అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాలపత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిజన్ కార్యక్రమాల్లో ‘లంగరమ్మలు, లంగరయ్యలు’ మాట్లాడే భాషలో వినిపించటం లేదు.
Category Archive: సంచికలు
ఈ ప్రత్యేక జనరంజని కార్యక్రమంలో పెండ్యాలగారు సినీ సంగీతం గురించి, గాయకుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన వర్ధమాన గాయనీ గాయకులకు యిచ్చిన సూచనలు ఆలోచించదగ్గవి.
పెద్దక్కను పోగొట్టుకున్న చెల్లెమ్మలు, ఒక్క పట్టున మూడురోజుల్లో యీ పుస్తకం రాసి, మరో వారం రోజుల్లో పుస్తకంగా ప్రచురించి వాళ్ళ అమ్మా నాన్న చేతుల్లో పెట్టారట (కూతురిని పోగొట్టుకున్న దుఃఖాన్ని కూడా మరిచి యీ ముచ్చట చెప్పారు వాళ్ళ నాన్నగారు.) ‘పెద్దక్క ప్రయాణం’ వీలైనంత మందికి అందుబాటు లోకి తీసుకు రావాలనే మల్లీశ్వరి గారి సంకల్పానికి ఆసరాగా ఈమాట గ్రంథాలయంలో ఈ పుస్తకాన్నుంచుతున్నాం.
30 మార్చ్ 2014 ప్రచురణ: ఉగాది సందర్భంగా గతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయిన కొన్ని లలిత గేయాలు మీకోసం అందిస్తున్నాను. జయ నామ సంవత్సర శుభాకాంక్షలతో – శ్రీనివాస్.
తమ మనోభావాలు గాయపడుతున్నాయని, తమ సంస్కృతిని అవమానించారని, ఇలా అర్థం లేని ఆరోపణలతో విద్యావేత్తలు, రచయితలు, కళాకారులపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా అడ్డుకోకపోగా, వ్యక్తిస్వేచ్ఛను మరింత నియంత్రించే విధంగా నాయకులు, ప్రభుత్వాలు ప్రవర్తించడం గర్హణీయం. నాగరిక సమాజంలో తమ అభివ్యక్తిని — అది ఎంత సమాజవ్యతిరేకమైనా సరే, నిర్భయంగా ప్రకటించే హక్కు ప్రతివారికీ నిర్ద్వంద్వంగా ఉండి తీరాలి; అంతే ముఖ్యంగా ఆ అభివ్యక్తాన్ని విమర్శించే హక్కు కూడా. విమర్శకు ఎవరూ అతీతులు కారు, కారాదు. కానీ, నిజాలని వక్రీకరించడం, ఒక పుస్తకాన్ని లేదా చిత్రాన్ని కనీసం చదవకుండా, చూడకుండా ఆందోళనలు చేయడం, వంటివి సహ్యమైన ప్రతిచర్యలు కావు. ఒక తాజా ఉదా. భారతదేశంలో పెంగ్విన్స్ ప్రచురణ సంస్థ ఇటీవలే అమ్మకాలు ఆపివేసిన ది హిందూస్: ఏన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ, అన్న పేరుతో వెండీ డానిగర్ వ్రాసిన పుస్తకం. పెంగ్విన్స్ సంస్థను, డానిగర్‌ను, విమర్శిస్తూ మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ముమ్మరంగా అభిప్రాయాలు వెలివడ్డాయి, చర్చలు జరిగాయి. నింద, ప్రతినిందల ఈ అయోమయపు పరిస్థితిలో, ఆ వివాదపు పూర్వాపరాలను నిష్పక్షపాతంగా, సహేతుకంగా బేరీజు వేసి మనకు తన వ్యాసం ద్వారా వివరిస్తున్న సురేశ్ కొలిచాలను అభినందిస్తున్నాం.
30 మార్చ్ 2014 ప్రత్యేక ప్రచురణ: ఉగాది సందర్భంగా పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్న లలిత గీతాలు: ఉగాది పాటలు.
ఇంకా: పూర్ణిమ, స్వాతికుమారి, రాధ, సోమ శంకర్, వేంకటేశ్వరరావు, ఆర్. శర్మ, సాయి బ్రహ్మానందంల కథలు; మానస, ఇంద్రాణి, భవానీ ఫణి, వైదేహి, యదుకులభూషణ్,దేశికాచార్యుల కవితలు; శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవ కవితాగానం, వారి జ్ఞాపకాలు, పరుచూరి శ్రీనివాస్ సమర్పణ; మురళీధరరావు, మోహన రావుల వ్యాసాలు; కనకప్రసాద్ శబ్దసాహిత్యం, కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం.
[గమనిక: ఈమాటలో శబ్దతరంగాలను ఇకపై Apple, Android టాబ్లెట్లలో కూడా వినగలిగే ఏర్పాటు చేశాము. పూర్తి స్థాయి మొబైల్ పోర్టబిలిటీ త్వరలోనే అందిస్తాము. – సం.]
ఆమె అతడిని చూసింది. అదే క్షణాన అతడూ చూశాడు. చూసి, చూపు తిప్పుకున్నాడు. ఐస్ వల్ల గ్లాస్‌కి చెమటలు పడుతున్నాయి. ఆమె అతడిని గమనిస్తూనే ఉంది. ఒక్కో గుక్క తాగి, గ్లాస్ కిందపెట్టి, ఆమెను చూడబోయి, ఆమె గమనిస్తుందని గమనించి, రెప్పలనీడలో కళ్ళను అటూ ఇటూ పరిగెత్తిస్తూనే ఉన్నాడు.
నా ఒళ్ళో నుంచి జారిపడ్డ గుండ్రటి గంగిరేణు కాయలను ఏరుకుంటూ తల ఎత్తి నా వైపు చూశాడు చిలిపిగా. అతని కళ్ళల్లో వచ్చిన ఆ మెరుపు దేని తాలూకుదో నాకు తెలుసు. పుస్తకాలు చదివిన నాకు ఆమాత్రం తెలీదా. కాని నాకెమంత గొప్పగా అనిపించలేదు. మూతి ముడుచుకుని వాళ్ళతో ఒక్కమాట కూడా చెప్పకుండా వచ్చేశాను.
ఎవరో కనబడుతారు, అంతగా తెలీని వాళ్ళు, “ఆరోజు కూడా ఇలానే మనం రైల్వే స్టేషన్లో కలిసినప్పుడూ…” అని పలకరించబోతారు- “ఆరోజు కలవలేదు, తగిలాం!” అని సవరిస్తాను. సెల్లో, పర్సో చూసుకుంటూ చాకచక్యంగా తప్పేసుకుంటారు. ఒక్కోసారి బాగా కావలసిన వాళ్ళే, “ఏమిటిక్కడ, ఎవరొస్తున్నారూ?” అని.
సరంగు ఈ లంకలో ఆగడం ఎంత ప్రమాదమో, ఎందుకు వద్దో అన్నీ పాస్టర్‌కి చెప్పి ఆయన్ని అక్కడకి వెళ్ళకుండా ఆపుదామని చూశాడు కాని పాస్టర్ మంకుపట్టూ, ఆయన పాస్టర్ అనే గౌరవం వల్లా ఏదీ కుదర్లేదు. ఓ అరగంటలో చకచకా పడవ దింపడం, పాస్టర్ గారూ ఇంకో ఇద్దరు పడవ నడిపే బెస్తవాళ్ళూ దిగడం అయింది.
వైధవ్యం పొందిన ఆడవారు ఒక బ్రహ్మచారిని అమ్మవారికి బలి ఇస్తే తరువాత జన్మలో వైధవ్యం రాదనే మూఢ నమ్మకం ఈ బళ్ళారి ప్రాంతాలలో ఉంది. అమ్మవారికి పూజ చేసి ‘నైవేద్యం’ అవకాశం వెంబడి పెట్టుకుంటామని మొక్కుకుంటారు. అవకాశం చూసుకుని నెమ్మదిగా, నిదానంగా పని చేసే విషాన్ని భోజనంలో కలిపి పెడతారు.
అమ్మమ్మకి మొగుడు పోయాక శిరోముండనం చేయించారు. అందువల్ల నెత్తి మీద ముసుగేసుకొనేది. చూడ్డానికి పచ్చ దబ్బపండులా ఉన్న అమ్మమ్మ మొహమ్మీద తెల్ల ముసుగు మాత్రం ఆవిడ జీవితంలో నల్లమచ్చే! మొగుడు పోయాక ఆడపడుచూ, అత్తగారూ దగ్గరుండి శిరోముండనం చేయించారని వాళ్ళని రోజూ తెగ తిట్టుకునేది.
కాని ఆ రాత్రి ఫైరింగ్ ఆగనే లేదు. రాత్రంతా ఎదురుకాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. మధ్య మధ్యలో రెండు వైపుల నుంచి బాంబుల వర్షం కురుస్తోంది. ఆ రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు. చెవులు పగిలిపోతాయా అనిపించేంత చప్పుళ్ళు. మేము, కుల్జీత్ మామ కుటుంబం రాత్రంతా ఆ కందకంలోనే దాక్కుని ఉన్నాం.
ఆ పిల్లవాడేమో అల్లరివాడు, ఎప్పుడూ ఇటూ అటూ ఆడుతూనే ఉంటాడు. కానీ వసంతానికి అతడు ముద్దులబాలుడు. అందుకే వాడిని మురిపెంగా జోలపాడి బజ్జో పెట్టాలన్న తాపత్రయం. ఆ సన్నివేశాన్ని చాలా అందంగా మన ముందుంచాడు భట్టుమూర్తి. వసంతశోభ అంతా పచ్చదనంతో మిసమిసలాడే చెట్లలోనే కనిపిస్తుంది.
మనం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం
ఎప్పుడో ఒక క్షణంలో మాత్రం చందన పుష్పాల్లా
మాటలు మన మధ్య కొత్తగా గుబాళిస్తాయి.
కిక్కిరిసిపోయిన జనం మధ్య కూడా
వాడికి తోడు ఒంటరితనమే
వాడి చూపుల దారిలో ఎవరూ నడవరు
ఏ కంటిపాపలోనూ వాడు నవ్వడు.
నాకెప్పుడూ నువ్విలాగే కనపడాలి!
సౌందర్యం రెపరెపలాడింది.
నన్నొక్కసారి ముద్దుపెట్టుకోవూ?
ప్రేమ ఆర్తిగా పెనవేసుకుంది.
ఆ ఇంటికి నిండుగ
కొలువు తీరినవి
నిక్కి నిక్కి
చూస్తూ ఉన్నవి
బారులు తీరి
రంగు రంగుల
పిట్టల బొమ్మలు
నాకు వెండీ డానిగర్ పుస్తకంలో హిందువులను అవమానపరిచే అంశాలు గాని, హిందూ మతాన్ని పనిగట్టుకొని కించపరిచే ఉద్దేశం గాని ఏ కోశానా కనిపించలేదు. ప్రతి పేజీలోను ఒక పరిశోధకురాలు తాను ఎన్నుకున్న అంశంపై అన్నీ దృక్కోణాలను విశ్లేషించడానికి, అన్నీ ప్రత్యామ్నాయ కథనాలను వీలైనంతగా చర్చించడానికి పడే తాపత్రయమే కనబడింది.