Comment navigation


15792

« 1 ... 11 12 13 14 15 ... 1580 »

  1. కుడి ఎడమైతే పొరపాటు ఉందా? గురించి మధు‌ చిత్తర్వు గారి అభిప్రాయం:

    02/04/2025 9:53 am

    వ్యాసం ఎప్పటిలాగే బాగా రాశారు. Chirality గురించి డాక్టర్‍గా నాకు తెలుసు. ఇప్పటికే కొన్ని మందులు ఇలా తయారు చేసి బాగా పని చేస్తాయి అని కంపెనీ వారు మాకు ప్రమోట్ చేస్తున్నారు. వాడుతున్నాము కూడా. ఉదాహరణకి లేవో థైరాక్సిన్, ఎస్ ఏమ్లోడిపిన్ మొదలైనవి. ఇండియాలో Emcure అనే కంపెనీ కేవలం chirally modified medicinesనే తయారు చేస్తూంది. వాటి పనితనంలో నాకైతే గొప్ప తేడా ఏమీ కనబడలేదు. అయితే ఈ వ్యాసంలో బాక్టీరియా వైరస్‍లకు ఈ మిర్రర్ ఇమేజ్ చేయవచ్చు అనే విషయం తెలిసింది. అందుకు రచయిత కు ధన్యవాదాలు. ఇది ప్రమాదమో కాదో తెలియాలంటే అవి వాడినప్పుడు మాత్రమే తెలుస్తుంది అనుకుంటాను. ఒకే అభ్యంతరం, తెలుగు సాంకేతిక పదాలు వాడినందువల్ల అర్థం అవడం కష్టం అవుతుంది అనే నాకు అనిపించింది. పాండెమిక్‍కు మహమ్మారి బదులు ఎలసోకు పోలరైజషన్‍కి తలీకరణ ఇంకా సాధ్యం అపసవ్యం లాంటి మాటలు తెలుగు వాడినా అర్థం కావడానికి ఇంగ్లీష్ పదాలు వాడితే మనకి అంతర్జాతీయ పరిశోధనల పురోగతి బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే పరిశోధన అంతా ఇంగ్లీష్ లోనే జరుగుతోంది కాబట్టి. నాకు సంస్కృతం కొంత పరిచయం వుంది కాబట్టి ఈ మాత్రమైనా అర్థం అయింది. చాలామంది విద్యార్థులకి ఈ పదాలు అర్థం కాకపోవచ్చు. ఎవరికి తోచిన ప్రామాణిక పదాలు వారు వాడితే ఇంకా అయోమయంగా వుంటుంది. దీనికి పరిష్కారం ఏమిటో తెలుగు మీడియంలో అధ్యాపకులు విశ్వవిద్యాలయాలు ఆలోచించాలి. అయితే రచయిత ఈ పోలారిటీ ప్రాణ్యాలు ఇలా రాసిన డిఎన్ఎ ఆర్‍ఎన్ఎ గురించి రాసినది నాకు మాత్రం ఇంగ్లీష్ లోకి మార్చుకుని చదివితే బాగా అర్థం అయింది. మంచి వివరాలు, సమాచారం లభించింది. ధన్యవాదాలు.

  2. ఇక్కడే ఉన్నందుకు గురించి MK KUMAR గారి అభిప్రాయం:

    02/04/2025 8:22 am

    ఈ రచనలో స్వాతికుమారి జీవితం, మరణం, ఆత్మపరిశోధన, క్షమాపణ, భయాలపై గంభీరమైన ఆలోచనలు వ్యక్తం చేశారు. కథలో, రచయిత తన అనుభవాలను, ఆత్మవిమర్శలను, చావు పై ఉన్న భయాన్ని వివరించారు. తన మనసులోని అనేక ప్రశ్నలను కూడా వ్యక్తం చేశారు. జీవితం చివరికి ఏ విధంగా ముగియనుందో, మరణం తర్వాత ఏముంటుందో అనే అనుమానాలు, ఆశలు, అభ్యర్థనలతో కూడిన క్షణాలను శోధిస్తూ, తన వ్యక్తిగత అనుభవాలను బలోపేతం చేశారు. చుట్టూ ఉన్న పరిచయాలు, అనుభవాలు, మానవ సంబంధాలపై ఉన్న అవగాహనను కూడా శోధించే ప్రయత్నం చేశారు. ఈ రచనలో ప్రతిఫలించే భావనలు మరణం, జీవితం, ప్రేమ, క్షమాపణల మధ్య అనేక సంక్లిష్టమైన సంబంధాలను పూర్వాపరాలు, ప్రశ్నలు, అనుభూతులతో అభివర్ణించడం బాగుంది.

  3. ఇద్దరు కళాకారులు గురించి MK KUMAR గారి అభిప్రాయం:

    02/04/2025 8:18 am

    ఈ రచనలో అనేక విలక్షణమైన భావనలు, ఆలోచనలను అన్వేషించారు. ఇది కేవలం ఒక వ్యక్తి జీవితంలోని అంతఃసంఘర్షణలే కాకుండా, మరింత విశాలమైన సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను సైతం ప్రతిబింబిస్తుంది. కరుణాకర్ అనే ప్రధాన పాత్ర అనుభవాలను, జ్ఞాపకాలను, మానసిక అస్తవ్యస్తతను ఆకర్షణీయంగా చిత్రించారు.

    ఈ రచన సమాజంలో ఉన్న వివిధ రకాల మానవ సంబంధాలు, అనుభూతులు, వ్యక్తిగత ఆత్మవిశ్వాసం, నిరాశల మధ్య ఈ సమకాలీన ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. యువరాజ్, కరుణాకర్, తదితర పాత్రలు వారి తమని తాము వ్యక్తీకరించే విధానాలు, మానసిక స్థితులను చూపించారు.

    అనువాదం బాగుంది.

  4. బంకు బాబు మిత్రుడు… గురించి తః తః గారి అభిప్రాయం:

    02/04/2025 8:16 am

    మూర్తి గారూ అనువాదం బాగుంది.
    “Picture a scenic pond nestled within the confines of a small village in Bengal, its calm surface dotted with lotus flowers. Then imagine, one moonlit night, a spaceship splashing down and sinking into its depths, until the only thing visible is a golden spire sticking out of the water. The local villagers think it is a temple risen from the Earth below. Most of them decide to worship it. Little do they realize that the object contains a small humanoid creature that will invisibly play havoc in their lives.
    If you think this sounds like an entertaining idea for a science-fiction film, you would be right. And if perhaps, you were to think it somewhat similar to the famous 1982 film E.T. the Extra-Terrestrial, directed by Steven Spielberg, you might not be far off either. But this other alien, the one that crash-landed in India and not America, never quite made it to movie screens across the globe, despite being dreamed up in the 1960s by one of the most significant film directors of the 20th century – Satyajit Ray”
    The unique universe of Satyajit Ray
    IOP ‘s Physics World
    09 Aug 2022
    నమస్కారాలతో – తః తః

  5. అస్తిత్వవాద సాహిత్యం: 2అ. దొస్తోయెవ్‍స్కీ గురించి pavan kumar గారి అభిప్రాయం:

    02/04/2025 5:45 am

    మా లాంటి యువకులకు తాత్విక చింతనలు సులభమైన తెలుగులో అందిస్తున్నందుకు వేవేల కృతజ్ఞతలు.

  6. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి మాన్నేపల్లి నికేష్ గారి అభిప్రాయం:

    02/04/2025 1:47 am

    నేను ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం. ఏ. తెలుగు చదువుతున్నాను. అనుకోకుండా చండీదాస్ గారి గురించి తెలుసుకునే క్రమంలో మీ వ్యాసం చదివాను. ఇది అత్యద్భుతం.

  7. పాముకాటుకి చెంపదెబ్బ? గురించి rao vemuri గారి అభిప్రాయం:

    02/03/2025 7:16 pm

    కృత్రిమ మేథ సహాయంతో పాము విషానికి విరుగుడు కనిపెట్టే ప్రయత్నం భారతదేశంలో జరుగుతున్నాదని శ్రీ పలకా కొండలరావు గారు ఈ దిగువ లంకెని నా దృష్టికి తీసుకువచ్చేరు.

    https://www.hindustantimes.com/opinion/scientifically-speaking-an-ai-driven-cure-for-snake-bite-victims-101738589275985.html?utm_source=substack&utm_medium=email

  8. సంపాదకునికి ఉత్తరం గురించి అనామక రచయిత గారి అభిప్రాయం:

    02/03/2025 12:14 pm

    అమ్మా బి.వి.ఎస్.మనస్విని గారూ:

    మీరు రాసిన “సంపాదకునికి ఉత్తరం” చదివాకా ఎందుకో ఇది “సంపాదకుని ఉత్తరం”లా తోచింది తప్ప ఒక కొత్త పాఠకురాలు రాసారంటే నమ్మబుద్ధి కాలేదు. నిబిడాశ్చర్యంతో నన్ను నేను గిచ్చుకున్నాను.

    యథా రచనా–తథా పాఠకా, తీరులో తెలుగు సాహిత్యం పరిగెడుతోంది.
    పత్రికలు కూడా వాల్ పోస్టర్ గోడల్లా తయారయ్యాయి.

    మీరు వ్రాక్కుచ్చినట్లు సోషల్ మీడియా ప్రభావం అంతటా వుంది; అన్ని భాషల్లోనూ ఇదే జాడ్యం. దీనికి తెలుగు ఒక్కటీ మినహాయింపు కాదు.

    కరోనా కంటే తీవ్రమైన “గుర్తింపు వైరస్” ప్రపంచాన్ని ఆవరించి దశాబ్దం దాటింది. లైకులు, లవ్వులతో ఎదుటవారిని సంతోష పరిచే చట్రంలో అందరూ ఇరుక్కున్నారు.
    ఇచ్చినమ్మ లైకు, పుచ్చుకున్నమ్మ లైకు–తీరున ప్రపంచమంతా ఒక అనధికార, అదృశ్య ఒప్పందం సంస్కార ప్రదంగా కుదుర్చుకుంది.

    కాబట్టి ఎవరి పుస్తకమ్మీద ఎవరూ ఉన్నదున్నట్లు రాయరు. రాయలేరు కూడా.
    రాసే దమ్ముని సభ్య సమాజం కోల్పోయి చాలా కాలం అయ్యింది.
    ఇది “గుర్తింపు వైరస్” సైడ్ ఎఫెక్ట్. దీనికి వాక్సిన్ ఇంకా రాలేదు.
    కాబట్టి వైరస్ అందరికీ పట్టినా, ఎవరికీ అంటనట్లే నటిస్తున్నారు.

    అడుక్కుని రాయించే భిక్షక రచయితలు అన్నికాలాల్లోనూ, అంతటా వున్నారమ్మా! ఇదేం కొత్త కాదు!
    ఎవరూ రాయకపోతే సదరు సంపాదక మహాశయులు మారుపేరుతో రాసిన సంఘటనలు కూడా వున్నాయి.
    తమ పత్రిక్కి వచ్చిన రచనలన్నీ కుటుంబరావు గారు తిరగరాసేవారని, అప్పట్లో చెవులు కొరుక్కునేవారు రచయితలు .

    సోషల్ మీడియా వల్ల రచయితలూ, పాఠకులూ అందరూ ఒకే చోట ఉండటం వలనా, ఎవరి పుస్తకం మీదా ఎవరూ ఉన్నదున్నట్టు రాయరు. పొగిడి తీరాలి. లేదంటే తిరిగి తన పుస్తకానికి మంచి రివ్యూలు రావనే భయం. అందరూ దూరం పెడతారేమో అనే జంకు. దీన్నుండి బయటపడే సూచనలు కనుచూపు మేరలో లేవు.

    ఇంతమంచి వాక్యం రాసిన మనస్విని తల్లీ, నువ్వు కూడా నీకు నచ్చిన పుస్తకం గురించి రాయమని నా విన్నపం.
    కథో, కవితో ఏదో ఒకటి–నీకు నచ్చింది.
    అదీ తెలుగుదే. వేరే భాషది కాకూడదు సుమా?
    మీకు సమయం లేకపోతే సదరు సంపాదకుల వారికి తెలుగులో ఒక మంచి పుస్తకం సూచించు.
    రాయమని అర్థించు తల్లీ!

    –అనామక తెలుగు పాఠకుడు.

  9. ఎవరెస్ట్ బేస్ కాంప్ 4 గురించి Ramesh గారి అభిప్రాయం:

    02/03/2025 10:12 am

    మీ యాత్రానుభవం ఎంతో అద్భుతంగా వుందండి. నేను కూడా మీతో పాటు హిమాలయాల్లో యాత్ర చేసాను. ధన్యవాదాలు.

  10. పని₹మని₹షి గురించి మథు చిత్తర్వు గారి అభిప్రాయం:

    02/03/2025 9:21 am

    ఈ కథ నాకు బాగా నచ్చింది. మీరు ఇలాంటి కథలు కూడా రాస్తారని తెలియదు. సస్పెన్స్ అదిరింది. నెరేషన్ Squid games, hunger games గుర్తు వచ్చాయి. కొంచెం predictable గా వున్నా, నాకు ఇలాంటి కథలు ఇష్టం కాబట్టి. అభినందనలు.

« 1 ... 11 12 13 14 15 ... 1580 »