శీర్షిక బావుందిగానీ, పాతకథలనే ఎన్నుకోవాలనే సూచనే బాగాలేదు. 1960, 1970 తర్వాత మంచి కథలే రాలేదని మీ అభిప్రాయమా? లేకపోతే ఆ తర్వాత వచ్చిన మంచి కథలన్నీ అందరికీ ఎరుకేనని మీ నమ్మకమా? నా ఉద్దేశంలో ఈ రెండు వాదాలూ సరైనవి కావు. ఆ మాటకొస్తే, సాహిత్యం మీద ఆసక్తి, ప్రవేశం ఉన్న వారికి పాత కాలపు గొప్ప కథలతోనే ఎక్కువ పరిచయం ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటారా? ఏళ్ళ తరబడీ వాటి గొప్పదనాన్ని గురించి వింటూంటాం కాబట్టి.
అయినా మీరడిగింది “గొప్ప”కథలని గురించి కాదు కదా? కేవలం “నచ్చిన” కథలని గురించి. అలాంటప్పుడు సమకాలీన కథలకు ప్రాముఖ్యతనిచ్చి, కొత్త కథలకూ, కొత్త రచయితలకూ గుర్తింపూ, ప్రోత్సాహమూ ఇవ్వటం మీ కర్తవ్యం కాదంటారా? గతాన్ని కీర్తించడం అందరూ, ఎల్లప్పుడూ చేసే పనే. వర్తమానాన్ని కూడా గౌరవించి, భవిష్యత్తుకి బాట చూపించటం “సాహితీ విలువలున్న” పత్రిక నడిపే సంపాదకుల బాధ్యత అనుకుంటాను.
తిరుక్కురళ్ కు చాలా మంచి పరిచయం ఇచ్చారు! ధన్యవాదాలు. ఇలా రెండు పాదాల ఉపజాతి పద్యాల్లో తిరుక్కురళ్ ను అనువదించ వచ్చన్న ఆలోచన బాగుంది.
వ్యాసంలోని ఒకటి రెండు ప్రస్తావనల గురించి నేనెరిగిన విషయాలు :
1. తిరుక్కురళ్ రచయిత అసలు పేరేమిటో తెలియదు. వళ్ళువర్ అన్న కులనామంతోనే ఆ రచయితను పిలిచారన్నదే ప్రస్తుతం అందరూ అంగీకరిస్తున్న వాదం.
2. తెలుగులో 19వ శతాబ్దం ఉత్తరార్థంలో వచ్చిన అనువాదమే మొదటిది అనడం కూడా చర్చనీయాంశమే. ఫాదర్ బెస్సి అనే ఇటాలియన్ మిషనరీ 1742 లో కురళ్ ను లాటిన్లోకి అనువదించాడు. (సాహిత్య అకాడెమీ వారి మోనోగ్రాఫ్ నుండి). The Kural of Thiruvalluvar – Translation by W.H. Drew అన్నద్ 1840లో ప్రచురితమైంది. డాక్టర్ గ్రాల్ 1854 లో జర్మను భాషలోనికి అనువదించాడు. జి. యు. పోప్ అనువాదం కూడా 1886 లో ముద్రితమైంది.
3. కామవేదం అన్నమాట ఎందుకో నాకు సరియైందని అనిపించడం లేదు. చదివిన వారు అది వాత్సాయనుని కామశాస్త్రం వంటిదని పొరబడే అవకాశం ఉంది. (ప్రేమవేదం అనొచ్చేమో బహుశ 🙂 ).
కామత్తుపాల్ నుండి ఒక కురళ్ ను ఉదహరించాలనిపిస్తోంది.
“అవర్ నెంజు అవర్కాదల్ కండుం ఎవన్ నెంజే
నీ ఎమక్కు ఆగా దదు.”
నాయిక తన హృదయాన్ని ఉద్దేశించి అంటోంది – అతని హృదయం మాత్రం అతను చెప్పినట్లు విని అతడినే అంటిపెట్టుకొని ఉంది. మరి నువ్వు మాత్రం నామాట వినక నన్నొదిలి అతడి దగ్గరకు వెళ్ళిపోతావెందుకు?
తిరుక్కురళ్ గురించి నేను చదివిన తెలుగు వ్యాసాల్లో అత్యుత్తమమైనది ఇదే అని చెప్పగలను.
వ్యాసం బాగుందండీ.
నిన్న ఈనాడులో బెంగళూరు నాగరత్నమ్మ గారిపై వచ్చిన పుస్తకం గురించి చదివాక, ఈవిడెవరో, ఏమిటో అన్న కుతూహలం కలిగింది. పరుచూరి శ్రీనివాస్ గారు రచ్చబండకి పంపిన మెయిల్ పుణ్యమా అని…ఈ వ్యాసాన్ని చేరి, ఆ సందేహ నివృత్తి చేసుకున్నాను. పైన రాజేంద్ర గారు అన్నట్లు – ఇలాంటి మరిన్ని వ్యాసాలు మీ అంత వివరంగా ఎవరన్నా రాస్తే, చదివి, కొత్త విషయాలు తెలుసుకోగలను అని ఆశిస్తున్నాను 🙂
అన్నట్లు, మీరు ఇక్కడ ఇచ్చిన ఎంపీ3 లంకె పని చేయడం లేదు!
కళాపూర్ణోదయం 1910 నాటి ప్రతిని ఇలా అందరికీ అందుబాటు లోనికి తెచ్చినందుకు రామరావు గారూ మిమ్మల్ని మనసా అభినందిస్తున్నాను. ఈ ప్రబంధాన్ని మీ వచనంలో తిరిగీ [ఆ అసలుకధని ఇవాళ్టి తరాల వారిని దృష్టిలో పెట్టుకుని] చెప్పడం కూడా బాగుంది.అది వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కూడాను. అయితే.. సూరనగారి పద్యాలలో ఉండే విశేషాలని కూడా ఆయా సందర్భాలలోనైనా మీరు చేర్చి ఉండి ఉంటే ఉత్తరోత్తరా ఈ కుర్ర తరాలకి చందస్సు మీదా..అలాగే తెలుగు పద్యాల మీదా కూడా రుచి పుట్టే వీలుండేదేమో కదా అని నాకు అన్పించింది. మీకు కుదిరితే అలాంటి కొన్ని చోట్ల అయినా పింగళి సూరన గారి పద్యరచనా విశేషాలని మీ వచనానువాదంలో సైతం జతచేయడానికి ప్రయత్నించవచ్చునేమో ఆలోచించగలరు. నేను మీ వచనాను వాదాన్ని చదవకుండా చెప్తున్న మాట ఇది. ఒకవేళ ఆ పనిని మీరు గనక మీ అనువాదంలో ఈ సరికే చేసిఉండిఉంటే నా సూచనని పక్కన పడేయవచ్చును. మరోసారి మీకుఅభినందనలు తెలియజేస్తూ.. ఈమాటని కూడా[ ఇలాంటి సాహిత్యకృషిని ప్రోత్సహిస్తున్నందుకు] మెచ్చుకుంటూ…
కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి maachiraaju saavitri గారి అభిప్రాయం:
11/01/2010 9:00 am
శీర్షిక బావుందిగానీ, పాతకథలనే ఎన్నుకోవాలనే సూచనే బాగాలేదు. 1960, 1970 తర్వాత మంచి కథలే రాలేదని మీ అభిప్రాయమా? లేకపోతే ఆ తర్వాత వచ్చిన మంచి కథలన్నీ అందరికీ ఎరుకేనని మీ నమ్మకమా? నా ఉద్దేశంలో ఈ రెండు వాదాలూ సరైనవి కావు. ఆ మాటకొస్తే, సాహిత్యం మీద ఆసక్తి, ప్రవేశం ఉన్న వారికి పాత కాలపు గొప్ప కథలతోనే ఎక్కువ పరిచయం ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటారా? ఏళ్ళ తరబడీ వాటి గొప్పదనాన్ని గురించి వింటూంటాం కాబట్టి.
అయినా మీరడిగింది “గొప్ప”కథలని గురించి కాదు కదా? కేవలం “నచ్చిన” కథలని గురించి. అలాంటప్పుడు సమకాలీన కథలకు ప్రాముఖ్యతనిచ్చి, కొత్త కథలకూ, కొత్త రచయితలకూ గుర్తింపూ, ప్రోత్సాహమూ ఇవ్వటం మీ కర్తవ్యం కాదంటారా? గతాన్ని కీర్తించడం అందరూ, ఎల్లప్పుడూ చేసే పనే. వర్తమానాన్ని కూడా గౌరవించి, భవిష్యత్తుకి బాట చూపించటం “సాహితీ విలువలున్న” పత్రిక నడిపే సంపాదకుల బాధ్యత అనుకుంటాను.
కామవేదము: పరిచయం గురించి చంద్ర మోహన్ గారి అభిప్రాయం:
11/01/2010 8:11 am
తిరుక్కురళ్ కు చాలా మంచి పరిచయం ఇచ్చారు! ధన్యవాదాలు. ఇలా రెండు పాదాల ఉపజాతి పద్యాల్లో తిరుక్కురళ్ ను అనువదించ వచ్చన్న ఆలోచన బాగుంది.
వ్యాసంలోని ఒకటి రెండు ప్రస్తావనల గురించి నేనెరిగిన విషయాలు :
1. తిరుక్కురళ్ రచయిత అసలు పేరేమిటో తెలియదు. వళ్ళువర్ అన్న కులనామంతోనే ఆ రచయితను పిలిచారన్నదే ప్రస్తుతం అందరూ అంగీకరిస్తున్న వాదం.
2. తెలుగులో 19వ శతాబ్దం ఉత్తరార్థంలో వచ్చిన అనువాదమే మొదటిది అనడం కూడా చర్చనీయాంశమే. ఫాదర్ బెస్సి అనే ఇటాలియన్ మిషనరీ 1742 లో కురళ్ ను లాటిన్లోకి అనువదించాడు. (సాహిత్య అకాడెమీ వారి మోనోగ్రాఫ్ నుండి). The Kural of Thiruvalluvar – Translation by W.H. Drew అన్నద్ 1840లో ప్రచురితమైంది. డాక్టర్ గ్రాల్ 1854 లో జర్మను భాషలోనికి అనువదించాడు. జి. యు. పోప్ అనువాదం కూడా 1886 లో ముద్రితమైంది.
3. కామవేదం అన్నమాట ఎందుకో నాకు సరియైందని అనిపించడం లేదు. చదివిన వారు అది వాత్సాయనుని కామశాస్త్రం వంటిదని పొరబడే అవకాశం ఉంది. (ప్రేమవేదం అనొచ్చేమో బహుశ 🙂 ).
కామత్తుపాల్ నుండి ఒక కురళ్ ను ఉదహరించాలనిపిస్తోంది.
“అవర్ నెంజు అవర్కాదల్ కండుం ఎవన్ నెంజే
నీ ఎమక్కు ఆగా దదు.”
నాయిక తన హృదయాన్ని ఉద్దేశించి అంటోంది – అతని హృదయం మాత్రం అతను చెప్పినట్లు విని అతడినే అంటిపెట్టుకొని ఉంది. మరి నువ్వు మాత్రం నామాట వినక నన్నొదిలి అతడి దగ్గరకు వెళ్ళిపోతావెందుకు?
తిరుక్కురళ్ గురించి నేను చదివిన తెలుగు వ్యాసాల్లో అత్యుత్తమమైనది ఇదే అని చెప్పగలను.
నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి Sreekanth Reddy గారి అభిప్రాయం:
11/01/2010 1:46 am
..and here’s one site where these books can be ordered. This site seems to be a treasure trove of Telugu literature books (both old & new)
Sreekanth
ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి Aditya Bhagavan Dhulipala గారి అభిప్రాయం:
11/01/2010 1:22 am
ధన్యవాదములు!!
విద్యాసుందరి గురించి Sowmya గారి అభిప్రాయం:
10/31/2010 11:48 pm
వ్యాసం బాగుందండీ.
నిన్న ఈనాడులో బెంగళూరు నాగరత్నమ్మ గారిపై వచ్చిన పుస్తకం గురించి చదివాక, ఈవిడెవరో, ఏమిటో అన్న కుతూహలం కలిగింది. పరుచూరి శ్రీనివాస్ గారు రచ్చబండకి పంపిన మెయిల్ పుణ్యమా అని…ఈ వ్యాసాన్ని చేరి, ఆ సందేహ నివృత్తి చేసుకున్నాను. పైన రాజేంద్ర గారు అన్నట్లు – ఇలాంటి మరిన్ని వ్యాసాలు మీ అంత వివరంగా ఎవరన్నా రాస్తే, చదివి, కొత్త విషయాలు తెలుసుకోగలను అని ఆశిస్తున్నాను 🙂
అన్నట్లు, మీరు ఇక్కడ ఇచ్చిన ఎంపీ3 లంకె పని చేయడం లేదు!
నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి Sreekanth Reddy గారి అభిప్రాయం:
10/31/2010 12:51 am
Here’s an online version of Molla Ramayanam, I wish some one transliterated hard to comprehend words.
Sreekanth
మహామంగళప్రవచనము గురించి ijalab గారి అభిప్రాయం:
10/28/2010 3:11 pm
అద్భుతమ్ అద్భుతమ్ అద్భుతమ్ అద్భుతమ్ అద్భుతమ్ అద్భుతమ్ అద్భుతమ్ అద్భుతమ్ అద్భుతమ్
కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
10/28/2010 12:05 pm
కళాపూర్ణోదయం 1910 నాటి ప్రతిని ఇలా అందరికీ అందుబాటు లోనికి తెచ్చినందుకు రామరావు గారూ మిమ్మల్ని మనసా అభినందిస్తున్నాను. ఈ ప్రబంధాన్ని మీ వచనంలో తిరిగీ [ఆ అసలుకధని ఇవాళ్టి తరాల వారిని దృష్టిలో పెట్టుకుని] చెప్పడం కూడా బాగుంది.అది వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కూడాను. అయితే.. సూరనగారి పద్యాలలో ఉండే విశేషాలని కూడా ఆయా సందర్భాలలోనైనా మీరు చేర్చి ఉండి ఉంటే ఉత్తరోత్తరా ఈ కుర్ర తరాలకి చందస్సు మీదా..అలాగే తెలుగు పద్యాల మీదా కూడా రుచి పుట్టే వీలుండేదేమో కదా అని నాకు అన్పించింది. మీకు కుదిరితే అలాంటి కొన్ని చోట్ల అయినా పింగళి సూరన గారి పద్యరచనా విశేషాలని మీ వచనానువాదంలో సైతం జతచేయడానికి ప్రయత్నించవచ్చునేమో ఆలోచించగలరు. నేను మీ వచనాను వాదాన్ని చదవకుండా చెప్తున్న మాట ఇది. ఒకవేళ ఆ పనిని మీరు గనక మీ అనువాదంలో ఈ సరికే చేసిఉండిఉంటే నా సూచనని పక్కన పడేయవచ్చును. మరోసారి మీకుఅభినందనలు తెలియజేస్తూ.. ఈమాటని కూడా[ ఇలాంటి సాహిత్యకృషిని ప్రోత్సహిస్తున్నందుకు] మెచ్చుకుంటూ…
రమ.
కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
10/27/2010 2:08 pm
కళాపూర్ణోదయం మూలం చదవదల్చుకున్నవారు ఇక్కడి నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
ప్రేమ కవితలు గురించి ak eswar గారి అభిప్రాయం:
10/27/2010 8:41 am
చాల బాగున్నయి.