అడ్డం
- భక్తులకి సంతానాన్ని ప్రసాదించే దేవత కోసం ఆరుద్ర పదాలు (4)
సమాధానం: కూనలమ్మ - ఒకటి అడ్డంలో కవిగారు “అచ్చోట తిరగేసి కొడితే దాని ఖర్మం” అని దీనిగురించే అన్నారు (3)
సమాధానం: తాబేలు - ప్రభావము కల కస్తూరి? కాదు, గురుత్వాకర్షణ కేంద్రం (5)
సమాధానం: గరిమనాభి - ఈ మందు పిట్టకి పోస్తారు, సామెత ప్రకారం (2)
సమాధానం: వస - రాజకీయ కీటకాల మధ్య విభేదాల ధ్వని కాబోలు – ఎటునుంచైనా వినిపిస్తుంది (5)
సమాధానం: లుకలుకలు - కొండవాగు రమ్మంది. జంతువుల వేటకి వల దొరికింది (3)
సమాధానం: వాగుర - ఊడ్చి పెట్టుకు పోయేదానికి వంద ముఖాలా? (5)
సమాధానం: చీపురుకట్ట - మా తాతలు పిల్లల్ని మొదట్లో మధ్యలో కూర్చోపెట్టుకున్న కన్నవారు (5)
సమాధానం: మాతాపితలు - అధికారికంగా సమ్మతిస్తే వేసేది (2)
సమాధానం: ముద్ర - చీమలు పెట్టే వాటి మధ్య వాననుండి కాపాడేది చేరిస్తే చిత్తకార్తిలో మొలకలేస్తాయి (6)
సమాధానం: పుట్టగొడుగులు - హృదయం లేని గృహద్వారంతో రామాయణపాత్ర (2)
సమాధానం: వాలి - మెత్తని పకోడీలు కావాలంటే శ్రీహరి నిఘంటువు చూడాలి (5)
సమాధానం: పత్తికాయలు - తుమ్మెద తేనెతిండి (5)
సమాధానం: మధులిహము - శాంతిపర్వంలో వెనకబడ్డ భర్త (2)
సమాధానం: పతి - వ్యాధిని తెచ్చే కీటకాలు సమాజంలో కూడా ఉంటాయి (6)
సమాధానం: చీడపురుగులు - మూతిలేని వానర సమూహము కట్టిన చీర (2)
సమాధానం: కోక - మత్తుకలిగించే విత్తులు (5)
సమాధానం: గసగసాలు - ఏనుగు వికృత రూపం మధ్య వగరు భరించలేనిదైతే సాంబ్రాణికడ్డీ వెలిగించండి (5)
సమాధానం: అగరువత్తి - ఏదుపంది ఎముక (3)
సమాధానం: జడక - ఒకప్పటి మన ఏలికలు (5)
సమాధానం: తెల్లదొరలు - మృత్యువు వికృతరూపం దాలిస్తే? (2)
సమాధానం: మిత్తి - లవణజలము చమురుతో కలిస్తే మేఘం వస్తుందా? (5)
సమాధానం: జలముచము - వేలు కొలమానం (3)
సమాధానం: అంగుళం - దట్టంగా కుట్టిన బట్టతో ఎగిరే పక్షి (4)
సమాధానం: బొంతకాకి
నిలువు
- పనివాడికి దొరికే పన్ను? (2)
సమాధానం: కూలి - ముహూర్తంతో మదపుటేనుగు? (2)
సమాధానం: లగ్నం - రాయలసీమ పప్పులు ఒకప్పటి మన చిల్లర డబ్బులు (3)
సమాధానం: బేడలు - ఇవే (3)
సమాధానం: గడులు - చైత్రమాసం ఏడురోజులు మద్యపాన కార్యక్రమం చెయ్యొచ్చా? (5)
సమాధానం: మధువారము - మానలేని దురభిమానము లో పుట్టిన వజ్రాయుధం (4)
సమాధానం: భిదురము - ఇది పక్షి కాదు. తినే చేప (4)
సమాధానం: ఈసపిట్ట - బలపం కట్టుకుని తిరిగే శరీరభాగం (2)
సమాధానం: కాలు - మావిచిగురు అంచులతో పర్యాయం (2)
సమాధానం: మారు - అమ్మమ్మ లేదు పోయింది. మిగిలింది మాతలుడు మాత్రమే (2)
సమాధానం: మామ - ఆడచీమని చంపి పీలికలు చెయ్యండి (4)
సమాధానం: పిపీలిక - ఆకలేస్తే కడుపులో పరిగెత్తే జంతువులు (4)
సమాధానం: ఎలుకలు - మన శరీరం పైన ఉండేవాటి వల్ల వచ్చే కళంకం (4)
సమాధానం: పుట్టుమచ్చ - గండ్ర తర్వాత పట్టుకునే చేతిపనిముట్టు (3)
సమాధానం: గొడ్డలి - కారలేని హెచ్చువేత స్వభావం (3)
సమాధానం: గుణము - మంచానికి ఇది బిగించకపోతే పట్టెక్కడ? (3)
సమాధానం: పట్టెడ - అడవిలో ఉండే పల్లె (3)
సమాధానం: కారూరు - మూడు దారుల్లో తిరిగే గంగ (4)
సమాధానం: త్రిపథగ - ఆ వానలు ఆజ్ఞ లేకుండా పడితే పదునే! (2)
సమాధానం: వాలు - స్వప్నలేఖిని కాకిగోల (5)
సమాధానం: కలకలము - ఈ ఉంగరపువేలుకి పేరులేదు (4)
సమాధానం: అనామిక - సుగ్రీవుని భార్య మరుజన్మలో తిరిగి పుట్టింది (2)
సమాధానం: రుమ - నలభైఐదులో మొదటి సగం – పదహారులో చివర మూడొంతులు (3)
సమాధానం: అజపజ - తెల్లసవరములో వరస తెగింది. ఇది స్పష్టము (3)
సమాధానం: తెల్లము - దొందు జోడు (2)
సమాధానం: దొయి - ఎద్దు మెడలో గంట కట్టాలంటే చేష్టలుడుగుతారా? (3)
సమాధానం: లుడుగు - ధ్వని చేసే బరువు (2)
సమాధానం: మోత - నండూరి నాయుడు బావ మరదలు (2)
సమాధానం: ఎంకి