Comment navigation


15826

« 1 ... 1105 1106 1107 1108 1109 ... 1583 »

  1. మొలక గురించి Geddapu Lakshmi Prasad గారి అభిప్రాయం:

    11/03/2010 9:34 am

    తన్మయత్వం (తత్ + మయత్వం) రెండు వైపులా పదునున్న ఒక కత్తి. ఎవరితో లేదా దేనితో మనం తన్మయత్వం చెదుతామో తదనుగుణమైన అనుభూతినీ ఫలితాన్ని పొందుతాము. ఉపాసనా విధానాలు ఈ సూత్రం ఆధారంగానే రూపుదిద్దుకున్నాయి. పసిపాపతో తన్మయత్వం చెందడం వల్ల “పెద్దతనాన్ని అలుపెరగనీయకుండా వేధించిన ఆలోచనలన్నీ ఆవిరైపోతాయి”. ఉపాసన వల్ల కలిగిన తన్మయత్వం ప్రభావం అది. దీన్ని మీరు బాగా ఆవిష్కరిచారు. శుభమ్ భూయాత్.

  2. రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి chakirevu upendra గారి అభిప్రాయం:

    11/03/2010 7:52 am

    హస్తబల్ అన్నది ” stable ” అన్న ఇంగ్లీషు మాట నించి
    వచ్చి ఉండాలి.. ఏనుగుల శాల లేక గుర్రాల శాల ని అస్తబల్ అంటారు. విజయనగరం లో కోట పక్కన ఏనుగుల శాల ని హస్తబల్ అంటారు. చాలా ఊళ్లలో అస్తబల్ లేక హస్తబల్ అన్న పేరుతో ఏదో ఒక చోటు ఉంటుంది. మూలం పెర్షియన్ లోనో అరబిక్ ఉంటుందేమో తెలియదు.
    ఉ.

  3. విన్నకోట రవిశంకర్ ‘రెండోపాత్ర’: ఒక పరిచయం గురించి Rakesh గారి అభిప్రాయం:

    11/03/2010 5:46 am

    నాకు అత్యంతప్రీతికరమైన కవి, శ్రీ విన్నకోట రవిశంకర్!
    ఆయన కవిత్వంలోని గాఢతా, ఆర్ద్రతా గురించి నాలాంటి అభిమానులు ఎంత రాసినా – అది తక్కువే…..

  4. రచయితలకు సూచనలు గురించి Santosh Karteek గారి అభిప్రాయం:

    11/03/2010 5:43 am

    ఈమాట .com చూశాను.
    చాలా ఆనందంగా వున్నది.

  5. జీనో పేరడాక్సు గురించి narEn గారి అభిప్రాయం:

    11/02/2010 8:57 pm

    నిజమైన కవి తత్వాన్ని కూడా తనకు ఆసరాగా తీసుకుని లోకాన్ని చుట్టుముట్టి వస్తాడు. జీనో కవిలాంటి
    తత్వవేత్త. డిస్క్రీట్ ప్రయాణాలు అనంతము అనడానికి ఎంత స్ప్రుహ కావాలి? బిల్లీకాలిన్స్ తత్వాన్ని జీర్ణిచు కున్న కవి. ఇంత మంచి కవితని తలకెత్తుకుని మంచి పని చేశారు. సమకాలీనమే కాదు, జీవితము మీద, విశ్వం మీద గతిజ స్తితిజ శక్తుల ప్రమేయమున్నంత వరకూ ఈ కవిత అప్లై అవుతూనే ఉంటుంది.

  6. నా అందం ఏమయింది? గురించి Giri గారి అభిప్రాయం:

    11/02/2010 7:31 pm

    Beautiful!

  7. నా అందం ఏమయింది? గురించి Bhavani గారి అభిప్రాయం:

    11/02/2010 3:47 pm

    చాలా బాగుంది. అందం, ఆనందం ఎప్పుడూ ఒకచోట వుండవు.

  8. నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు : ఒక స్పందన గురించి గంటి లక్ష్మీ నరసింహమూర్తి గారి అభిప్రాయం:

    11/02/2010 1:58 pm

    ఎంకి్ పాటలు పై డా.కె.శ్రీనినాస శాస్త్రి గారి స్పందన అత్యంత రమణీయంగా సాగింది.మా నాన్నగారు కీ.శే.పండిత గంటి సూర్యనారాయణ శాస్త్రి గారు,శృంగార శాస్త్రి గా కూడా ప్రసిద్దులు, మొదటిసారిగా ఎంకి పాటలు అచ్చు వేసి అచ్చతెలుగు జాణ తనానికి ఆక్షక రూపం గల్పించేరు.పంచాగ్నుల వారు మా నాన్నగారు నడిపిన “కల్యాణి” మాస పత్రికలో పని చేసేవారు.నండూరి వారు, మా నాన్నగారు కారులో వెళుతున్పప్పుడు సుబ్బారావుగారు ఎంకి పాటలు వినిపించేవారు. కొత్తదనం ప్రోత్సహించే మానాన్నగారు వెంటనే ముద్రించారు. తరువాత విశాలాంధ్ర వారు ముద్రించారు. ఈ మాటలు రాయడానికి అవకాశమిచ్చిన “ఈమాట” వారికి, ఇంత మంచి విశ్లేషణ నందించిన శాస్త్రి గారికి నా ధన్యవాదాలు.-మూర్తి

  9. రచయితలకు సూచనలు గురించి కందర్ప కృష్ణ మోహన్ గారి అభిప్రాయం:

    11/02/2010 12:50 pm

    ఈ మాటకు నమస్సులు
    రచనలు పంపవలసిన ఈ మెయిల్ అడ్రస్ కనిపించట్లేదు
    దయచేసి తెలుపగలరు

    కందర్ప కృష్ణ మోహన్

    (submissions (AT) eemaata.com, పై వ్యాసంలో రచనలు పంపే పద్ధతి హెడ్డింగ్ కింది మొదటి బులెట్, మొదటి లైన్ చూడండి. – సం.)

  10. కోనసీమ కథలు: న్యాయవాదం గురించి mOhana గారి అభిప్రాయం:

    11/02/2010 11:02 am

    బ్రహ్మానందం గారూ, మంచి కథ, ఇతివృత్తము. అయితే ముగింపు ఎందుకో నన్ను ఆకర్షించలేదు. వాళ్లు చంపబడకుండా ఉండి ఉంటే బాగుండేది. మీ ముగింపులో జీవితంలో ఆశపైన నమ్మకం పోయింది. కోర్టులపైన, న్యాయంపైన, నిజాయితీపైన కూడా నమ్మకం పోయింది. మరెందుకు జీవించాలి అనే భావం కలుగుతుంది చివరకు. నిరాశతో, విధేయుడు – మోహన

« 1 ... 1105 1106 1107 1108 1109 ... 1583 »