Comment navigation


15823

« 1 ... 1139 1140 1141 1142 1143 ... 1583 »

  1. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:

    07/02/2010 4:13 pm

    ఎండావాన కలిసిన నులువెచ్చని ఆకాశంలో
    విరబూసిన ఇంద్ర ధనుసులు
    రాలే వాన చుక్కకి పులకరించిన వళ్ళు
    హాయిగా వెచ్చగా కాసే నులువెచ్చటి ఎండని
    పీల్చుకుని రంగురంగుల భాషల్తో
    పలకరించే పువ్వుల నవ్వులు
    నీలపుటాకాశంలో మెత్తటి తెల్లటి పరుపులు
    అనంతంగా విస్తరించిన పచ్చటి పసిరికలు
    చల్లటి చలమల పలకరింపులు
    పారే నదులు, తెలవారే అరుణారుణ రవికిరణాలు
    గోధూళిలో వినిపించే గంటల గణగణ నాదాలు
    ఎంత చక్కని నిజాలు,
    పుల్లారెడ్డి పాలకోవాలా!
    నిన్న సగం కడుపు నిండిన పొట్టకి
    దోసెడు అన్నం కావాలగాని,
    ఒక గ్రాము కోవా కాదు
    రక్తం కారిపోయే బాలింతకి
    వైధ్యం కావాలగాని
    ఒక రోజా పువ్వు కాదు
    ఎదిగొచ్చిన బిడ్డకి నిప్పుపెట్టే నాయనకి
    నీలపుటాకాశాలు కళ్ళబడవు
    డొక్కలో కుమ్మిన బూటు కాలికి
    కడుపులో బిడ్డ ఏడుపులు వినపడవు
    నిజవే ఇంత అందవైన లోకంలో
    ఇన్ని బాధలు నిజవే
    కారి, కారి నల్లబడిన ఈ రక్తం నిజవే
    మరింతగా ఎర్రబడి మనసుని కృంగదీస్తున్న
    ఈ ఎర్రెర్రని రక్తం నిజవే
    పారే పినాకిని నిజవే
    ఎండిన ఎకరా కయ్యనిజవే
    అవి నా బాధకి సంకేతవో
    మీ సుఖానికి కారే సంగీతవో!
    నాకెందుకు మీరు నా మట్టిని నాకు
    వాసన చూపిస్తున్నారు?
    నాకిప్పుడు మా అమ్మా నాయన్లు
    నా యత్తా మావలు
    నా హితులు స్నేహితులు
    నా నేలా నింగీ
    నా కష్టం నష్టం
    నా కెందుకు గుర్తు తెస్తున్నారు
    నేనిప్పుడు ఈ డాలరు స్వర్గంలో
    నిండా మునిగి తేల్తున్నాను
    ఇప్పుడు నేను
    పువ్వుల్నుంచీ
    రంగుల్నుంచీ
    ఎగిరిపొయ్యే
    అద్భుతవైన
    సీతాకోక చిలుక రెక్కలనుంచి
    సుఖవైన నా గ్నాపకాల చలమలనుంచి
    (పాచికంపేగాని చల్లగా వుంది కదా)
    అద్భుతవైన ఉదయాస్తమయాలనుంచి
    వంగి పలకరించే రంగుల
    ఇంద్రధనువు నుంచి
    చక్కటి శుష్క వేదాంతాన్ని
    చిక్కగా వడుక్కుంటుంన్నాను
    మీ దెబ్బల రెక్కల
    చప్పుడు నాకెందుకు
    నాకు మీ కల్లలైన కలల
    పెడబొబ్బలు నాకెందుకు
    నాకు మీ ఛిద్రవైనగుండెనుంచి కారి
    గడ్డకట్టిన నల్లని రక్తపుమరకల
    గుసగుసలెందుకు
    ఎందుకు అప్సరు, నాకివన్నీ ఎందుకు?
    ఈ స్వర్గంలో మేవు కట్టుకున్న
    ఈ సుఖాల గూటినించి
    మా చుట్టూ మేవు గీసుకున్న
    ఈ చక్కని అందాల గిరి నించి
    (చిన్నప్పుడు బచ్చాలాటలా)
    మమ్మల్ని బయటకు లాగే
    ఈ ప్రయత్నవెందుకు?

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  2. కృష్ణదేవరాయలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/02/2010 2:35 pm

    internet explorer “full screen” ప్రెస్ చేసినా నాకు పుస్తకం పేజీలో ఒక భాగమే కన్పిస్తోంది గానీ ఎందుకని మరి రెండో సగం పూర్తిగా కన్పించడం లేదు.??
    నేను ఏం చేస్తే మొత్తం పుస్తకం చదవగలనూ చెప్పండి.

    రమ.
    [Please refresh the page while holding the “Ctrl” button down. We could see the complete page in full screen mode. Please bear with us while we try to fix this issue – Eds.]

  3. ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ గురించి ramanarsimha గారి అభిప్రాయం:

    07/02/2010 2:11 pm

    సంపాదకీయం చాలా `సరదాగా` ( వాస్తవానికి దగ్గరగా ) ఉంది.
    నా అభిప్రాయంలో ఏదైనా లోపం ఉంటే ముందస్తు క్షమాపణలు..
    e-mail: ramuputluri@yahoo.in

  4. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/02/2010 2:10 pm

    లైలా గారూ !! భలే రాసారు మీరు. మీతో నా గొంతు కలుపుతున్నా!! అయితే ఆంధ్రదేశంలో ఇలా బలవంతపు విప్లవ కక్కులు ఒక తప్పనిసరైపోయిది. మీకు తెలుసోలేదో గానీ మీలా ఎవరన్నా ఉన్నమాట అన్నారో వారికి రకరకాల బిరుదులు రెడీ. మిమ్మల్ని వారి తిట్ల తో “ఎండగడ్తారు” మీకు సరైన “సామాజిక స్పృహ” లేదని తీర్మానించేస్తారు. వెంకటేశ్వర రావు గారు కవిత్వంలో ఎక్కువ పుస్తకాలు రావడానికి కవిత్వం కాదు కవిత్వాన్ని “డెమోక్రటిసైజ్ ” చేయడం అని ఎవరో చెప్పేరని విని హాశ్చర్య పడ్డారా? ఆ అభిప్రాయం పచ్చి నిజం. ఎందుకూ ఏమిటీ అన్న ప్రశ్నలు అడిగే వాళ్ళు లేరు. అలా వచ్చే కవిత్వాన్ని ఎవరూ పట్టించుకోరు. పుస్తకాలు ఎన్నైనా అచ్చుకానివ్వండి వాటిని గురించి ఆ కవులు పంచిపెట్టుకోవడమే తప్పించి అమ్ముకుని ఎరగరు. అంతా తీవ్రాతితీవ్రమైన పదాలతో “విప్లవాల” రాతలు రాసేసేవాళ్ళే!! కానీ సుఖంగా బతుకుతూనే ఈ కడుపుమంట రాతలన్నీ రాస్తారు.

    కాదంటే తిడతారు. సాహిత్య రౌడీయిసమ్ లాంటిది. మీకు విసుగు కలిగిందీ అంటే అది సమంజసమే!!

    మీరు జీవితాన్నీ అనుభవస్తానూ అని అన్నారా అంటే మీరు వట్టీ “బూర్జువా” అన్నమాట . ఇది మరొక తిట్టూ. ఒక వేళ మీరేమన్నా కొన్నాళ్ళూ విప్లవాలు రాసి మానేసి ఇలాంటి మాట గాని అన్నారా మీరు ” రెనగేడ్ “. అపుడే భయపడకండి. మా బాధలు ఏం చెప్పమంటారు?? ఇక్కడ ఎంత తిట్టూ కవిత్వం రాస్తే వారికి అంత సదుపాయం. అది ఒక షోకు. ఇలా తగలడింది ఎక్కువ శాతం “వచన కవిత” ఎక్కడా వస్తు వైవిధ్యం ఉండదు. వ్యక్తీకరణలూ అంతే. భాష పదబంధాలూ మరి అడక్కండి. కావాలంటే ఓపిక ఉన్న ఎవరన్నా ఒక పుంజీడూ పుస్తకాలని చదివి చూడండి. నాలాగే లైలా తో మీరుకూడా అవునంటూ గొంతు కలుపుతారు. మేం రకరకాల గ్రూపుల రకరకాల భావజాలాల బాధితులం!! కవితా సంకలనాలలో కవిత్వమ్ తప్ప ఇంకేదైనా ఉన్నా దాని గురించి ఎక్కడా మాట్లాడలేని వాళ్ళం!! మెరమెచ్చు మాటలు అనడానికీ వినడానికీ అలవాటు పడి ఉన్నవాళ్ళం. ఉన్నమాట అనడం ఎలాగో కూడా మరిచిపోయిన వాళ్ళం!! మేం తెలుగు కవితా పాఠకులం!! మాయదారి రాతల తలరాతల బరువుని మోస్తూ నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఎన్ని పుస్తకాల మోతని మోస్తున్నామో ఆ జగన్నాధునికెరుక. ఇంక కవిత్వమ్ ఏ సన్నటి గొంతుతోనో ఉన్నా ఈ మోతలో పడి అది చాలా దూరంగా పారిపోతూంటే పట్టి తెచ్చుకోలేక నిస్సహాయంగా చూస్తున్నవాళ్ళం!! బతుకు రుచిని వీళ్ళు మరిచిపోయి అలాంటి ఆనందం జీవితంలోంచి పోయినట్టూ బొల్లేడ్పులు ఏడుస్తున్నారు. అదువల్ల మీ ఉన్నమాట మీరన్నమాట నాకు మహా సుఖంగా ఉంది సుమా!!

    రమ.

  5. సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు గురించి ramanarsimha గారి అభిప్రాయం:

    07/02/2010 1:46 pm

    పిల్లల్ మనస్తత్వంపై మీ విశ్లేషణ చాలా బాగుంది.
    ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన వ్యాసమిది..
    ధన్యవాదాలు..

  6. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి Ramnath గారి అభిప్రాయం:

    07/02/2010 1:45 pm

    Sreenivas,
    Very good. I have been looking for this a longtime. Was the famale voice sree Rangam gopala ratnam?

  7. కృష్ణదేవరాయలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/02/2010 12:43 pm

    it opens with a second column split into half vertically down through out. am afraid the book can’t be read totally. is it a defect in scanning/ uploading?

    rama.

    [There is nothing wrong with scanning or uploading. The entire book is properly uploaded and formatted. You should have no problem reading the pages in Firefox browser. If you are using Internet Explorer please click “fullscreen” on the top bar to see the complete page, while we are working to fix a minor error in IE. Thanks for your patience. ]

  8. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    07/02/2010 12:40 pm

    ఈ సంకలనానికి ఉద్దేశించిన అఫ్సర్ కవితలన్నీ తను చదివి -ఈ పుస్తకానికి, ముందుమాట రాసేసరికి నెల్లుట్ల వేణుగోపాల్ అన్న వ్యక్తికి అప్పటికే ఆంధ్రాలో ఉన్న కష్టాలు చాలక , ఇప్పుడీ పద్యాలన్నీ చదివి బాధ పడగలనా -అని అనిపించినట్లూ, అతని మనసు ఇంకా పాడయినట్లూ నాకు తోచింది. ఆ ముందుమాట అతి దీనం గానూ, ఎంతో భారంగానూ, ఘోరంగానూ, నాకెందుకు అప్పచెప్పారు సంపాదకులీ పని, దీని నుండి నన్ను విముక్తుడిని చెయ్యండి బాబూ -అని వేడుకున్నా, ఆయనకు తప్పనట్లుగా ధ్వనించింది.

    అరే, అఫ్సర్ ఏం రాసిఉంటాడు, ఈయనకు ఇంత డిప్రెషన్ రాటానికి- అనుకున్నా.

    ఆ ‘ముందుమాట’ చాలా బాగా రాశారనీ, అసలు బాగా రాయలేదనీ, బాగాలేదు అన్నవాళ్ళు సంస్కారం లేని వారనీ, అసలు కవీ, ముందు మాట రాసిన జర్నలిస్టూ ఎన్నేళ్ళనుంచో స్నేహితులు – స్నేహితులు స్నేహధర్మం నెరపుకుంటుంటే మధ్యలో బైటి వాళ్ళు మాట్లాడటమేంటనీ – ఇలా చాలా ఆశ్చర్యకరమైన కామెంట్లు నేను పుస్తకం.కమ్ లో కొన్ని నెలల క్రితం చదువుకున్నాను.

    ఇప్పుడు వేలూరి సమీక్ష – మచ్చుకి పరిచయం చేసిన కవితలు చదివితే- ఈ కవితల సంకలనం నాకు చదవబుద్ది కాదు. అప్పటి ఆ ముందుమాట, ఈ సమీక్ష చదివినందువల్ల ఇప్పటికిలా అనిపిస్తున్నది.

    ఇందులో
    ప్రతి ఆలోచనా గరళం
    ఎవరో గిచ్చారంటు గిలగిలలాడె గళం
    తన్ను తాను తన్నుకుంటూ
    ఓదార్పుకై అందరి కాళ్ళ చుట్టూ
    చేతుల సంకెళ్లెందుకో మెలెయ్యటం
    ఎందుకో ఇతనికి
    ఏదీ నచ్చదు
    ఎవరూ నచ్చరు
    ఏదో వేదన ఏదో నిస్పృహ
    ఎవరిమీదో కక్కలేని మింగలేని ద్వేషం
    తనపై ఇంకొందరిపై ఎంతో ఎంతో జాలి, సానుభూతి.
    ఇలా సొంతంగా వెలి వేసుకుంటూ, దుఃఖాలని పోగేసుకుని
    మెలివేసుకుని మెడకు వయొలిన్ తీగల్లా
    ఉరేసుకుంటే చస్తే సైగల్ సంగీతం పలకదు,
    పంకజ్ మల్లిక్ “ఎ రాతే ఏ మౌసమ్ ఎ హసనా హసానా
    ముఝే భూల్ జానా, ఇన్హేనా భులానా భులానా భులానా”
    మృదుత్వాన్ని ప్రేమించి తరించే భాగ్యం అబ్బదు
    గరుకు మాటలు, గరుకు గడ్డం, నిజమే అవీ బాగుంటాయ్
    ఎప్పుడంటే అతని కళ్ళూ, పెదాలూ, మనసూ ప్రేమను వర్షిస్తున్నప్పుడు.
    బార్లనుండీ , పీర్లనుండీ, వార్తాలయాలనుండీ బార్బర్ పార్లర్ల
    నుండీ కవిత్వానికి గరుకు పదాల కోసం కవి వెదక వచ్చునా.
    యక్, షరమ్. షరమ్.
    ఊరి మంగలాడి మొద్దుకత్తి లోతుకు, గడ్డం తెగి ఏదో ఇంత నెత్తురు రావచ్చు
    తుప్పుకోతకు టెటనస్ రావచ్చు
    కవిత్వపు నాజూకు మెహబూబా రాదు కాక రాదు.
    శరీరం బైట ప్రవహింపజేసే రక్తంలో శక్తి లేదు. ఆకర్షణ లేదు.
    జీవితం మధురిమను ప్రేమించేవారికి నల్లనెత్తురు రోత సుమా!
    రోజూ రాతల్లొ చచ్చేవాడికి ఏడ్చేదెవడు
    నవనవలాడే బ్రతుకుకూ, కవితకూ
    ఊరి చివర ఏం పని
    కనిపించే దక్కడ కట్టెలూ, కాష్టాలూ,
    ఏడుపు సంకేతమిస్తే చాలు ఎగిరొచ్చే కాకులూ
    వినిపించే దక్కడ కుళ్ళు రుచి మరిగిన
    రాబందుల రెక్కల తటతటలు.

    క్షమా కీజియే. It is a matter of life and death. వెంటనే నా ‘పూలరధం’ మళ్ళించి, ఎక్కడ ఉద్యానవనాలు, ఎక్కడ సితారు ధ్వనులు, సుందర భావనలు ఉన్నవో అక్కడికి వెళ్ళి పూలగాలులు పీల్చి జీవించాలి.

    లైలా

  9. సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు గురించి Sowmya గారి అభిప్రాయం:

    07/02/2010 2:00 am

    🙂 బాగుందండీ!

  10. అ, న్యాయం గురించి jagadeeshwar reddy గారి అభిప్రాయం:

    07/02/2010 1:54 am

    ఇప్పుడే అ.న్యాయం చదివాను.
    ఆ మధ్య ఆరిసీతారామయ్యగారి ‘పరివర్తన’ కథ చదివినప్పుడే అమెరికా జైళ్ళల్లో మగ్గుతున్న తెలుగువాళ్ల దీన పరిస్థితి తలచుకుని భయమేసింది. ఇప్పుడు ఈ కథ చదవగానే ఆ భయం మరింత పెరిగింది. ఆ భయంతో కథని ఎలా విశ్లేషించాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉన్నాను. కాని ఒకటి – కథని క్యాబేజీ ఒక్కో పొర వలిచేసినట్టు చెప్పి మంచికథగా మలిచారు. అదే కొంత బిగితో అల్లివుంటే గొప్పకథ అయ్యేదనిపించింది.
    – గొరుసు

« 1 ... 1139 1140 1141 1142 1143 ... 1583 »