Comment navigation


15828

« 1 ... 1091 1092 1093 1094 1095 ... 1583 »

  1. ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి మోహన గారి అభిప్రాయం:

    01/05/2011 1:35 pm

    ఇలాటి ప్రత్యేక సంచికలు ఉండాలా ఉండకూడదా అనే దానిపైన కాదు ఈ అభిప్రాయం. పాత సంచికలు తిరగవేసి అందులో ఇలాటివి ఎన్ని ఉన్నాయో అనే విషయాన్ని తెల్పడమే దీని ఉద్దేశం. జనవరి 2007 నుండి విడుదలయిన ఈమాట సంచికలను ఇందుకై ఎన్నుకొన్నాను. జనవరి 2008లో భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినోత్సవము సందర్భముగా దీనిని ప్రచురించారు. చనిపోయినవారిపయిన మాత్రమే కాదు బతికిఉన్న వాళ్లపయిన కూడ సంచికలను ప్రచురిస్తారు అన్నదానికి ఇది నిదర్శనము. తరువాత నవంబరు 2008లో స్మైలుపైన ఒక సంచిక వచ్చింది. నవంబరు 2009 నుండి ప్రత్యేక సంచికలు కొన్ని ఎక్కువే. అయితే దానికి ఒక కారణము ఉంది. నవంబరు 2009 సంచిక కొ.కు.ను, జనవరి 2010 సంచిక శ్రీశ్రీని వారి శతజయంతి సందర్భముగా సంస్మరిస్తూ ప్రచురించినవి. జూలై 2010 సంచిక శ్రీకృష్ణదేవరాయల సింహాసనారోహణమయి 500 సంవత్సరాలు కాలం గడచిన సందర్భముగా వెలువడింది. కృష్ణరాయలను కన్నడిగులకన్న తెలుగువారు “మనవాడు” అనుకొంటారు, అందులకు ఇది నిదర్శనము. ఈ నెల సంచిక దివంగతులు సంపత్కుమారులను సంస్మరిస్తూ వెలువడింది. సామాన్యముగా ఇటువంటి పండితులను పండితులు, పరిశోధకులు తప్ప మిగిలిన వారెవ్వరూ పట్టించుకోరు. అట్టివారు కూడ తెలుగు భాషకు గొప్ప సేవ చేస్తూ ఉన్నారని ఈ సంచికను చూస్తే మనకు విదితమవుతుంది. అదీ కాక ఇందులోని వచన కవిత పద్యమా కాదా అన్నది ఇప్పుడు కూడ ఒక పెద్ద ప్రశ్నే. పై సంచికలకు భిన్నముగా ఊహించని కారణముగా వెలువడిన ఒకే ఒక సంచిక సెప్టెంబరు 2010 సంచిక. ఇది మహాకవి తిలకును గురించినది. ఈ నా అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయమని అడుగలేదు. నేనే వెదకి వ్రాసినది. మరో విషయం – ఈమాటలోని అన్ని విషయాలు అందరికీ నచ్చక పోవచ్చు, కాని ఇందులోని ఒక్కొక్కటి కొందరి కయినా తప్పక నచ్చుతుంది అనుకొంటాను. ముఖ్యముగా తెలుగుజాతి మరచిపోయిన, మరచిపోతున్న కొన్ని సాహిత్య, సంగీత, లలితకళల విలువలను వీరు ప్రోత్సాహం చేయడము ఎంతో ముదావహము. ఇది ముత్యాలసరము అంగడిలో కొనుక్కోవచ్చు అనుకొనే కాలం వాళ్లకు ఎంతో ఉపకరిస్తుంది.

    విధేయుడు – మోహన

  2. కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/05/2011 1:18 pm

    కన్యాశుల్కం ఆనాటికి ఒక ఆధునిక నాటకం. అప్పారావు గారు నాటకం రాసి వ్యావహార భాషకీ..కన్యాశుల్కపు సమస్యకీ తన దృక్పధం నించి ఒక వేదికని ఇచ్చారు. అంతే !! ఆ పరిధిలోనే కన్యాశుల్కం నాటకం గమనించవలసి ఉంది. రచయిత చెప్పని విషయాలని రచయితకి ఆపాదించడం చేసినప్పుడు అందుకు జవాబులు ఆ రచన నించి దొరకడమ్ కస్టమ్ ఎప్పుడైనా !! ప్రాచీన సంప్రదాయ పధ్ధతిలో కన్యాశుల్కం నాటకాన్ని చూసి కోవెల సంపత్కుమార దాన్ని రసచర్చ లోకి నడిపించడలో సబబూ లేదు. అర్ధమూ లేదు. ఆస్కార్ వైల్డ్ తరహా లాంటి వారి రచనల్లో మనకి కనిపించే సంభాషణల వాడి “పంచ్ ” లాంటిది మనకి కన్యాశుల్కం లో కన్పిస్తుంది. ఆనాటికి అప్పారావు గారి మీద అప్పటి పాశ్చ్యాత రచయితల ప్రేరణలని ఆ నాటకం మనకి తెలియజేస్తుంది.

    ఒక రచయితకి తన రచన పరిధినీ దాని ప్రయోజనాన్నీ విస్తరించుకునే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. కన్యాశుల్కం మొదటి ప్రతికీ మలిప్రతికీ మధ్య ఉన్న భేదం రచయితగా అప్పారావుగారి ఆశయాల లో వచ్చిన మార్పు కూడా కావొచ్చు. మధురవాణి పాత్ర పెరగడం ..గిరీశం వేపునుంచి ఫోకస్ మధురవాణి వేపు మారితే గనక అలా జరగడానికి ఆయన తనవైన కారణాలకి అవకాశం కల్పిచుకోడం అసాధ్యం కానఖ్ఖరలేదు. గిరీశం ఒక “మంచి” పాత్ర ఏ కోశానా కాదు. ఆ నాటకం బట్టి ఆ పాత్ర మీద రచయితగా అప్పారావు గారికి ఏమంత సానుభూతి కూడా ఉన్నట్టు కనబడదు. అసలు కన్యాశుల్కం నాటకం లో ఏ మగ పాత్ర మీదా అప్పారావుగారికి సానుభూతి ఉన్నట్టు అన్పించదు.
    గిరీశం చేత ఆయన అనేక భావాలు మాట్లాడించారు. అందులో కప్పదాట్లూ ఉంటాయి. సదాశయాలూ ఉంటాయి. గిరీశానికి ప్రధానంగా తాను మాత్రమే ప్రధానం. ఇంకెవ్వరూ కాదు. అతగాడు ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా తనే కేంద్రంగా చేసిన వాడు. తన బాగు కోసమే చేసిన వాడు. అలాంటి పాత్ర “మచి వాడు ” అవగలగటమ్ అసాధ్యం జీవితంలో!! అందుకనే అప్పారావుగారు బుచ్చమ్మ పెళ్ళిని గిరీశం తో జరగనివ్వలేదు.

    ఇంక అప్పారావుగారికి వైదీకి నియ్యోగి భేదాలు మెండుగా ఉన్నాయని ఆరోపించడం లో అర్ధం లేదు. అందుకు ఆ నాటకం నించీ ఏ ఆధారమూ లేదు. రామప్పంతుల్ని రెండవ ప్రతిలో ఆయన నియ్యోగిని ఎందుకు చెయ్యాలీ?? ఆయనకి అసలు సౌజన్యారావు మీదనే అంత సదభిప్రాయం ఉన్నట్టు కనపడదు. సౌజన్యారావు పంతులూ నియ్యోగే!! ఇకపోతే కొండుభోట్లు సిధ్ధాంతీ లాంటి పాత్రలు మాత్రమే వైదీకి పాత్రలు. వాటిని ఆయన వెకిలి పాత్రలుగా చూపించలేదు. వీళ్ళు కాక మిగిలిన పాత్రలు అంటే అగ్నిహోత్రావధాన్లూ..లుభ్దావధాన్లూ..కరటక శాస్త్రీ..గిరీశం వీరంతా “ద్రావిడ బ్రాహ్మణులు” అప్పారావు గారు విజయనగరం ఇలాకాలోని ద్రావిడ బ్రాహ్మణులనే తన నాటకంలో చాదస్తులుగా చూపించేరు. వారి ఇంటి పేర్లతో సహా రాసేరాయన. “నేమాని” గిరీశం. అలాగే బుచ్చమ్మ గిరీశంతో అంటుంది ఇలా !! ” మీరొప్పుకుంటే మా రాంభొట్ల అచ్చమ్మ మిమ్మల్ని పెళ్ళాడుతానంది” అని. ఇదులోని నేమాని ..రాంభొట్ల ఇంటీ పేర్లు ద్రావిడుల ఇంటి పేర్లు గానీ వైదీకుల ఇంటి పేర్లు కావు. నందాపురపు పట్టీ [ పట్టీ అంటే 18 అగ్రహారాలు] అంతా ద్రావిడ బ్రాహ్మణ్యమే !! వైదీకులు నియ్యోగులూ తగుమాత్రంగా ఉన్న ప్రాంతాలు అవి. ఈ సంగతి ఆ ప్రాంతాలని ఎరిగిన వారికి తెలుసు.

    అందువలన గురజాడ అప్పారావు గారికి వైదీకి ద్వేషాన్నీ..నియ్యోగపుటభిమానాన్నీ ఇవాళ కొత్తగా అంటగట్టటం లో నిజమూ లేదు. ఔచిత్యమూ లేదు.

    రమ.

  3. కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ గురించి మోహన గారి అభిప్రాయం:

    01/05/2011 11:52 am

    గురజాడవారి కాలములోని జాతి, వర్గ రాజకీయాలు నాకు ఎక్కువ తెలియవు కానీ నన్నయ కాలములో ఈ కాలములోవలె వైదికులు, నియోగులు ఉన్నారా అనే సందేహము నాకు కలుగుతుంది. బాటసారిగారూ, మీరు నన్నెచోడుని కుమారసంభవము కుహనా కవిత్వమని, మానవల్లి రామకృష్ణకవి వ్రాసి నన్నెచోడునికి ఆపాదించారు అనే వాదాన్ని ఏ ఒకరో ఇద్దరో తప్ప తెలుగు కవులు, పండితులు, పరిశోధకులు అందరూ నిరాకరించారు. వారి వాదన అంతా నన్నెచోడుని కాలము గురించే. ఇంతకూ నన్నెచోడుడు వైదికుడు కాడు, నియోగి అసలే కాడు, ఒక క్షత్రియుడు. వివరాలకు నేను వ్రాసిన కవిరాజశిఖామణి, క్రౌంచపదము వ్యాసాలను చదువుతారని ఆశిస్తాను.

    విధేయుడు – మోహన

  4. విశ్వనాథ కోవెల గురించి మోహన గారి అభిప్రాయం:

    01/05/2011 10:39 am

    కామేశ్వర రావుగారూ, ఐదవ అక్షరము లఘువు మాత్రమే కాదు, ఆరవ ఏడవ అక్షరాలు గురువుగా కూడ ఉండాలి. మీరు చెప్పిన ఉదాహరణలో అనేకదంతం లోని తం గురువే ఐనా, భక్తానం లోని మొదటి రెండు అక్షరాలు గురువే కనుక శ్లోకాన్ని పాడేటప్పుడు గురువును లఘువుగా పాడుకోవచ్చు. కాని ఇక్కడ సా జయతి లోని జయ అక్షరాలు రెండూ లఘువులే. అందువల్ల ఇది పద్యము కాదని నేను చెప్పలేదు. సామాన్యముగా మనము అర్థము చేసికొనే శ్లోకములా లేదు ఇది అని మాత్రమే అన్నాను. విధేయుడు – మోహన

  5. విశ్వనాథ కోవెల గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/05/2011 2:26 am

    మోహనగారు, నరసింహమూర్తిగారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
    మోహనగారు, చివరి శ్లోకం మూడవపాదం సంపత్కుమార “విశ్వనాథ సాహిత్య దర్శనం” పుస్తకంలో ఉన్నట్టుగానే ఇక్కడ ఇచ్చాను. అందులో ముద్రారాక్షసమైతే నాకు కనిపించలేదు. మూడవపాదంలో అయిదో అక్షరం గురువవ్వడం గురించా మీరన్నది? బహుశా అది కచ్చితంగా పాటించాల్సిన నియమం కాదనుకుంటా. కొన్ని అనుష్టుప్ పద్యాలలో గురువు కనిపిస్తోంది (ఉదా: అగజానన పద్మార్కం మూడవపాదం).

  6. పాఠకులకు సూచనలు గురించి మోహన గారి అభిప్రాయం:

    01/04/2011 7:28 pm

    సుధాకర్ గారు మంచి సలహానే ఇచ్చారు. ఈమాట ప్రతి సంచిక ఎందరు చూస్తారో? ఒక పాఠకుల counter పెడితే బాగుంటుందేమో? – మోహన

  7. ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/04/2011 2:03 pm

    లైలా గారూ !! మా అనేక మంది భావనలకి మీ లేఖ ప్రతిబింబమయ్యిది.

    చాలా సూటిగా ఉన్న విషయాన్ని చెప్పినందుకు మీకు నా అభినందనలు. నాకు ఇంకో సందేహం కూడా వచ్చింది. అథవా వీరు అంటే ఈమాట పత్రిక వారు ఆ “పండితుల గొప్పదనాలకి” పట్టం కట్టదలుచుకున్నారనే అనుకుందాం.. దాన్ని వారు బతికి ఉన్నప్పుడే చెప్తే గనక కనీసం ఆ “పండితులు” చదువుకుని సంతోషించుకుని అన్నా ఉండేవారేమో కద? మనుష్యుల్లోని ఆ గొప్పదనాలన్ని వాళ్ళు పోయేకే ఎందుకు బయటికి మాట్లాడాలని అన్పిస్తుంది చెప్మా?? వాళ్ళు బతికి ఉండగా చెప్పకూడదా ఏమి?? పండితులు పోతేనే గానీ వారిలోని “గొప్పదనాలని” గురించి మాట్లాడరన్నమాట.!! ఇదెలాంటి లక్షణమో??

    పత్రికని రూపొందించడంలో.. ఈమాట వైఖరి లో స్పస్టంగా ఇవాళ కనిపిస్తూన్నవి ..చాందసం… అనాసక్తత ..యాంత్రికత.. విసుగూను. రచనల్లోనూ ఆ లోటుంది. వాటి ఎంపికలోనూ ఉంది. ఇలా స్మారక సంచికలని రూపొందించుకు పోవడంలో ఒక సులువుంది. కొత్త వారినించి రచనలని ఆశించనఖ్ఖరలేదు.. ఆ సరికే అచ్చైన రచనలతో ఒక పత్రికని నింపేయవచ్చును. మళ్ళీ 2 నెలలపాటు రచనల జంఝాటం లేదాయె!!

    రమ.

  8. కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ గురించి తెలుగు బాటసారి గారి అభిప్రాయం:

    01/04/2011 1:17 pm

    గుఱజాడ కూడా ఒక సంస్కర్తేనా ? అతను వైదికద్వేషి. నియోగుల fanatical అభిమాని. ఆయన రచనల నిండా అదే ధోరణి. తాను వైదీకుడని భావించిన ఆదికవి నన్నయ్య మీది ద్వేషంతో మానవిల్లి రామకృష్ణకవి అనే ఆయన చేత కుమారసంభవం అనే పద్యకావ్యాన్ని రచింపించి దాన్ని వావిళ్ళవారికి అందజేసి అది నన్నయ్యగారి మహాభారతం కంటే పూర్వగ్రంథమనీ, అందుచేత నన్నయ్యగారు ఆదికవి కాదనీ నిరూపించడానికి పూనుకున్నాడు.

    ఇది ఆ మేధావికి ఉన్న సంకుచిత చీకటి కోణం.

  9. కోనసీమ కథలు: వామనుడు గురించి మోహన గారి అభిప్రాయం:

    01/03/2011 4:13 pm

    మంచి కథ, చక్కని కథాశిల్పం! అన్నిటికంటె నాకు నచ్చింది కథ పేరు – వామనుడు. ఈ కథలో ఎవరు వామనుడు? రూపంలో నల్లగా పొట్టిగా ఉండే పేరప్పగారా, లేకపోతే ప్రేమాభిమానాలు లేని వారి కుటుంబ సభ్యులా? ఆలోచించాల్సిందే. – మోహన

  10. ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి sivalenka గారి అభిప్రాయం:

    01/03/2011 1:08 pm

    tried typing in telugu but somehow the letters are not coming out correctly.

    What laila gaaru said is absolutely true.. nothing more to add

« 1 ... 1091 1092 1093 1094 1095 ... 1583 »