మంచి శీర్షిక. కాపీరైటు పేచీలు లేకుండా ఉండాలని కాబోలు పాత కథలను ఎన్నుకోమని సలహా ఇచ్చారు. నాకో యోచన తట్టింది. అదేమంటే, మన ఈమాటలోని కథలనే ఎందుకు ఎన్నుకోరాదు అని. కథ పునర్ముద్రణ కూడా అనవసరం, అది ఇక్కడే దొరుకుతుంది. రచయితలకు కూడా ప్రోత్సాహదాయకముగా ఉంటుంది. విధేయుడు – మోహన
సావిత్రి గారు లెస్స పలికారు. ఆ పాత గొప్ప పేర్లు మాకెలాగూ తెలుసు. ఇప్పటికీ నా బోంట్లం ఎవరి కథలు చదవాలీ అని ఎవరైనా అడిగితే ఇంకా ఆ పేర్లే చెప్తున్నాం. రాను రాను నా చదువు తగ్గటం ఒక సమస్య అయితే ఎంచేతనో ఓ మాదిరి కథ అయినా అప్పటిదే గుర్తుండి పోవడం, ఇవ్వాళే చదివిని గొప్ప కథ అయినా రెండ్రోజుల్లో మర్చే పోవడం రెండో కారణం. కొత్తగా వస్తున్న కథల్లో మంచి కథల్ని ఎంచటమే మరింత మంచిదని నా అభిప్రాయం. పోనీ మధ్యే మార్గంగా అసలు ఆ పాత కాలానికి ఉన్న ప్రాధాన్యత తీసేసి, రాసిన వ్యాసంలోని నాణ్యతని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోగలరేమో చూడండి. ఏ రకంగా అయినా, చక్కటి శీర్షిక అవుతుందని చెప్పడంలో నాకు సందేహం లేదు.
ఇతరులకు – ఆకాశవాణి వారి ఇతర నాటికలు, రూపకాలు, పరిచయ కార్యక్రమాలు, ఇష్టాగోష్టులు, ప్రత్యేక భక్తిరంజని కార్యక్రమాలు, శ్రోతలతో ముఖాముఖీలు, ఇక్కడ చూడవచ్చు. ఇక్కడికెళ్లాక పరిచయాలు – నాటికలు సెక్షను నొక్కండి… వినండి…
నాదేమీ లేదని – ఒకవేళ చప్పట్లు కొట్టాలనుకుంటే – గత ఆరు నెలలుగా ఆడియోలు అందించిన వారికే కొట్టండి అని తెలియచేస్కుంటూ… 🙂
శివధనుర్భంగ ఘట్టం లో ఇలాంటి ఉపమానాలతోనే సత్యనారాయణగారు కూడా తన కల్పవృక్షంలో రాముని ధనుష్టంకారాన్ని గురించి చాలా హడావుడి చేస్తారు. అయితే ఇక్కడ మొదటి కల్పన మరి, మల్లిఖార్జున భట్టుగారిదన్నమాట!! బాగుంది.
అయ్యా !! దేశికాచార్యుల వారూ !! మీ పద్యాలంటే ఇష్టం నాకు.వాటిల్లోని ధార బాగుంటుంది. పద్యానికి ప్రాణవంతమైన లక్షణం కదా అది.”” పర్వతము శాశ్వతం బట్లె వాహినియును”” అన్నారు మీరు. అవునా ?? అయితే ఎంత బాగుండునూ?? కవులం గనక అలా అనుకుంటాం కాబోలు మనం !! .కానీ అదేమిటో మా విశాఖపట్నంలో కొండల్ని తవ్వేస్తున్నారు మట్టి కోసం. మా తెలంగాణంలో లక్షల ఏళ్ళనాటి రాళ్ళగుట్టల్నీ మాయం చేసేస్తునారు. మా దేశంలో అన్ని చిన్నాచితకా నదుల్నీ ఇసక కోసమ్ తోడేస్తున్నారు. మరి మనం ఇంకిపోతున్న ఆ నదుల గురించీ.. పడక అలా ఆగిపోయిన జలప్రపాతాల గురించీ.. నానాటికీ తరిగిపోతున్న ఆ వేల ఏళ్ళ నాటి ఘనమైన రాళ్ళ గుట్టల గురించీ.. కనుమరుగైపోతోన్న ఆ మహా పర్వతాల గురించీ కూడా ముఖ్యంగా పాడాల్సి ఉంది కదా ఇవాళ?! .మీది మంచి పద్యం కదా అని మెచ్చుకునే ధైర్యం కూడా లేని ఈ రోజుల్లో ఏం చెయ్యమంటారూ?? వీటిగురించి కూడా ఇక్కడ గుర్తుచేయక తప్పింది కాదు.
కోనసీమ కథలు: న్యాయవాదం గురించి seenu గారి అభిప్రాయం:
11/01/2010 11:08 pm
చాలా మంచి ప్రయత్నం … భాష వంశీ గారి తరహాలో( మా పసలపూడి కథలు) ఉంది
కోనసీమ కథలు: న్యాయవాదం గురించి శారద గారి అభిప్రాయం:
11/01/2010 9:31 pm
చాలా బాగుందండీ ఈ కథ. న్యాయ వాదం, కోర్టులూ లాటి వాటితో నాకే మాత్రమూ పరిచయం లేకపోవటంతో చాలా ఇంటెరెస్టింగ్ గా అనిపించింది.
శారద
జలప్రపాతము గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:
11/01/2010 4:01 pm
అందముగ జారె జలపాత మవని పైన
కొండ పైనుంచి గాంచెనొ గూర్చె గవిత
చారు రశ్ముల సుత్రామ చాప మొప్ప
తీర్చె మెఱుగులు తిరుమల దేశికుండు
తిరుమల దేశికాచార్యుల వారి కవితయె ఒక జలపాతము. ఇంద్రధనస్సు ఆయన కుంచె.అందముగా చిత్రించారు.ఆయనకు నమస్కృతులు.
కోనసీమ కథలు: న్యాయవాదం గురించి K.VARA LAKSHMI గారి అభిప్రాయం:
11/01/2010 2:27 pm
బ్రహ్మానందం గారూ!
కోనసీమ కథల కోసం నెలనెలా ఎదురు చూసేలా చేసేంత బావుంది మీ ‘న్యాయవాదం ‘.
మన కోనసీమ జీవితాల్ని ఇంకెన్ని కోణాల్లో చిత్రిస్తారో చూడాలి. కీపిటప్-
-కె. వరలక్ష్మి
కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి mOhana గారి అభిప్రాయం:
11/01/2010 2:23 pm
మంచి శీర్షిక. కాపీరైటు పేచీలు లేకుండా ఉండాలని కాబోలు పాత కథలను ఎన్నుకోమని సలహా ఇచ్చారు. నాకో యోచన తట్టింది. అదేమంటే, మన ఈమాటలోని కథలనే ఎందుకు ఎన్నుకోరాదు అని. కథ పునర్ముద్రణ కూడా అనవసరం, అది ఇక్కడే దొరుకుతుంది. రచయితలకు కూడా ప్రోత్సాహదాయకముగా ఉంటుంది. విధేయుడు – మోహన
కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి Akkiraju Bhattiprolu గారి అభిప్రాయం:
11/01/2010 1:35 pm
సావిత్రి గారు లెస్స పలికారు. ఆ పాత గొప్ప పేర్లు మాకెలాగూ తెలుసు. ఇప్పటికీ నా బోంట్లం ఎవరి కథలు చదవాలీ అని ఎవరైనా అడిగితే ఇంకా ఆ పేర్లే చెప్తున్నాం. రాను రాను నా చదువు తగ్గటం ఒక సమస్య అయితే ఎంచేతనో ఓ మాదిరి కథ అయినా అప్పటిదే గుర్తుండి పోవడం, ఇవ్వాళే చదివిని గొప్ప కథ అయినా రెండ్రోజుల్లో మర్చే పోవడం రెండో కారణం. కొత్తగా వస్తున్న కథల్లో మంచి కథల్ని ఎంచటమే మరింత మంచిదని నా అభిప్రాయం. పోనీ మధ్యే మార్గంగా అసలు ఆ పాత కాలానికి ఉన్న ప్రాధాన్యత తీసేసి, రాసిన వ్యాసంలోని నాణ్యతని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోగలరేమో చూడండి. ఏ రకంగా అయినా, చక్కటి శీర్షిక అవుతుందని చెప్పడంలో నాకు సందేహం లేదు.
– అక్కిరాజు
నాటికి నేడు – రేడియో నాటిక గురించి వంశీ గారి అభిప్రాయం:
11/01/2010 12:36 pm
శ్రీనివాస్ గారూ ధన్యవాదాలు.
ఇతరులకు – ఆకాశవాణి వారి ఇతర నాటికలు, రూపకాలు, పరిచయ కార్యక్రమాలు, ఇష్టాగోష్టులు, ప్రత్యేక భక్తిరంజని కార్యక్రమాలు, శ్రోతలతో ముఖాముఖీలు, ఇక్కడ చూడవచ్చు. ఇక్కడికెళ్లాక పరిచయాలు – నాటికలు సెక్షను నొక్కండి… వినండి…
నాదేమీ లేదని – ఒకవేళ చప్పట్లు కొట్టాలనుకుంటే – గత ఆరు నెలలుగా ఆడియోలు అందించిన వారికే కొట్టండి అని తెలియచేస్కుంటూ… 🙂
భవదీయుడు
వంశీ
కోనసీమ కథలు: న్యాయవాదం గురించి jayaprabha గారి అభిప్రాయం:
11/01/2010 11:04 am
గొర్తి బ్రహ్మనందగారూ !! మీ కధ బాగుంది. మనసుకు గుచ్చుకుంది. మరిన్ని మంచి కధలు రాయండి.
జయప్రభ.
నాకు నచ్చిన పద్యం: శ్రీరామ ధనుష్టంకారం గురించి jayaprabha గారి అభిప్రాయం:
11/01/2010 10:46 am
శివధనుర్భంగ ఘట్టం లో ఇలాంటి ఉపమానాలతోనే సత్యనారాయణగారు కూడా తన కల్పవృక్షంలో రాముని ధనుష్టంకారాన్ని గురించి చాలా హడావుడి చేస్తారు. అయితే ఇక్కడ మొదటి కల్పన మరి, మల్లిఖార్జున భట్టుగారిదన్నమాట!! బాగుంది.
జయప్రభ.
జలప్రపాతము గురించి jayaprabha గారి అభిప్రాయం:
11/01/2010 10:18 am

జయప్రభ