దేనికో రెడీ అవుతున్నట్టు నన్ను వెల్లకిలా పడుకోబెట్టి నాపైకి వొరిగాడు. నా మీద నాకు నమ్మకం పోయేది ఈ పొజిషన్ లోనే. ముందు సులువుగానే మానేజ్ చేసేదాన్ని. ఈ మధ్యే నాలో ఈ మార్పు గమనించాను. అతని పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలిసిపోతుంది. మెత్తని ఈటెల్లా నా గుండెలోకి గుచ్చుకెళ్ళిపోయే ఫీలింగ్స్. అటు స్వీకరించలేను. ఇటు తిప్పిపంపించనూ లేను. ‘బ్రేక్ ఫాస్ట్ ఇన్ ది బెడ్’ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్.
Category Archive: సంచికలు
“ఎమిరేట్స్‌కి స్వాగతం! మొత్తానికి రెండేళ్ళు పట్టింది మీరు ఇక్కడికి చేరడానికి.” నిజమే. మిన్నీ 2018లో వేసిన బీజం నిలదొక్కుకొని, మొలకెత్తి, మారాకు వెయ్యడానికి రెండేళ్ళు పట్టేసింది. క్రమక్రమంగా వెనకబడిపోయిన దుబాయి ప్లాను. ఢిల్లీకీ దుబాయ్‌కూ మధ్య ఉన్న నాలుగు గంటల దూరాన్ని దాటడానికి నాకు రెండేళ్ళు పట్టింది. 2020 ఫిబ్రవరిలో ఆ దూరం దాటగలిగాను.
“అమ్మనిచ్చి పెళ్ళి చెయ్యమని నువ్వు తాతయ్యనడిగావ్. నీకంటే రెండేళ్ళు పెద్దదని వాళ్ళు వద్దన్నారు. మీ ఇద్దరికీ వేరే చోట్ల పెళ్ళయినా, నువ్వు అమ్మని వేధిస్తోనే ఉన్నావ్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా. పైగా పెళ్ళయిన రెండేళ్ళకే అమ్మ తల చెడి పుట్టింటికి తిరిగొచ్చిందాయె. నీ ప్రయత్నాలు ఫలించకుండా ఎలా ఉంటాయి?!” ఆయన తల అడ్డంగా తిప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అతనికి తెలుస్తోంది.
నా వైపు చూసిందా అమ్మాయి. ఊపిరి బిగబట్టి తనవైపే చూశాను. అమ్మాయి సన్నగా ఒక నవ్వు నవ్వి, మెల్లగా చేతులు సాచి నెమ్మదిగా నేలని తన్ని పైకి లేచింది గాలిపటంలాగా. అలాగే నవ్వుతూ నా వంక చూస్తూ గోడల పక్కగా హాయిగా పైకి ఎగురుతూ… తేలిగ్గా ఒక దేవతలాగా తేలుతూ అలాగే మెల్లగా గది పై కప్పుదాకా ఎగిరింది. పై కప్పు దగ్గ్గరకు రాగానే, చేయి ఎత్తి కప్పును నెట్టి ఆ ఊతంతో మళ్ళీ మెల్లగా కిందకు రాబోయింది. కానీ మళ్ళీ తేలసాగింది.
నిద్రపోవడం అంటే
వాంఛలు ఆరిపోయే వాయిదాలాంటి నీ ముద్దు.
కళ్ళుమూయడం కాదని చీకటికైతే తెలుసు.
మేనత్తలు, నీల, నిసి, ఇద్దరు ఒకేసారి లండన్ రావటం, అదీ తన ఇండియా ట్రిప్ ముందే జరగటం, వారి మేనకోడలికి చాలా సంతోషాన్నిచ్చింది. అదీ! వారంతా ఈ అతి చక్కని చోట ఆ రోజు కలవాలనుకోటం. జస్ట్ గ్రేట్! కొలనులో హంసలు విలాసంగా తేలుతున్నాయి, వారి కళ్ళముందు. రంగుల తుమ్మెదలు ఓడ్‍హౌస్ కథలలోలాగా ఎగురుతున్నయ్యి. గాలి తేలిక సుగంధాలు తెస్తున్నది.
దారిలో ఏదో కూడలి దగ్గిర గుమికూడి ఉన్నారు జనం, ఏదో వింత చూస్తున్నట్టు. దగ్గిరకెళ్ళి చూశాడు. దారుణమైన నెప్పితో పడి ఉన్న ఒక స్త్రీ మూలుగుతోంది. ప్రసవవేదన. ఇందుకేనా భగవానుడు చెప్పేది జననమరణాలనుంచి విముక్తి పొందాలని? పాపం ఎంతటి వ్యథ! చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికీ ఏమీ చేయడానికి పాలుపోవడంలేదు. ఎవరో పరుగున పోయి వైద్యుణ్ణి పిలుచుకొచ్చారు.
ఎన్నో అడగాలనుకున్నాను
ఆ రాత్రిని, ఈ మేఘాన్ని
ఆ స్వప్నాన్ని, ఈ మౌనాన్ని.
ఎన్నో అడగాలనుకున్నాను
సగమే తెరిచిన నీ తలపు వెనుక
తలుపు తీయని మనసును.
ఇంతకు ముందు ఆమె ఇలా వుండేది కాదు. ఈ రెండు మూడు నెలల నుండే! మనసులో ఆందోళనో, తీరిక చిక్కనివ్వని పనులో, మరింకేమిటో?! అప్పటికీ సహాయానికి దిగాడు. అదే మూకుడు. అదే నూనె. కానీ ఆ ఆలూ వేపుడు ఓసారి కుదిరినట్లు మరింకోసారి కుదరదు. ఎందుకో అర్థంకాదు. పోనీ గిన్నెలు కడిగి పెడదామంటే జిడ్డు వదలలేదంటుంది. తానూ ఆఫీస్ పనితో పాటు మరెన్నో పనులు చక్కబెట్టుకుని వస్తోంది కదా!
ఈ రోజుల్లో అయితే కసాండ్రా లాంటి వ్యక్తిని ‘శకున పక్షి’ అని గేలిచేసి ఉండేవారు. మనకి అవగాహనలో లేని ఏదైనా శక్తివంతమైన ప్రభావం వల్ల మనకి ఏదో కీడు కలగబోతోందని జోస్యం చెప్పేమనుకోండి. ఉదాహరణకి ‘పర్యావరణం వెచ్చబడడం వల్ల పల్లపు ప్రాంతాలు ముంపుకి గురవుతాయి’ అని ఒక శాస్త్రవేత్త జోస్యం చెప్పేడనుకోండి. మనకి వెంటనే నమ్మబుద్ది కాదు.
ఇవి ప్రయత్నం మీదనైనా అందరూ రాయగలిగిన కథలు కావు. ఇందులో ఉన్నదేమీ వెక్కిరింపో దూషణో కాదు. మొదట్లోనే చెప్పినట్టు చాలా అరుదైన, కథ చెప్పే ధోరణికి అద్దంపట్టే కథలు. హాయిగా, మిత్రుడితో సాగే ఆత్మీయ సంభాషణలా, లేనిపోని మర్యాదలూ నటనలూ పక్కన పెట్టి, దాపరికం లేకుండా కులాసాగా మాట్లాడుకున్న ముచ్చట్లు.
ఈ సన్యాసులు చేసిన యుద్ధవిధానమును పరిశీలించినచో అది ధర్మయుద్ధమేయని తేటపడగలదు. లోకసంగ్రహముకొరకును మతధర్మములను రక్షించుటకును మ్లేచ్ఛులను ప్రతిఘటించి ధర్మసంస్థాపనము చేయుటలో మహానుభావులైన సన్యాసులు కూడా రాజులకు తోడ్పడినట్లు మనదేశ చరిత్రలో కొన్నియుదాహరణములున్నవి.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
క్రితం సంచికలోని గడినుడి-44కి మొదటి పదమూడు రోజుల్లో కేవలం అయిదుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-44 సమాధానాలు.
ఎవరి గ్రంథం వారే అచ్చువేయించుకోవలసి రావడం కవులకు ఎంత దౌర్భాగ్యమో వివరిస్తూన్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం రెండవభాగం నుంచి 35వ ప్రకరణం, పఠనరూపంలో.
జూన్ నెల గడినుడి కొంచెం కఠినంగా ఉందని, సరిచూపు సౌకర్యం ఉన్నా కొన్ని సమాధానాలకు అర్థమేమిటో తెలియలేదని కొందరు పాఠకులు అభిప్రాయపడ్డారు. అందుకని అవసరమైన […]
జాతీయ రహదారుల మీద పగిలి నెత్తురోడుతోన్న అరికాళ్ళ ముద్రలు. రోళ్ళు పగిలే ఎండల్లో నిండు నెలల గర్భిణుల నడకలు. నిలువ నీడ లేని దారుల్లో ప్రసవం. ఆగే వీల్లేని బ్రతుకుని మోసుకుంటూ తారురోడ్ల మీద పచ్చి కడుపులతో ఆ తల్లుల ఎడతెగని ప్రయాణం. గడ్డలు కట్టే రొమ్ములను నొక్కుకుంటూనే రోజుల పసిగుడ్లను హత్తుకుంటూనే కొనసాగిన నడకలు. పెద్దలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యులు అందరిదీ అదే దారి. అదే వరస. ఊరెటో తెలీదు. ఇంకెంత దూరం వెళ్ళాలో లెక్కేలేదు. వెళ్ళగలరో లేదో తెలీదు. భాష రాదు. బస్సు లేదు. రైలు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం అరికాళ్ళకు చెప్పుల్లేవు. ఎక్కడా ఆగి ఆశ్రయం పొందగల పరిస్థితి అసలే లేదు. గత రెండు నెలలలో రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటుకుంటూ కోట్లాది వలస కార్మికులు చేసిన హృదయవిదారకమైన ప్రయాణంలో మచ్చుకి కొన్ని దృశ్యాలివి. ఎలాగోలా ఇల్లు చేరాలన్న వెర్రి ఆశకి ఆకలి, వ్యాధి భయం, అధికారులు ఎక్కడ ఎందుకు అడ్డగిస్తారోనన్న బెరుకు తప్ప ఏం తోడున్నాయి వారికి? అవసరానికి వాడుకోవడమే తప్ప ఏ సమాజమూ సొంతంచేసుకోని ఏకాకితనం ఈ వలసజీవులది.
కరోనా వైరస్ ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసింది. రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. సామాజిక జీవితం సగటుజీవి మరపుపొరల్లోకి నెట్టేయబడింది. లక్షలలో నిరుద్యోగులవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. బలవంతంగా మీదపడ్డ ఒంటరితనం, ఉన్నట్టుండి మారిపోయిన జీవితం, ఉక్కిరిబిక్కిరిచేసే బాధ్యతలు, కనీసావసరాలు తీరేందుకు ఏర్పాటు చేసుకోవాల్సిన తొందర–ప్రపంచమంతా అనుభవించిన వొత్తిడిలో స్థాయీభేదాలుండవచ్చునేమో కాని, ఉదాసీన వాతావరణం మాత్రం ఎక్కడా లేదు. ఇట్లాంటి పరిస్థితికి ఏ దేశపు ప్రజలూ సిద్ధపడి లేరన్నది వాస్తవం. ఏ ప్రభుత్వమూ ఎన్ని ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకున్నా నూటికినూరుశాతమూ తన ప్రజలను కాపాడుకోలేదనీ అర్థం చేసుకోగలం. కానీ, గత కొన్నాళ్ళుగా భారతదేశంలో మనం చూసిన వలసజీవుల కన్నీటిచరిత్ర, ఒక పరిపాలనావ్యవస్థగా మనమెంత హీనస్థితిలో ఉన్నామో సుస్పష్టం చేసింది. ఇందరు వలసకార్మికులు అప్పటికప్పుడు అమలైన లాక్‌డౌన్‌తో అటు పనిలేక, భత్యంలేక, బ్రతుకులేక, భద్రతలేక, ఇంటికిపోయే దారిలేక గిలగిలలాడిపోతూ నడివేసవిలో సామాను నెత్తిన పెట్టుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి నడిచిపోతుంటే, సరిహద్దుల దగ్గర ఆపి చోద్యం చూసిన పాలకవ్యవస్థను ఏమనాలి? ప్రజల క్షేమం చూడాల్సిన ప్రభుత్వం వారిపైనే తమ జులుం చూపించడాన్ని ఇంకేమనాలి? సమాజంలోని ఒక భాగానికి కనీస రక్షణ కరవవుతున్నప్పుడు, నిర్లజ్జగా వాళ్ళనలా వదిలేసి చేతులు దులుపుకోవడం ఎంత అమానుషం! కులాన్ని, మతాన్ని, ధనాన్ని మత్తుమందుగా ప్రజలకు పంపిణీ చేసి అవసరానికి పబ్బం గడుపుకునే మన ప్రభుత్వాల ప్రమాదకర ధోరణికి నిలువెత్తు ప్రతీక ఈ వలసకార్మికుల మహానిర్గమనం. అయితే, రాజ్యం నీళ్ళొదిలేసిన బాధ్యతను సామాన్య ప్రజానీకం తలకెత్తుకుంది. ప్రభుత్వం గుడ్డిదైనచోట మానవత్వం కళ్ళు తెరిచింది. సాటి మనుషుల కష్టానికి చలించిపోయిన సామాన్యులెందరో తమ శక్తికి మించి, వలస కార్మికులకు ఎంతో కొంత కడుపు నింపి వారిని ఆదరంతో గౌరవంతో ఇళ్ళకు చేర్చడం కోసం తపించారు, శ్రమించారు. చీమూ నెత్తురూ లేని రాజకీయనాయకులు వారి శ్రమను తమదిగా ప్రచారం చేసుకుంటున్నా, అహంకారంతో అధికారయంత్రాంగం అడ్డుపడుతున్నా అన్నింటికీ ఎదురొడ్డి మరీ అనుకున్నది సాధించారు. మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఇంత గొప్పగా ప్రకటించి, అది ఎన్నటికీ సమసిపోదని భవిష్యత్తు పట్ల భరోసా ఇచ్చి, దేశమంటే మట్టి కాదు, దేశమంటే ప్రభుత్వం కాదు, దేశమంటే మనమేనని మరొక్కసారి గుర్తుచేసిన ఆ మానవీయశక్తులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం.
ఆమెను లేపబోయేంతలో ఏం జరిగిందో అతనికి ముందు అర్థంకాలేదు. బెడ్‌లాంప్ మసక వెలుతురులో నడుచుకుంటూ పోతున్న ఆకారాలు కనిపిస్తున్నాయి. గోడల మీద పొడుగ్గా నీడలు పాకుతూ పోతున్నాయి. కొన్ని పిల్లల నీడలు, కొన్ని వొంగిపోయిన ముసలి నీడలు, భుజాలకు వేలాడుతూ పసిపాపల నీడలు, నెలల నిండు గర్భిణుల నీడలూ. నెత్తిన ఏవో మూటలూ. నివ్వెరపోయి చూస్తూ కూచుండిపోయాడు.
తెల్లవారితే అతను చెప్పే మాటకోసం
ఆమె కొన్ని రాత్రులుగా మేలుకొనే ఉంటోంది.
మిట్టమధ్యాహ్నం అయ్యింది…
అతనెందుకో ఈ మధ్య ఇచ్చిన మాటలు మర్చిపోతున్నాడు.
ఆగలేక ఎదురెళ్ళింది
“చూడు, గందరగోళంలో ఉన్నాను” అని
కాయితపు ముక్కలు చూపించాడు.
నేను యూట్యూబులో ఒకే ఒక్కసారి మా పెద్దోడు నడవడానికి ముందు కాళ్ళు హుషారుగా టపటపలాడించే వీడియో పోస్టు చేయడానికిగానూ అకౌంట్ ఓపెన్ చేశాను. దానికి పాస్‌వర్డ్ ఏదో ఉంటుంది. నాకే గుర్తులేదిప్పుడు. ట్విట్టర్ కూడా ఓపెన్ చేశాను. కానీ వాడట్లేదు. అయినా దానికి కూడా ఏదో ఉండేవుంటుంది. గూగుల్ ప్లస్ కూడా ఏదో ఉన్నట్టుందిగానీ దానిలో నేను ఉన్నట్టో లేనట్టో నాకే తెలీదు.