Comment navigation


15828

« 1 ... 1097 1098 1099 1100 1101 ... 1583 »

  1. జయప్రభశబ్ద కవిత్వం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    12/04/2010 4:43 pm

    చాలా అందమైన పొయెట్రీ. మేలు పరిచయం.

    I must have “Breakfast with Jayaprabha” over a few days. I think I have all her published books. కొనుక్కున్నాను. కొన్ని నేనడిగితే :-)ఆనంద స్వరూప్ ఇండియాలో కొని పంపించాడు.
    జయప్రభ థీసెస్ కొన్ని ఉన్నాయని తెలుసు. చదవాలని కోరికా ఉన్నది. ఐనా ఒకరి ‘intellectual property’ వారి పర్మిషన్ లేకుండా, లేదా అడిగిన మూల్యం చెల్లించకుండా చదవటం న్యాయం కాదు. నాకు అలా చేయటం ఇష్టం ఉండదు.
    రచయిత రచనకు సరైన ధర వారే నిర్ణయించాలి. పుస్తకమైనా. PDF file ఐనా సరే. ఎప్పటికప్పుడు మంచి రచనకై ఎదురు చూసే పబ్లిక్ కి అందజెయ్యాలి. పాఠకులు ఆ విలువ చెల్లించి, విలువైన రచనలను సేకరించుకుని చక్కని వాతావరణంలో చదువుకోవాలి. అప్పుడు కదా నా లాటి పాఠకులకు సంతృప్తి.

    ఈ పరిచయం లో కన్న ఇంకా అందమైన పొయెట్రీ ఉందనుకుంటే రచయిత్రి తప్పక తెలియచెయ్యాలి. C-span, book T.V. Charlie Rose writers’ interview లు నాలాటి వాళ్ళు చూసేది ఎందుకు? పుస్తకాల్లో కొన్ని భాగాలు రచయితలు స్వయంగా చదివి వినిపించి, వివరించినప్పుడు – నచ్చితే ఆ పుస్తకాలు కొనుక్కోటానికే కదా.

    తమ్మినేని యదుకులభూషణ్ ఈ వ్యాసంలో ఉదహరించిన ఇతరులను గూర్చి కూడా తెలుసుకోవాలని ఉంది.

    కొన్ని వారాలుగా ‘ఈ మాట’ లో అభిప్రాయ సహితంగా చక్కని రచనలను చదివిస్తున్నారు.

    This magazine makes the holiday season so much more festive. Enjoying. Thanks.

    లైలా

  2. జయప్రభశబ్ద కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/04/2010 2:45 pm

    యశస్వి గారికి ఈ వ్యాసంలో అంతా సవ్యంగానే కన్పించడమ్ వారి భావ సానుకూలతకి నిదర్శనంగా అనుకుంటాను. నాకు వ్యాసం అర్ధమ్ అయిన తీరు మీదనే నేను ప్రతిస్పందించినది.

    మనకి నప్పని ఆహార్యాన్ని ధరించి ప్రదర్శనని మొదలుపెడితే అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఈ వ్యాసమూ అలాగే ఉంది. ఇంత వాచాలత్వాన్ని తన వ్యాసంలో చూపించిన యదుకులభూషణ్ తన కవిత్వంతో ఎందరిని ఆకట్టుకున్నాడో.. తన విమర్శనాచతురతతో ఎందరికి జ్ఞానం కల్గించాడో ఎవరైనా వివరిస్తే సంతోషిస్తాను. జయప్రభ గారి కవిత్వాన్ని ఇష్టపడ్డవారంతా మరి ఈయన అంచనా ప్రకారము అజ్ఞానులూ, శబ్దలోలులూ అకవిత్వానికి పోషకులూను. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక్క యదుకుల భూషణుడే మరో ఉమాకాంతుడూనూ !!

    అంతటి ఉమాకాంతవిద్యాశేఖరులకే దిక్కులేకపోయింది. ఆయన ఎంత తిట్టినా కృష్ణశాస్త్రినే నిలబెట్టుకుంది గానీ తెలుగు సాహిత్యం ఆయన విమర్శని కాదు. ఎప్పుడో కాలంచెల్లిన భావాలని జనం దృష్టిని తనవైపుకి తిప్పుకోడానికి కాబోలు ఈయన ఈ వ్యాసంలో చాలా ప్రయత్నమ్ చేసాడు. పద్యాల్ని తెగ ప్రస్తుతించేశాడు:) ఈ వ్యాసం రాసి ఇన్నేళ్ళు గడిచినా దీనిమీద నేను ప్రతిస్పందించే దాకా ఒక్క అభిప్రాయం కూడా లేదంటేనే ఈయన మాటలకి పాఠకులు ఏపాటి విలువనిచ్చారో అర్ధమౌతూంది మరి.

    రమ

    [comment edited – Eds.]

  3. జయప్రభశబ్ద కవిత్వం గురించి yasasvi గారి అభిప్రాయం:

    12/04/2010 1:10 pm

    రమగారి ప్రతిస్పందనలో ఉన్న జోరు ఎందుకని ఎక్కువగా ఉందో నాకు సరిగ్గా అర్ధమ్ కాలేదు. యదుకుల భూషణ్ గారు జయప్రభ గారి కవిత్వమ్ నించి తనకి నచ్చిన కొన్ని పద్యాలని ఎంచుకుని వానిలోని అందచందాలనో ఇబ్బందులనో విశ్లేషణ చేసారు. అందులో ఆయన దృష్టి మిగతా వారి దృష్టి కన్నా భిన్నమైనది కావొచ్చు కదా?? అందులో రమ గారు చెప్పిన భావాలేమీ లేవే?? అయితే జయప్రభ గారి కవిత్వంలో భిన్న కోణాలున్నాయి. వాటిని యదుకులభూషణ్ గారు చూపించలేకపోయి ఉండొచ్చు. కానీ నాకైతే ఈ విమర్శలో యదుకులభూషణ్ ని జ్వాలాముఖితో పోల్చదగ అంశమేదీ చూపుకు తోచలేదు. పైగా ఆయన ఎంపిక చేసి ఇచ్చిన జయప్రభ గారి కవితలన్నీ చదవడానికి ఇంపుగాఉన్నాయి కూడా!! అందుకు యదుకులభూషణ్ గారి అభిరుచిని రమ గారు మెచ్చుకోక తప్పుపట్టడమ్ ఎందుకని జరిగిందో??

    యశస్వి.

  4. జయప్రభశబ్ద కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/04/2010 1:12 am

    రాజకీయాతీతమైన దృష్టి ఉన్నవాడు అరాచకీయమైన తూకానికి పూనుకుంటే సరిగ్గా ఇదిగో ఈ విమర్శ లాగే ఉంటుంది. జయప్రభ కవిత్వం మీద ఇలాంటి వ్యాఖ్యానాలని చేసిన వాళ్ళలో ఈ యదుకుల భూషణ్ మొదటివాడేమీ కాదనుకుంటాను. జయప్రభ కవితాసంకలనాల మీద మగవాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుని ఇలాంటి రాతలు రాసి ఏదో ఒక తరహా గుర్తింపుకోసం ప్రయత్నించడం చాలాసార్లు జరిగింది కూడా !! ఈయనకి స్త్రీవాదమో లేక మరో వాదమో నచ్చలేదు గనక వాటిని కవిత్వంలోంచి ఎంచి ఖండించడానికి పూనుకుంటే ఆ విమర్శ ఏ తోవలో సాగాలో ఆ తోవలోనే సాగింది ఇది కూడా !! జ్వాలాముఖి మొదలుకుని మరి కొందరు కుర్ర జ్వాలాముఖుల దాకా ఈ తరహా గొంతు ఆమె కవిత్వం విషయంలో “విమర్శ” పేరున రావడం కొత్త ఏమీ కాదు కూడాను. అయితే అవన్నీ ఎంతమేరకి నిలబడ్డాయో దీనికీ అంతే స్థానం ఉంటుంది.

    ఆవిడ కవిత్వాన్ని విమర్శ పరిధిని కూడా దాటిపోయి ఆరుద్ర రివ్యూ పేర బోలెడంత తిట్లు కుమ్మరించిన సందర్భమ్ ఉంది. ఆరుద్ర దృష్టి ఏ తోవలో నడిచిందో అది చూపించి ఆయన నీరస దృష్టికి ఆ రాత నిదర్శనంగా నిలిచిందే తప్ప ఆ అభిప్రాయం జయప్రభ కవిత్వాన్ని తక్కువ చేయలేకపోయింది. పాక్షిక దృష్టితో రాసిన ఎన్నో రాతలు ఆవిడ కవిత్వం మీద ఇదివరలో కూడా రాకపోలేదు. ఆ తరహా రాతల్లో ఇది ఒకటి. ఐతే స్త్రీవాదులు ఇటువంటి రాతలని పరిగణన లోకి తీసుకుంటారా?? అన్నదానికి సైతం వాళ్ళ అనేక ప్రతిస్పందనలు జవాబులుగా ఉన్నా ఇంకా ఇటువంటి స్త్రీల రాజకీయ కవిత్వాలని వ్యతిరేకించే వాళ్ళున్నారంటే ఇంకా తెలుగు సాహిత్య రంగంలో తరవాతి తరాలలో సైతం ఎంత వెనకబాటుతనం ఉందో స్పస్టపడుతోంది.

    మనకి అన్నా అఖ్మతోవా నచ్చుతుంది. కానీ మన సమకాలంలో మనతో పాటు నడిచే ఒక అన్నా అఖ్మతోవా, ఒక మాయా యాంజిలో నచ్చలేదు. అది తెలుగువిమర్శలో ఉన్న ఒక జాఢ్యం. పేరొచ్చిన వారిని విమర్శించి తానూ పేరు తెచ్చుకోవాలన్న ఒక అతి పాత పాత జాఢ్యం. అందుకు అనేకసార్లు అనేక మందికి జయప్రభ కవిత్వం ఎంతో ఉపయోగపడటం అన్నదే ఆమె కవిత్వానికి ఉన్న బలాన్ని చెప్పకనే చెబుతోంది. ఏమీ లేని పుస్తకాన్ని చదివి అవతల పడేయాలి. కానీ దాన్ని అంత సుదీర్ఘంగా అంత బలంగా కాదని అనవలసి రావడమ్ అంటేనే అందులో ఉన్న విశిష్టతని ఒప్పుకోవడం అన్నమాట. పండితుని వేషం వేసుకున్న వాడు పండితుడు కానట్టే ఈ తెచ్చికోలు హడావిళ్ళూ ఈ డొల్లమాటలూ సైతమ్ అతుకులబొంతలాంటివని అర్ధమ్ అవుతుంది. రాజకీయాతీతమైన జీవితమూ లేదు. రాజకీయాతీతమైన కవిత్వమూ ఉండదు. అది అఖ్ఖరలేని వాళ్ళు ఆ తరహా కవిత్వాన్ని విమర్శించపూనుకోవడం లోనే వారి చూపు లోని అంతరార్ధమ్ అర్ధమవుతుంది ఎవరికైనా !!

    అయితే ఈ పరిస్థితి ప్రపంచ సాహిత్యంలో స్త్రీల వ్యక్తీకరణల మీద నిందాపూరిత స్వరాలతో విమర్శ పేరు పెట్టుకుని జరగడం అనేకసార్లు జరిగింది. ఇక్కడ మళ్ళీ జరిగింది. పురుష సాహిత్య ప్రపంచంలో మళ్ళి మళ్ళీ జరుగుతూనే ఉంటుంది కూడాను. ఈ తరహా సాహిత్యమ్ వచ్చిందీ అంటేనే దాని అవసరమ్ ఉందీ అని అర్ధం ! అది ఈ అరాజకీయ వాదులకి ఒప్పుదల అయ్యిందా కాదా అన్నదానితో కవయిత్రులకి ఏమీ ప్రమేయం లేదని వాళ్ళు ముక్తకంఠంతో ఇదివరకే చెప్పేసారు కూడా !!

    కవిత్వం అనేక తరహాల్లో బయటికి వస్తుందని ..”శిల్పం” సారంలోనూ రూపం లోనూ భిన్నం గా ఉంటుందనీ కవితా శిల్పం నిజంగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకు సహృదయతా ఉండాలి. సంయమనమూ ..సహనమూ ఉండాలి. కానీ ఈ విమర్శలో అది కొరవడింది. ఇందులో యదుకుల భూషణ్ కి నచ్చినవి కొన్ని ఉన్నట్టే మిగతా తరహా వ్యక్తీకరణలు నచ్చిన వాళ్ళూ మరికొందరుంటారు. విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కవులు వారి తోవన వారు పాడుతూనే ఉంటారు.

    రమ.

  5. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/03/2010 2:58 pm

    కవిత్వాంశ అన్నది ఏ కోశానా లేని దీన్ని ప్రచురించడం “శేషేంద్రశర్మ కి నివాళి గా” అంటూ పైగా…అది ఈమాట వాళ్ళ లోపం !! ఎన్నో కవితలు శేషేంద్ర శర్మ గారివి మంచివి ఉన్నాయి. అయినా దీన్ని ఎన్నుకోవడం చేసారూ అంటే అది సంపాదకుల అభిరుచికి మాత్రమే నిదర్శనం. కవి రాసిన ప్రతీ అక్షరాన్నీ అత్యుత్తమ స్థాయిలో ఉందనో లేదా ఉండాలనో అనుకోవడం కవిత్వతత్వం తెలియనివారనుకోవచ్చు. కానీ బాధ్యత కల్గిన పత్రికా సంపాదకులు అలా చేయకూడదు. ఎంపిక చేసి శేషేంద్ర శర్మ రాసిన ఏ మంచి కవితనైనా ఆయనకి నివాళిగా ఇచ్చి ఉండవచ్చు. ఇలాచేయడం పోయిన ఒక కవిని ప్రస్తుతించడం కిందకి రాదు సరికదా..ఆయన ఊహాశక్తి మీదో ఆయన శబ్దశక్తి మీదో ఒక వెక్కిరింత లాంటిది గుప్పించడమే !! ఐతే, అందువలన కవిగా శేషేంద్ర శర్మ గారికి వచ్చిన నష్టమూ ఏమీ లేదు. ఆయన కవిత్వం చదివిన వారు ఆయన మంచి కవిత్వం రాసినట్టు కూడా గుర్తించగలరు.

    ఇంక ఈ రాత కవిగా మరింక ఆయన స్పందనలన్నీ ఉడిగిపోయిన తరువాత రాసి ఉండొచ్చు. చెప్పడానికి ఇవాళ ఆయన లేనప్పుడు ఈ ప్రశ్న కి జవాబూ రాదు.పాపం ఆయన మాత్రం ఏంచెప్పగలడూ?? అయితే అది కవికేనా వర్తించేదీ?? పస లేకపోయినా విమర్శ పేరుతో తమ రాతల్లోనానా చెత్తని చెలామణీ చేయడం లేదూ విమర్శకులూనూ?? ఏంచేస్తాం? చదివేసి
    చాదస్తం అని ఊరుకుంటాం అంతే !!

    రమ.

  6. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి వంశీ గారి అభిప్రాయం:

    12/03/2010 11:10 am

    చాలా దుర్భరంగా ఉంది కవిత. ఆయనే రాసాడా అనేది నా అనుమానం..

  7. అఫ్సర్‌ “వలస”, కల్పనా రెంటాల “కనిపించే పదం” గురించి Sowmya గారి అభిప్రాయం:

    12/03/2010 4:53 am

    ఇంతకీ ఇది రాసిందెవరండీ? పేరే కనబడ్డం లేదూ?

    [భూషణ్ గారు. తప్పు సవరించాం. మీకు కృతజ్ఞతలు – సం.]

  8. జీనో పేరడాక్సు గురించి madhurasree గారి అభిప్రాయం:

    12/03/2010 1:43 am

    కవిత చాలా బాగుంది

  9. ఒకే ఒక్క ఇస్మాయిల్‌ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    12/03/2010 1:32 am

    అవును ఇస్మాయిల్ తత్వశాస్తమే బోధించినట్టు ఇప్పుడు గుర్తొస్తోంది. సవరించినందుకు యదుకుల భూషణ్ కి థాంక్స్. అలాగే ఏ కవీ శబ్దాన్ని తక్కువ చేయలేడనే నేను అనేది కూడాను.

    ఇకపోతే సాహిత్యం లో ఎవరి దగ్గరా “అంకెలూ..సంకెలూ” ఉండవు. కానీ ఒక శ్రీశ్రీ కవితో ఒక తిలక్ కవితో నోటికొచ్చినట్టు చప్పున ఇస్మాయిల్ కవితాపంక్తులు నోటికొచ్చిన వారు సంఖ్యలో తక్కువే ఉంటారు. ఉంటారన్నది ఒక స్పృహ. వాదనకోసం నాలుగు వాక్యాలు రాయడం వట్టి కుర్రతనం. దానికి నేను ప్రతిస్పందించను.

    ఇకపోతే యదుకులభూషణ్ చెప్పిన “పద్యం మనసులో రూపుదిద్దుకోవడం” అన్నది సరైన మాట. పరికరాలు అన్నవి కాదు నిర్ణయించిన విషయాలు. ఇవాళ కంప్యూటర్ ఉంది. కాయితం ఉంది. అంతకన్నా ముందు తాటాకుంది. ఇవి కాలానుగుణంగా వచ్చిన సదుపాయాలు మాత్రమే !! పాతరోజుల్లో కూడా పుస్తకాలకి నకళ్ళు తీయిచుకోవడం అన్నది ఉంది. అందరికీ పుస్తకం అన్నది అందుబాటులో లేదు గనక ఒకరు చదవడమో పదిమంది వినడమో జరిగి ఉండొచ్చు. అచ్చుయంత్రం వచ్చాకా సైతమ్ కవిత్వాన్ని అందరూ లోపలే చదువుకున్నారని ఏమీ చెప్పలేము. విషయం అది కానే కాదు.కవితా స్పందనలో దాని పాత్ర ఏమీ గణనీయమైనదీ కాదు.

    ఇంక ఇస్మాయిల్ గారి కవిత్వానికి సంబధించి వెల్చేరు చెప్పిన మిగతా థియరీ అంతా కృతకంగా ఉంది. నేను చేసిన వ్యాఖ్య దానికి సంబంధించినది. కవులు అనేక రకాలైన వ్యక్తీకరణలు చేసారు. అందులో ఇస్మాయిల్ తరహా వ్యక్తీకరణ ఒకటి. దాని లోతుపాతులేమైనా అవి నారాయణరావు చెప్పిన కారణాలకి మాత్రం కాదు అన్నది నా భావం.

    అతి ఆంగ్లత్వం అన్నది ఒకటుంది ఆధునిక కాలంలో! వెనకటికి నా మిత్రుడు అంటూండేవాడు. తెలుగులో పదజాలం అమితం. అంత వొకాబులరీ అనవసరం. సగం పదాలు వదిలేయడం మంచిదీ అని.
    ఇది అనువాదాలు చేసేవాళ్ళకి వచ్చే ఇబ్బందులని చర్చించినప్పుడు వచ్చిన మాట అన్నమాట. ఏతావాతా చెప్పేదేమంటే… అనువాదకులకి బాగుంటాయని కవులు “క్లుప్తం” గానూ రాయరు. విస్తరించీ రాయరు.

    సాధారణంగా కవితలో భావాన్ని”లౌడ్” గా చెప్పడం అన్నది ఇంగ్లీషు యూరోప్ దేశాల వెరసి పశ్చిమ దేశాల సాహిత్యానికి ఇమిడే విషయం కాదు. వారికి “క్లుప్తంగా” ఉన్న భావం చప్పున అందుతుంది. అందువలన ఇస్మాయిల్ కవితని అనువాదాలనించి కూడా వాళ్ళు నచ్చుకుని ఉండిఉండొచ్చు.కానీ కవితని పశ్చిమ దేశాల వారు మెచ్చుకోవడం అన్నది ఆ కవి గొప్పతనానికి నిదర్శనమూ కాదు.లేదా ఆ కవి కవితకి అదొక అదనపు అర్హతా కాదు. కేవలమ్ కవిత్వలో క్లుప్తత అన్నది పాశ్చ్యాత్యుల సెన్సిబిలిటీస్ కి దగ్గరగా అన్పించడానికి అవకాశం ఉంది. అంతమాత్రమే !! ఇంగ్లీషు ప్రభావమో లేక తాను బోధించిన తత్వశాస్త్ర ప్రభావమో కూడా ఇస్మాయిల్ గారి మీద లేదనీ అనలేం !! దానికనుగుణంగా ఆయన వ్యక్తీకరణ సాగిందా అన్నది చూడొచ్చు. నారాయణరావు దాన్ని కవిలోని ఒక “గడుసుతనం” గా అభివర్ణిస్తున్నారు. అది నారాయణరావు గారి వ్యాఖ్యానమే తప్ప ఇస్మాయిల్ గారి దృక్పధం అయి ఉంటుందని అనిపించదు. ఏ కవీ “పనిగట్టుకుని “గడుసు” గా కవిత్వం రాయడనుకుంటాను.. కానీ విమర్శకుడు మాత్రం తనలోని “గడుసు” తనంతో కవిలో లేని అలాంటి కొన్ని”గడుసుతనాలని” తన సిధ్ధాంతంలోంచి చూస్తాడు. దాన్నే ఆ కవికీ ఆపాదిస్తాడు. కానీ పాఠకులకి వాటితో ఏ ప్రమేయమూ ఉండదు. ఒక కవి కొందరికి నచ్చడానికీ మరి కొందరికి అంతగా ఆస్వాదయోగ్యం కాకపోవడానికీ ఉండే కారణాలు రకరకాలు.

    రమ

  10. ఏ నడలో ఏ ఎడలో! గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    12/01/2010 9:25 pm

    సాహిత్యం పాట వరసలోకి ఒదిగినప్పుడే వినడానికయినా, పాడుకోడానికయినా బావుంటుంది. అలాంటి పాటలే హత్తుకుంటాయి. పాటకి పాటా ( ట్యూనూ ), సాహిత్యానికి సాహిత్యమూ విడివిడిగా బాగానే ఉన్నా, రెంటినీ తాళంతో బంధించేసరికి విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లా అనిపించాయి. బహుశా ఒక వెస్ట్రన్ ట్యూన్కి తెలుగు సాహిత్యం అతికించడం వల్ల వచ్చిన ఇబ్బందేమో? సాహిత్యంలో కూడా పాటకి వుండాల్సిన సరళత లోపించింది. ఈ క్రింది వాక్యం చూడండి.
    “కల్లరి మబ్బుల కావిరుల ఏ కలలో కల్లలో “, పాడేటప్పుడు చివరి పదాలు
    రెండూ(కలా, కల్లా ) ఒకేలా వినిపించే ప్రమాదం ఉండీ, భావం చెడిపోతుంది.
    లోపలి లోతులు నాకు తెలీవు. పైకి కనిపించేది మాత్రం ఇదే!

« 1 ... 1097 1098 1099 1100 1101 ... 1583 »