రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కథలు చెప్పే అతను

రచన: బాలసుధాకర్ మౌళి
జులై 2018

పాటకి
రాళ్ళు కరిగి నీరైపోయిన కథ చెప్పాడు
ముప్పై ఏళ్ళుగా
ఏదో ఒక కథ
ఎవరికో ఒకరికి చెప్తూనే వున్నాడు
రాత్రి రెప్పవాల్చని కాలం వరకూ
పాదాల గడబిడ అడుగుల మధ్య
కుండపై దరువేస్తూ
ఏ గుండెలను కరిగించాలనో
ఆ నిశ్శబ్ద సంగీతలయకారుని ఆరాటం
ఏమో ఏ చైతన్యం వైపో

కదిపితే రాళ్ళ కథేం
నిజంగా నీళ్ళ కథే చెప్తాడు
నీళ్ళు అగ్నిగా మారి అడవిని అల్లుకున్న కథ
అశ్రునయనాలతో ఆలపిస్తాడు
అగ్ని కథేం
విల్లు పుష్పంగా విచ్చుకున్న కథ
గొప్ప తమకంతో చెప్తాడు
అతను చెప్పాలి గాని
కుక్కపిల్ల కూడా చెవులు రిక్కించి
వింటుంది

చిన్న గోనె పట్టా
దానిపైనే కూర్చుని
చుట్టూ ఆవరించిన
చీకటి తునకలను చెదరగొడ్తూ
ఒక్కో పాటని
గాలి వీస్తున్నంత సహజంగా
నేర్పుగా
పాడుతాడు

రాతి కాలాన్ని
నిర్దయగా ఛీకొట్టే
వొక్కడు
మనిషిని మనిషిని కలిపే
వొక రాగాన్ని అన్వేషిస్తూ భంగపడ్తూ
యిదే బతుకు అన్నాడు
చెట్టుని కొమ్మని పువ్వుని
మనుషుల్లోకి మళ్ళించే
మహా కంకణమేదో కట్టుకున్నట్టున్నాడు
నావైపు తిరిగి ఒక దరువు వేశాడు

అతని దరువు
రాత్రి నిద్రలోనూ వినిపిస్తుంది

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    కె.కె. రామయ్య July 6, 2018 6:08 am

    ” అడవిని అల్లుకున్న అగ్ని కథ – – –
    అశ్రునయనాలతో చైతన్యం కోసం ఆలపిస్తాడు ”
    వొందనాలు మౌళీ

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కథలు చెప్పే అతను

ఇటువంటివే…

  1. అతను నవ్వుతున్నాడు
  2. సిలబస్: 7. బొమ్మలు చెప్పే కథ
  3. ప్రేమల కథలు
  4. బేతాళ కథలు: కథన కుతూహలం – 2
  5. తిలక్ కథలు

జులై 2018 సంచికలో ...

  • 1 + 1
  • ఒక ఆషాఢపు రాత్రి
  • ఒక ప్రయాణం
  • ఒక శిల్పి అంతిమ యాత్ర
  • కథ
  • కథలు చెప్పే అతను
  • కాళీ పదములు
  • కొత్తనేలపాట
  • గడినుడి – 21
  • జీవితానందం ఎక్కడున్నది?
  • జులై 2018
  • నటనకు గీటురాయి
  • నాకు నచ్చిన పద్యం: ఒక మహారాజులోని పసి మనసు
  • పది నిముషాలు
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 2
  • విషమవృత్తము ఉద్గతలో తాళవృత్తపు మూసలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 21
  • సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు
  • సిలబస్: 5. బొమ్మ ఎందుకు?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నాకు నచ్చిన పద్యం: ఒక మహారాజులోని పసి మనసు
పది నిముషాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.