Comment navigation


15828

« 1 ... 1095 1096 1097 1098 1099 ... 1583 »

  1. గుర్తుందా గోదారీ? గురించి Raghu గారి అభిప్రాయం:

    12/13/2010 5:28 pm

    యేమీ కాని నేనే చదివి ఇంత మురిసిపోతుంటే, సాక్షాత్తు గోదారమ్మ తానెంత మురిసిపోతుందో?? ఇసుక కోవలో నేనూ చేరిపోతున్నానేమో అని భయమేస్తుంది, ఎందుకంటే నాకూ కుళ్ళుగా ఉంది..ఈ ఆలోచనా ప్రవాహం నన్నెందుకు తాకలేదని..

  2. జయప్రభశబ్ద కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/12/2010 1:00 pm

    అనురాగ శర్మగారూ !! మీరు చాలా ఓపిగ్గా “లింకులు’ ఇచ్చినందుకు నాకు ఆశ్చర్యం ఏమీ కలగలేదు గానీ వాటిని చదివే ఆసక్తీ తీరికా నాకు లేవు. నాకు నచ్చిన వాటిని నేను చదువుకోగలను. అలాగే ఎవరికి నచ్చినవి సైతం వారు పదిలపరుచుకుని చక్కగా చదువుకోవచ్చును. మనది ప్రజాస్వామ్యం గనక అందరూ అభిప్రాయాలు చెప్పేయవచ్చును. కాదన్నదెవరూ?? పైగా అదుపులేనంత చోటొకటి ఉండనే ఉంది కూడా కదా?? బోలెడంత రాయడానికీ!! రాసుకుపోతే సరి!! భూమ్మీద ప్రతివారికీ చోటుందాయె !

    రమ.

  3. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Saraswathi గారి అభిప్రాయం:

    12/12/2010 2:52 am

    Where can I get Bharamara vinyasam. I heard it on AIR long back. Is it available for buying

    Saraswathi

  4. జయప్రభశబ్ద కవిత్వం గురించి అనురాగ్ శర్మ గారి అభిప్రాయం:

    12/10/2010 1:56 pm

    “ఈ వ్యాసం రాసి ఇన్నేళ్ళు గడిచినా దీనిమీద నేను ప్రతిస్పందించే దాకా ఒక్క అభిప్రాయం కూడా లేదంటేనే ఈయన మాటలకి పాఠకులు ఏపాటి విలువనిచ్చారో అర్ధమౌతూంది మరి.”

    రమ గారు

    పాఠకుల అభిప్రాయాలా రచన ఘనతను నిరూపించేవి ?? ఇదెక్కడి వితండ వాదం ??

    గతంలో ఈ మాట అతిథి పుస్తకాలను వాడేది.మే 2006 నుండి మనం వాడుతున్న “పాఠకుల అభిప్రాయాలు” (ఈ మాట సంపాదకుల మాటల్లో చెప్పాలంటే -“ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.) అందుబాటులోకి వచ్చింది. పాత అభిప్రాయాలకు సంపాదకులు లింకు ఇచ్చారేమో నాకు తెలియదు. ఈ సంచికలోని వ్యాసాలు సాంకేతిక కారణాల వల్ల చాలా కాలం అందుబాటులో లేవు అన్న విషయం పక్కన పెడితే, “జయప్రభ శబ్ద కవిత్వం” వచ్చిన సంచిక పై పాఠకుల అభిప్రాయాల లింకు, ఆసక్తి గల పాఠకుల కోసం పాత అతిథి పుస్తకాలకు లింకు ఇస్తున్నాను.

    మీరు కొనియాడే జయప్రభ గారి వ్యాసం మీద గత పదకొండేళ్ళలో ఒక్క వ్యాఖ్యయినా లేదు. ఆ వ్యాసానికి పాఠకులు విలువ నివ్వలేదనా?? లేదా ఇది మగ దురహంకారుల కుట్రలో భాగమా?

    అదిగాదు ఆలోచించే తీరు, అప్పటి అభిప్రాయాలు వచ్చిన పేజీలు ఎక్కడో ఉండి ఉంటాయి, వాటిని వెతికి పట్టుకోవాలి, అంతే.

    అనురాగ్ శర్మ

  5. నాటికి నేడు – రేడియో నాటిక గురించి ashok గారి అభిప్రాయం:

    12/10/2010 11:04 am

    ఈ నాటిక చాలా బాగుందండీ.

  6. ఏ నడలో ఏ ఎడలో! గురించి madhukar గారి అభిప్రాయం:

    12/09/2010 3:55 pm

    మీరు ప్రేయసిని ప్రేమించారో ఆ ఎడబాటును వరించారో తెలుసుకోవాలని ఉంది. గీతం అధ్బుతమ్ గా ఉంది.

  7. జీనో పేరడాక్సు గురించి madhukar గారి అభిప్రాయం:

    12/09/2010 3:34 pm

    కవిత నడక,ఎత్తుగడ అంత చాలా బాగున్నై.(నాకు ఒరిజినల్ వర్షన్ తెలియదు) వస్తువు ఎన్నిక లో వైవిధ్యం, సమస్యల చిత్రించే తీరు బాగున్నై.మీలోని సామ్య వాద నిబధ్ధత ధ్వని గర్భితంగా ఉంది. ఏమంటారు???

  8. మొలక గురించి madhukar గారి అభిప్రాయం:

    12/09/2010 3:13 pm

    కువకువల కిలకిలల
    గోరువెచ్చని
    పాల మీగడల
    మృదుత్వ నిర్మలత్వంలోకి పద ప్రయోగం చిన్నారుల సంకేతాలుగా సున్నితంగా లలిత మనోహరం గా ఉన్నై. మీ కవితలో స్వాత్మయీకరణ శక్తి ఉంది.(జనులు తాము కవి తో మమేకమయ్యి అదే భావ స్థాయి చేరుకోవడం)

  9. కోనసీమ కథలు: న్యాయవాదం గురించి madhukar గారి అభిప్రాయం:

    12/09/2010 2:56 pm

    బ్రహ్మానందం గారు మీ కథలు మార్క్ ట్వైన్ ని తలపిమ్ప చేసాయి. అతని విట్,ఐరనీ ,అధిక్షేప ధోరణి వంటి ఎన్నో సంగతులు మీ రచన ఉండటం నిజంగా మా పాఠకుల అదృష్టం. అభినందనీయులు మీరు.

  10. నాకు నచ్చిన పద్యం: శ్రీరామ ధనుష్టంకారం గురించి madhukar గారి అభిప్రాయం:

    12/09/2010 1:28 pm

    మొల్ల తన బాల కాండ లో రాముడు ధనుర్భంగం చేసేటపుడు ధరా తలమా కదల్బొకు,ఆది శేషు భూమండలాన్ని గట్టిగా పట్టుకో , అష్ట దిగ్గజాలు జాగ్రత్త రాముడు శివ ధనస్సుని ఎక్కు పెట్టబోతున్నాడు అని చేసిన కల్పన కూడా హృద్యంగా ఉంటుంది.

« 1 ... 1095 1096 1097 1098 1099 ... 1583 »