ఏ సుదతి చిరునవ్వువే వెన్నెలా!
ఏ మగువ సిగపువ్వువే
తెల్లని నీ వెలుగు వెల్లువల పరుపుపై
పవళించె నరమోడ్పు ముదిత బృందావని!

తనతో బాటే పెరిగి పెద్దవైన అనుభవం, నైపుణ్యం
వదల్లేక అగరొత్తి పొగల్లో సుళ్ళు తిరుగుతుంటే
పెంచి పోషించిన ఆస్తులు మాత్రం
వారసుల ఇరుకు మదుల్లో వాటాలై విడిపోతుంటాయ్

హిమనగాలు కరుగుతాయి, రగుల్తాయి, ఆవిరులై
మరుగుతాయి అతడి కోర్కెల వైను
గ్లాసుల్లో మంచు మైదానాలశాంత
జలధరాలు, పయనమెచటికని మాత్రం అడగకు

ఉక్కా గొల్లూ చీకటమ్మా వేసాకాలం ఎండ
బిడ్డల్నాటి అడ్డాలు కాదు ఎవడి దేనిమీదనా మరిలేదు
ఎవడూకానివాడి దీవి దానిమీదేనే ఏమీకాన్దాని దీని మీద
దూరానున్నారు చుక్కలమ్మా పిల్లలంటే ఆకాశ పంట

సూర్యకాంతిలో గాని, ఇంద్రధనస్సులో గాని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టిన ఏడు రంగుల గురించి ఈ శ్లోకం వివరిస్తుందంటే నమ్మశక్యం కాదు. నిజానికి, ఋగ్వేద కాలం నాటికే ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు ఏడు వేర్వేరు పేర్లుండేవని చెప్పగలిగే శ్లోకం ఏదీ మనకు ఋగ్వేదంలో కనిపించదు.

ఏల్చూరి మురళీధరరావుగారు నవంబర్ 2013 ఈమాటలో ప్రచురించిన ‘కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన అన్న వ్యాసం ద్వారా కుమారసంభవం కావ్యం రాసిన కవి నిజంగా ఎవరు? అతని కాలం ఏది? అనే వాదనను మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇలాంటి కాల, కర్తృనిర్ణయాలపైన నా ఆక్షేపణలను ఈ వ్యాసంలో వివరిస్తాను.

డా. ఏల్చూరి మురళీధరరావు నవంబరు 2013 ఈమాటలో వ్రాసిన ‘కుమారసంభవంలో … ‘ అన్న వ్యాసానికి ప్రతిగా నా ఈ వ్యాసంలో నన్నెచోడుడు ప్రబంధయుగము తఱువాతవాడు కాదని, కవిజనాశ్రయ ఛందోగ్రంథమునకు ముందే కుమారసంభవమును వ్రాసినాడని వివరిస్తున్నాను.

ఆభారతకుమారులు రాజ్యములను స్థాపించుటయే కాక హిందూ విజ్ఞానమును, మతమును ప్రజలలో ప్రతిష్ఠించి, మహానిర్మాణములను భారతీయశైలిని నిర్మించి, తమ మాతృభూమియొక్క ఖ్యాతిని వ్యాపింపజేసి, నిజమగు భారతపుత్రులుగ నుండిరి.

కర్ణాటక సంగీతజ్ఞులకి వెస్ట్రన్ మ్యూజిక్ పరిచయం 1800 కాలంలోనే ప్రారంభమయ్యింది. ఇంగ్లీషు బ్యాండు చాలామంది సంగీత కారులకి పరిచయం ఉంది. ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ ఇంగ్లీషు బ్యాండ్ ప్రభావంతో కొన్ని పాటలు కట్టారు.

ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రం వివిధభారతి కార్యక్రమం ద్వారా సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం ఈమాట పాఠకులకోసం అందిస్తున్నాను.

శ-, ష-, స- అక్షరాలు మూడు ప్రత్యేక వర్ణాలుగా పలు భారతీయ భాషలలో కనిపించినా, ఈ అక్షరాల ఉచ్చారణ విషయంలో అన్ని భాషలవారిలోనూ కొంత అయోమయం కనిపిస్తుంది. సంస్కృత భాష ఆధారంగా తయారైన వివిధ వర్ణమాలలలో వీటిని మూడు ప్రత్యేక అక్షరాలుగా పేర్కొన్నా, ఇవి మూడు విభిన్న ధ్వనులుగా ఏ దేశభాషలోనూ స్థిరత్వం పొందలేదు.

భారత ఉపఖండంలో శబ్ద ఉచ్చారణకున్న ప్రాధాన్యత, ఉచ్చారణ ఆశువుగా నేర్చుకోవడానికి ఏర్పరచిన కఠినమయిన నియమాలు, మరింక ఏ ప్రాంతం లోను కనపడవు. ఈ పరిస్థితి భారత ఉపఖండానికి ప్రత్యేకం. ఈ నేపథ్యం లోంచే బలమైన ధ్వనిశాస్త్రం మనకి అభివృద్ధి చెందింది.