మాఘకవి వర్ణించిన జాణలు అప్పటమైన సంస్కృత వనితలు. ఆ కవి నర్మదాతీరవాసి కనుక కాస్తో కూస్తో అక్కడి సంప్రదాయపు ఒప్పులకుప్పలు. నగరకాంతలు, ధనవంతులబిడ్డలు. పెద్దన తీర్చిన గంధర్వకాంతలు పట్టణవాసులైనప్పటికీ ముగ్ధలైన పల్లెపడుచుల తీరు. వీరు అప్పటమైన తెలుగు అందాలకు ప్రతీకలు.

తెలుగు భాషలో ఒక నూతన కవితాశైలికి నాందీవాక్యమును పలికిన మహాప్రస్థానంలో ఎన్నో రకములైన మాత్రాఛందస్సులను శ్రీశ్రీ వాడినాడు. ఛందస్సు సర్పపరిష్వంగము నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ గేయములలో రసానుభూతి కోసం ఎన్నో ఛందస్సులను పాటించాడు.

దసరాకి బొమ్మల కొలువు పెట్టడం తమిళదేశంలో అధికంగా వ్యాప్తిలో ఉంది. ఇళ్ళలోనే కాకుండా నవరాత్రులలో దేవాలయాలలో కూడా బొమ్మల కొలువులు పెడతారు. మధుర మీనాక్షీ దేవాలయంలో ప్రతీ ఏటా నవరాత్రులకు పెట్టే బొమ్మల కొలువులో వివిధ దేవీమూర్తులు కనిపిస్తాయి.

ఇన్నేసి మతాలు, ఆచారాలూ , వాటితో పోరాడుతూ నిబ్బరంగా సాగుతూంటారు ఈ చిన్ని గుంపులోని మనుషులు. మత మౌఢ్యం పెద్ద పులి. వేటాడుతుంది వీరిని.

ఇది భాగవతుల త్రిపుర సుందరమ్మగారు (బీనాదేవి) రావిశాస్త్రిగారి కథలపైన 1997లో విజయవాడ కేంద్రంలో చేసిన ప్రసంగం. ఈ ప్రసంగ పాఠం తరువాత వార్త దినపత్రికలోను, పైన పేర్కొన్న సమగ్ర రచనల సంకలనం లోను ప్రచురితమైంది.

రేడియో ‘అక్కయ్య, అన్నయ్య’లుగా ప్రసిద్ధులైన న్యాయపతి కామేశ్వరి, రాఘవరావుల గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదనుకుంటాను. ఈ సంచికలో ‘బాలానందం’ బృంద గేయాలుగా వచ్చిన కొన్ని రికార్డులను విందాం.

తాము చేసే పని మీద శ్రద్ధాసక్తులు, తమ పనితనం పట్ల గౌరవము, గర్వము, అభిమానమూ లేనివారి పని ఫలితాలు ఎంత నాసిరకంగా ఉంటాయో చెప్పడానికి మన తెలుగు ప్రచురణారంగం ఒక చక్కటి ఉదాహరణ. తెలుగులో ఇప్పటికీ, ఇన్నేళ్ళ తరువాత కూడా మనం గర్వంగా చెప్పుకోదగిన ప్రచురణ సంస్థలు లేవు. విషయం ఏదైనా పుస్తకం కూడ ఒక వస్తువే. దానికీ నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ప్రచురణ అంటే కేవలం అచ్చేయడం కాదనీ, ఒక మంచి పుస్తకం అనేది శ్రద్ధతో అభిమానంతో రూపు దిద్దితేనే సాధ్యమనీ, అవి లేకపోవడమే మన ప్రచురణ సంస్థల ప్రస్తుత పరిస్థితికి కారణమనీ, తమ వ్యాసం తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలులో శ్రీనివాస్, నాగరాజు, నారాయణరావు తమ అభిప్రాయాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. అంతే కాదు, ప్రస్తుతం తమ పుస్తకాలు తామే ప్రచురించుకునే ఔత్సాహికులకు ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలో వివరిస్తున్నారు కూడా.
 
తెలుగు గ్రంథాలలో అత్యంతకఠినమైనవాటిలో అగ్రగణ్యంగా, వసుచరిత్రం కంటే దుర్లభమైనదిగా పరిగణించబడే గ్రంథం, 16వ శతాబ్దిలో జటప్రోలు సంస్థానాన్నేలిన సర్వజ్ఞ సింగభూపాలుని వంశీకుడు, రామరాజభూషణునికి సమకాలికుడు అయిన సురభి మాధవరాయలు రచించిన చంద్రికాపరిణయముఅనే మహాప్రబంధం. ఈ గ్రంథానికి కొల్లాపురసంస్థానపండితులైన బ్రహ్మశ్రీ వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రులవారు వ్రాసిన టీకాతాత్పర్యసహితవ్యాఖ్యానంతో కూడిన ప్రతి ఆఖరిముద్రణ 1928లో. ఆ ప్రతి ఇప్పుడు అలభ్యం. అపురూపమైన ఆ ప్రతి సాధించుకుని, షుమారు ఏడు వందల పేజీలు అక్షరం అక్షరమూ అచ్చుతప్పులు దిద్దుకుంటూ, కేశవపంతులు నరసింహశాస్త్రి, శ్రీరంగాచార్యులవారి ఉపోద్ఘాతములు జత చేస్తూ, యూనీకోడ్‌లో తిరగ వ్రాసి ఈమాట గ్రంథాలయం కోసం అందచేశారు తిరుమల కృష్ణదేశికాచార్యులు. వారి అద్వితీయమైన శ్రమకు, ప్రాచీన సాహిత్యం పట్ల వారి నిబద్ధతకూ ఈమాటనుంచి వారికి హృదయపూర్వక అభినందనలు.

“మోనీ, ఒకటి చెప్తా, ప్రామిస్ చెయ్, ఎవరికీ చెప్పకూడదు.”

“ప్రామిస్, చెప్పవే ఏంటో?”

… …

“ఓ! సత్యా?! ఆరోజు బస్ వెనక చీకట్లో తనతో… అది నువ్వేనా?”

“ఏంటీ? కాలేజ్‌లో తెలిసిపోయిందా? వద్దన్నాను. నైట్ కదా! చీకట్లో ఎవరూ చూడరని… చున్నీ కప్పేసుకుని…”

“మరి ఇంట్లో చెప్పావా?”

“అమ్మో, డాడీ చంపేస్తారు. ఇంటర్ కాస్ట్ అంటే అసలొప్పుకోరు.”

మౌనంగా ఉన్న కైక నోరు తెరిచింది. “మంధరా, ఇప్పుడు నువ్వు వచ్చినది రఘువంశ మహారాజు దశరధుడి దగ్గిరకి. రఘువెటువంటివాడో, సూర్య వంశం ఎటువంటిదో నీకు తెలియకపోవచ్చు. నిన్ను ఇక్కడకి విశ్వామిత్రులవారు పంపించారంటే అందులో మనకి తెలియని నిగూఢ రహస్యం ఏదో ఉందన్న మాట. చూద్దాం ఏం జరగబోతోందో. ఈ రాజభవనం నీ ఇల్లే అనుకో. నీ చేతనైన సహాయం చేస్తూండు. మా పూర్వీకులని కూడా రావణుడు చంపాడని నేను విన్నాను. ఏదో ఒకరోజు వాడికి ఆయుర్దాయం తీరిపోతుంది.”

అగస్త్యుడు తానొక్కడే చకచకా ఆ కొండెక్కి లోపాముద్రని వచ్చేయమనలేదు. పాపం అసలే సన్నని నడుమేమో, అంత పెద్ద కొండ ఎక్కేటప్పుడు ఆమెకి నడుమునొప్పి రాక మానదు. అది గ్రహించిన అగస్త్యుడు, తానొక అడుగు ఎక్కి, ఆమె చేయిపట్టుకొని, ప్రేమగా రమ్మని పిలిచి, ఎక్కిస్తూ, ఎంతో ఆదరంతో జాగ్రత్తగా తనతో పాటు కొండ చివరికంటూ తీసుకువెళ్ళాడట. ఆ తర్వాత అక్కడి జలపాతాలలో వారిద్దరూ సరిగంగ స్నానాలు చేశారు. ఎంత చూడముచ్చటైన దృశ్యమో కదా!

పోతనగారు శ్రీమహాభాగవతంలో మూలాతిరిక్తంగా కనీసం ముప్ఫై – నలభై గ్రంథాల నుంచి డెబ్భై దాకా అనువాదాలను చేశారు. అమోఘమైన ఈ పద్యానికి మూలం సంస్కృత భాగవతంలో లేదు. రుయ్యకుని అలంకారసర్వస్వానికి జయరథుడు కూర్చిన విమర్శినీ వ్యాఖ్యలో సారాలంకార వివరణ వద్ద ఉదాహృతమై ఉన్నది. పోతనగారి బహుగ్రంథశీలితకు, విశాలమైన వైదుష్యానికి, విపులపాండిత్యానికి నిదర్శకమైన మహాద్భుతఘట్టం ఇది.

కార్లు బైకులు. మల్టిప్లెక్సులు. ఇంగ్లీషు మాటల అడ్వాన్స్ క్యూ. షరా మామూలు టిక్కెట్టు క్యూ.
సోఫాల్లా సీట్లు. పెద్ద సైజు తెర. మొబైలు ఫోన్లపై తారాడే వేళ్ళు వేరార్యూ టెక్స్టింగులు.
జీరో సైజుల షో అప్పులు బ్యాక్‌లెస్ క్లోజప్పులు విఎఫెక్స్ ఫైట్స్ చేజెస్ హీరో బిల్డప్స్.

అలవికాని తళుకు బెళుకులతో,
అర్థరాత్రి దాకా ఆనందాన్ని వెతుకుతూ తిరిగే మనుషులతో
సతమతమయ్యే ఊరిని చూసి
ఆకుల రంగులే ఆభరణాలుగా ధరించిన అడవి
చిన్నగా నవ్వుకుంటుంది.

మనిద్దరి మధ్యా మాటల అవసరం యేముంది
చూపుల కొసలమీద వేళ్ళాడుతూ
కాళ్ళావేళ్ళా పడే అభ్యర్దనలు
వేలికొసలనుండి పాకిపాకి
నిలువెల్లా పరామర్శించే అనునయాలు

ఎక్కడెక్కడ తిరిగేవు నాయినా బిడ్డా సిపాయి చిన్న
ఎండనపడి వొచ్చేవు నాయినా నా కన్న?
కోనాడ అడివుల్లంట యేటకెల్లేనులేయే మాయమ్మ
పేనాలు పోతన్నాయి పక్కన్న పరిసిత్తు రమ్మీ!

నిన్న ఏ సమయంలో నువ్వు నాతో తిరగడానికి
బయలుదేరావో ఏడణాలిచ్చి రిక్షా ఎక్కి
అకస్మాత్తుగా సముద్రపు వడ్డుకు,

Did you know, that I would suddenly die,
wouldn’t be alive to break bread with you?