మంచి ప్రయత్నం. కాని పేరు నిరపేక్షంగా (impersonal గా) ఉంది. “నాకు నచ్చిన కథ” అంటే క్లుప్తంగా బాగుంటుంది. పాత కథలయినంత మాత్రాన అందరూ పదే పదే చెప్పే గొప్ప పేరున్న కథకులవే అయి ఉండాలని లేదు. పూసపాటి గారి గురించి ఎంతమందికి తెలుసు?
నచ్చిన కారణంతో కేవలం పరిచయం చేసేదిగా కాక, వ్యాసం కథకి వన్నె తెచ్చేదిగా ఉంటుందని ఆశిద్దాం. నేను కొన్నేళ్ళ క్రితం షాపులో చూసి వెంటనే కొన్న పుస్తకం, Touchstones [1] గుర్తొచ్చింది. ఈ కాలపు కవులు, బాగా పేరున్న వాళ్ళూ, అంతగా లేని వాళ్ళూ, ఒక్కొక్కరు తమకి నచ్చిన ఓ కవిత, వేరే వాళ్ళు రాసినది, పాతదైనా కొత్తదైనా, ఎందుకు నచ్చిందో రాశారు. కవితలే కాక వ్యాసాలు కూడా గుర్తుంచుకోదగ్గవి. పుస్తకం అంతా ఒక్క పట్టున చదవనవసరం లేదు.
ఇవాళ దాంట్లో Maxine Kumin వ్యాసం చదివాను. తన భుజాల్లో, వెన్నుపూసలో బాధ ఎందుకో కనుక్కోడానికి ఆవిడని డాక్టర్లు MRI scan కి పంపించారు. ఆ పరీక్ష చావుకి దరిదాపుల్లో ఉంటుంది. దాన్ని భరించడానికి తను కంఠస్థం చేసిన కవితలని గుర్తు తెచ్చుకున్నాననీ, వాటన్నిటిలోకీ బాగా పనికొచ్చినది AE Housman కవిత “XXVII,” అన్నది. “We are all mortal, but it is the poet who shivers most articulately under the thin blanket of mortality,” అని ముగించిన వ్యాసం, “Trochee, Trimeter, and the MRI,” నన్నాకట్టుకుంది. నేనూ ఒకసారి MRI తతంగం పాలయ్యాను, అప్పటికిది చదివుంటే బాగుండేది.
తెలుగులో Touchstones లాంటి పుస్తకాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Touchstones: American Poets on a Favorite Poem,” edited by Robert Pack and Jay Parini. Middlebury College Press, 1996.
ఈ సంచికలో వైదేహి కవిత .. ఉదయకళ కవిత కూడా వ్యక్తీకరణ లో వేరే తోవ అయినా…. థీమ్ లో ఇంచుమించుగా ఒకేలాంటి భయాన్ని తమ భావనల్లో తొణికిసలాడించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది.
వయసుజారిపోయే వేదన అనేది ఒకటి ఉంటుందని అది ఆడవాళ్ళకే ఉంటుందనీ అన్పించేలా సాగాయి ఈ కవితలు. మగవాళ్ళకి అవసరంలేని ఈ అభద్రత ఇలా ఈ కవయిత్రులకే ఎందుకో?? అమ్మాయిలూ అన్ని వయసుల్లోనూ అంతర్లీనంగా ఒక అందం ఉంటుందనీ..ఒక హుందాతనం ఉంటుందనీ మీరు నమ్మలేకపోవడం ఏం బాలేదు . నా అందం ఏమయ్యిందో అని ఇప్పుడే ఈ చిన్న వయసులోనే బేజారైపోతే ఇహ నడి వయసులోకి అడుగుపెట్టాకా మరింకేం విశ్వాసం ఉంటుందీ ఊహించడానికీ??
అంచేత ఇప్పట్నించే ఈ ముసలి మాటలు ఊహల్లోకి రానివ్వకండి. మీరింకా మంచిమంచి వయసు ఊహలు బోలెడన్ని చేయాల్సే ఉంది:)
రాలిపోయే ఆకుల్లా దొర్లిపోతుంటాయి రోజులు. కలశంలోని అమృతం ఆవిరై పోతే, చివరకు మిగిలేది కలశం మాత్రమేగదా! కానీ ఈ అమృతం మళ్లీ మరో పాత్రను అంచులదాకా నింపుతుంది. చాలా బావుంది మీ కవిత. – మోహన
‘నాటికి నేడు’ నాటిక ఎన్ని సార్లు విని ఉంటానో గుర్తులేదు. అంతిష్టం ఆ నాటికంటే నాకు. మహాలక్ష్మమ్మగా సీతారత్నంగారూ, నరుసుపంతులుగా కుటుంబరావుగారూ నువ్వా నేనా అనేలా పోటాపోటీగా నటించారనిపిస్తుంది. తర్వాత చిలకమర్తి ‘గణపతి’ నాటకంలో గణపతి తల్లిపాత్రలో ఇంకెంతో గొప్పగా క(వి)నిపించారు సీతారత్నంగారు.
పరుచూరి శ్రీనివాస్‌గారూ … వీలైతే శారదా శ్రీనివాసన్, జి.వి. సుబ్రహ్మణ్యం, సిద్దప్పనాయుడుగార్లు నటించిన ‘యామినీ పూర్ణతిలక’ను కూడా అందించే ప్రయత్నం చేయండి.
– గొరుసు
ఇప్పుడెందుకిలా? గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:
11/11/2010 1:09 pm
ఘాడమైన అనుభూతితో నిండిన భావ తీవ్రత ఉందీ కవితలో. నాకు నచ్చింది.
పద్యాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. “దిగంతర, దంతి కర్ణ రంధ్రాంతర, సాగరాంతర, ధరాభ్ర తలాంతర, చక్రవాళ శైలాంతర, సర్వ భూధర గుహోకుహరాంతర పూరితంబుగన్ అని అంతర, అంతర, అంతర అంటూ ఆ పదాలతో పాటు మనలని లాక్కునిపోయి, వింటినారి వింత శబ్దం పద్యంలోని ధారలో వినిపింపజేశాడు కవి.” అని ఒక్క వాక్యంలో చాలా బాగా చెప్పారు పద్యంలో ని రసాన్ని.
“అంతర అంతర” అని వినిపించే అంత్యానుప్రాస కొద్ది మార్పుతో “ఇంతై ఇంతయై” అయిపోతూ “ఇంతింతై వటుడింతయై మరుతానింతై నభోవీధిపైనంతై” ఎత్తుకుపోయిన పోతన పద్యాన్ని స్ఫురింపజేసింది.
రాముని వింటి శబ్దం ఈ పద్యంలో వినిపించింది. వింటి రూపం కడిమెళ్ళ వరప్రసాద్ గారి ఈ అవధాన పద్యంలో కనిపించింది.
“రామ భద్రుని విల్లొక ప్రణవమేమొ
వంగుచున్నది ధర్మము వైపునకును
శరము గురిపెట్టెనా ముక్తి వఱలు గాదె
అట్టి కోదండమునకునై ప్రాంజలింతు!”
============
విధేయుడు
-శ్రీనివాస్
I read this piece of poem with interest. The poet is holding the aspect of beauty in the words of others. What others comment is what THE aspect the nerrator is seeking.
It is a wonderful concept that a playful little girl is beautiful.
నా అక్షరాలు వెన్నెల్లో ఆదుకునే అందమైన ఆదపిల్లలు
said Sri Tilak.
Beauty lies in every facet of life; it is a pleasure seeking beauty.
It is a joy for ever.
The poetess/ poet is confused in perceiving and particular about recording anger towards man, in the process lost the path.
Change in figure, grey strands, spects, maturing attitude, wrinkles, dependence.. each stage has a beauty of its own, supported by life.
regards
కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/14/2010 1:30 am
మంచి ప్రయత్నం. కాని పేరు నిరపేక్షంగా (impersonal గా) ఉంది. “నాకు నచ్చిన కథ” అంటే క్లుప్తంగా బాగుంటుంది. పాత కథలయినంత మాత్రాన అందరూ పదే పదే చెప్పే గొప్ప పేరున్న కథకులవే అయి ఉండాలని లేదు. పూసపాటి గారి గురించి ఎంతమందికి తెలుసు?
నచ్చిన కారణంతో కేవలం పరిచయం చేసేదిగా కాక, వ్యాసం కథకి వన్నె తెచ్చేదిగా ఉంటుందని ఆశిద్దాం. నేను కొన్నేళ్ళ క్రితం షాపులో చూసి వెంటనే కొన్న పుస్తకం, Touchstones [1] గుర్తొచ్చింది. ఈ కాలపు కవులు, బాగా పేరున్న వాళ్ళూ, అంతగా లేని వాళ్ళూ, ఒక్కొక్కరు తమకి నచ్చిన ఓ కవిత, వేరే వాళ్ళు రాసినది, పాతదైనా కొత్తదైనా, ఎందుకు నచ్చిందో రాశారు. కవితలే కాక వ్యాసాలు కూడా గుర్తుంచుకోదగ్గవి. పుస్తకం అంతా ఒక్క పట్టున చదవనవసరం లేదు.
ఇవాళ దాంట్లో Maxine Kumin వ్యాసం చదివాను. తన భుజాల్లో, వెన్నుపూసలో బాధ ఎందుకో కనుక్కోడానికి ఆవిడని డాక్టర్లు MRI scan కి పంపించారు. ఆ పరీక్ష చావుకి దరిదాపుల్లో ఉంటుంది. దాన్ని భరించడానికి తను కంఠస్థం చేసిన కవితలని గుర్తు తెచ్చుకున్నాననీ, వాటన్నిటిలోకీ బాగా పనికొచ్చినది AE Housman కవిత “XXVII,” అన్నది. “We are all mortal, but it is the poet who shivers most articulately under the thin blanket of mortality,” అని ముగించిన వ్యాసం, “Trochee, Trimeter, and the MRI,” నన్నాకట్టుకుంది. నేనూ ఒకసారి MRI తతంగం పాలయ్యాను, అప్పటికిది చదివుంటే బాగుండేది.
తెలుగులో Touchstones లాంటి పుస్తకాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Touchstones: American Poets on a Favorite Poem,” edited by Robert Pack and Jay Parini. Middlebury College Press, 1996.
పరిశోషణం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/14/2010 12:04 am
జమిలిగా వైదేహీ ఉదయకళలకి,
ఈ సంచికలో వైదేహి కవిత .. ఉదయకళ కవిత కూడా వ్యక్తీకరణ లో వేరే తోవ అయినా…. థీమ్ లో ఇంచుమించుగా ఒకేలాంటి భయాన్ని తమ భావనల్లో తొణికిసలాడించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది.
వయసుజారిపోయే వేదన అనేది ఒకటి ఉంటుందని అది ఆడవాళ్ళకే ఉంటుందనీ అన్పించేలా సాగాయి ఈ కవితలు. మగవాళ్ళకి అవసరంలేని ఈ అభద్రత ఇలా ఈ కవయిత్రులకే ఎందుకో?? అమ్మాయిలూ అన్ని వయసుల్లోనూ అంతర్లీనంగా ఒక అందం ఉంటుందనీ..ఒక హుందాతనం ఉంటుందనీ మీరు నమ్మలేకపోవడం ఏం బాలేదు . నా అందం ఏమయ్యిందో అని ఇప్పుడే ఈ చిన్న వయసులోనే బేజారైపోతే ఇహ నడి వయసులోకి అడుగుపెట్టాకా మరింకేం విశ్వాసం ఉంటుందీ ఊహించడానికీ??
అంచేత ఇప్పట్నించే ఈ ముసలి మాటలు ఊహల్లోకి రానివ్వకండి. మీరింకా మంచిమంచి వయసు ఊహలు బోలెడన్ని చేయాల్సే ఉంది:)
రమ.
పరిశోషణం గురించి మోహన గారి అభిప్రాయం:
11/13/2010 9:20 pm
రాలిపోయే ఆకుల్లా దొర్లిపోతుంటాయి రోజులు. కలశంలోని అమృతం ఆవిరై పోతే, చివరకు మిగిలేది కలశం మాత్రమేగదా! కానీ ఈ అమృతం మళ్లీ మరో పాత్రను అంచులదాకా నింపుతుంది. చాలా బావుంది మీ కవిత. – మోహన
నాటికి నేడు – రేడియో నాటిక గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
11/13/2010 6:52 pm
గొరుసు-గారు, ‘యామినీ పూర్ణతిలక’ కూడా త్వరలోనే అందించే ప్రయత్నం చేస్తాను.
ఆడియో టేపుపైనున్న నాటికని digitise చేయవలసి వుంది.
— శ్రీనివాస్
నాటికి నేడు – రేడియో నాటిక గురించి jagadeeshwar reddy గారి అభిప్రాయం:
11/13/2010 6:16 am
‘నాటికి నేడు’ నాటిక ఎన్ని సార్లు విని ఉంటానో గుర్తులేదు. అంతిష్టం ఆ నాటికంటే నాకు. మహాలక్ష్మమ్మగా సీతారత్నంగారూ, నరుసుపంతులుగా కుటుంబరావుగారూ నువ్వా నేనా అనేలా పోటాపోటీగా నటించారనిపిస్తుంది. తర్వాత చిలకమర్తి ‘గణపతి’ నాటకంలో గణపతి తల్లిపాత్రలో ఇంకెంతో గొప్పగా క(వి)నిపించారు సీతారత్నంగారు.
పరుచూరి శ్రీనివాస్‌గారూ … వీలైతే శారదా శ్రీనివాసన్, జి.వి. సుబ్రహ్మణ్యం, సిద్దప్పనాయుడుగార్లు నటించిన ‘యామినీ పూర్ణతిలక’ను కూడా అందించే ప్రయత్నం చేయండి.
– గొరుసు
ఇప్పుడెందుకిలా? గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:
11/11/2010 1:09 pm
ఘాడమైన అనుభూతితో నిండిన భావ తీవ్రత ఉందీ కవితలో. నాకు నచ్చింది.
గరికపాటి పవన్ కుమార్
నా అందం ఏమయింది? గురించి Balu గారి అభిప్రాయం:
11/11/2010 10:47 am
చాలా బాగుంది
నాకు నచ్చిన పద్యం: శ్రీరామ ధనుష్టంకారం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/10/2010 4:51 am
పద్యాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
“దిగంతర, దంతి కర్ణ రంధ్రాంతర, సాగరాంతర, ధరాభ్ర తలాంతర, చక్రవాళ శైలాంతర, సర్వ భూధర గుహోకుహరాంతర పూరితంబుగన్ అని అంతర, అంతర, అంతర అంటూ ఆ పదాలతో పాటు మనలని లాక్కునిపోయి, వింటినారి వింత శబ్దం పద్యంలోని ధారలో వినిపింపజేశాడు కవి.” అని ఒక్క వాక్యంలో చాలా బాగా చెప్పారు పద్యంలో ని రసాన్ని.
“అంతర అంతర” అని వినిపించే అంత్యానుప్రాస కొద్ది మార్పుతో “ఇంతై ఇంతయై” అయిపోతూ “ఇంతింతై వటుడింతయై మరుతానింతై నభోవీధిపైనంతై” ఎత్తుకుపోయిన పోతన పద్యాన్ని స్ఫురింపజేసింది.
రాముని వింటి శబ్దం ఈ పద్యంలో వినిపించింది. వింటి రూపం కడిమెళ్ళ వరప్రసాద్ గారి ఈ అవధాన పద్యంలో కనిపించింది.
“రామ భద్రుని విల్లొక ప్రణవమేమొ
వంగుచున్నది ధర్మము వైపునకును
శరము గురిపెట్టెనా ముక్తి వఱలు గాదె
అట్టి కోదండమునకునై ప్రాంజలింతు!”
============
విధేయుడు
-శ్రీనివాస్
దుప్పట్లో ముడుక్కున్నా గురించి నరేన్ గారి అభిప్రాయం:
11/10/2010 12:02 am
బాగుంది. కానీ మీ ‘వానకు తడిసిన పువ్వొకటి ‘ అంత క్లుప్తమైన సునిశిత పరిశీలన ఇందులో కనిపించట్లేదు. అలాంటి కవితలు ఆశిస్తూ….
నా అందం ఏమయింది? గురించి Surya Prasad గారి అభిప్రాయం:
11/09/2010 3:57 am