Comment navigation


15826

« 1 ... 1103 1104 1105 1106 1107 ... 1583 »

  1. కవిత్వీకరణ కొన్ని సంగతులు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/08/2010 7:19 pm

    ” పద్యం ఎత్తుగడ ముగింపూ ..” వంటివాటి గురించి..పద్యం రాసినప్పటి లేదా చదివినప్పటి కూడా “మానసిక వాతావరణాన్ని గురించి మాట్లాడుకోవడానికీ ఆ పద్యంలోని రాయబడ్డ వస్తువుకీ అందులోని “వాదానికీ”..ఏమీ సంబంధం ఉండనఖ్ఖరలేదు. బాగున్న ఏ పద్యాన్ని గురించైనా కూడా దాని ఎత్తుగడ ముగింపూ ఇతర వాతావరణాన్ని గురించీ అంతే స్పస్టం గా మాట్లాడుకోవచ్చును. వస్తువు ఒక అంశం మాత్రమే!! పోనీ వాదం వగైరాలు. అవేవైనా. కదా!!

    రవిశంకర్ గారికి వాదాలని గురించీ లేదా అవి వచన కవిత్వానికీ దాని రూప సారాలకీ చేసిన మేలూ..కీడులని గురించీ నిర్దిష్ట మైన అభిప్రాయాలు గనక ఉంటే వాటిని గురించి కూడా ఈ వ్యాసంలో చర్చకి పెట్టి ఉంటే బాగుండేది. కానీ ఆయన వాటి జోలికి పోకుండా కొన్ని పొడిపొడి మాటలు మాత్రమే అని ఊరుకున్నారు..ఏలనో??

    ఆయన ఒక కవిగా మాట్లాడేరో లేక పాఠకునిగా మాట్లాడేరో…విమర్శకునిగా ముందుకొచ్చి .. ఈ అభిప్రాయాలు చెప్పేరో నాకు అర్ధం కాలేదు. ఆయనలో ఈ పాత్రలు అన్నీ కలగాపులగం అయిపోయినట్టుగా నాకు దృశ్యమానం అయింది మరి.

    ఆయన చేసిన ఒక సూచన మాత్రమ్ నాకు చాలా నచ్చింది.ఎవరైనా ఒక కవి తాను ఒక కవితా దృశ్యాన్ని ఆవిష్కరింప పూనుకున్నప్పుడు ఏయే మానసిక స్థితులకి లోనవగలిగిందీ చెప్పాలని అనడం!! అది సాధ్యమేనని ఆయన భావించినట్టుగా ఈ వ్యాసంలో సుస్పస్టం అయింది గనుక ఆ ప్రయత్నానికి కూడా ఆయనే శ్రీకారం చుట్టడం బాగుంటుంది . కవిగా ఒక కవిత రాసే ముందూ..రాస్తున్నప్పుడూ..రాయడం పూర్తయిన తర్వాత తన మానసిక విశ్లేషణ ని ఆయన చేయగలరని నేను ఎంతో కుతూహలంగా ఉన్నాను ఒక పాఠకురాలిగా చదివేందుకు సిధ్ధంగానూ ఉన్నాను.
    రమ.

  2. నాకు నచ్చిన పద్యం: శ్రీరామ ధనుష్టంకారం గురించి నరసింహారావు మల్లిన గారి అభిప్రాయం:

    11/08/2010 11:59 am

    విశ్వనాథ వారి సీతాకల్యాణం ఘట్టం లోని పద్యాలకోసం ఈ లింకు చూడగలరు.

  3. మొలక గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    11/07/2010 3:47 pm

    చాలా బాగుంది…

  4. నా అందం ఏమయింది? గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    11/07/2010 3:44 pm

    చాల చక్కగా ఉందండీ…

  5. నా అందం ఏమయింది? గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/06/2010 4:05 pm

    మీ కవిత చాలా నిజాయితీగా చాలా స్వచ్చంగా ఉంది. భావ ప్రకటన చాలా సున్నితముగానూ ఆలోచనా యుక్తముగానూ ఉంది. మనస్సు స్పందించింది.

  6. దుప్పట్లో ముడుక్కున్నా గురించి sivasankar గారి అభిప్రాయం:

    11/06/2010 3:46 pm

    అర్ధవంతముగా ఏమీ అనిపించడము లేదు. మీరు మనసులో అనుకున్నవి స్పష్టముగా తెలియపరచలేకున్నా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది.

  7. షష్ఠ్యంతములు గురించి mOhna గారి అభిప్రాయం:

    11/06/2010 3:00 pm

    నాదెళ్ల పురుషోత్తమకవి ఒక చిత్రకవి. వీరు తమ అద్భుతోత్తరరామాయణ కావ్యములోని ఐదు షష్ట్యంతములను ఉత్సాహవృత్తములో వ్రాసారు. అందులో ఒకటి –
    నిత్య నిర్వికల్ప విష్ణు నిర్గుణస్వరూపికిన్
    సత్య మోద చిత్ప్రకాశ సత్వ దృక్కలాపికిన్
    స్తుత్యమాన రూప వేద్య సుందరాంగజారికిన్
    దైత్య ఖండన ప్రశస్త దారుణాస్త్రధారికిన్

    విధేయుడు – మోహన

  8. కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి hareesh గారి అభిప్రాయం:

    11/06/2010 10:25 am

    Katha Nachina Karanam :

    Naku Yandamoori garu 80 dashakallo vrasina “Tulasidalam” “Tulasi” kathalu chala nachai. EE perlu vinagane Kshudra Sahityam ani kani, idi english novel ki copy ani kani teesiparaste nenemi cheyalenanukondi. Yandamoori indulo hero, heroine gaka villain ni mariyu prati character ni glorify chesina vidhanam naku chala nachindi. Indulo prati kshanam utkantha kaligistu, kshudra sampradayani ki sambadinchina tantu gurinchi samacharam vivarinchina vidhanam chala bagundi. Tulasi talliga Sharada patra ento elevated ga chitreekarincharu yandamoori garu. Chetabadi valana Tulasi jabbu padinda leka post Hypnotic suggestions valanaa annadi samanthara sanghatanalato suspense ni srushtincharu. Ika rendo bhagamaina Tulasi lo, Darka ane patra chala manaveeyatanu pradarshistundi. Nagarikata nerchukoni, tana pratigna kuda marichipoyi manavatvanike pedda peeta vesi rushitulyudavudu Darka. Kshudra sahityam ani teesi parase vallu tappaka chadivi teeralsina pustakalu ivi. Naa uddheshyam prakaram, Ramayanam, Bharatam taravata, anni rasalu poshimpabadina navalalu ga veetini cheppukovachu. Prati patrani ento ouchichyavantam ga teerchi diddina ee pustakalu personality development ki chala upayoga padatayi.

    hareesh

  9. దుప్పట్లో ముడుక్కున్నా గురించి Apple Prasad గారి అభిప్రాయం:

    11/06/2010 2:31 am

    మీ ఆలోచనలని బాగా తెలియజేశారు.

  10. రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి chakirevu upendra గారి అభిప్రాయం:

    11/06/2010 2:02 am

    నాకు తెలిసి ఒక్క విజియనగరం లో మాత్రమే దీన్ని ‘హ’ స్తబల్ హాల్ అంటారు. మిగతా అన్నీ చోట్లా ‘అ’స్తబల్ అనే అంటారు.

    చక్రి గారు సరదాకి అంటున్నారనుకుంటాను. హస్తి అనే మాట కీ అస్తబల్ అన్న మాటకీ సంబంధం ఉందనుకోవటానికి నాకు ఆధారమేమీ కనపడటం లేదు. లాటిన్ – రోమన్ – జర్మన్ – ఫ్రెంచ్- స్పానిష్ -అరబిక్ భాషల నించి గుర్రపు రౌతుల ద్వారా దక్షిణ ఆసియా కి వచ్చిన మాట అయి ఉండాలి. విజియనగరానికి ఫ్రెంచ్ సైన్యం ద్వారా వచ్చి ఉండాలి.

    కథ లో మగ పెళ్ళి వాళ్ళు పొగరు బోతు తనం తో — ఎదుటి సైన్యం లోకి చొచ్చుకు వచ్చి రాజు కి పగ పెట్టారు. రాజుగారి బలగం అంతా చెలరేగే సరికి ఆట కట్టు అనుకుంటుండగా – రాణి గారు ఎదురు తిరిగి, ఎదుటి సైన్యాన్ని కకావికలం చేసి పారేయటమే కాక తమ వైపు రాజు గారిని కూడా బంటు కింద తీసి పారేశారు. ‘రాజు గోరి మాటకేటి’ అని దాసీ మనిషి చిట్టెమ్మే జబర్దస్తీగా అన గలిగిందంటే స్వపక్షంలోనే బలా బలాలు ఎంతగా మారి పోయాయో చూడండి. పోయింది మగ పెళ్ళి వారి పరువే కాదు. ఆడ పెళ్ళి వాళ్ళలో రాజు గారి మాట కూడా లెక్క లేకుండా పోయింది. కంగాళీ ఛట్రం లా కనపడినా, చివరి ఎత్తు మహా పసందుగా ఉండినందుకు సంతోషించ వచ్చా ? రెండు బంట్లు ఎక్కడో జారీ పోయినాయంటే ఆట మునపట్లా ఆడటానికి వీలవదు కాబట్టి చింతించుకుంటూ కూచోవాలా ? ఇదీ తాత గారి చదరంగం పెట్టె గొడవ.

    మనవడి దగ్గర కచ్చితమైన సమాధానం ఉండి ఉంటే మనకి ఇంత చక్కటి కథ చెప్ప గలిగి ఉండే వాడు కాదేమో.
    ఉ.

« 1 ... 1103 1104 1105 1106 1107 ... 1583 »