Comment navigation


15826

« 1 ... 1108 1109 1110 1111 1112 ... 1583 »

  1. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గురించి మందాకిని గారి అభిప్రాయం:

    10/27/2010 1:14 am

    చాలా చాలా చాలా చాలా బాగుంది!!

  2. ఆర్ యూ రెడీ? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    10/26/2010 10:44 am

    మీరు అభిప్రాయం రాసేరన్న ఒక కుతూహలం వల్ల కాకపోతే లైలా గారూ !! ..బహుశా ఇలాంటి కధని నేను చదివి ఉండేదాన్ని కాను. కధలోని విషయాన్ని ..అలాగే ఇవాళ్టి కుర్రాళ్ళ భయాల్నీ ..అనుమానాల్నీ కాసేపు అటుంచి చూసినా అసలు ఇది ” కధ” అన్న మాట లోకి ఎలా వొదుగుతుందా?? అని. నా అసలు తపన.

    టకటకా కొన్ని అభిప్రాయాల్ని చెప్పేయాలీ అన్న ఒక లౌల్యాన్ని వదలందే తెలుగున మంచి కధలు రాలేవు.కధలో ఒక వాతావరణం లేదు. పాత్రల ఎదుగుదల లేదు. గుర్తుంచుకోదగిన ఒక్క సంభాషణ లేదు. కొత్త వస్తువుని తీసుకుని రాసేటప్పుడు సదరు రచయితకి ఉండవలసిన కాసింత స్పస్టత అసలే లేదు. “చతురత” అన్న సందర్భం చూడబోతే ఈ కధలో అది శూన్యం !! కధని చదివాకా అది ఒక నీతుల అతుకుల బొంతలా కన్పిస్తూంటే ..ఇహ దాన్ని చదివి అలాంటి భావాలున్న వాళ్ళు ఎవరైనా సంతోషించాలేమో తప్ప .. కధని చదవాలని అనుకున్నవాళ్ళకి మాత్రం గంపెడు నిరాశ కలుగుతుంది. ఇలా బులబులాగ్గా రాసేయడం అన్నది మన భాషలోమాత్రమే సాధ్యమేమో…అని అన్పించక మానదు సుమా !! ఇలాంటివి ఎంత మంది ఎన్ని రాసినా అలాంటి రచనలన్నీ “పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయే” లాంటివే !!

    నేను ఈ కధా వస్తువు లోని తికమకలని గురించిమాట్లాడే పనికి మరి పోవడం లేదు. అందుకు మీ మాటలే చాలు.

    రమ.

  3. ఆర్ యూ రెడీ? గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    10/25/2010 11:17 pm

    “ఆర్ యూ రెడీ?”

    మంచి తమాషాగా రాశారు కథ.

    నేటి కాలం లావణ్యతో -ఆడవాళ్ళు మగవాళ్ళతో కలిసి తిరగటంలో, ప్రత్యేకంగా ఆడవాళ్ళే ఎందుకు జాగ్రత్తగా ఉండాలో, ఎలాటి జాగ్రత్తలు వహించాలో, రివర్సు డైలాగులు చెప్పించిన తీరు గమనీయం.

    ‘అరిటాకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద అరిటాకు పడ్డా అరిటాకు కే నష్టం.’
    ‘ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు’ – ఇలాటి పాక్షికమైన పాత తెలుగు డైలాగులు, కొత్త యూనివర్సిటీ కేంపస్ నుండి ఈ యుగం అమ్మాయితో చెప్పించటం – నాకు బాగా నవ్వొచ్చింది.

    సెక్స్ -ఆడ మగా ఇద్దరికీ సమానంగా ఇష్టమైన విషయం కాదూ? ఇద్దరికీ అవసరమైనది కాదూ? ఆడ, మగ -జీవితంలో సమ ఉజ్జీలు కారా? ఈ ‘ప్రేమ’ వ్యవహారం లో వారికి లాభనష్టాలు సమం కాదా? ఈ కథలో ఉన్న పాత్రలకు అలా అనిపించటం లేదు.

    ఆడది మోసగించబడేదీ, నష్టపోయేదీ. మగవాడు మోసం చేసేవాడు. ఎప్పటి అభిప్రాయాలు ఇవి?
    ఆడవారు లొంగదీయబడేవారు. మగవారు లొంగదీసే వాళ్ళూ- అని ఈ కాలపు అమ్మాయితోనే చెప్పిస్తున్నారు, ఈ కథలో ఏమి చమత్కారం. లావణ్య ఇలా అంటుంది కథలో;


    కాని, అభ్యంతరం చెప్పకుండానే లొంగిపోయిన అమ్మాయిని ‘లూజ్ కారెక్టర్’ అని అపార్థం చేసుకునే మనస్తత్వమే అబ్బాయికి ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి అతను వెనుకంజ వేయవచ్చు.”

    What an Amazingly twisted complex bamboozling sentence!

    For a contrast, hear what this simple man is saying from three centuries back, in this poem,


    Darling, do not regret the promptness of your surrender!
    I think no less of you now, you have not lost my respect” _ Goethe.

    In this poem, a male is addressing a woman, who was willing to go to bed with him. Even though he uses a word such as ‘surrender’ -still this man of 18th century , comes across as much more of a man, of natural human impulses and normal desires. The man in Goethe’s poem is Way Way different from Vasu, the hero in this Telugu story.

    కథ చివరలో వాసు అయోమయ పరిస్థితి, అతడు 🙂 ఉడాయించిన రీతి అమోఘం.

    ఈ కథలో ఉన్న ముగ్గురు పాత్రలకూ ఇక ముందు ముందు, వారి పవిత్ర్తతకు ఎట్టి భంగమూ రాదు, అని అనిపిస్తున్నది. They will all be so very careful, and remain pure, and celibate. What an achievement!

    మరెందుకో, ఈ కథలో పాత్రల వలె ఆలోచించటానికి, నాకు ఏ మాత్రం మనస్కరించదు.

    నమస్కారాలు.
    లైలా

  4. దివ్య దీపావళి గురించి Murty గారి అభిప్రాయం:

    10/25/2010 9:28 pm

    Hello sir,

    very nice website. i have one request about sinare poem. there is one asu kavithvam he told about teluguvaadu. panche kattu vaadu evadu vaadu vaade kada telugu vaadu… like this.

    Can you please send me the link to the poem please. Thanks a ton.

    Regards,
    Murty.

  5. నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి Sreekanth Reddy గారి అభిప్రాయం:

    10/25/2010 2:07 am

    Hello Cheemalamarri Gaaru,
    Thanks a lot for posting the poem. I’m now left with no choice but to read the whole book.
    Can anyone kindly point out the website(s) that sell Molla Ramayanam (preferably with meanings to complicated words explained). I did search for it myself but to no avail.
    sreekanth

  6. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    10/24/2010 7:37 pm

    సాని కి మూలం రెండు విధాలు: 1) సాహిణి – అంటే సైన్యాధికారి. ఉత్తర భారతంలో సహానీ కూడా దీనికి మారు రూపం. 2) స్వామిని – అంటే స్వామికి స్త్రీ లింగం.

    కృష్ణారావుగారు ఏదో అశ్లీలత ఉందని తమ ఇంటి పేరుని ముట్నూరు గా మార్చుకున్నా, ముట్లూరి కి మూలం వేరు – పనిముట్టు లోని ముట్టు, అంటే సాధనం.

    అప్పాజోస్యుల, వల్లభజోస్యుల పేర్లలో ఉన్నది వారి ఒకప్పటి వృత్తి – జోస్యం చెప్పడం.

    ఈ విషయాలు, మన పేర్ల మీద పరిశోధన చేసిన యార్లగడ్డ బాలగంగాధరరావు గారి పుస్తకాలలో [1] [2] ఉన్నాయి.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “ఇంటిపేర్లు,” ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు, నిర్మలా పబ్లికేషన్స్, 2001.
    [2] “నామ విజ్ఞానము,” ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు, నిర్మలా పబ్లికేషన్స్, 2002.

  7. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి yasasvi గారి అభిప్రాయం:

    10/23/2010 12:06 am

    “సాని” అన్న పదానికీ ఇవాళ వాడుక లోఉన్న సాని అన్న పదానికీ ఎటువంటి సంబంధమూ లేదని రోహిణీప్రసాదుగారు గమనించగలరు. సాహిణి అన్న పదం కాలక్రమంలో సాని గా రూపాంతరం చెందింది. సాహిణి అన్న మాట సేనాని అన్నమాట లాంటిదే!! అందువల్ల చలసాని లోని “సాని’ అన్న మాట సాహిణి అన్న ఆయా కుటుంబీకుల పూర్వవృత్తిని [ అంటే వారి సేనా నాయకత్వపు హోదాని ] సూచించేది అని మనం అర్ధం చెసుకోవాలి. మిగతావి సైతం అటులనే అనువర్తిస్తాయి. ఇవి ఎక్కువగా కమ్మ కులం వారిలో కనిపించడానికి కారణం వారు మధ్యయుగాల్లో అమర నాయకులుగానూ సైన్యంలో సేనానాయకులుగానూ ఉండినవారు కావడమే !!

    యశస్వి.

  8. ఇప్పుడెందుకిలా? గురించి maddirala siddardha గారి అభిప్రాయం:

    10/22/2010 12:48 pm

    మీ కవిత చాలా బాగుంది

  9. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Karthik గారి అభిప్రాయం:

    10/22/2010 10:59 am

    చాల వివరముగ వ్రాసారు.

  10. రచయితలకు సూచనలు గురించి BHAMATI గారి అభిప్రాయం:

    10/21/2010 7:09 pm

    ఈమాట పత్రిక ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది.

« 1 ... 1108 1109 1110 1111 1112 ... 1583 »