మాట్లాడ్డం మొదలుపెట్టడానికి ముందుగా ఒక సిగరెట్టందించేడు కమిసార్. నేను వెంటనే ఒక రెండు దమ్ముల్లాగి అందులో మూడో వంతు అవగొట్టాను. అప్పటికి కొన్ని రోజులుగా నేను సిగరెట్ మొహం చూళ్ళేదు. అంతకు ముందు వ్రాసిన ఉత్తరంలో సిగరెట్లు పెట్టలేదు మా అమ్మ. కొద్ది రోజుల్లో తనే నన్ను చూడ్డానికి తెల్లగుర్రపు సరస్సుకు వస్తానని వ్రాసింది.

ప్రేమ వర్షం కురిపిస్తుందనుకున్న మేఘం
నిర్దయగా పిడుగుల్ని విసిరినా
వెలుగు నిస్తుందనుకున్న దీపం
వేల మిణుగురులుగా మారి
అనంత శూన్యంలోకి అదృశ్యమయినా
ఆగకు

మనకి చెప్పుకోడానికి చరిత్ర లేదు. అది లేకపోవడమే నా శిరోభారానికి మూలం. అవును ఏం ఉన్నా లేకపోయినా పాలకులకి చరిత్ర ముఖ్యం. అదెంత బాగుంటే… అంత బాగా మనం గుర్తింపు పొందుతాం. అర్ధవయ్యిందా? అందుకని మనం మన చరిత్రని రాయించుకోవాల! అవసరమైతే అసలు చరిత్రలని తిరగ రాయించెయ్యాల. అడ్డొస్తున్నాయనుకుంటే ఆ పాత చరిత్రలని చింపి పారెయ్యాల!

ప్రేమని వివరించాలని ఆపేక్షని పూయాలని
నువ్వంటే నాకిష్టమని అంతా నీకోసమేనని
మొత్తం కళ్ళతోనే సంపూర్ణంగా
ఆర్తిగా చూస్తూ ఆర్ద్రంగా అల్లుకుంటూ
అప్పుడప్పుడూ గింజలకని గూట్లోకి చేరీ
పక్కగదిలోకెళ్ళినా శక్తికొద్దీ పిలుస్తూ
అదే పనిగా కూస్తూ అన్న మాటలు అప్పగిస్తూ…

ఆటల మైదానాల్లో స్కోరర్‌ని నేను. ఆటతో పాటు జీవితాన్ని రికార్ద్ చేయడం నా పని. ఇప్పుడు ఈ పుస్తకానికి ఒక ‘ముందు మాట’ అంటూ చెప్పాలి కాబట్టి–ఎందుకు ఈ రాతలు ఇప్పుడు? ఇలాగని? పెదాలు బిగించుకుని మోకాళ్ళ మీద కూచుని జుట్టు కళ్ళమీదికి జారుతుంటే చేత్తో తోసుకుంటూ, చాలా చిన్నవాడిగా, ఇంటా బయటా గోడల మీద బొగ్గుతో నల్లబొమ్మలు గీసే నేనే నాకు కనబడతా.

ఆయనంటే అందమైన పుస్తకానికి చిరునామా. పుస్తక ప్రియులకి విజయవాడలో దర్శనీయ స్థలాల్లో నవోదయ ఒకటి. దాని అధిపతి రామమోహనరావంటే సీటు వదలని విక్రమార్కుడు. స్నేహానికి, పుస్తకాల ప్రచురణకి ఆయనొక అగ్ మార్కు. విశిష్ట ప్రచురణకర్తగా రామినేని అవార్డు అందుకున్న నవోదయతో అరమరికలు లేని సంభాషణం!

కార్యమో, కాలక్షేపమో ఏదీ తోచక సగం నిద్రలో ఎడం చేత్తో ఏవో జ్ఞాపకాలు రాసిపడేసిన (మన నెత్తిన) తీరు కథలు కావు… పుస్తకం నిండార వున్న చిన్న చిన్న సంగతులన్నీ మనిషి స్పృహ తాలూకు తేమ ఏ మాత్రం ఎండిపోకుండా వున్నా, దానికి పని కల్పిస్తాయి. పత్రికల్లో వార్త చదవనివాళ్ళకు సైతం వారి ఆలోచనల్లో చిన్నపాటి సుడిగుండమొకటి బయలుదేరి ‘వాట్ మస్ట్ బి డన్?” అని నిలదీస్తుంది.

నవోదయలో అడుగిడిన సాహితీవేత్తలంతా వెలుగుమూర్తులే! ఆ వెలుగే ఇదంతా! మంచి పుస్తకానికి చిరునామా నవోదయ! మహోదయుల సాయంకాలపు సంగమమై 50యేళ్ళు వెలిగింది. పుస్తకాల గుళ్ళో ధ్వజస్తంభంలా నవోదయను నిలపాలన్నది నా కల. నేనింకా ఆ కల కంటూనే ఉన్నాను. నవోదయ పుస్తకాలు తెలుగు భాష ఉన్నంతవరకూ సజీవం. తెలుగు భాష ఉన్నంతవరకూ నవోదయ సజీవం.

సృజనలో అసందర్భంగానైనా, అసంబద్ధంగానైనా తాము చెప్పదల్చుకున్నది చొప్పించే కళాకారులు చుట్టూ ఉన్న ప్రస్తుత కాలంలో, కళ కళ కోసమే అన్న భావనను ఇంత బలంగా చిత్రించిన నవల రావడమే ఆశ్చర్యం. ఒకసారి సృజన నీ నుండి వేరు పడ్డాక, అదిక నీది కాబోదన్న మాటలను, రచయిత పండించుకున్న విధానమిది.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

అడ్డం నియమం పత్రంలో లేని మూలాన భీరువులు పఠించేది. (6) సమాధానం: పలాయనమంత్రం గిజిగాడు (6) సమాధానం: బంగారుపిచ్చుక ఇది అంటే నాకు తెలీదా […]

క్రితం సంచికలోని గడినుడి-38కి మొదటి పది రోజుల్లోనే పదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, పాటిబళ్ళ శేషగిరిరావు, జిబిటి సుందరి, అగడి ప్రతిభ, వైదేహి అక్కిపెద్ది, ముకుందుల బాలసుబ్రహ్మణ్యం, బండారు పద్మ, సరస్వతి పొన్నాడ, విజయాదిత్య, రవిచంద్ర ఇనగంటి.

గడి నుడి-38 సమాధానాలు, వివరణ.

విమల్‌కు చేతులు కాళ్ళు వణకసాగాయి. మిథున్ సంచి, స్సాక్స్, నీళ్ళ సీసా అన్నీ కారులోనే ఉన్నాయి. విమల్ లేప్‌టాప్, పుస్తకాల సంచీ, ఫైళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మిథున్ మాత్రం లేడు. ఏం జరిగింది? బిడ్డ ఎలా తప్పిపోయాడు? అన్నది వాడి బుర్రకు అందలేదు. బయలుదేరే తొందరలో బిడ్డను కారులో ఎక్కించడం మరిచిపోయాడా? వాడికి నమ్మబుద్ధి కాలేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద దుమారాన్నే లేపింది. ప్రస్తుత ప్రపంచంలో ఎదగడానికి, ఆర్థికంగా ఉన్నతమైన వర్గాలతో విద్యావుద్యోగాలలో పోటీ పడడానికి బడుగు వర్గాలవారికి ఉపయోగపడుతుందని ఈ నిర్ణయాన్ని సమర్థించే వారొకపక్క, విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని ఆవేశంతో ప్రతిఘటిస్తున్న భాషాభిమానులొకపక్క, తమ తమ కులమతవర్గ వాదాలకనుగుణంగా దీనికి రకరకాల రంగులలుముతున్న మరికొందరొకపక్క, తలో వైపు నుండి కూడి విషయాన్ని ఫక్తు రాజకీయం చేశారు. వీళ్ళ నినాదాలన్నీ తమ లబ్ధి కోసమూ, తమ అత్యుత్సాహమో, అజ్ఞానమో ప్రదర్శించడం కోసమూ తప్ప నిజంగా ప్రభుత్వ పాఠశాలలు తప్ప గతిలేని పిల్లల బాగోగుల గురించి కాదు. వాళ్ళకు ఎలాంటి చదువు కావాలి, అది ఎలా చెప్పచ్చు, వారికీ ఎలా సమానావకాశాలు కల్పించచ్చు అని కాదు. ఉద్వేగపూరిత విశ్వాసాలను దాటి, తెలుగు బోధన కావాలనేవారు దానివల్ల విద్యార్థులకు ఏం ప్రయోజనం కలుగుతోంది అని ఆలోచించటంలేదు. ఆంగ్ల బోధనను సమర్థించేవారు అసలు మన పాఠశాలల్లో ఆంగ్లం చక్కగా నేర్పగలిగే ఉపాధ్యాయులెంతమంది ఉన్నారు, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా అమలు చేయగలదు అన్నవి ఆలోచించటంలేదు. ఒక భాష మాట్లాడగలగడం వేరు. ఆ భాషలో ఆలోచించగలిగే సామర్థ్యం తెచ్చుకోవడం వేరు. కనీసం తను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పగలిగేంతగా, రాయగలిగేంతగా తర్ఫీదునివ్వగలిగిన ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయి? ఉపాధ్యాయులెందరున్నారు? ఇప్పటికే తెలుగు ఆలోచననిచ్చే భాషగా కాకుండాపోయింది. అందువల్ల ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ప్రస్తుత తెలుగు సమాజాల్లో విద్యార్థులకు ఏ మేలు జరుగుతుంది అనేది చర్చనీయాంశమే. అదేవిధంగా అరకొర ఆంగ్లబోధన వల్ల విద్యార్థులకు భావిజీవితంలో ఉపయోగపడేంత భాషాసామర్థ్యం వస్తుందన్నదీ అనుమానాస్పదమే. గత ముప్ఫై నలభై ఏండ్లలో తెలుగు ఇంగ్లీషు మీడియాలలో చదివిన విద్యార్థులెందరిని చూసినా మాధ్యమం వారి భాషను కాని, ఆలోచనను కాని ప్రభావితం చేసినట్టు కనిపించదు. మరోపక్క, గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశంలో విద్యాబోధన స్థాయి క్షీణిస్తూ వచ్చిన మాటా రహస్యమేం కాదు. ఈ స్థితిలో, విద్యాబోధన ఏ మాధ్యమంలో అన్న చర్చకు ముందు, ఏ విద్య? ఏ రకమైన బోధన? అన్న ప్రశ్నలు వివరంగా చర్చించబడాలి. కేవలం ఉపాధి కోసమే విద్య అనుకున్నప్పుడు అది ఏ మాధ్యమంలో ఉండాలి అనేది ఆర్థిక సామాజిక కారణాల బట్టే ఉంటుంది. కానీ విద్య కేవలం మనుగడ కోసం మాత్రమే కాదు. భాష మనిషికీ మనిషికీ మధ్య ఉన్న సంభాషణ అంతరించకుండా ఉండేందుకే కాదు. ఏ తరానికాతరంలో బుద్ధిజీవులను పెంచేదే విద్య అని, అందుకు తోడ్పడే భాష అవసరమని, మర్చిపోకూడదు. ఇప్పుడు మన తెలుగుదేశంలో జనం వెంపర్లాడుతున్న భాష, అది తెలుగైనా ఇంగ్లీషైనా, ఒక స్వంత ఆలోచననిచ్చే భాషగా ఉందా? మనం పిల్లలకు ఏ రకమైన విద్య నేర్పించాలనుకుంటున్నాం, నేర్పిస్తున్నాం, ఎందుకు, ఎలా నేర్పిస్తున్నాం? అన్న చర్చలు మొదవలవ్వాలి. మాధ్యమాల మార్పుకన్నా, శిక్షణలోనూ, శిక్షకులలోనూ మార్పు ముఖ్యమన్న ఎరుక అన్ని చర్చల్లోనూ ప్రధానంగా వినపడనంతకాలం, అవి ఎంతకాలం, ఏ స్థాయిలో నడిచినా ఏ లాభమూ లేదు.

ఏమనుకుంటున్నావు నాగురించి? వెండిరంగు దేవుడు పసుపుపచ్చ ఫాదర్‌ను అడిగేడు ఆక్రోశంతో, అలిసిపోయి, రాజీ పడిపోయిన గొంతుతో. నేను మిమ్మల్ని ఇలా కావాలనే, నాకు ఇష్టమయే పుట్టించాననుకుంటున్నావా? నేను మీ అందరూ బాధ పడుతుంటే చూసి ఆనందిస్తున్నానని అనుకుంటున్నావా? మీరు ఏడుస్తుంటే చూసి నవ్వుకొనే శాడిస్టులాగా కనిపిస్తున్నానా నీకు? ఇలా పుట్టించడమే నేను చేయగలిగింది. నాకు చేతనయింది. అంతే.

వీళ్ళకు మనలాంటి శ్రుతిమించిన పోటీతత్వం లేదు. నింపాదిగా తమ పని తాము చేసుకొంటూ పోతారు. రేయింబవళ్ళు పనిచేసి అందరికన్నా ముందు ఉండాలి అన్న తాపత్రయం లేదు. ఒక పట్టాన సహనం కోల్పోరు, ఆవేశపడరు. మనం కోల్పోయి ఆవేశపడినా స్పందించనే స్పందించరు. తరిమో, ఆశపెట్టో, భయపెట్టో వీళ్ళతో పనిచేయించలేం.

జనార్ధనరాజుకి రోజూ పిట్ట మాంసం వుండాలి. లేకపోతే ముద్ద దిగదు. నల్లగా నేరేడుపండులా నిగనిగలాడే జనార్ధనరాజు వయస్సు యాభైకి అటూ ఇటూ వుంటాయి. అంతటి నలుపు మొహంలోనూ ఎర్రటి పెదాలు ఎప్పుడూ తాంబూలం వేసుకున్నట్టు కనిపిస్తాయి. కాంతులీనే ఆయన కళ్ళు ఎలాటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆడవాళ్ళనైతే మరీను. ఆయన్ని బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆయన కళ్ళ వెనక కదిలే భావాల గురించి తెలుస్తుంది.

మా నాన్నకి కామ్రేడ్ గావ్‌ని చాచి లెంపకాయ కొట్టాలనిపించిందిట. మా అమ్మ చనిపోతే అతనికెందుకానందమో మా నాన్నకర్థం కాలేదు. నిజానికి, కామ్రేడ్ గావ్ ఆనందమల్లా, తను ఇంకా వెతకాల్సిన పని తప్పినందుకు మాత్రమే. కామ్రేడ్ గావ్ మా నాన్నతో తరువాత అన్నాడట. “షాంగ్‌హాయ్‌లో ఎంతమంది షూ గూయింగ్‌లున్నారో, మీకు తెలుసునా? 288 మంది! వాళ్ళలో ఒక మగవాడు కూడా ఉన్నాడు.

ఊహ కందని ఉదాసీనత
బరువుకాని బరువై
ఎద మీద వాలుతున్నప్పుడు
మూసీ మూయని నా కనురెప్పల మాటున
కదలీ కదలని ఒంటరి మౌన మేదో
దైన్య చిత్రాలను చెక్కుతుంటుంది.