Comment navigation


15828

« 1 ... 1090 1091 1092 1093 1094 ... 1583 »

  1. ఛందస్సే యయె నీదు కోవెల గురించి Sriramam గారి అభిప్రాయం:

    01/11/2011 10:48 pm

    శ్రీ మోహన రావు గారు,
    మీరు సంపత్కుమరాచార్య గారి గురించి వ్రాసిన వ్యాసము చాల బాగున్నది. ప్రస్తుతము వారికి రామారావు గారికి మధ్య జరిగిన “వచన పద్యము” చర్చ చదువుతున్నాను. ఈమధ్యనే మీ వ్యాసములు చదువుతున్నాను సందేహనివారణకై మీతో తరచు సంప్రతించ కోరుతున్నాను. అప్పకవీయముతో పరిచయమున్నది. ఇక్కడ స్నేహితులకు (సాహిత్యాభిలాషులకు) చందస్సు (నేను నేర్చుకొంటూ) వారికి నేర్పే బాధ్యత తీసుకొన్నాను. వీలైతే “తెలుగు ఛందోవికాసము” మరియు “గిడుగు వారి తెలుగు ఛందోరీతులు” లభ్యమయే సదుపాయము చెప్ప మనవి.

    Congratulations on receiving the Charles Brown award. I think I had met you in Detroit on Sri Sri, KoKu,GopiChand function. We visited from Toronto for that function. Recently I read your article on “Ragadalu”, I liked it and I appreciate very much if you could e-mail me your article on “Chandassu & mathematics”. I could not get this article on the web, similarly “vedamu vari Chandassu”.

    With regards,

    Sriramam
    sriramamu@yahoo.com

  2. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నాగమురళి గారి అభిప్రాయం:

    01/10/2011 9:48 am

    రోహిణీప్రసాద్ గారూ, మీ కామెంటుకి ధన్యవాదాలు.
    >> జ్యోతిష్యానికి భౌతికశాస్త్ర పద్ధతిలో రుజువులు వెతకబోతే అన్నీ సమస్యలే కనిపిస్తాయి.
    మీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    బహుశా అధికశాతం శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం జ్యోతిషం యొక్క శాస్త్రీయత ‘చచ్చిన పాము’ లాంటిది కావచ్చు. జ్యోతిషం శాస్త్రీయం కావచ్చని ఆశించేవాళ్ళది దింపుడు కళ్ళెం ఆశ కావచ్చు. అందుకే నేననుకునేది ఏమిటంటే, ఈ చర్చకి కొత్త జవజీవాలు కల్పించాలంటే మొదట జ్యోతిషం సందేహాతీతంగా పని చేస్తుంది అని శాస్త్రీయంగా నిరూపించబడాలి. ఆ బాధ్యత తీసుకోవాల్సింది జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళే/జ్యోతిష్కులే.

    ఇప్పుడు అంతా నమ్ముతున్న విధంగా జ్యోతిషం పనిచేస్తుందని మొదట స్టాటిస్టిక్సు సహాయంతో రుజువు చెయ్యగలిగితే తర్వాత మిగతా కష్టమైన ప్రశ్నల గురించి శోధించడానికి బలం చేకూరుతుంది.

    శాస్త్రీయతని పక్కనపెడితే, మీ ప్రశ్నల్లో ఒకదానికి నేను ఇదివరకు జ్యోతిష్కులనుండి విన్న సమాధానం.
    >>ఈ జాతకాలనేవి మనుషులకి మాత్రమే వర్తిస్తాయా?
    ప్రధానంగా. ఎందుకంటే జంతువులకి ప్రత్యేకమైన ‘ఐ’డెంటిటీ అనేది లేదు. అవి ప్రకృతిలో భాగం. జ్యోతిషాన్ని ఉపయోగించేది మనుషుల మనస్సులకి అనుభవంలోకి వచ్చే ‘శుభాశుభాలు, కష్టసుఖాలు’ మొదలైనవాటి గురించి చెప్పడానికి. జంతువులకి అటువంటి భావనలు ఉండే అవకాశం లేదు కాబట్టి వాటి పట్ల జ్యోతిషాన్ని వినియోగించం.

    అయినప్పటికీ, కొంతమంది పాశ్చాత్య జ్యోతిష్కులు పెంపుడు జంతువులకి జాతకాలు వెయ్యడాలు, వాటికొచ్చే అనారోగ్యాల్ని జాతకపరంగా విశ్లేషించడాలూ నేను ఎరుగుదును.

  3. 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి krishna గారి అభిప్రాయం:

    01/10/2011 9:30 am

    యుగంధర్ గారు,
    కావలి నెల్లూరు జిల్లా, దర్గామిట్టీ కథలు వ్రాసింది తెలంగాణ యాస లో కాదు.

  4. సిరుల సంక్రాంతి గురించి GS RAO గారి అభిప్రాయం:

    01/10/2011 8:37 am

    నిజముగానే సంక్రాంతి అంటే సిరుల సంక్రాంతి ..బాగా నచ్చింది.

  5. మంచుమనిషి గురించి Venu Dasigi (VEDA) గారి అభిప్రాయం:

    01/09/2011 10:32 pm

    మంచు ముత్యము లెంచి చేర్చిట
    మంచి ముత్యపు మాల పేర్చి వి
    రించి సృష్టిని మించి కూర్చిరి
    కాంచ విందేనోయ్ !

  6. రవీంద్రధనుస్సు గురించి మోహన గారి అభిప్రాయం:

    01/09/2011 9:02 pm

    మెగాస్టార్ చిరంజీవి “రవీంద్రనాథ్ టాగూరు” పేరి పాత్రలో న్యాయాలయములో విశ్వకవికి ఆరోపించి చెప్పిన మాటలు (ఠాగూరు చిత్రంలో – రచన పరుచూరి సోదరులు) –

    “ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో
    ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగగలడో
    ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కై పోయి మగ్గిపోదో
    ఎక్కడ మా చదువు విజ్ఞానం మూఢ నమ్మకాలలో ఇంకిపోదో
    ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో
    అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా
    నా ఈ దేశాన్ని మేలుకొలుపు”

    – మోహన

  7. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి K.Rohiniprasad గారి అభిప్రాయం:

    01/08/2011 3:55 am

    జ్యోతిష్యం గురించి ఆసక్తి లేనందువల్ల నేను ఇంతకాలమూ ఈ వ్యాసాలు చదవలేదు. రచయిత శైలీ, అభిప్రాయాలూ బాగానే ఉన్నాయి. పైగా ఇది ఎక్కువమంది ముట్టుకోని విషయం.

    ఈ జాతకాలనేవి మనుషులకి మాత్రమే వర్తిస్తాయని ఎవరైనా అంటే నాకు ఉన్న లేశమాత్రమైన ఆసక్తి కూడా తగ్గిపోతుంది. భూమిమీది, లేదా విశ్వంలోని జీవరాశిలో మనుషులు కేవలం ఒక భాగం మాత్రమేనని రుజువయింది కనక ఇతర జీవాలకు వర్తించని సిద్ధాంతాలు చప్పరించేసేవిగానే అనిపిస్తాయి.

    పుట్టిన వేళ అనేది అన్ని ప్రాణులమీదా తన ప్రభావం చూపుతుంది అనే మాట కూడా అసంబద్ధమే. ఎందుకంటే ప్రతి రోజూ, ప్రతి క్షణమూ వేలకొద్దీ గొడ్లూ, కోళ్ళవంటి పక్షులూ మాంసాహారుల నిమిత్తమై బలిఅవుతూనే ఉంటాయి. మరి అవన్నీ దురదృష్ట జాతకులేనా? అదే క్షణంలో, అదే ప్రాంతంలో అంతే అయస్కాంతక్షేత్రానికీ, మెలనిన్ తదితర ప్రభావాలకీ గురి అయిన ఇతర ప్రాణులు బలి అవటం లేదేం?

    ఒక్క కాంతిని మినహాయిస్తే పుట్టిన వేళలోని విశేషం ఏముంటుంది? అండం ఫలదీకరణం చెందిన క్షణం ముఖ్యమైనదా? గుడ్లుపెటే ప్రాణుల మాటేమిటి? మధ్యస్థంగా అనిపించే ప్లాటిపస్ ఎలాంటి జాతకం కలిగి ఉంటుంది? జ్యోతిష్యానికి భౌతికశాస్త్ర పద్ధతిలో రుజువులు వెతకబోతే అన్నీ సమస్యలే కనిపిస్తాయి.

    సామాజిక, ఆర్థికశక్తుల కారణంగా అయోమయానికి లోనయే మనుషుల జీవితాలను బలంగా ప్రభావితం చేస్తున్న దుష్టులు ఇందరు కనిపిస్తూ ఉంటే ఎక్కడో ఉన్న గ్రహాలనీ, నక్షత్రాలనీ తప్పుపట్టడంలో అర్థం ఉందా?

    ఒకవేళ నేను పుట్టిన వేళ, స్థలం నా స్వభావాలను నిర్ణయిస్తాయని అనుకున్నా నేనెక్కే బస్సు ప్రమాదానికి గురి అయి నేను ఫలానారోజున చచ్చిపోతాననేది అందువల్ల ఎలా నిర్ణయమౌతుంది? నేను మాటిమాటికీ చావును ప్రస్తావించడం ఎందుకంటే మేక అయినా, మనిషి అయినా చావుకు లోనవడం బతుకులో అన్నిటికన్నా పెద్ద దుర్ఘటన కాబట్టి. దాన్ని ఊహించి చెప్పలేని జ్యోతిష్యం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు.

  8. రవీంద్రధనుస్సు గురించి Venu Dasigi (VEDA) గారి అభిప్రాయం:

    01/08/2011 1:24 am

    వాడపల్లి శేషతల్పశాయి గారు 45 యేళ్ళనాటి వ్యాసాన్ని పరిచయం చేసినందుకూ, ఆంధ్రభారతి వారు ఆవ్యాసాన్ని అందించినందుకూ వారికి చాలా కృతజ్ఞతలు!

    అప్పటికీ ఇప్పటికీ యీకవిత మీద ఆసక్తి ఏమాత్రం తగ్గకపోవడం రవీంద్రుని ప్రతిభకు తార్కాణమైతే, ఆవ్యాసంలోనూ, నావ్యాసంలోనూ అదే కవులు ఎక్కువమంది కనిపించకపోవడం మరొక విధంగా రవీంద్రుని ప్రతిభకు అంజలి పట్టడమేననుకోవచ్చు. భారతి వ్యాసాన్నిబట్టి ఆదిపూడి సోమనాథరావు గారి అనువాదం ఇప్పటికి దాదాపు 85 యేళ్ళ క్రిందటి నాటిదన్నమాట. మరి అది ఆవ్యాసరచయిత శ్రీవాత్సవగారికి ఎందుకు నచ్చలేదనంది నాకు కొంచెం ఆశ్చర్యకరమే.

    — వేణు దశిగి (వేద)

  9. మూడు లాంతర్లు గురించి indrani Palaparthy గారి అభిప్రాయం:

    01/07/2011 3:21 am

    కనక ప్రసాదు గారు:

    ఆట చాలించి కామెంటరీ/విశ్లేషణకి దిగడం ఆటగాళ్ళకి శారీరకపరిమితులదృష్ట్యా అవసరం. సృజనకారులకెందుకీ గోల? కనకప్రసాద్ గారు, ఈ telling మానేసి showingలోకి వచ్చేద్దురూ.

    విభు గారితో ఏకీభవిస్తానండీ.

    వ్యాసాలు చాలా శక్తివంతంగా, ఆలోచింపజేసేవిగా ఉన్నాయి కానీ వీటిల్లో పడి కమ్మకమ్మగా, కారం కారంగా మిరపకాయ బజ్జీల్లా ఉండే మీ కధలు,ఎండాకాలంలో చల్లని గోళీ సోడాల్లా జిల్లుమనిపించే మీ కవితలు రాయడం మానేయకండే…

    పాలపర్తి ఇంద్రాణి.

  10. కృష్ణా తటచారిన్ గురించి indrani Palaparthy గారి అభిప్రాయం:

    01/07/2011 3:07 am

    కనక ప్రసాదు గారు:

    పాట వీనులవిందుగా ఉన్నదండి.ఇప్పటికి పది సార్లు విన్నాను.

    పాలపర్తి ఇంద్రాణి.

« 1 ... 1090 1091 1092 1093 1094 ... 1583 »