హనుమ గారి కామెంటు మిస్సయ్యాను.“The Physics Teacher” పేపరు “Myths about Gravity and Tides” లింకు
చూపినందుకు హనుమగారికి చాలా కృతజ్ఞతలు. అలల తోపుదలకు భూమిపై దినపరిమాణం ఎట్లా పెరగడం, ఆ లెక్కచొప్పున ఎప్పుడో 484లోని సూర్యగ్రహణం స్పేయిన్ లో కాక గ్రీసులో ఎందుకు కనపడిందో విప్పి చెప్పడం అద్భుతం, అనూహ్యం, ఆనందం.
హేతువాదమేమో కాని హేతువులు అర్థంచేసుకోవడమే అద్భుతం అనిపిస్తే, చూపించడానికి ఎంత జాగ్రత్త, పరిశీలన, పరిశ్రమ, పరిశోధన, సృజనాత్మకత కావాలో!
=======
విధేయుడు
శ్రీనివాస్
లైలా గారి వ్యాఖ్యానం నాకు ఎక్కువ బాగుంది. దేవదేవి కూడా ఒక సాధారణ వేశ్యకాదు. అప్సర. శ్రీరంగనాధుని సంకల్పం వల్లనే జన్మించింది.
సారంగు తమ్మయ్య తెలుగు పలుకుబళ్ళు ఎంతో బాగుంటాయి.”చీకటింటిలో వెకిరింతల్ “లాంటి ఉపమానాలు ఇందుకు నిదర్శనం.
రోహిణీ ప్రసాద్ గారూ!! ఒకపని చేయడానికి వలసిన ప్రేరణ..ప్రోత్సాహమూ చాలా అవసరం ఎవరికైనా కూడా!! మీరు రాస్తున్న వ్యాసాలు భావాలకి సంబంధించినవి కావు గనక వెంటనే మనసుకి ఎక్కక పోవచ్చును. మీరు చెప్పే ” స్వర ” ప్రపంచం గురించిన పరిజ్ఞానం కూడా చాలా ముఖ్యమైనదేనని నేను అనుకుంటున్నాను. పైగా దీని మీద popular పధ్ధతిలో సులభంగా అర్ధమయ్యే వ్యాసాలు రాసిన వాళ్ళు ఎవరూ కన్పించడం లేదు. ఆ దృష్ట్యా మీ వ్యాసాలు విలువైనవే అవుతాయి. మీరు తప్పకుండా ఈ అంశం మీద వ్యాస రచనని కొనసాగించండి. పాఠకుల ప్రతిస్పందనని బట్టీ బాగా response వస్తేనే రాయాలీ అనీనూ..ఎక్కువ ప్రతిస్పందన లేకపోతే నిరుత్సాహపడి ఎందుకూ రాయడం అనీ భావించకండి. ప్రతిస్పందన చాలాసార్లు ఒక వ్యాసంలోని విషయ ప్రాధాన్యతకి కొలమానం కాలేదు.
శాస్త్రీయ సంగీతం గురించి మీరు మరిన్ని విషయాలని వ్యాసాలుగా రాయడం బాగుంటుందనే నేను భావిస్తున్నాను. నాకు సాహిత్యం మీద ఉన్నంత పట్టు గానీ ఆసక్తి గానీ సంగీతం మీద లేకపోవచ్చును. కానీ ఒక పాఠకురాలిగా అందులోని విషయం విలువైనదనే నేను నమ్ముతాను. దయచేసి మీరు తిరిగి సంగీతంగురించి వ్యాసాలు రాయండి. ఏదో ఒక కొత్త విషయం సంగీతాన్ని గురించి మామూలు పాఠకులకి తెలిసే అవకాశాన్ని ఎందుకు మూసేయాలీ?? మీనించి మరిన్ని వ్యాసాల్ని ఆశిస్తాను.
రమ.
పాఠకులకు సూచనలు గురించి దేశిరాజు సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం:
06/18/2010 3:13 am
ఈ రోజు అనుకోకుండా మీ ఈమాట ను నెట్ లో చూడటం చాలా ఆనందం కలిగించింది. తెలుగు చదవటం రాదు అని చెప్పడం ఫాషను గా ఉన్న ఈరోజుల్లో, తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. జై తెలుగు తల్లి.
బాగుండండీ పద్యం, పద్యం పై వ్యాసం. ఈ రచన మంచి పకడ్బందీగా శ్రీరంగేశుడు తప్ప, ఒరులు చొరరాని విప్రనారాయణుని వజ్రహృదయ సన్నిభంగా, నిర్మించారు.
ఐనా స్త్రీ సహజ చాపల్యం కొద్దీ 🙂
కథను పట్టి చూస్తే – విప్రనారాయణుడు విష్ణువు ‘పూలమాల’ అంశతో జన్మించిన వాడు కదా. అటువంటి వానికి వజ్రము నుండీ లోహము, లోహము నుండీ చెట్టూ, పూవూ, మకరందమూ అవుతూ పోతూ ఉంటం పతనం కాదు. అతని సహజ గుణానికి దగ్గరగా వచ్చినట్లు నాకు అనిపించింది.
విప్రనారాయణుడు – దేవదేవి కథ చాల సరసమైనది. వైజయంతీ విలాసము మంచి సరదా కావ్యము.
Nagamurali gaaru,
it is really informative for an open minded reader. I can imagine the struggle you have undergone to know the facts. No one usually share such experiences, particularly those who have learned the art. I appreciate your openness in sharing the same with telugu readers. Probably, I may not forget some of your words/experiences.
Thanks a lot.
శ్రీనివాసరావుగారిలాగే చాలామంది నా వ్యాసం చదివి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా చెప్పారు. అలా చేస్తున్నప్పుడు స్వయంగా స్వరాలను గట్టిగా పాడుకుంటే అవగాహన చాలా త్వరగా ఏర్పడుతుంది. అలా ఎంతమంది చేస్తున్నారో తెలియదు. మంచి గొంతు ఉన్నా, లేకపోయినా, నలుగురూ విన్నా, ఎవరూ వినకుండా తలుపు బిగించుకున్నా పాడడం మటుకు చాలా అవసరం. అలా చేస్తే స్వరజ్ఞానం సంపాదించడం సులువు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
06/18/2010 3:57 pm
వ్యాసం సరళంగా వ్రాసినందుకు అభినందనలు.
హనుమ గారి కామెంటు మిస్సయ్యాను.“The Physics Teacher” పేపరు “Myths about Gravity and Tides” లింకు
చూపినందుకు హనుమగారికి చాలా కృతజ్ఞతలు. అలల తోపుదలకు భూమిపై దినపరిమాణం ఎట్లా పెరగడం, ఆ లెక్కచొప్పున ఎప్పుడో 484లోని సూర్యగ్రహణం స్పేయిన్ లో కాక గ్రీసులో ఎందుకు కనపడిందో విప్పి చెప్పడం అద్భుతం, అనూహ్యం, ఆనందం.
హేతువాదమేమో కాని హేతువులు అర్థంచేసుకోవడమే అద్భుతం అనిపిస్తే, చూపించడానికి ఎంత జాగ్రత్త, పరిశీలన, పరిశ్రమ, పరిశోధన, సృజనాత్మకత కావాలో!
=======
విధేయుడు
శ్రీనివాస్
నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
06/18/2010 2:10 pm
లైలా గారి వ్యాఖ్యానం నాకు ఎక్కువ బాగుంది. దేవదేవి కూడా ఒక సాధారణ వేశ్యకాదు. అప్సర. శ్రీరంగనాధుని సంకల్పం వల్లనే జన్మించింది.
సారంగు తమ్మయ్య తెలుగు పలుకుబళ్ళు ఎంతో బాగుంటాయి.”చీకటింటిలో వెకిరింతల్ “లాంటి ఉపమానాలు ఇందుకు నిదర్శనం.
రమ.
కీబోర్డ్ మీద రాగాలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
06/18/2010 1:28 pm
రోహిణీ ప్రసాద్ గారూ!! ఒకపని చేయడానికి వలసిన ప్రేరణ..ప్రోత్సాహమూ చాలా అవసరం ఎవరికైనా కూడా!! మీరు రాస్తున్న వ్యాసాలు భావాలకి సంబంధించినవి కావు గనక వెంటనే మనసుకి ఎక్కక పోవచ్చును. మీరు చెప్పే ” స్వర ” ప్రపంచం గురించిన పరిజ్ఞానం కూడా చాలా ముఖ్యమైనదేనని నేను అనుకుంటున్నాను. పైగా దీని మీద popular పధ్ధతిలో సులభంగా అర్ధమయ్యే వ్యాసాలు రాసిన వాళ్ళు ఎవరూ కన్పించడం లేదు. ఆ దృష్ట్యా మీ వ్యాసాలు విలువైనవే అవుతాయి. మీరు తప్పకుండా ఈ అంశం మీద వ్యాస రచనని కొనసాగించండి. పాఠకుల ప్రతిస్పందనని బట్టీ బాగా response వస్తేనే రాయాలీ అనీనూ..ఎక్కువ ప్రతిస్పందన లేకపోతే నిరుత్సాహపడి ఎందుకూ రాయడం అనీ భావించకండి. ప్రతిస్పందన చాలాసార్లు ఒక వ్యాసంలోని విషయ ప్రాధాన్యతకి కొలమానం కాలేదు.
శాస్త్రీయ సంగీతం గురించి మీరు మరిన్ని విషయాలని వ్యాసాలుగా రాయడం బాగుంటుందనే నేను భావిస్తున్నాను. నాకు సాహిత్యం మీద ఉన్నంత పట్టు గానీ ఆసక్తి గానీ సంగీతం మీద లేకపోవచ్చును. కానీ ఒక పాఠకురాలిగా అందులోని విషయం విలువైనదనే నేను నమ్ముతాను. దయచేసి మీరు తిరిగి సంగీతంగురించి వ్యాసాలు రాయండి. ఏదో ఒక కొత్త విషయం సంగీతాన్ని గురించి మామూలు పాఠకులకి తెలిసే అవకాశాన్ని ఎందుకు మూసేయాలీ?? మీనించి మరిన్ని వ్యాసాల్ని ఆశిస్తాను.
రమ.
పాఠకులకు సూచనలు గురించి దేశిరాజు సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం:
06/18/2010 3:13 am
ఈ రోజు అనుకోకుండా మీ ఈమాట ను నెట్ లో చూడటం చాలా ఆనందం కలిగించింది. తెలుగు చదవటం రాదు అని చెప్పడం ఫాషను గా ఉన్న ఈరోజుల్లో, తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. జై తెలుగు తల్లి.
నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/17/2010 3:49 pm
బాగుండండీ పద్యం, పద్యం పై వ్యాసం. ఈ రచన మంచి పకడ్బందీగా శ్రీరంగేశుడు తప్ప, ఒరులు చొరరాని విప్రనారాయణుని వజ్రహృదయ సన్నిభంగా, నిర్మించారు.
ఐనా స్త్రీ సహజ చాపల్యం కొద్దీ 🙂
కథను పట్టి చూస్తే – విప్రనారాయణుడు విష్ణువు ‘పూలమాల’ అంశతో జన్మించిన వాడు కదా. అటువంటి వానికి వజ్రము నుండీ లోహము, లోహము నుండీ చెట్టూ, పూవూ, మకరందమూ అవుతూ పోతూ ఉంటం పతనం కాదు. అతని సహజ గుణానికి దగ్గరగా వచ్చినట్లు నాకు అనిపించింది.
విప్రనారాయణుడు – దేవదేవి కథ చాల సరసమైనది. వైజయంతీ విలాసము మంచి సరదా కావ్యము.
లైలా
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి snkr గారి అభిప్రాయం:
06/17/2010 11:01 am
Nagamurali gaaru,
it is really informative for an open minded reader. I can imagine the struggle you have undergone to know the facts. No one usually share such experiences, particularly those who have learned the art. I appreciate your openness in sharing the same with telugu readers. Probably, I may not forget some of your words/experiences.
Thanks a lot.
జీలకర్ర – బెల్లం గురించి B.Narendrababu గారి అభిప్రాయం:
06/16/2010 3:30 am
అద్భుతం. అవును నిజం. ఇన్ని రోజులు ఈ కవిత ఎందుకు చదవలేకపోయానా అనిపించింది.
మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి B.Narendrababu గారి అభిప్రాయం:
06/16/2010 3:14 am
మోహాల దేహాలకు నేర్పిన అయస్కాంత భాష…. చాలా బాగుంది.
సామాన్యుని స్వగతం: నా విమాన ప్రయాణం గురించి venkata vutukuru గారి అభిప్రాయం:
06/16/2010 2:13 am
మీరు రాసింది చదువుతుంటే మా అమ్మ గారి విమాన ప్రయాణం గుర్తుకువచ్చింది.
నిజంగా పెద్దవాళ్ళకు సౌకర్యాలు బాగా కల్పించాలి.
బాగా రాశారు. Thanks.
కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/16/2010 12:29 am