Comment navigation


15828

« 1 ... 1100 1101 1102 1103 1104 ... 1583 »

  1. మన్మధుని బాణాలు గురించి Kiran Adimatyam గారి అభిప్రాయం:

    11/21/2010 1:02 am

    చాలా బాగుంది. నేను స్కూల్లో చదుకునేటప్పడు పల్లకి మా ఇంట్లో ఉండేది. ఇప్పడు ఇలాంటివి ఉన్నాయో లేవో. 🙂 Thanks for sharing.

  2. నాటికి నేడు – రేడియో నాటిక గురించి jagadeeshwar reddy గారి అభిప్రాయం:

    11/20/2010 3:42 am

    వంశీగారూ…
    బాబోయ్‌ … ఎంత గొప్ప కలక్షనండీ మీది?
    హేట్సాఫ్‌ సార్‌. పరుచూరి శ్రీనివాస్‌గార్ని ‘పూర్ణతిలక’ పరిచయం చేయమని కోరింది నా తోటి ‘ఈమాట’ పాఠకశ్రోతలకోసమని.
    అన్నట్టు రావుబాలసరస్వతిగారితో రంగనాయకమ్మగారి ఇంటర్వ్యూ ఈ మధ్య విడుదలైన రంగనాయకమ్మగారి వ్యాసాల పుస్తకంలో ఉంది. అదీగాక డిసెంబర్‌ 2010 ‘పాలపిట్ట’ (మాసపత్రిక) లో కూడా ఆ ఇంటర్వ్యూ తాలూకు టెక్ట్స్‌ వస్తోందని తెలిసింది.
    ధన్యవాదాలతో …
    -గొరుసు

  3. రవి గాంచిన కవి: విన్నకోట రవిశంకర్ కవితా సంకలనాల పరామర్శ గురించి నరేన్. గారి అభిప్రాయం:

    11/20/2010 12:08 am

    అమోఘమైన ప్రేమని కవితల్నిండా కుమ్మరించి పంచి పెట్టినందుకు రవి శంకర్ గారిని,
    అందులోనూ ఆణిముత్యాలని సమీక్షించినందుకు మీకు ధన్యవాదాలు.
    నరేన్.

  4. నాటికి నేడు – రేడియో నాటిక గురించి వంశీ గారి అభిప్రాయం:

    11/19/2010 8:24 am

    @గొరుసు గారు – ఈ యామినీపూర్ణతిలక నాటిక రెండు భాగాలుగా పబ్లిష్ అయి ఉన్నది డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో.

    మొదటి భాగం 50 MB కావున కొద్దిగా ఓపిక చూపించవలసి ఉంటుంది.. 🙂

    భవదీయుడు
    వంశీ

  5. నాటికి నేడు – రేడియో నాటిక గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:

    11/18/2010 12:28 pm

    శ్రీనివాస్ గారూ,

    నండూరి సుబ్బారావుగారు డాన్ క్విక్సోట్ గా నటీంచిన రేడియో నాటిక ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి 1969 లో వచ్చింది. ఆ నాటిక కోసం ఎంత ప్రయత్నించినా దొరకటంలేదు. మీరు పూనుకుంటే దొరకవచ్చు.

    దయచేసి ప్రయత్నించగలరు.

  6. నా అందం ఏమయింది? గురించి పార్ధ సారధి గారి అభిప్రాయం:

    11/17/2010 11:16 pm

    చాలా బాగుంది

  7. జీవితం గురించి naren గారి అభిప్రాయం:

    11/17/2010 10:33 pm

    రాత్రిని రెండు తరాల కోణాల్లోంచి చూస్తూ జీవితాన్ని బాగా నిర్వచించారు.
    ఈ కవిత కి టైటిల్ జీవితం-1 అని అనుకుని మిగిలిన పార్శ్వాలని కూడా ఆవిష్కరించవచ్చు.
    ఉదాహరణకు, పిల్లల భవిష్యత్ గురించి పెద్దలు తపిస్తారు. కాని పెద్దైన పిల్లలు
    కన్న వాళ్ళను భారంగా భావిస్తున్నారు. ఇది కూడా నిత్య పరంపర, జీవితానికి మరో నిర్వచనం.

  8. నాటికి నేడు – రేడియో నాటిక గురించి ramana గారి అభిప్రాయం:

    11/17/2010 10:30 pm

    2 పాత్రలతో 30 నిమిషాల రేడియో నాటకం మెప్పించడము గొప్ప.

  9. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి మోహన గారి అభిప్రాయం:

    11/17/2010 8:27 pm

    తమిళములో కణ్ణదాసన్ ఎన్నో పాటలను ఆ కాలములో రాసారు. వాటికి విశ్వనాథన్ – రామమూర్తి గారలు, మహాదేవన్ గారు ఏ మార్పు లేకుండా స్వరపరచారు. అందువల్లనే ఆ పాటలు సంగీతములో, సాహిత్యములో ఎంతో చక్కగా ఉన్నాయి. నా స్నేహితుడు భానుమూర్తి చెప్పేవాడు – గీతగోవిందములోని అష్టపది బాణీలో రాస్తే ఏ పాటనైనా స్వరపరచవచ్చు అని ! ఉంటాను – మోహన

  10. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    11/17/2010 5:31 am

    మనకు తెలిసిన పాటలను గురించి రచయిత బాగా విశ్లేషించారు. అయితే సినీగీతాల రచన ఎన్నో పరిమితులకు లోబడి జరుగుందనేది తెలిసిన విషయమే. మామూలు కవులకుండే స్వేచ్ఛ సినీరచయితలకుండదు. సాధారణంగా ఇచ్చిన ట్యూన్లకు పాటలు రాయించడం పరిపాటి. ఇది కవికి సవాలుగా పరిణమిస్తుంది. బాగా రాసి మెప్పించడం కష్టమవుతుంది.

    సంగీతదర్శకుల్లో కె.వి.మహాదేవన్ తన ట్యూన్లకు పాట రాయమని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన పాటకు వరసలు చేసేవారట. ఇది ముందుగా తమిళంలో తయారై తెలుగులో మళ్ళీ తీసిన సినిమాలకు వర్తించదనుకోండి.

    ఇందుకు సి.ఆర్‌.సుబ్బరామన్ పూర్తిగా విరుద్ధం. అతని పాటల రచనలన్నీ ట్యూన్లకు కిట్టించినవే. తెలుగువారిలో ఆదినారాయణరావువంటి స్వరరచయితలుకూడా ట్యూన్లకే ప్రాధాన్యతనిచ్చారు. ఘంటసాల ఒక్క సందర్భంలోనే (మల్లియలారా మాలికలారా) తాను ముందుగా చేసిన వరసకు అడిగి పాట రాయించుకున్నారని సి.నా.రె. ఒక సందర్భంలో చెప్పారు.

    దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని (ముఖ్యంగా చివరి రోజుల్లో) ట్యూన్ కోసం పాట రాయమనే సాహసం ఎవరూ చేసేవారుకారు. ఆయన చేత ఒక్క పాటైనా రాయించుకోవటం తమకు అదృష్టంగా నిర్మాతలు భావించేవారట. ఘనశ్యామసుందరా అనే ప్రసిద్ధ మరాఠీ సినీగీతం ఒరవడిలో ఆయనచేత ఘనాఘనసుందరా అనే పాటను రాయించారు. భూప్ రాగంలోనే మరొక పద్ధతిలో స్వరరచన జరిగింది.

    ముందుగా అరవంలో విడుదలైన పాటలకు తిరగరాసినప్పటికీ శ్రీశ్రీ రాసిన పాటలు కొన్ని ఒరిజినల్ కంటే బావుంటాయి. ఉదాహరణకు దొరికేరు దొరగారు (ప్రేమించిచూడు). నిపుణుడైన కవి ఎటువంటి పరిస్థితిలోనైనా బాగా రాయగలడని దీన్నిబట్టి తెలుస్తుంది.

« 1 ... 1100 1101 1102 1103 1104 ... 1583 »