Comment navigation


15823

« 1 ... 1128 1129 1130 1131 1132 ... 1583 »

  1. నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో ఒక ఉదయం గురించి Vishnu గారి అభిప్రాయం:

    07/14/2010 9:51 am

    చక్కని పద్యం-అన్వయం. కేవలం ప్రతిపదార్థ తాత్పర్యాలే కాకుండా పద్యానికి మంచి పరిచయాన్ని అందించటం, “context” ని నిశితంగా పరిశీలించడం మీ శీర్షిక ప్రత్యేకత. ధన్యవాదాలు.

    -చైతన్య విష్ణు

  2. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి Kayala Nagendra గారి అభిప్రాయం:

    07/14/2010 9:20 am

    ఈమాట.కామ్ చూసాను. చాలా బాగుంది. తెలుగులొ ఒక మంచి పత్రికను అందిస్తున్న మీకు ధన్యవాదాలు.

  3. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:

    07/14/2010 12:41 am

    అఫ్సర్ రాయబోయే వ్యాసం కోసం నేను కూడా ఎదురుచూస్తాను. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రుల జీవితాలూ – సాహిత్య సృష్టి గురించి ఇంతకు మునుపు ఈ మాటలో జరిగిన చర్చల్లో వచ్చిన ప్రశ్నలను దృష్టిలో ఉంచుకుని మరొక్క అడుగు ముందుకు వేయటానికి అనువుగా రాస్తారని ఆశిస్తున్నాను.

    ప్రత్యేకించి ఈ విజ్ఞప్తి చేయటానికి ఒక కారణం ఉంది. అమెరికన్ ఆంధ్రుల జీవితానుభవాలు ఫ్రోజెన్ స్థితి లో ఉంటాయన్న మాట దురుసుగా కాదు కానీ లోతు లేని అభిప్రాయంగా నాకూ అనిపించింది. ఈమాటలో అభిప్రాయ వేదికలో వివరంగా చెప్పటానికి వీలవక పోవటం వల్లనే అలా ధ్వనించి ఉండ వచ్చుననుకుంటున్నాను.

    ప్రవాస జీవితం గురించి చాలా మంది దార్శనికులు చాలా ఇన్ సైట్ ఫుల్ గా చెప్పిన మాటలు అఫ్సర్ గారికి అందుబాటులో ఉండే ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండే పాటలూ, సినిమాలూ, కథలూ కబుర్లూ ఉండనే ఉన్నాయి. ఇదే కాక దృష్టిలో ఉంచుకోవలసిన విషయం ఒకటి వేలూరి గారి వ్యాసంలో చూచాయగా చెప్పినది కూడా ఉంది. అమెరికాలో ఉన్న తెలుగు వారి అందరి అనుభవాలూ ఒకేలా ఉండవు. తరాల మధ్య తేడాలు ఉంటాయి, మతం, కులం, ప్రాంతం, వయసు, స్త్రీ లా పురుషులా అన్న భేదాలూ ఉంటాయి. మాలతి గారి మేడిసన్ అనుభవమూ అఫ్సర్ గారి మేడిసన్ అనుభవమూ ఒకేలా ఉండదు. ఇన్ని రకాల అనుభవాలలో సృజనకి కావలసిన వెల్ స్ప్రింగ్స్ ఎక్కడ ఉన్నాయో వాటికీ ముప్పై వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇంటికీ మధ్యనున్న సంబంధం ఏమిటో చెప్పగలిగితే ఎలా ఉందో, ఎలా ఉండ వచ్చునో చూచాయగానైనా చెపితే అందరికీ ఉపయోగంగా ఉంటుంది.

    సంపాదకులకి ఒక సూచన – అసలు ప్రవాస జీవితంలో తెలుగు – తెలుగు వారి అనుభవాలూ, ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన వారి అనుభవాలూ ఇలాంటి అంశాలతో ఒక సంచిక తెస్తే బాగుంటుంది. విషయం కేవలం సాహిత్యానికే పరిమితం చేయక పోతే తెలుగు లోనో – ఇంగ్లీషులోనో (తరువాత అనువదించుకోవచ్చును) రాయగలిగిన వారు, చెప్పగలిగిన వారూ చాలా మందే ఉంటారనే నా నమ్మకం. లేకపోతే గుడి గుడి గుంచం గా చర్చ అక్కడే తిరుగుతూ ఉంటుంది.

  4. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/13/2010 9:38 pm

    హడావుడిలో ఇంతకు ముందు కామెంట్ లో చిన్నతప్పు చేశాను – అది కంతు దిదృక్షు రూక్ష నయనుడు, కంతు దిదృక్షు రూక్షుడు కాదు.

  5. తలుపుల రసీదు గురించి Radha గారి అభిప్రాయం:

    07/13/2010 6:36 pm

    బావుంది!!!

  6. అ, న్యాయం గురించి Radha గారి అభిప్రాయం:

    07/13/2010 6:28 pm

    Nice story. Nowhere did the author mention that the story is based on facts. If you are looking for a reality based story, you should go to CNN or other news related websites. This is FICTION people…

  7. ప్రేమ కవితలు గురించి santhosh గారి అభిప్రాయం:

    07/13/2010 3:11 pm

    చాలా బాగున్నది.

  8. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/13/2010 2:43 pm

    “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” గురించి రమా భరద్వాజ్ గారి వ్యాఖ్యలు ఆలోచనాత్మకాలు. ఐతే వారు ఆ గ్రంథం నుంచి ఆశిస్తున్నవి దాని పరిథిలోవి కావనుకుంటాను.

    1. వారు ““రచనా సందర్భం” మారితే వచ్చే అవకాశాలనీ.. అంటే వీలూ సాలూ అంటాం తెలుగులో వాటి గురించి మాట్లాడుకుందికి ఉపకరిస్తుందేమో గానీ అది మంచి కవిత్వమా కాదా అని గుర్తించడానికి ఎందుకూ ఉపకరించదు.” అన్నారు. నాకు అర్థమైనంతవరకు ఏది మంచి కవిత్వమో ఏది కాదో గుర్తించటం కాదు ఆ పుస్తకం చేస్తున్న పని; తెలుగు కవిత్వంలో పెనుమార్పులు ఏవో, వాటి వెనక వున్న కారణాలు ఏమిటో గుర్తించటానికి ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించి ఆ సిద్దాంతం ద్వారా వేటిని పెనుమార్పులుగా గుర్తించవచ్చో చూపించింది, అంతే.

    2. మరో చోట “కవితావిప్లవాల స్వరూపాన్ని దాటి ముందుకెళ్ళవలసిన “సందర్భం” కూడా ఏనాడో వచ్చింది. నారాయణరావు గారి థియరీ భాషలో చెప్పాలీ అంటే విమర్శా సందర్భం ఏనాడో మారింది. ఆ దృష్ట్యా కవితా విప్లవాల స్వరూపం ఒక పాత పుస్తకం. ఇవాళ్టికాలపు అవసరానికి అది ఎందుకూ ఉపయోగపడదు. ” ఇక్కడ వారు వాడిన తర్కమార్గం సుగమంగా లేకపోయినా, దీన్ని నేను ఇలా అర్థం చేసుకుంటున్నాను (ఇది పెడదారైతే అసలు దారేదో తెలుసుకోవాలని వుంది): ఇది ఒక విమర్శాగ్రంథమనీ, కవిత్వానికి లాగానే విమర్శాసందర్భంలో మార్పు వల్ల విమర్శలో కొత్తవిప్లవం వచ్చిందనీ, ఈ గ్రంథం పాతవిప్లవం తాలూకుదనీ. విమర్శకు సంబంధించి అలాటి సిద్ధాంతం ఒకటి వున్నట్టు, దాని ప్రకారం ఈ పుస్తకం ఒక పాతవిప్లవంలోదని ఆ తర్వాత మరొక రచన లేదా రచనలు కొత్త విప్లవం లేదా విప్లవాలకు దారి తీసినట్టు నిరూపణ అయిందని నాకు తెలియదు; కాని ఈ చర్చ కోసం అలా జరిగిందని ఒప్పుకుందాం. అలా ఒప్పుకున్నా, ఈ పుస్తకం చదవవలసిన అవసరం తీరిపోయిందని దాన్నుంచి ఎలా నిర్ధారణ చెయ్యటం? ఇక “ఇవాళ్టికాలపు అవసరం” అనేది. ఈ అవసరం ఏమిటో ఎక్కడా స్పష్టంగా చెప్పకుండా దానికి ఇది ఎందుకూ ఉపయోగపడదు అంటే అర్థం చేసుకోవటం కష్టం. ఈ వాక్యసందర్భాన్ని బట్టి ఆ అవసరం సైతం ఏదో ఈ పుస్తకపరిథిలో లేనిదే అయుంటుందని అనిపిస్తున్నది. నాకు మూడు సాధ్యమయే అర్థాలు కనిపిస్తున్నాయి:

    అ) “చాలా కొత్త విప్లవాలు వచ్చాయి, వాటిని ఈ పుస్తకం లోని సిద్ధాంతం గుర్తించలేదు”
    ఆ) “ఈ పుస్తకంలో చెప్పిన కారణాలు కాకుండా కవితావిప్లవాలకి ఇంకొన్ని కొత్తకారణాలు కనుక్కున్నారు”
    ఇ) “ఈ సిద్ధాంతం తప్పని నిరూపించబడింది”

    వీటిలో ఏది జరిగివున్నా, అలా జరిగినట్టు నాకు తెలియదు. దయచేసి అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో ఎవరైనా చెప్తే తెలుసుకుంటాం.

    చివరగా, నేను చేసిన పాడు పనికి విమర్శకులందర్నీ విమర్శించటం ఎందుకు? (అలాగే, నన్నొక విమర్శకుడిగా లెక్క వేసినందుకు రమ గారికి థేంక్స్, నేను కాకపోయినా.)

  9. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/13/2010 1:53 pm

    మోహనరావు గారు ఈ పద్యం “మోహావేశం”లో భృకుటిని (కనుబొమలు) కనురెప్పలు అన్నారు అనుకుంటున్నాను !! (మోహనరావు గారు, నా శబ్దలోలతని క్షమించండి).

    కంతు దిదృక్షు రూక్షుడని ఎంత సాభిప్రాయంగా అన్నారో పెద్దన గారు ! ఎదుటివాణ్ని కాల్చేసే చూపులన్నమాట. కనుబొమలు పాముల్లా ఆడటమే కాదు, ఫూత్కారాలు కూడా చేశాయి. ఔరా !!!

  10. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana గారి అభిప్రాయం:

    07/13/2010 12:58 pm

    మిథిలలో (నేటి బిహార్ రాష్ట్రం) 16వ శతాబ్దములో భానుకరుడు అనే సంస్కృతకవి ఉండేవాడు. భానుదత్తుడని కూడా ఇతనికి పేరు ఉంది. ఈ కవి యావద్భారతదేశములో నానారాజులను సందర్శించి మన్నన పొందాడు. ఇతడు తొమ్మిది కావ్యాలను వ్రాసినాడట. అవి – అలంకారతిలకము, కావ్యదీపిక, కుమారభార్గవీయము, గీతగౌరీపతి (ఇది ఎక్కడైనా దొరికితే చూడలని ఉంది, ఇది గీతగోవిందానికి అనుకరణ), చిత్రచంద్రిక, రసతరంగిణి, రసపారిజాతము, రసమంజరి, శృంగారదీపిక. కృష్ణరాయలు కూడా రసమంజరి అని ఒక కావ్యాన్ని వ్రాసినాడు. భానుకరుడు షేర్షా, నైజాంషా, వీరఖాన్ (రీవా రాజ్య పాలకుడైన హిందూ రాజు), శ్రీకృష్ణదేవరాయలు మున్నగు రాజులను సందర్శించాడు. కృష్ణరాయలను ప్రత్యక్షముగా, వ్యంగ్యముగా ప్రశంసించాడు తన పుస్తకాలలో. రసపారిజాతమునుండి ఒక పద్యము –
    ఆర్యా-
    కృష్ణం సమర సతృష్ణం
    దృష్టవతో భాంతి విష్టరశ్రవసః
    రాజన్య జన్మమూలే
    భుజమూలే పులకముకులాని
    – భానుకరుడు, రసపారిజాతము
    (కృష్ణరాయలు సమరాసక్తుడు, విష్ణువులా శోభతో కనిపిస్తాడు, రాజులకు మూలపురుషుడు, అతని భుజాలు పులకించిపోతున్నాయి).

    పై విషయాలు శ్రీ ఈయుణ్ణి వెంకట వీరరాఘవాచార్యులు 1952 ఫిబ్రవరి భారతి పత్రికలో వ్రాసిన “కవిసార్వభౌముడు భానుకరుడు – శ్రీకృష్ణదేవరాయలు” అనే వ్యాసములో ఉన్నవి.

    విధేయుడు – మోహన

« 1 ... 1128 1129 1130 1131 1132 ... 1583 »