగలరు

« 1 ... 1146 1147 1148 1149 1150 ... 1583 »