నీ కోసం!
నా గానం జ్వలితానలమైతే
నా ప్రాణం చలితానిలమైలే
కావి మాత్రమిస్తా నీకోసం
తావి తేనెమోస్తా నీకోసం
సిరులన్నీ ఒక మానికమైతే
విరులన్నీ ఒక కోరకమైతే
మానికాన్ని దాస్తా నీకోసం
కోరకాన్ని కోస్తా నీకోసం
జీవితమంతా ఒక క్షణమైతే
ప్రేమంతా ఒక చుంబనమైతే
ఆ క్షణాన్ని దాస్తా నీకోసం
చుంబనాన్ని దాస్తా నీకోసం
నిర్జన జగదాలయ శిథిలాల్లో
కాలే కాలపు కడ కొనవరకూ
నేను ఎదురుచూస్తా నీకోసం