ఇదే మొదలు. పిల్లాడు పుట్టాక వొంటరిగా ప్రయాణించడం! పెద్ధ ఝాన్సీరాణీలా ఫీలయిపోయి, వొక్కతే వెళ్ళగలనని బయల్దేరింది. ఇప్పుడు తెలుస్తోంది ఎంత కష్టవోఁ, ఎంత స్ట్రెస్సో! ఛ! మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి బ్యాడ్ డెసిషన్ తీసుకోకూడదు… లోపల్లోపల తిట్టుకుంటూ సీటు క్రింద నించి బ్యాగ్ బయటికి లాగింది. పిల్లాడి సామాన్లు అన్నీ సైడ్ పాకెట్‌లో సర్దేసింది. బ్యాగ్ సీట్ కిందనించి తీసి పక్కనే పెట్టుకుంది.

భర్తని కోల్పోయిన లైయస్ భార్య యొకాస్టా ఈడిపస్‌కి పట్టమహిషి అయింది! తను చంపినది తన తండ్రినే అనిన్నీ, తను వివాహం చేసుకున్నది తన తల్లినే అనిన్నీ ఈడిపస్‌కి కానీ అనుచరులకి కానీ ఊహామాత్రంగానైనా తెలియలేదు. విధి వైపరీత్యం! ఈడిపస్-యొకాస్టాల దాంపత్యానికి ఫలితంగా నలుగురు పిల్లలని కంటారు.

ఇట్టి స్థితిలో నాంగ్లేయులకీ ప్రజలలో నెట్టి పలుకుబడియుండును? భయము వల్ల నేర్పడిన భక్తియేగాని ప్రేమవలన నేర్పడిన విశ్వాసము లేదు. తమ అధికారమును సంపదను హరించి తమ్ము నాశనము చేసిన ఈ ఆంగ్ల ప్రభుత్వము నీ ప్రజలు ప్రేమింతురా? తమ గౌరవమును తీసివేసి అధోగతిలోనికి దింపినవారిని వీరు మన్నింతురా?

మంచి పనే చేశావ్ ఆలస్యంగా వచ్చి!
కనీసం పదిరోజుల ముందొచ్చుంటే
నిష్టూరమాడేదాన్నేమో
నిందించేదాన్నేమో
నీకూ నాకూ మధ్య దూరాన్ని నిలదీసి
గుట్టలుగా రాలిన నా ఎదురుచూపుల ఎడారుల్లో
నిన్ను చెయ్యి పట్టుకొని చరచరా తిప్పి

కానీ
ఎప్పట్లాగా అప్పటి నేను ఎగరలేదు
మళ్ళీ చిగురవ్వలేదు…
కళ్ళు నలిపాక వాడిపోనూలేదు.

ఈసారి ఇప్పటి నేనే
మళ్ళీ కొత్తగా మోడవ్వక్కర్లేదు!

సెగలు గుండెను తాకుతున్నా
పొగలు పైబడి కమ్మేస్తున్నా
తగలబడుతున్నది నీ నమ్మకమేనని
ఎన్నటికీ అంగీకరించవు
అస్థికల రూపంలోనైనా
అది నిలిచే ఉంటుందని
ఆశగా ఎదురుచూస్తునే ఉంటావు.

ఎవరెవరినో ప్రేమిస్తావు
ఎవరెవరినో మోహిస్తావు
కనీసం కామిస్తావు
కారునల్లని మేఘమై కౌగలిస్తావు
నిజానికి ఎదుట ఉన్నది ఎవరో
నీకూ తెలియదు, వారికే తెలియనట్లే

దేనికీ ఒరుసుకపోకుండా దందెడ పికిలిపోవుడేంది? ఆ దాగుడుమూతల మర్నాగిని కనిపెట్టాలె. ఇకపై కనిపెట్టుకుని వుండాలె.
ఎప్పుడు మొదలైందో ఈ వలపట దాపట తిరిగే అగులు బుగులు? ఎవలు నాటిండ్లో కలుపు బీజం? ఆరాదియ్యాలె.

అల్లిన అనుబంధాలు
పరచిన బతుకు వస్త్రం మీద
కుట్టిన వంకర టింకర చిత్రంలా
చేతిలో పట్టుకు చూసుకుంటుంటే
పొంగే దిగులు
ఇప్పుడిక ఎలా సరిచేయనూ

మీ హృదయములో బాధ గూడుకట్టుకొన్నప్పుడు ఈ పుస్తకము తెరచి ఒక్క ఐదు పేజీలు చదవగనే ఆ బాధ కరిగి ద్రవమై ఆపై యావిరి రూపమున బయటకు వెళ్ళి మీకు గాలిలో తేలియాడుచున్న యనుభూతి కలుగును. కోవిడ్-19 ప్రత్యేక వైద్యశాలలయందు దీనిని చదివించిన, రోగులకు శీఘ్ర ఉపశమనము కలుగునని ప్రయోగముల ద్వారా నిరూపితమైన సత్యము.

ప్రపంచంలో జనం అందరూ కూడా అనేకానేక రోగాలతో, విపత్తులతో మూలుగుతున్నారు. కొంతమందికి శారీరిక అనారోగ్యం అయితే కొంతమందికి మానసిక అనారోగ్యం. తనతో సహా ఎవరికీ కూడా పూర్తి ఆరోగ్యం అనేదే లేదు. జీవితంలో ఒకే ఒక విషయం ప్రతీవారికీ జరిగేదీ, జరగక తప్పనిదీ – చావు మాత్రమే. ఇదేనా సిద్ధార్థుడు సన్యాసం తీసుకోవడానిక్కారణం?

విలక్షణమైన రచనాపటిమ, ప్రత్యేకమైన శైలి-శిల్పాలతో కలాన్ని మంత్రదండంగా మార్చిన కథా రచయిత చంద్ర కన్నెగంటి. ఆయన వ్రాసిన కథల్లోంచి పన్నెండు ఆణిముత్యాలు, శ్రీనివాస్ బందా స్వరంలో వినండి.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఇది తన అమాయకపుకళ్ళతో చుట్టూ జరిగే జీవితాన్ని సునిశితంగా గమనించిన పిల్ల కథ. ఆ అమ్మాయి ఎక్కడా ఎవ్వరినీ నిలదీసినట్టు కనపడకపోవచ్చు; ఎదురుతిరిగి ఎవ్వరితోనూ పోట్లాడినట్టు కనపడకపోవచ్చు. కానీ తన ఎరుకలో ఒక మనిషిని మరో మనిషి గాయపరిచిన ప్రతిసారీ, అది తిరస్కారంగా పుస్తకంలో కనపడుతూనే ఉంది.

అడ్డం కార్డియోగ్రాఫు సమాధానం: హృల్లేఖ గజల్. పెన్నా శి.రా.కృ. పుస్తకం కూడా. సమాధానం: సల్లాపం నెత్తిపై జల్ల వేస్తే ఘాటైనది కనిపిస్తుంది. సమాధానం: వేల్లజ […]

పంజరంలో బందీ అయిన పక్షి ఎందుకు పాడుతుందో తెలుసా? తన రెక్కలు కత్తిరించబడి, తన కాళ్ళకు సంకెళ్ళు వేయబడి, రగిలిపోతున్న కోపం, నిస్సహాయతల ఊచలకావల చూడలేక, ఇక వేరే దారి లేక, దూరతీరాలకు తన గొంతు చేరాలని, స్వేచ్ఛాస్వాతంత్రాల కోసం తాను పాడే పాట పదిమందికీ వినిపించాలని–అంటుంది మాయా ఏన్జెలో తన కవితలో. ఇటీవల ప్రపంచమంతా వెల్లువెత్తుతున్న బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమం మొదట అమెరికాలో ఇలానే గొంతు విప్పుకుంది. తరతరాలుగా లోపల వేళ్ళూనుకున్న ఆధిపత్యభావజాలం సాటి మనిషి పీకపై కాలు పెట్టి ప్రాణాలు తీసివేయడానికి సంకోచించని ఆ క్షణంలో సాంకేతికంగా అభివృద్ధి చెందినంత మాత్రాన సామాజికంగాను అభివృద్ధి చెందినట్టు కాదని సర్వప్రపంచానికీ స్పష్టమయింది. రంగు, కులం, మతం, జాతి, లింగభేదం, అధికారం, ధనం-ఇలా సాటి మనిషిపై వివక్ష వేయి పడగలతో విషం చిమ్ముతూనే ఉంది. ఈ రుగ్మత ఏ ఒక్క దేశానిదో, ఏ ఒక్క సంస్కృతిదో కాదు. ప్రపంచమంతటా ఏదో ఒక రూపంలో ఈనాటికీ ఈ వివక్ష కనపడుతూనే ఉంది. అసహాయుల ప్రాణాలను బలిగొంటూనే ఉంది. కాలం మారిందనీ బానిస భావజాలం మేమిక మొయ్యమనీ ఇన్నాళ్ళూ దానిని భరించిన వాళ్ళు ఇప్పుడు బాహాటంగా చెప్పడం ఆధిపత్య సమాజానికి అహం మీద పడిన దెబ్బవుతోంది. ఎంత కట్టడి చేసినా తమ బ్రతుకుని గానం చేస్తూనే ఉండాలన్న పట్టుదలతో, వేనవేల ఒంటరి గొంతులు ఇప్పుడు ఒక్కటై మార్మోగుతున్నాయి. వివక్షకు గురైనవారి అనుభవాల్లోని వేదన, ఆ గొంతుల్లోని తడి, ధిక్కారం అందరికీ అర్థమవడం కోసం ఉద్యమిస్తున్నాయి. మునుపు లేని కొత్త చర్చలకు, కొత్త ఆలోచనలకు తావిస్తున్నాయి. సహానుభూతి ఉండీ సమస్యలోతులు పూర్తిగా తెలియనివారికి తెలియజేస్తున్నాయి. భిన్నాభిప్రాయాలను గౌరవించడానికి, భిన్నానుభవాలను అర్థం చేసుకోవడానికి, విభిన్నజీవనరీతులకు రెండు చేతులతో స్వాగతమిచ్చి తమ సరసనే స్థానమివ్వడానికి ఔదార్యం, సహనం, సహానుభూతి అవసరం. కత్తిరించబడ్డ చరిత్ర పుస్తకాలు, జల్లెడ పట్టబడిన బడిపాఠాలు అన్ని నిజాలూ చెప్పవు. అన్ని దృక్కోణాలూ చూపవు. మనసు లోపల్లోపలికి వెళ్ళి తమ అస్ఠిమూలగతమైన వివక్షాధోరణులను, అహంకార ఆధిపత్య ధోరణులను ఎవరికివారు తరచిచూసుకోగలగడమే సమాజంలో సమూలమైన మార్పు తెచ్చేందుకు మొదటి అడుగు. ఆ ఆలోచన మెదిలే దిశగా, అలా చూసేందుకు వీలైన ప్రశ్నలను వివక్ష, దాస్యం, అణచివేతల కొలిమిలో కాలిపోయి ఇక వేరే దారితోచని కళాకారుల గళం ఆర్తిగా అడుగుతూనే ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేసిన, ఇప్పటికీ చేస్తున్న అలాంటి గొంతులేవైనా మన చుట్టూనే ఉన్నాయా అని చెవులొగ్గి వినాల్సిన సందర్భమిది. మన లోపలి చీకటి కుహరంలో తెలియకుండానే దాగివున్న వివక్షాధోరణుల పైన ప్రతి ఒక్కరం నిజాయితీగా వెలుగు ప్రసరించుకోవాల్సిన తప్పనిసరి తరుణమిది. సాటిమనిషిని ద్వేషించడానికి వెయ్యి కారణాలెప్పుడూ ఉంటాయి. ప్రేమించడానికి ఒక్క కారణం వెతుక్కొనవలసిన సమయమిది.

క్రీ.శ. 11వ శతాబ్ది నుంచి నవలను తమ ప్రధాన సాహిత్యమాధ్యమంగా చేసుకుని, ప్రపంచ భాషలన్నిటిలోనూ నవలా సామ్రాజ్యంలో మహిళలు తమ బావుటా ఎగరేశారు. అలాంటి నవలారచయిత్రులను సాహిత్య చరిత్రలు ఎలా గుర్తించాయి? వారు ఎలా జీవించారు? వారు ఏం రాశారు? సమకాలీన సాహిత్య సమాజం వారిని ఎలా చూసింది? వారి రచనల్లో ఇప్పుడు కూడా చదివి, తెలుసుకుని ఆనందించగల విషయాలేవైనా ఉన్నాయా?