Comment navigation


15821

« 1 ... 1142 1143 1144 1145 1146 ... 1583 »

  1. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగమురళి గారి అభిప్రాయం:

    06/23/2010 12:25 am

    Pravina garu, Snkr garu, Srinivas Nagulapalli garu: Thank you very much for your comments.
    రమగారూ, ధన్యవాదాలు. మీరన్న మాటలు నాకు కవికులగురువు మాటల్ని మళ్ళీ గుర్తు చేశాయి.

    పురాణమిత్యేవ న సాధు సర్వం, నచాపి ‘శాస్త్రం’ నవమిత్యవధ్యమ్‌,
    సంతః పరీక్ష్యాంతరత్‌ భజంతే, మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః ||

    కావ్యానికి బదులు శాస్త్రం అని మార్చాను. ‘సంతః – మూఢః’ అన్న పదాలు ఈరోజుల్లో వాడతగినవి కావు కాబట్టి వాటిల్ని ‘ఆసక్తీ, ఓపికా ఉన్నవాళ్ళు’, ‘అవి లేనివాళ్ళు’ అని అర్థం చేసుకోవచ్చనుకుంటా.
    వ్యాసం చదివి మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.

  2. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    06/22/2010 4:24 am

    హేతువుకి లొంగేదంతా అన్నది నా భావం. అని పాఠకులు గ్రహింతురు గాక. అలాగే ఆధునికతే అన్నిటికీ కొలమానం అని ఉంటే చాలు వాక్యంలో “ఆధునిక ప్రమాణాలే అన్నిటికీ కొలమానం” అని అవసరంలేదు. ఇవన్నీ టైపోలు తొందరలో దొర్ల్లినవని గమనింప ప్రార్ధన.

    రమ.

  3. ప్రేమ కవితలు గురించి chandu గారి అభిప్రాయం:

    06/21/2010 6:33 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  4. బాలమురళీకృష్ణ సంగీతం గురించి jayanthi గారి అభిప్రాయం:

    06/21/2010 5:20 am

    బాలమురళి గారి మీద రాసిన వ్యాసము బావుంది. చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాము. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.

    జయంతి

  5. తడిస్తే కదా తెలిసేది! గురించి SATYA NARAYANA గారి అభిప్రాయం:

    06/20/2010 4:47 pm

    మీ కవిత చాలా బాగుంది. Very good కవిత. ఇలాగే continue చేయండి.

  6. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:

    06/20/2010 8:24 am

    వరలక్ష్మిగారు పాడిన అనేక పాటలు పాత తెలుగుపాటలు వెబ్సైటులో ఉన్నాయి:
    http://www.oldtelugusongs.com/cgi-bin/search2/search.pl

  7. ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:

    06/20/2010 8:18 am

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ. చక్కటి ఆడియోని అందించారు. మరిన్ని ఇటువంటి ఆణిముత్యాలను అందిస్తారని ఆశిస్తూ.

  8. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి suresh గారి అభిప్రాయం:

    06/19/2010 11:30 pm

    రాంగోపాల్ వర్మ is ultimate. There are no words to tell about him.

  9. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    06/19/2010 2:36 am

    నాగమురళి గారూ!! మీ విషయం నా అనుభవానికి మించినది గనక దాని గురించి నాకు తెలియలేదు గానీ ఆ విషయాన్ని మీరు విశదీకరించిన విధానం మాత్రం చాలా బాగుంది. మీ వచనం చదువుతూంటే సుఖంగా ఉంది.

    ఇహ.. నాకు అర్ధం కాని విషయాలు ఎప్పుడూ కొన్ని ఉంటాయి. పరస్పర భిన్నమైన నమ్మకాలు కలిగిన వాళ్ళు వాదించుకోడం అన్నది నాకు చాలా ఆశ్చర్యంగా అన్పిస్తుంది. ఈ వాదనలు బ్రహ్మపదార్ధాన్ని మించినవి. ఎటూ తేలేవి కావు. అయినా మనుష్యులకి తమ నమ్మకమే గెలవాలన్న పట్టు ఎక్కువ. హేతువాదులుకూడా వాళ్ళవాళ్ళ నమ్మకాన్ని గెలిపించుకోడంలో అంతే చాదస్తులు మరి.

    గమ్మత్తేమంటే గతితార్కిక భౌతిక వాదాన్ని అనుసరించే కమ్యూనిస్టులు చాలా పట్టుదలగా నిరీశ్వర వాదులుగా ఉండటం భారతదేశంలోనే ఎక్కువ. తూర్పు ఐరోపా దేశపు కమ్యూనిస్టులు ప్రొటెస్టెంట్ చర్చి కి వెళ్ళి హాయిగా ప్రార్ధనలు చేసుకుంటారు. వాళ్ళకి పార్టీ రాజకీయాలు వేరు..వ్యక్తిగత విశ్వాసాలు వేరూనూ!! అలాంటి పరిస్థితి ఇండియాల్లాంటి దేశాల్లో చాటుమాటుగా సాగుతుందే గానీ బయటికి కన్పించేలా జరగదు. మనదగ్గర అంత నిజాయితీ ఈ తరహా మార్గంలో నడిచేవారిలో ఉండదు. నమ్మకంలేకపోవడం కూడా చివరికి ఒక నమ్మకం లో భాగమే అని వీళ్ళు అనుకోరు.

    ఇంక చాలా పాతకాలంనాటి శాస్త్రాలు, ఉదాహరణకి ప్రాచీన శిల్పశాస్త్రాలు..నౌకా శాస్త్రాలూ వంటివి ఆయా కాలాల్లో ఎంతో ఉన్నత ప్రమాణాలతో నడిచినట్టు మనకి ఉదాహరణ పూర్వకంగా తెలుసు. ఇవాళ ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు లేరు కాబట్టి అవన్నీ అశాస్త్రీయ మైనవని అనలేము కదా?? అలాంటివి ఎలా కట్టేరో కూడా ఇదమిథ్థంగా ఇవాళ స్పస్టంగా మనం అర్ధం చేసుకోలేము కూడా!! అంత ఘనమైన నాగరికతని సాధించిన వెనకటి తరాలు మరికొన్ని విషయాల్లో నేర్పరులు కారని మనకి ఎలాతెలుసూ?? కేవలం హేతువాదమే అన్నిటికీ జవాబుదారీ కాలేదు. గందరగోళం ఉంటే ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యతలేని వారిది కావొచ్చునేమో గానీ శాస్త్రానిది ఎలా అవుతుందీ??ఆధునిక ప్రమాణాలే అన్నిటికీ కొలమానం అన్న నమ్మకం కూడా ” అన్నీ వేదాల్లోనే ఉన్నాయష” అన్న అప్పారావు గారి వెక్కిరింతకి ఒకరకంగా కొనసాగింపే!! ఆధునికమైనదంతా హేతువుకి లొంగనిదంతా ..సత్యమే అన్న భ్రమ..అది మాత్రమే వాస్తవం అన్న భ్రమ మరొకటి లేదు. నాగ మురళి గారూ మీ శైలి బాగుంది. అందుకు మరోసారి మీకు అభినందనలు.
    రమ.

  10. నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    06/18/2010 7:13 pm

    లైలాగారూ,
    ఇక్కడ వజ్రంనుండి నీరుగా మారింది విప్రనారాయణ గుణం కాదు, అతని సద్భావం. అతని వజ్ర సంకల్పం నీరుగారి పోయింది. పైగా పువ్వు దగ్గర ఆగిపోలేదు. నీళ్ళకన్నా పల్చనై పోయింది! కాబట్టి ఇది అతని సహజ గుణానికి దగ్గరగా వెళ్ళడం కాదని నా అభిప్రాయం. విప్రనారాయణుడు ఎప్పుడూ పూలమాలే. ఒకప్పుడు స్వామి మెడలోని మాల, మరొకప్పుడు దేవదేవి కొప్పులో దండ 🙂

« 1 ... 1142 1143 1144 1145 1146 ... 1583 »