Comment navigation


15821

« 1 ... 1147 1148 1149 1150 1151 ... 1583 »

  1. శరణాగతి గురించి Geddapu Lakshmi Prasad గారి అభిప్రాయం:

    05/31/2010 12:56 pm

    ఛందస్సు అభివ్యక్తికి ప్రతిబంధకమనే భాషరాని, భాష నేర్చుకోని సొమరిపోతులు మీ పద్యాలు చదివితే బాగుంటుంది.
    పదక్రమంపు టింపుల నలవర్చి అనే కంటే పదక్రమంపు సొంపుల నలవర్చి అంటే బాగుండేదేమో. స్వర్ణమయతేజముతోడ శిరఃపదాంతమున్ అనే దగ్గర అన్వర్థ సాధనలో క్లిష్టత చోటు చేసుకుదని నా అభిప్రాయం. దీన్ని స్వర్ణ నిధులీనుచు నాపద మస్తకంబికన్ రంతొనరింనేల? అనో వేరే విధంగానో అంటే బాగుండేదేమో! అఖండ యతి బాధా ఉండేది కాదు.
    చనువు తీసుకుని ఉచిత సలహాలిచ్చినందుకు అన్యథా భావించరుకదా!!!!
    శుభం భూయాత్

  2. ఉత్తమాయిల్లాలు గురించి Satya గారి అభిప్రాయం:

    05/29/2010 11:53 am

    మాలతి గారూ,

    మీరు చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పారు.మీకు శ్రీరంగశయనం పైకోపమేమో గాని, ఆ పాత్రపై ఖచ్చితమైన అవగాహన ఉంది. నిజ జీవితంలో తారసపడిన ఒక పాత్రలాగా ‘చిత్రీకరించారు’.

    70-80 ప్రాంతాల్లో ఇటువంటి మనస్తత్వాలు ఇట్లా ఉండేవేమో నాకు తెలీదు కాని, ఈ కాలం చెత్త సినిమాలు చూసి మనసులు పాడు చేసుకొని…భార్య ఉండగానే కలల్లో తేలిపోయే వాళ్ళు, భార్య పోయిన తర్వాత ఆ కలల్ని నిజం చేసుకోవాలనుకవడంలో నాకేమీ అసహజమనిపించలేదు.

    –సత్య

  3. కళావసంతము గురించి మందాకిని గారి అభిప్రాయం:

    05/29/2010 4:39 am

    మోహన విరచితమైన మధుమాసపు వర్ణన మనమోహనమై, ఇంపుగా నున్నది.
    ధన్యవాదములు.

  4. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి kavitha గారి అభిప్రాయం:

    05/28/2010 4:16 pm

    Kayakay గారు, కథ మళ్ళీ చదివాను..మీ అభిప్రాయం చూసాక.మబ్బు విడినట్టుగా ఉంది!

  5. ఇంకా ఎందుకు మిగిలావు గురించి gana గారి అభిప్రాయం:

    05/28/2010 12:33 pm

    కవితాత్మక నింద లేక నిరసన.

    ‘ఆది భిక్షువు వాడినేది కోరేదీ’ లేక
    ‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ‘ కన్నా
    మీ కవిత ఘాటుగానే ఉంది.

    ఏదనుకున్నా బాగా వ్రాసారు.

  6. మరో ప్రపంచం పిలిచింది గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    05/28/2010 11:52 am

    1979లో బరంపురంలో అఖిలాంధ్ర రచయితల సమ్మేళనం మార్చి 20-22 ల మధ్య జరిగినప్పుడు మహాకవి ‘ అల్లూరికి వారసుడా శ్రీశ్రీ కవితా లాలసుడా, దేర్ ఫోర్ ఊగరా ఊగరా’ అని ప్రసన్న వదనంతో చదవడం, ‘ఒక్క మతితోనే సతమతమౌతుంటే నాకీ బహు మతులెందుకూ’ ‘ అన్న పానుగంటి వారి జోక్ ని వినిపించి ‘సాక్షి’ వ్యాసాలు ప్రస్తావించడం- ఇవన్నీ మననం చేసుకుంటుంటే అటువంటి ‘మూవింగ్ ఎన్ సైక్లోపీడియా’ కవి 20వ శతాబ్దంలోనే కాదు, ఇప్పుడూ లేడు అనిపిస్తుంది. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది- ఈ గేయం ఎన్నో రూపాలతో సినీ గీతంగా మళ్ళీ మళ్ళీ శ్రీశ్రీ కలంనుండే రావడం బహుశ: గిన్నీసు వారి దృష్టికి రాలేదేమో. రణ భేరి చిత్రంలో కొంత భాగం ‘మార్చింగ్ సాంగ్’ గా, మిగతా భాగం బుర్ర కథ గా మలిచారు. ఇవన్నీ ఒక చోటికి తీసుకు రాగలిగేది, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, ఈ మాటే!
    -వేగోతారా

  7. ఉత్తమాయిల్లాలు గురించి Sam గారి అభిప్రాయం:

    05/28/2010 4:47 am

    నాకు కథ అసలు అర్దము కాలేదు. మన్నించెదరు.

  8. ఇంకా ఎందుకు మిగిలావు గురించి మందాకిని గారి అభిప్రాయం:

    05/28/2010 4:08 am

    బావుందండీ!

  9. ఇంకా ఎందుకు మిగిలావు గురించి Srinivas Varma గారి అభిప్రాయం:

    05/26/2010 10:49 pm

    చాలా బావుంది మాస్టారు. మరో సీతారామ శాస్త్రి గారు కనిపిస్తున్నారు, ఆ పదాలు, లోతైన భావం. Keep it up. Thank you.

  10. ఉత్తమాయిల్లాలు గురించి lakshmi గారి అభిప్రాయం:

    05/25/2010 6:32 pm

    కథలకు ఇంతగా స్పందిస్తారని తెలియదు..ఒక రచయితని అభిమానిస్తే అన్నీ బాగా కనబడతాయనే నమ్మాను …
    లక్ష్మిరాఘవ

« 1 ... 1147 1148 1149 1150 1151 ... 1583 »