Comment navigation


15826

« 1 ... 1110 1111 1112 1113 1114 ... 1583 »

  1. బందీ గురించి chandra గారి అభిప్రాయం:

    10/11/2010 11:16 pm

    నారాయణ గారు,

    అద్భుతం అండీ.చాలా బావుంది అంటే తక్కువేమో…ఎంత సరళమైన పదాలు ఎన్ని భావాలు..ఎన్ని సార్లు చదివానో ఇప్పటికే..మీ ఇతర రచనలు నాకు పంపించండి దయచేసి నేను CATS లో మీకు నా id ఇచ్చానండి..ధన్యవాదాలు

  2. తోడు గురించి JR.Nagabhusanam గారి అభిప్రాయం:

    10/09/2010 12:34 am

    కధ చివరి వరకూ చదివేదాకా భయపడుతూనేవున్నాను శారద, రామారావుని ఎక్కడ పెళ్ళి చేసుకుంటుందోనని. ఆసాంతం చదివాక వీళ్ళకి పెళ్ళి జరగలేదని హాయిగా వుంది. ఆశ్చర్యం ఏమిటంటే, పెద్దవాళ్ళకి పెళ్ళంటూ జరిగుంటే వరసలు మారిపోయేవి అని ఈ కధలో ఏ పాత్రా అనుకోకపోవడమే! అమెరికాలో ఉంటే మాత్రం ఇలాంటివి కూడా అభ్యుదయ ముసుగు వేసుకుంటాయా? కధని నడిపించే విధానంలో కూడా కొన్ని తప్పులున్నాయి. రెండు మాటలు మాట్లాడగానే వనజకి శారద లోతైన మనిషి లాగా కనిపిస్తుంది. అమ్మ యాక్సిడెంటులో చనిపోయిన సంగతి చిన్నపిల్లలకి చెప్పకూడదు (షాక్ అవుతారని కావొచ్చు), పెద్దయ్యాక కూడా దాచడమెందుకు? – భూషణ్

  3. నేను పులిని గురించి nageswara rao గారి అభిప్రాయం:

    10/08/2010 7:00 am

    చాలా బాగు0ది

  4. కొండ నుంచి కడలి దాకా గురించి Agnaath గారి అభిప్రాయం:

    10/08/2010 6:36 am

    నమస్కారం.
    “(నెట్‌లో stream అవుతున్న శబ్దతరంగాల్ని grab చేసే ప్రోగ్రాములున్నాయని విన్నాను. వాడటం తప్పేమో. నేను ప్రోత్సహించను గానీ ఇది ఎవరికివారు నిర్ణయించుకోవాల్సిన విషయం.) ”
    -మొదట ఇది చదవగానే, తేదీ చూస్కోకుండా…పాత వ్యాసం అనుకున్నాను. నిజం చెప్పాలంటే: ఏ సాఫ్ట్వేరూ వాడకుండానే, కేవలం హెచ్టీఎమ్మెల్ కోడు చూసి కూడా ఈ ఫైళ్ళు దిగుమతి చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ కాపీరైట్ల విషయం: నాకు అవగాహన లేదు కానీ, ఇవన్నీ మీరు ఆన్లైన్ లో పెట్టేశాక అవాయిడ్ చేయగలరు అంటారా? ఒకరు కాకపోతే ఒకరు – ఎవరో ఒకరు డౌన్లోడ్ చేస్కోరూ?

    ఏదేమైనా, మంచి ఆడియో అందించారు…దానికి వేల ధన్యవాదాలు….

  5. ప్రేమ కవితలు గురించి lalitha గారి అభిప్రాయం:

    10/08/2010 5:17 am

    simply super sir mi kavita

  6. దీపఖేల గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    10/07/2010 6:11 pm

    దీపఖేల కాదిది రాగహేల! చాలా బావుంది.
    పేరి పద్మావతి గారు చాలా బాగా పాడారు.
    స్వర రచనకీ, స్వరకల్పనకీ తేడా తెలియలేదు. స్వరరచన చేసిన వారే సంగీత వరుస ఇచ్చారనుకుంటే, మరి స్వరకల్పన ఏమిటి? సాధారణంగా కచేరీల్లో పాడేవారు కృతి చివర్లో ఆశువుగా స్వరాలు కట్టడాన్ని స్వరకల్పన అంటారు కదా? అలా చూస్తే, ఈ పాట చివర్లో అవి కనిపించలేదు. ఎవరైనా వివరిస్తే బావుంటుంది.

  7. తడి గురించి sateesh గారి అభిప్రాయం:

    10/07/2010 2:06 pm

    చాలా బాగుంది.

  8. భవబంధాల సాక్షిగా… గురించి Aditya Bhagavan Dhulipala గారి అభిప్రాయం:

    10/07/2010 9:03 am

    “నా గది లోపల చీకటిలో!
    చీకటి లోపల నా గదిలో!!” అన్న శ్రీ శ్రీ గారి మాటలు గుర్తు వచ్చాయి. Well composed!
    ఆదిత్య భగవాన్ ధూళిపాళ

  9. దీపఖేల గురించి కర్లపాలెం హనుమంత రావు గారి అభిప్రాయం:

    10/06/2010 6:14 pm

    Excellent! ఐ సింప్లీ లవ్డ్ ఇట్!

  10. రచయితలకు సూచనలు గురించి కర్లపాలెం హనుమంత రావు గారి అభిప్రాయం:

    10/06/2010 5:29 pm

    ఈ మాట ఇప్పుడే చూస్తున్నాను.లే అవుట్ చూస్తే మంచి నాణ్యత కనపడుతుంది. చదివి నా స్పందన తెలియచేస్తాను .

« 1 ... 1110 1111 1112 1113 1114 ... 1583 »