గడప దగ్గర
వేగంగా
తలుపు మీద వరకూ
ఓ వెలుతురు నీడ వూగులాట!
నిలుస్తూ వూగుతూ
నిలకడ లేకుండా-
Category Archive: సంచికలు
మెరుపులు
నల్ల చీరకి
జరీ అంచులా
తార్రోడ్డుకి
అటూ ఇటూ పారే
ఎర్ర
మట్టి నీళ్ళూ
సరైన పదం కోసం
చీకట్లో తడుముకొంటూంటే
చేతికి సూర్యుని ముక్క తగిలింది
ఉదయం పద్యమై
విచ్చుకొంది
గుర్తు పెట్టుకుంటావని
మొట్టికాయలు మొట్టేను
అంతకంటే ఏం లేదు!
అవినేని భాస్కర్ చేసిన ఆకు కవిత తమిళ మూలం: తెలుగు, తమిళ్ లిపులలో. తమిళుక్కు నీరం ఉండు (1997) కవితా సంపుటి నుండి.] (இலை […]
“పువ్వులాగా పుట్టకుండా
పండులాగా మారకుండా
ఆకులానే పుట్టినందుకు
ఆకు రూపం దాల్చినందుకు
ఎప్పుడైనా బాధ పడ్డావా?”
అక్కడకు ఎలా వెళ్ళాలి? వెళ్ళినా అసలు ఎలా అడగాలి? నేను ఏ పనిని కూడా అలా చేసేయలేను. దాని గురించి కొంత ఆలోచించాలి; మథనపడాలి; గింజుకోవాలి; అప్పటికి గానీ సంసిద్ధుణ్ని కాలేను. అందులో భాగమే ఆ మానసికపు కసరత్తంతా!
తమిళములో పా అంటే పాట అని చెప్పవచ్చును. ప్రాచీన తమిళ ఛందస్సులో ప్రసిద్ధికెక్కిన ‘పా’ ఛందస్సులు – వెణ్బా, ఆశిరియప్పా, కలిప్పా, వాంజిప్పా, మరుట్పా.ఈ వ్యాసములో వెణ్బాగుఱించి మాత్రమే చర్చిస్తాను. వెణ్ అనగా తెలుపు అని, పా అనగా పాట అని అర్థము, కాబట్టి వెణ్బాను ధవళగీతి అని పిలువవచ్చును.
ఆంధ్ర మహాకవులు సంస్కృతం నుంచి తెలుగులోకి కావ్యాన్ని పరివర్తించేటప్పుడు భాషాంతరీకరణంలో వారు అనుసరించిన శాస్త్రీయమార్గాలేమిటి? వారు చేసిన ప్రాతిపదిక కృషిస్వరూపం ఏమిటి? అందుకు మార్గదర్శకసూత్రాలు ఏమున్నాయి? అని వివరించినవారు లేరు. తెలుగులో ఆ ప్రకారం తన అనువాదసరణిని సవిస్తరంగా పేర్కొన్న ఒకే ఒక్క మహాకవి శ్రీనాథుడని ప్రసిద్ధి.
మొదటి గడి-నుడిని ఉత్సాహంగా ప్రయత్నించి ప్రోత్సహించిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈ నెల గడినుంచీ నియమాలు కొద్దిగా మారాయి. దయచేసి గమనించగలరు.
హృదయ కమలములను ముకుళించి రహించిన పూజ
మీ పద సరోజములను నయన పంకజము లలర్చి రమణ యతి రాజ
పిచ్చయ్య శాస్త్రిగారు, గుర్రం జాషువాగారు ఇద్దరూ వినుకొండలో స్నేహితులు, కలిసి చదువుకున్నారు. ఇద్దరూ కలసి జంట కవులుగా రచనలు చేయాలనుకున్నారని అయితే వీళ్ళిద్దరి పేర్లు కలవక విరమించుకొన్నారనే కథ ఒకటి ఉంది.
వివరణలు క్రిప్టిక్ క్రాస్ వర్డ్ పజిళ్ళలో ఇచ్చే ఆధారాల్లో సమాధానాన్ని నేరుగా గానీ డొంకతిరుగుడుగా గానీ సూచించేవి, సాధకుల సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించేవి, పదాలకు […]
వ్యావహారిక భాషోద్యమ పితామహుడైన గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతిని (29 ఆగస్ట్, 1863) తెలుగు భాషోత్సవదినంగా ప్రకటించుకుని తెలుగువారు తెలుగు భాష గొప్పదనాన్ని కీర్తిస్తూ సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. గ్రాంథిక భాషను కాదని వ్యావహారికభాష తెలుగులో తెచ్చిన పెద్ద మార్పుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా — ఈ భాషావాదాలకి ఆద్యులుగా మన మనసుల్లో స్థిరపడిపోయిన పరవస్తు చిన్నయ సూరి, గిడుగు రామమూర్తుల రచనల వల్ల తెలుగు భాష వ్యవహారాలలో కలిగిన మార్పులేమిటి? తెలుగు భాష చరిత్రలో మొదటగా వినిపించే ఈ ప్రముఖుల అభిప్రాయ వైరుధ్యాలు ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? వీరిద్దరి రచనలు ఏ సందర్భాలలో ప్రాచుర్యం లోకి వచ్చాయి, వాటివల్ల ఆధునిక వచన రచనకి లాభమా, నష్టమా? అనే విషయాలు చర్చిస్తూ వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ రాస్తున్న వ్యాసంలో మొదటి భాగం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.
ఈ సంచికనుండి గడి నుడి శీర్షిక మొదలుపెడుతున్నాం. పాఠకులు ఆదరించి ప్రోత్సహిస్తారని, ఉత్సాహంతో పాల్గొంటారని, ఆశిస్తున్నాం.
రాజు తన జీవితం గురించి చెప్పిన తరువాత నాకు కూడా అదే పద్యం గుర్తొచ్చి వాణ్ణడిగాను. ‘ఇండియన్లు అమెరికా జేరడమంటే ఆకాశాన్నందుకోవడమేనని నిర్ధారిస్తే, నువ్వేమిటి ఇలా ఆకాశాన్నుంచీ మెట్లు దిగుతూ వచ్చి ఇక్కడ అడవుల్లో చేరావ్? ఒక యూనివర్సిటీ వాళ్ళు కాదంటే నీకున్న పేరుతో ఇంకో యూనివర్సిటీకి వెళ్ళచ్చు. అలాగే, ఒక కాలేజీ వాళ్ళు కాదంటే ఇంకొక కాలేజీకీ, ఒక హైస్కూల్ నచ్చకపోతే ఇంకొక హైస్కూల్ వెళ్ళి వుండచ్చు గదా?’
ఏమో. ఇప్పుడు నేను చేయాల్సిన పని? ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తులసి ఇంటికి ఎందుకు వెళ్ళానో ఇప్పుడు మళ్ళీ అందుకే వెళ్ళాలి. తను విషయం చెప్పేలోగా ఆమె ‘హుష్’ అంటూ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి ఏడుస్తుంది. పిల్లలు వింటే పరువు పోతుందని. కోడలు చూస్తే జీవితమే నాశనమైపోతుందని, కొడుకు ఛీ కొడ్తాడని కారణాలు చెబుతుంది. ‘విహారికేం చెప్పమంటావ్’ అని అడుగుతాను. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడూ చెప్తుంది. కారణాలు మాత్రమే వేరు.
పల్లెటూళ్ళ జీవన చిత్రణలో ఒక సౌందర్యం ఉంటుంది. వర్గంగానో, సంఘంగానో కూడి బ్రతకడంలో దొరికే భరోసాని బలంగా చూపెడుతుందది. పట్టణజీవితపు ఒంటరితనంలో బిగ్గరగా చెప్పుకోలేని, ఒప్పుకోలేని, ఎవరితోనూ పంచుకోలేని, తప్పించుకోలేని వేదన ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఈ వైరుధ్యాన్ని ఒకేసారి ఒకే కవితలో, లేదా ఒకే సంపుటిలో స్ఫుటంగా చెప్పడం మామూలు కవులకు దాదాపు అసాధ్యం. కరుణాకర్ మామూలు కవి కాదు.
సూచన ప్రాయంగా వెల్లడించిన భావాన్ని పట్టుకునే వాడు కవిత్వానికి సరయిన పాఠకుడు. సూచన ప్రాయంగా వెల్లడించడానికి తగిన భాషను విచక్షణతో సమకూర్చుకునే వాడు నిజమైన కవి. సౌభాగ్య కుమార మిశ్ర ఆ కోవకు చెందినవారు కాబట్టే అనువాదకుడి పని అంత సులువు కాదు. ఈ అరవై కవితల అనువాదానికి ఒక్క ఏడాది పట్టిందంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
భాష తెలియడమంటే నిఘంటువులో పదాలు, వ్యాకరణ సూత్రాలూ తెలియడం మాత్రమే కాదు. వాక్యవిన్యాస రహస్యాలు తెలియాలి, నుడికారంలోని సొగసులు తెలియాలి, పలుకులోని కాకువు తెలియాలి. అవి తెలియాలంటే పండితుడయితే సరిపోదు, జనవ్యవహారంలో నిత్యం ప్రవహించే పలుకుబడి వంటబట్టాలి. అందుకే విశ్వనాథ ‘లోకమ్ము వీడి రసమ్ము లేదు’ అన్నది. పోతన కన్నా గొప్పగా తెలుగులోకపు పలుకుబడిని పట్టుకొన్న కవి ఎవరున్నారు!