అమితాశ్చర్యం కొలిపే విషయం పిఠాపురం రాజావారు వారి పరివారంతో కాలిఫోర్నియాలో దిగ్గానే ఒక స్వామీజీ, వారి భక్తులు వీరికి స్వాగతం పల్కడం! ప్యాలస్ లని తలదన్నే ఒక ఇంట్లో (బెవర్లీ హిల్స్ లోని ఒక భక్తురాలి ఇల్లట) ఊదువత్తుల మధ్యలో సిల్కు దిండుల మీద ఆశీనులై ఉన్న ఈ స్వాముల వారిని అక్కడి వాళ్ళంతా ఒక దేవుడిని చూసినట్లు చూడటం!

అక్టోబర్ లో అడుగు పెట్టేసరికి
చుట్టూ వున్న చెట్లన్నీ
ముదురు రంగు కాషాయాల్ని ధరించటం మొదలెడతాయి

వేశ్యావృత్తిలో ఉన్న వారి పట్ల సానుభూతినీ, గౌరవాన్నీ ప్రకటించిన రచయితలు ప్రజా బాహుళ్యపు విశ్వాసాలకు భిన్నమైన దృక్పథాలతో రచనలు సాగించారు. వీరందరూ సృష్టించిన వేశ్యల పాత్రల ద్వారా తెలిసేది ఏమిటంటే అసహజమైన వృత్తిని సమాజం వారిపై రుద్దింది కానీ సహజసిద్ధమైన వారి విలక్షణతలను రూపు మాపలేకపోయింది అని.

ఈ శ్లోకములో చెప్పిన కవిత్త్వపు భావము వెనుక చెప్పని భావసంపద ఎంతో ఉంది. ఇదంతా పాఠకుడు తనకు తాను ఊహించుకోవాలి. ఇక్కడ పాఠకుడూ ఒక కవి! సంక్లిష్టమైన భావం కదూ. ఈ సంక్లిష్టత పద్యంలో లేదు. మనలో ఉంది. ఆధునిక యంత్రయుగంలో ఉన్నాం కాబట్టి ఈ సంక్లిష్టత. మేఘాలు, నక్షత్రాలు, తారకలు, చంద్రుడు – ఆధునిక యుగంలో ఇవన్నీ భోగాలు మనకు!

అక్కరలను తెలుగుభాషలో వృత్తాలకు ముందే వాడినారు. నన్నయ భారతానికి ముందు, నన్నెచోడుని కుమారసంభవానికి ముందే శిలాశాసనములలో అక్కరలలో పద్యాలు చెక్కబడ్డాయి. అక్కరలు కన్నడము, తెలుగు – ఈ రెండు భాషలలో ఉన్నాయి.

ఇది నేను కొన్ని నెలలక్రింద ఈమాటలో ప్రచురించిన ‘వాణి నారాణి’ అను నాటికలో సందర్భానుసారముగా ఐదుపాటలను వివిధరాగములలో వ్రాసితిని. శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు ఆ ఐదుపాటలను పాడిరి. ఆపాటలతో గూడిన పినవీరనవృత్తాంతము నిక్కడ ప్రదర్శించుచున్నాను.

అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి) తన కవిత్వాన్ని ప్రచురించడానికి అంతగా ఇష్టపడేవారు కాదని అంటారు. అలాగే ఆయన పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు, ప్రసంగాలు చేసినట్లు కనపడటంలేదు. ఆయన కవితలని రెండింటిని ఆయన గొంతులోనే వినిపిస్తాను.

వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆయన రచనలలో, ప్రభావతీ ప్రద్యుమ్నము (1962), మనుచరిత్ర (1968) కావ్యాలకు రాసిన మంచి వ్యాఖ్యలు చాలామందికి తెలిసి ఉంటాయి. ఆయన తన సాహితీ యాత్ర పై చేసిన ప్రసంగం ఈ సంచికలో విందాం.

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైనారు. తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి వీరిని ఎడంగా నిలబెడతాయి.

ఈమాట పాఠకులకు కన్నెగంటి చంద్రను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కథయినా, కవితయినా, చంద్ర పేరు చూడగానే చేస్తున్న పనులన్నీ ఆపేసి వెంటనే చదివే పాఠకులం ఎందరమో. అలాంటి చంద్ర, అక్షరం మనసు తెలిసిన చంద్ర, తన రచనల నుంచి ఏమీ ఆశించకుండా నిరాపేక్షగా చావో బతుకో వాటి మానాన వాటిని విడిచిపెట్టే చంద్ర, ఒకానొకప్పుడు పృథివ్యాపస్తేజోవాయురాకాశములైన పంచభూతాల వంటి ఐదు కవితలు రాశాడు తెలుసాలో – మట్టి, వాన, మంట, గాలి, మబ్బులు, అంటూ! ఆ కవితలు చదివి వేలూరి అందరినీ, ఇప్పుడైనా చూడండి చంద్ర ఎందుకు మంచి కవో అని చెప్తూచెప్తూనే, ఆర్కైవుల్లో ఆ ఐదు కవితలూ వెతుక్కుని చదువుకుని దాచిపెట్టుకున్నాం కూడానూ. ఆతర్వాతెప్పుడో చంద్ర కవితలను వాన వెలిసిన సాయంత్రం అనేసి హడావిడిగా పుస్తకం చేసినప్పుడు వేలూరి ఈమాటలో వాటి గురించి మరోసారి గుర్తు చేశారు కూడానూ. ఏమైతేనేం, ఆ ఐదు కవితలూ మీకు పరిచయం చేయడం కోసం, పోనీ ఆ సాకుతో మీతో కలిసి మేమూ మరోసారి చదవడం కోసం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.

“తల్లీ! మునికి పేరు పెట్టాననుకో, అప్పుడు ఈ కథ ఆ పేరు గల ఒక మునికి మాత్రమే చెందుతుంది, మతంగుడి కథ, భరద్వాజుడి కథ లాగా. నువ్వు మునులేం చేస్తారు? అన్నావు కదా! ఏ పేరూ పెట్టకపోతే మునులు సాధారణంగా ఈ రకంగా ఉంటారు అన్నది చెప్పినట్టవుతుంది. ఈ విషయం అర్థమయింది కదా? ఇప్పుడు ముని పేరు అచ్చయ్య అనుకుందాం. ముని పత్ని పేరు పిచ్చమ్మ.

ఉద్యోగం లేదని చిరాకు ఒక వైపు. ఆమె నన్ను తనింట్లోకి రానియ్యకుండా నా ముఖం మీదే తలుపులు మూసేసిందని దిగులు మరో వైపు. ఆమెని అల్లరి చేశాను, ఆమె తోనే ఉండాలని, ఆమె మళ్ళీ మళ్ళీ కావాలనిపించి పిచ్చి పట్టినట్లయి ఆమెని ఎన్ని మాటలో అన్నాను. నేనట్లా మాట్లాడినా కూడా ఆమెకి నా మీద అంతే అభిమానం వుండింది. తను నాతో మాట్లాడకపోయినా తమ్ముడి చేత ఫోన్లు చేపిస్తూ నన్ను వచ్చేయమని అడిగిస్తూనే ఉంది.

‘సామాన్యుని జీవనం’ ఆయా కాలాలలో వచ్చిన సృజనాత్మక సాహిత్యంలో అంతో ఇంతో ప్రతిఫలిస్తూనే ఉంటుంది. దేశి సాహిత్యంలో అది విస్తృతంగా కనిపిస్తే, మార్గ సాహిత్యంలో పరిమితంగా కనిపిస్తుంది. తెలుగులో శైవసాహిత్యమూ, శ్రీనాథుని కావ్యాలూ సామాన్య జనజీవనాన్ని మరింత ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. అయితే, ఏ కావ్యమైనా సమకాలీన సమాజ పరిస్థితుల ప్రభావం నుంచి పూర్తిగా తప్పించుకోలేదు కాబట్టి ఏదో ఒక రూపంలో ప్రబంధాలలో కూడా ఆ కాల స్వభావం వ్యక్తమవుతూనే ఉంటుంది.

అంతకుముందు ఎప్పుడైనా చర్చ్‌కి వెళ్ళడానికి ఆసక్తి ఉండేది. ఇప్పుడు పొద్దున్నే లేవడానికీ, తిండి తినడానికీ కూడా వెగటే. దేవుడి గురించి విన్నదీ కన్నదీ అంతా కట్టుకధే అనే అనుమానం మొదలైంది. దేవుడనే వాడుంటే ఇలా చేస్తాడా? వయసైపోతున్న తనని వదిలేసి చిన్నకుర్రాణ్ణి తీసుకెళ్ళిపోయేడు. చర్చ్‌లో ప్రతీవారం పాస్టర్ భగవంతుడికి అపారమైన కరుణ ఉందని అంటాడే! మరి కళ్ళముందటే ఇలాంటివి జరుగుతూంటే ఎలా నమ్మడం?

అప్పా ఒక్కసారి నిశ్చేష్టుడయ్యాడు. మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకొని మాటల యుద్ధం మొదలు పెట్టాడు. మాస్టారు ఏమాత్రం కనికరం చూపించలేదు. “నావల్ల కాదు,” అంటూ వంద సార్లు అన్నాడు. చివరకి అప్పాకి విసుగొచ్చింది. మాస్టారి నిగ్రహం చూసి ముద్దు పెట్టుకోబోయాడు. కావాలంటే తన కొడుకు బదులు తనే పరీక్ష తీసుకుంటానన్నాడు. బూతు జోకులు చెప్పాడు. మరీ దిగజారుడుగా మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

పిల్లలమంతా మళ్ళీ రెక్కలు విప్పుకున్న
సీతాకోకచిలుకలమవుతాము
కట్టుతాళ్ళు విప్పుకున్న లేగదూడలమల్లే బయటికురుకుతాము
నోళ్ళు తెరుచుకుని ఆఖరి వానచుక్కలు అందుకుంటూ…

రెక్కలు విప్పుకొన్న దూది కొండల్లో
చెట్లూ, ఏనుగులూ, కొండశిలవలూ ఇంక యేవో
అగపడినట్టే పడి మాయమవుతుంటాయి
వాటి కిందగా ఒంటరిగానో గుంపులుగానో
దేన్నీ పట్టించుకోకుండా
రెక్కలాడిస్తూ పోతున్న పిట్టలూ-