వేమూరి గారు రాసిన అనుభవాలు లోగడ ఒక బ్లాగులో చదివాను. వారి అనుభవాలు చాలా విస్తృత పరిధిలొ ఉన్నాయి. అమెరికా వెళ్ళే తెలుగువారికి బాగా ఉపయోగపడతాయి. ఇవి చదవక మునుపు నేను అమెరికా వెళ్ళి మా పిల్లల దగ్గర ఆరుమాసాలు వుండివచ్చాను. వృత్తి రీత్యా జర్నలిస్టుని కాబట్టి నా అనుభవాలను అక్షరబద్ధం చేశాను. నా బ్లాగులొ వుంచాను కానీ పుస్తక రూపంలో తేలేదు. కొత్తగా అమెరికా వెళ్ళి కొన్ని రొజులు గడిపివచ్చే తలిదండ్రులను దృష్టిలో వుంచుకుని చేసిన రచన అది. అభిరుచి వున్న బ్లాగర్లు చూడదలిస్తే -bhandarusrinivasarao.blogspot.com (వార్త వ్యాఖ్య) ఓపెన్ చేయాల్సిందని కోరుతున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్ష్లలతో -భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు. (bhandarusr@yahoo.co.in)
విశ్వనాథ కోవెల గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:
01/02/2011 9:24 pm
ఈ వ్యాసము విమర్శకు విమర్శయినా ఎంతో బాగుంది.మీలో ఉన్న కవి కంటె విమర్శకుడు మరో మూడడుగులు ఉన్నతంగా ఉన్నాడు. చాలా మంచి వ్యాసము.రామాయణ కల్పవృక్షము చదవబోయే నా వంటి వారలకు ఈ వ్యాసము దోహదకారి.
చాలా అందంగా ఉన్నాయి మీ శిశిర చిత్రాలు. ఆకుల ఆకులపాటు వ్యాకులాన్ని కూడా కలిగిస్తుంది. వెనుక ఆనందమయమైన వసంతగ్రీష్మాలు, ముందు హేమంత నిశాంతాల అనంత ఖేదాలు. శిశిరము ఒక సంధి కాలమే. మంచి కవితను అందించినదులకు అభినందనలతో – మోహన
ఆట చాలించి కామెంటరీ/విశ్లేషణకి దిగడం ఆటగాళ్ళకి శారీరకపరిమితులదృష్ట్యా అవసరం. సృజనకారులకెందుకీ గోల? కనకప్రసాద్ గారు, ఈ telling మానేసి showingలోకి వచ్చేద్దురూ.
వ్యాసం మొదటి భాగం తెలుగు పాఠకులు ఇంతకు ముందుఇస్మాయిల్ రాతల్లో/కవితల్లో చూసిందే. వాలకం చూస్తే రెండవభాగంలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చదవడానికి మరో నాలుగునెలలయ్యేట్టుంది. వ్యాసాలను ధారావాహికలుగా ప్రచురించటంలో ఏమిటి పరమార్థం?
చాల బాగుంది ఈ కవిత. విశ్వనాథవారిపైన ఉండే వారి గురుభక్తి ఐదవ పద్యములో ప్రకటితమైనది. ఇది మధ్యాక్కర, దీనికి నన్నయలా, విశ్వనాథలా ఐదవ గణానికి యతి నుంచారు. విశ్వనాథలా నాల్గవ, ఐదవ గణాలకు రెంటికీ ఎందుకు పెట్టలేదో? ఆచార్యులు తిరుప్పావై కూడ గద్యముగా తెలిగించారు. ఇది అభినవ ప్రచురణలు 2003లో ప్రచురించిన ‘చింతయంతి’ పుస్తకములో గలదు. గోదా దేవి కాలము (అంటే తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి రచించబడిన కాలము) తొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్ధము. ఆ కాలానికి ఇంకా రామానుజుడు అవతరించలేదు. కాబట్టి విష్ణుభక్తులు కూడ విభూతినే ధరించేవారు. కాబట్టి వారి పెళ్లిళ్లు కూడ (గోదా దేవితో సహా) ఆ పద్ధతిలోనే (స్మార్త పద్ధతిలో) జరిగి ఉంటుంది. రామానుజుని కాలంలో అతడు తిరుప్పావై వల్ల ప్రభావితుడై దీనిని ధనుర్మాసములో పాడాలనే నియమాన్ని ప్రవేశ పెట్టారని తలుస్తారు. అంతే కాక ఆండాళులా వధువుకు కూడా కేశాలంకరణ చేస్తారు వివాహసమయములో. విధేయుడు – మోహన
చాల మంచి వ్యాసము కామేశ్వరరావుగారూ! రామయణాన్నే కాదు, భారతాన్ని, భాగవతాన్ని, భగవద్గీతను, ద్వైతులు ద్వైతపరముగా, అద్వైతులు అద్వైత పరముగా, విశిష్టాద్వైతులు విశిష్టాద్వైత పరముగా వ్యాఖ్యానించారు. పోతే, ఎక్కువ మంది అద్వైతులు గనుక (కనీసం ఆంధ్రదేశములో) ఈ అద్వైతత్వముపైన ఎక్కువ వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇందులో చిత్రం ఏమంటే ఒకే కావ్యాన్ని అందరు అనుయాయులు వారికి తోచినట్లు వ్యాఖ్యానించుకొన్నారు. ఇందులో ఏది నిజమో (అసలు కచ్చితమైన నిజము అనేది ఉందా ఇందులో) అనేది ఆ రామునికే తెలియాలి! చివరి శ్లోకములో మూడవ పాదము తప్పినట్లుంది, ముద్రారాక్షసమా? ఇంత మంచి వ్యాసము వ్రాసినందులకు నా అభినందనలు, కామేశ్వరరావుగారూ, ఉంటాను, విధేయుడు – మోహన
‘ఈ మాట’ ప్రతి రెండు నెలలకూ వస్తుంది. అందులో ఎన్నో రకాల -పాత, కొత్త రచనలు- ఉంటాయి. అది పత్రికకు ఎంతో వెరైటీని ఇస్తుంది. మంచిది.
కాని ప్రతి సంచికను ఎందుకు ఒక స్మారక సంచికగా తయారు చేస్తున్నారు? వెలువరిస్తున్నారు?ఒకవేళ మీకు ‘మరణించినవారిని స్మరించటమే’ ముఖ్యోద్దేశమైతే అది మీ పత్రిక ఆశయంగా ఎందుకు నిర్మొహమాటంగా చెప్పరు? మీ పత్రిక పేరు -స్మారకం, మాసోలియం, ట్రిబ్యూట్ , నివాళి. పేంథియాన్ – ఇలాటి పేరు పెట్టుకోవచ్చుగదా?
ఈ పత్రిక సంపాదకులకు – ఎందరో జీవించి ఉన్న మానవులు ఆహ్వానించే ప్రతి ఒక నూతన సంవత్సరాన్ని, ఒక ఋతువును, ఒక నెలను, ఒక రోజును , వేలాదివేల మనుష్యులకు సంబంధించిన కాలాన్ని, సంపాదకులు ఎన్నుకున్న ఒకేఒక్క రచయితకు గుర్తుగా వారి స్మారకంగా నిబంధించటానికి, వారికి హక్కు ఎవరిచ్చారు?
తమ రచనలను పంపిస్తున్న ఇప్పటి రచయితలకు , వారి రచనలు ఎవరికో సాంబ్రాణి కడ్డీలవుతున్నాయనీ, ఎవరి ఫొటోలకో దండలవుతున్నాయనీ, ఎవరికో అంకితమైపోతున్నాయనీ, తెలియదు.
ఇప్పటి పాఠకులు, ఇప్పటి రచయితలపై -ఇట్టి అత్యాచారం మీ సంపాదకులచే చేయబడటం, మీరు ప్రతిసారీ స్మరిస్తున్న ఆ గతించిన రచయితల స్పిరిట్ కే విరుద్ధం. వారు బ్రతికి లేనందున మీ ఈ చర్యలను వారు నిరోధించలేరు.
నిరభ్యతరంగా ఒక్కో సంచికలో ఒక రచయిత ( జనన మరణాల ప్రసక్తి దేనికి?) రచనలను ఫోకస్ చేసి చూపవచ్చు. వారి మీద ఒక అనుబంధము ఆ ఇస్స్యూలో ఉంచవచ్చును. ఒక రచయిత గురించి విశదంగా తెలుసుకోవాలి అనుకున్న వారు, చదువుకుంటారు.
పత్రిక సంపాదకులు ‘రిచ్యుయల్ ఓరిఎంటెడ్’ కాక ‘జవరాలైన’ కొత్త పత్రికను ప్రతిసారీ పాఠకులకు అంద చెయ్యాలనుకుంటే, ఈ మార్పు మీరు వెను వెంటనే చెయ్యవచ్చు. ఇప్పటి ఈ పత్రిక పరమపదించిన ‘ముందుమాట’ చదివి – ఉస్సురనక ముందే చెయ్య వచ్చు. కొద్ది చలాకీ మార్పులతో, వేలాది మంది పాఠకులకు ఆనందం కలిగేలాగా, వెంటనే పత్రికకు ప్రాణమివ్వవచ్చు.
మార్పులు చెయ్యగలుగుతారో, లేక ఈ ఉత్తరము ప్రచురించదలుస్తారో, సంపాదకులుగా, ఏది మీ నిజకర్తవ్యంగా భావిస్తారో , మీ శక్తి సామర్ధ్యాలకు ఏది నిదర్శనమనుకుంటారో- మీరే నిరూపించుకోండి.
నమస్కారములు
లైలా.
రచయితలకు సూచనలు గురించి పి రామచంద్ర రావ్ వైజాగ్ గారి అభిప్రాయం:
01/01/2011 2:03 pm
ఈమాట.కాం ప్రప్రథమంగా ఈ రోజే చూసాను. చిన్నచిన్న గేయాలు అవీ పంపాలంటే ఎలా పంపాలి? ఏ చిరునామాకి పంపాలి? దయచేసి తెలుప ప్రార్థన.
[పై శీర్షికలోనే చెప్పినట్లు RTSలో గానీ, unicode తెలుగులో గానీ type చేసిన రచనలు e-mail ద్వారా submissions@eemaata.com అన్న చిరునామాకు పంపాలి… సం.]
జెజ్జాల వారూ,
మీ ముత్యాల సరం snow man ని బహు చక్కగా అలంకరించింది. తెలుగు పద్యంలో స్నౌ మాన్ ఎంత బాగా ఒదిగి పోయాడో!
నాల్గవ పాదంలో మాత్రలు తక్కువగా ఉన్నందువల్లనో ఏమో, “flow” దెబ్బతిన్నటనిపించింది.
శిశిర చిత్రాలు గురించి Anand గారి అభిప్రాయం:
01/03/2011 7:15 am
చాలా బాగుది మీ కవిత.
పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి భండారు శ్రీనివాసరావు గారి అభిప్రాయం:
01/03/2011 6:02 am
వేమూరి గారు రాసిన అనుభవాలు లోగడ ఒక బ్లాగులో చదివాను. వారి అనుభవాలు చాలా విస్తృత పరిధిలొ ఉన్నాయి. అమెరికా వెళ్ళే తెలుగువారికి బాగా ఉపయోగపడతాయి. ఇవి చదవక మునుపు నేను అమెరికా వెళ్ళి మా పిల్లల దగ్గర ఆరుమాసాలు వుండివచ్చాను. వృత్తి రీత్యా జర్నలిస్టుని కాబట్టి నా అనుభవాలను అక్షరబద్ధం చేశాను. నా బ్లాగులొ వుంచాను కానీ పుస్తక రూపంలో తేలేదు. కొత్తగా అమెరికా వెళ్ళి కొన్ని రొజులు గడిపివచ్చే తలిదండ్రులను దృష్టిలో వుంచుకుని చేసిన రచన అది. అభిరుచి వున్న బ్లాగర్లు చూడదలిస్తే -bhandarusrinivasarao.blogspot.com (వార్త వ్యాఖ్య) ఓపెన్ చేయాల్సిందని కోరుతున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్ష్లలతో -భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు. (bhandarusr@yahoo.co.in)
విశ్వనాథ కోవెల గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:
01/02/2011 9:24 pm
ఈ వ్యాసము విమర్శకు విమర్శయినా ఎంతో బాగుంది.మీలో ఉన్న కవి కంటె విమర్శకుడు మరో మూడడుగులు ఉన్నతంగా ఉన్నాడు. చాలా మంచి వ్యాసము.రామాయణ కల్పవృక్షము చదవబోయే నా వంటి వారలకు ఈ వ్యాసము దోహదకారి.
శిశిర చిత్రాలు గురించి మోహన గారి అభిప్రాయం:
01/02/2011 4:43 pm
చాలా అందంగా ఉన్నాయి మీ శిశిర చిత్రాలు. ఆకుల ఆకులపాటు వ్యాకులాన్ని కూడా కలిగిస్తుంది. వెనుక ఆనందమయమైన వసంతగ్రీష్మాలు, ముందు హేమంత నిశాంతాల అనంత ఖేదాలు. శిశిరము ఒక సంధి కాలమే. మంచి కవితను అందించినదులకు అభినందనలతో – మోహన
మూడు లాంతర్లు గురించి విభు గారి అభిప్రాయం:
01/02/2011 2:33 am
ఆట చాలించి కామెంటరీ/విశ్లేషణకి దిగడం ఆటగాళ్ళకి శారీరకపరిమితులదృష్ట్యా అవసరం. సృజనకారులకెందుకీ గోల? కనకప్రసాద్ గారు, ఈ telling మానేసి showingలోకి వచ్చేద్దురూ.
వ్యాసం మొదటి భాగం తెలుగు పాఠకులు ఇంతకు ముందుఇస్మాయిల్ రాతల్లో/కవితల్లో చూసిందే. వాలకం చూస్తే రెండవభాగంలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చదవడానికి మరో నాలుగునెలలయ్యేట్టుంది. వ్యాసాలను ధారావాహికలుగా ప్రచురించటంలో ఏమిటి పరమార్థం?
పెండ్లి కల గురించి మోహన గారి అభిప్రాయం:
01/01/2011 6:06 pm
చాల బాగుంది ఈ కవిత. విశ్వనాథవారిపైన ఉండే వారి గురుభక్తి ఐదవ పద్యములో ప్రకటితమైనది. ఇది మధ్యాక్కర, దీనికి నన్నయలా, విశ్వనాథలా ఐదవ గణానికి యతి నుంచారు. విశ్వనాథలా నాల్గవ, ఐదవ గణాలకు రెంటికీ ఎందుకు పెట్టలేదో? ఆచార్యులు తిరుప్పావై కూడ గద్యముగా తెలిగించారు. ఇది అభినవ ప్రచురణలు 2003లో ప్రచురించిన ‘చింతయంతి’ పుస్తకములో గలదు. గోదా దేవి కాలము (అంటే తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి రచించబడిన కాలము) తొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్ధము. ఆ కాలానికి ఇంకా రామానుజుడు అవతరించలేదు. కాబట్టి విష్ణుభక్తులు కూడ విభూతినే ధరించేవారు. కాబట్టి వారి పెళ్లిళ్లు కూడ (గోదా దేవితో సహా) ఆ పద్ధతిలోనే (స్మార్త పద్ధతిలో) జరిగి ఉంటుంది. రామానుజుని కాలంలో అతడు తిరుప్పావై వల్ల ప్రభావితుడై దీనిని ధనుర్మాసములో పాడాలనే నియమాన్ని ప్రవేశ పెట్టారని తలుస్తారు. అంతే కాక ఆండాళులా వధువుకు కూడా కేశాలంకరణ చేస్తారు వివాహసమయములో. విధేయుడు – మోహన
విశ్వనాథ కోవెల గురించి మోహన గారి అభిప్రాయం:
01/01/2011 5:27 pm
చాల మంచి వ్యాసము కామేశ్వరరావుగారూ! రామయణాన్నే కాదు, భారతాన్ని, భాగవతాన్ని, భగవద్గీతను, ద్వైతులు ద్వైతపరముగా, అద్వైతులు అద్వైత పరముగా, విశిష్టాద్వైతులు విశిష్టాద్వైత పరముగా వ్యాఖ్యానించారు. పోతే, ఎక్కువ మంది అద్వైతులు గనుక (కనీసం ఆంధ్రదేశములో) ఈ అద్వైతత్వముపైన ఎక్కువ వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇందులో చిత్రం ఏమంటే ఒకే కావ్యాన్ని అందరు అనుయాయులు వారికి తోచినట్లు వ్యాఖ్యానించుకొన్నారు. ఇందులో ఏది నిజమో (అసలు కచ్చితమైన నిజము అనేది ఉందా ఇందులో) అనేది ఆ రామునికే తెలియాలి! చివరి శ్లోకములో మూడవ పాదము తప్పినట్లుంది, ముద్రారాక్షసమా? ఇంత మంచి వ్యాసము వ్రాసినందులకు నా అభినందనలు, కామేశ్వరరావుగారూ, ఉంటాను, విధేయుడు – మోహన
ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/01/2011 4:30 pm
ఈ ‘ముందుమాట’ పైనే నా అభిప్రాయం.
‘ఈ మాట’ ప్రతి రెండు నెలలకూ వస్తుంది. అందులో ఎన్నో రకాల -పాత, కొత్త రచనలు- ఉంటాయి. అది పత్రికకు ఎంతో వెరైటీని ఇస్తుంది. మంచిది.
కాని ప్రతి సంచికను ఎందుకు ఒక స్మారక సంచికగా తయారు చేస్తున్నారు? వెలువరిస్తున్నారు?ఒకవేళ మీకు ‘మరణించినవారిని స్మరించటమే’ ముఖ్యోద్దేశమైతే అది మీ పత్రిక ఆశయంగా ఎందుకు నిర్మొహమాటంగా చెప్పరు? మీ పత్రిక పేరు -స్మారకం, మాసోలియం, ట్రిబ్యూట్ , నివాళి. పేంథియాన్ – ఇలాటి పేరు పెట్టుకోవచ్చుగదా?
ఈ పత్రిక సంపాదకులకు – ఎందరో జీవించి ఉన్న మానవులు ఆహ్వానించే ప్రతి ఒక నూతన సంవత్సరాన్ని, ఒక ఋతువును, ఒక నెలను, ఒక రోజును , వేలాదివేల మనుష్యులకు సంబంధించిన కాలాన్ని, సంపాదకులు ఎన్నుకున్న ఒకేఒక్క రచయితకు గుర్తుగా వారి స్మారకంగా నిబంధించటానికి, వారికి హక్కు ఎవరిచ్చారు?
తమ రచనలను పంపిస్తున్న ఇప్పటి రచయితలకు , వారి రచనలు ఎవరికో సాంబ్రాణి కడ్డీలవుతున్నాయనీ, ఎవరి ఫొటోలకో దండలవుతున్నాయనీ, ఎవరికో అంకితమైపోతున్నాయనీ, తెలియదు.
ఇప్పటి పాఠకులు, ఇప్పటి రచయితలపై -ఇట్టి అత్యాచారం మీ సంపాదకులచే చేయబడటం, మీరు ప్రతిసారీ స్మరిస్తున్న ఆ గతించిన రచయితల స్పిరిట్ కే విరుద్ధం. వారు బ్రతికి లేనందున మీ ఈ చర్యలను వారు నిరోధించలేరు.
నిరభ్యతరంగా ఒక్కో సంచికలో ఒక రచయిత ( జనన మరణాల ప్రసక్తి దేనికి?) రచనలను ఫోకస్ చేసి చూపవచ్చు. వారి మీద ఒక అనుబంధము ఆ ఇస్స్యూలో ఉంచవచ్చును. ఒక రచయిత గురించి విశదంగా తెలుసుకోవాలి అనుకున్న వారు, చదువుకుంటారు.
పత్రిక సంపాదకులు ‘రిచ్యుయల్ ఓరిఎంటెడ్’ కాక ‘జవరాలైన’ కొత్త పత్రికను ప్రతిసారీ పాఠకులకు అంద చెయ్యాలనుకుంటే, ఈ మార్పు మీరు వెను వెంటనే చెయ్యవచ్చు. ఇప్పటి ఈ పత్రిక పరమపదించిన ‘ముందుమాట’ చదివి – ఉస్సురనక ముందే చెయ్య వచ్చు. కొద్ది చలాకీ మార్పులతో, వేలాది మంది పాఠకులకు ఆనందం కలిగేలాగా, వెంటనే పత్రికకు ప్రాణమివ్వవచ్చు.
మార్పులు చెయ్యగలుగుతారో, లేక ఈ ఉత్తరము ప్రచురించదలుస్తారో, సంపాదకులుగా, ఏది మీ నిజకర్తవ్యంగా భావిస్తారో , మీ శక్తి సామర్ధ్యాలకు ఏది నిదర్శనమనుకుంటారో- మీరే నిరూపించుకోండి.
నమస్కారములు
లైలా.
రచయితలకు సూచనలు గురించి పి రామచంద్ర రావ్ వైజాగ్ గారి అభిప్రాయం:
01/01/2011 2:03 pm
ఈమాట.కాం ప్రప్రథమంగా ఈ రోజే చూసాను. చిన్నచిన్న గేయాలు అవీ పంపాలంటే ఎలా పంపాలి? ఏ చిరునామాకి పంపాలి? దయచేసి తెలుప ప్రార్థన.
[పై శీర్షికలోనే చెప్పినట్లు RTSలో గానీ, unicode తెలుగులో గానీ type చేసిన రచనలు e-mail ద్వారా submissions@eemaata.com అన్న చిరునామాకు పంపాలి… సం.]
మంచుమనిషి గురించి Rajasankar గారి అభిప్రాయం:
01/01/2011 12:58 pm
జెజ్జాల వారూ,
మీ ముత్యాల సరం snow man ని బహు చక్కగా అలంకరించింది. తెలుగు పద్యంలో స్నౌ మాన్ ఎంత బాగా ఒదిగి పోయాడో!
నాల్గవ పాదంలో మాత్రలు తక్కువగా ఉన్నందువల్లనో ఏమో, “flow” దెబ్బతిన్నటనిపించింది.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో,
కారాశం