కథ మొదట్లో ఏమీ లేదు
అదే కథ ముగిసే సరికి
ఏమీ మిగిలేలా లేదు
ఉహూ…
ఉంటుంది
ఒక్కటే ఉంటుంది
మనిషి కథ
కాకపోతే
ప్రచురించటానికి
ప్రపంచాన్ని మొదలెట్టాలి
మళ్ళీ
అదే శూన్యం నుండి
కానీ ఎలా?
అదిగో ప్రణవం
సృష్టికి మూలం
మూగపోయింది
మనిషి కథని చదివిన పాపమేమో
మళ్ళీ ధ్వనించేలా లేదు.