Comment navigation


15823

« 1 ... 1140 1141 1142 1143 1144 ... 1583 »

  1. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/02/2010 1:47 am

    ముకుందరామారావు పదచిత్రాలు అనేకమ్ కొత్తగా ఉన్నాయి. అఫ్సర్ రాసిన కవిత కన్నా మెరుగైన భావాలున్నా మరెందుకనో వేలూరి వారు అక్కడ ఒక గొంతుకతో మాట్లాడి ముకుందరామారావు కవిత్వమ్ పుస్తకాన్ని సమీక్షచేసేటప్పటికి మాత్రమ్ ఒకలాంటి ఉదాశీన వైఖరిని తన సమీక్షలో చూపించారు.ఇదీ సమీక్ష చేసేవారి వైఖరి. అయినా పుస్తక సమీక్షలు తెలుగున వాస్తవంగా ఉన్నదెప్పుడు గనకా??

    రమ.

  2. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/02/2010 1:28 am

    పాశ్చాత్యదేశాల్లో పత్రికలు ఇంకా ప్రచురణకర్తల మీదా ఒక ముద్ర ఉంది. అదేమంటే అక్కడ వాళ్ళు కావాలంటే అకవులని హడావుడి చేసి కవులుగా ప్రచారం చేయగలరు..లేదా కవులని తయారూ చేయగలరు. అలాగే ఒక మంచి పుస్తకాన్నీ ఒక మంచి రచయితనీ కావాలనుకుంటే నొక్కేయనూగలరు అని. దీనికి సంబంధించి పశ్చిమ దేశాల పత్రికల మీదా ప్రచురణకర్తల మీదా బోలెడన్ని సంఘటనలూ ..కధలూ ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ వేలూరి వేంకటేశ్వర రావు గారి సమీక్ష చదవగానే “ఈమాట” మీద కూడా అలాంటి ప్రభావం ఏమన్నా ఉందా? అన్న సందేహం వచ్చింది నాకు. అఫ్సర్ రాసిన కవిత్వం సమీక్షకుడు చెప్పిన చాలా అభిప్రాయాల్లోకి ఏకోశానా ఇమడలేదు. కవిత్వం పేరుతో ఉత్త హడావుడి తప్ప మనసుని కదిలించి చాలాకాలం పాటు వెన్నాడి గుర్తుపెట్టుకోగల ఒక్క వాక్యమైనా లేని ఈ పుస్తకాన్ని అందరూ తప్పక సేకరించుకోవలసిన పుస్తకంగా సమీక్షకుడు కితాబు ఇవ్వడం చాలా కృతకంగానూ pompus గానూ ఉంది.

    రమ.

  3. అ, న్యాయం గురించి b.ajayprasad గారి అభిప్రాయం:

    07/02/2010 12:27 am

    ఈ కథ బాగుంది.

  4. కృష్ణదేవరాయలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/01/2010 1:13 pm

    ఈ “కృష్ణ దేవరాయలు” పుస్తకం తెరుచుకోబడుటలేదు చదువుటకు. కారణమేమో??

    రమ.

    [తప్పు సరిచేశాము. ఇప్పుడు ప్రయత్నించండి. తెలిపినందుకు కృతజ్ఞతలు – సం.]

  5. రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/01/2010 11:05 am

    నోట్ : ఇది మాధవ్ స్వంత వ్యాసం కాక పోయినా ఫిలిప్ వాగనర్ దే అయినా పైన నేను చెప్పిన విషయాలలో ఏమన్నా మార్చుకుని నా అభిప్రాయంలోని ఏ ఒక్క వాక్యాన్నీ తిరిగి రాయవలసిన పని ఉన్నట్టు నాకు అన్పించలేదు. ఆనాటి దేశీయ సాహిత్యాన్నీ ఇతర ఆకరాలనీ పరిశీలించకుండా కేవలం విదేశీయ చరిత్రకారుల..యాత్రీకుల రాతలనించే ఈ “ఇండాలజిస్ట్ లు” అభిప్రాయాలని ప్రకటించడం విడ్డూరం! మాధవ్ అనువాదం కూడా నీరసంగా ఉంది.
    దీనిని నేను ఇందాకా చెప్పిన నా పై అభిప్రాయానికి కింద జత పరచ గలరు.
    రమ.

  6. రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/01/2010 10:56 am

    ఈ వ్యాసంలో అనవసర పదాడంబరం అతిగా ఉండి వ్యాసం చదువుతున్నప్పుడు మాటిమాటికీ ఆలోచనకి ఆటకంగా అన్పించింది. మాధవ్ ఎక్కడా ఎందుకో మరి దేశీయ శాసనాలనించి గానీ.. నేలటూరి వెంకట రమణయ్య గారిలాంటి విజయనగర సామ్రాజ్యంపై చెప్పుకోతగ్గ పరిశీలన చేసిన వారి నించి గానీ ఏ సమాచారాన్నీ స్వీకరించనేలేదే?! అలాగే .. ఎప్పుడైనా గానీ సాహిత్యం తన కాలానికి చెందిన అలంకార వస్తు వస్త్ర వర్ణనలని వివరించడంలో చాలా ముఖ్యమైనది. మాధవ్ వ్యాసం ఆ నాటి సాహిత్యంలోంచి వివరాలని ఏమంతగా పొందుపరచలేకపోవడం వలనా.. విజయనగర కాలం నాటి వివరాలకోసం కేవలం విదేశీ రాతలనే నమ్ముకున్నట్టూ సాగడం వలనా .. ” రాతి నించి నార తీసిన” చందంగా తన ఊహల్ని అల్లుకుపోయినట్టూ అన్పించిందే గానీ ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని అంత బలంగా ప్రతిపాదించి స్థాపించలేకపోయింది. వ్యాసం చదవడం పూర్తి చేసిన తర్వాత ..వ్యాసకర్తకి “కొత్తగా” ఏదైనా చెప్పాలన్న తపన ఉన్నట్టు గా మాత్రం అర్ధమైంది.

    రమ.

  7. నువ్వు గురించి ప్రదీప్ గారి అభిప్రాయం:

    07/01/2010 8:03 am

    కవిత చాలా బాగా రాసారండి 🙂 నాకు చాలా నచ్చేసింది. Super అంతే.

  8. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి bhanu గారి అభిప్రాయం:

    07/01/2010 7:17 am

    very nice story.Depicts the understanding of the child.

  9. సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి bhanu గారి అభిప్రాయం:

    07/01/2010 7:01 am

    చాలా బావుంది వ్యాసము.

  10. ఈమాట మే 2010 వసంత ఋతు సంచికకు స్వాగతం గురించి Lakshmi Prasad Geddapu గారి అభిప్రాయం:

    07/01/2010 5:23 am

    వెబ్ పుటల్లో లంకెల శీర్షికల రంగు లేతగా ఉంది. కొంచెం ముదురు రంగులో ఉండేటట్లు మార్చితే బాగుంటుదేమో!

    గురు జన విధేయుడు,
    లక్ష్మీ ప్రసాద్ గెడ్డాపు

« 1 ... 1140 1141 1142 1143 1144 ... 1583 »