అడ్డం
- నీట సంచరించే ప్రాణి మధ్యలో అక్షరం మార్చుకుంటే కంపము (5)
సమాధానం: జలదరము - ఉత్తరాంధ్ర యాస మధ్యలో వాయిద్యవిశేషం (3)
సమాధానం: మద్దెల - బుడుబుడుక్కలవాడి చేతిలో ఉండే వాయిద్యం (4)
సమాధానం: డుబుడక్క - పారే నది (3)
సమాధానం: నిమ్నగ - సరస్వతిని కలిస్తే ఆటకత్తె (3)
సమాధానం: వాణిని - మితంగా తినేవారి భోజనం (4)
సమాధానం: పిట్టమేత - కడుపుబ్బనవ్వించే తార (2)
సమాధానం: పుబ్బ - ఒక సంవత్సరం చివర్లతో వజ్రాయుధం (2)
సమాధానం: పవి - బట్టలు నేసేవాడు ఒక పురుగు (3)
సమాధానం: సాలీడు - ఏనుగు మాత్సర్యం మధ్యలో మా సింహం (5)
సమాధానం: కరిమాచలము - కడుపు మీద వేడి కలిగిన రెండు (5)
సమాధానం: కాకోదరము - తోటకూర పిశాచి (3)
సమాధానం: శాకిని - జీడి నిప్పు లాంటి మాట (5)
సమాధానం: అగ్నిముఖము - పులుపు మిడతా? కాదు, శేషుడు (6)
సమాధానం: పుడమితాలుపు - హిందీలో చిన్నకథ తిరగబడితే ఉడుము (3)
సమాధానం: నిహాక - గడి-నుడి మస్తిష్కానికి ఆహారమా? (2)
సమాధానం: మేత - జనసమూహంతో స్నేహం (2)
సమాధానం: జట్టు - సృష్టిలో ఇలాంటిది స్నేహమేనోయీ అన్నాడు కవి (4)
సమాధానం: తీయనిది - మబ్బు కమ్మే పద్యవిశేషము (3)
సమాధానం: కందము - కన్యా యమునల మధ్య పుట్టిన తర్కశాస్త్రము (3)
సమాధానం: న్యాయము - పాములవేటగాడు (4)
సమాధానం: పక్షిరాజు - గొప్పదైన వీణ (3)
సమాధానం: మహతి - సమయాన్ని కొలవడంలో లయ మారితే పందిరి వెయ్యొచ్చు (5)
సమాధానం: కాయమానము
నిలువు
- ఉదాహరణకి అమరావతి (4)
సమాధానం: రాజధాని - రాజు , మంత్రి, ఏనుగులు, గుర్రాలు, శకటాలు, సైన్యం ఉంటే యుద్ధం కాదు (5)
సమాధానం: చదరంగము - గాలి భోంచేసే ప్రాణి (2)
సమాధానం: పాము - ఈ ముఖర్జీ అంటే తామరతీగ (4)
సమాధానం: కమలిని - ఇంటిముందు చల్లిన పేడనీళ్ళతో కోతి కడుపులో వట్టివేరు (2)
సమాధానం: కలయంపి - మూడైనా, ఇరవైరెండైనా ఇదే (6)
సమాధానం: గాడుపుమేపరి - కస్తూరి గుడ్డునుండి పుట్టింది (3)
సమాధానం: అండజ - మనకి ఊపిరి అందకుండా చేసే రోగం (4)
సమాధానం: ఉబ్బసము - గాలిలో కలిసిపోయే వాద్యవిశేషం (5)
సమాధానం: వాయులీనము - తలా తోకాలేని చేదుపుచ్చకాయలో ఉన్ననడికట్టు (3)
సమాధానం: పటకా - కొండ మొదట్లో తవ్వుకుని పోతే కదులుతుంది (3)
సమాధానం: చలము - ఎటునుండి చూసినా వేలుముద్రే (3)
సమాధానం: నిశాని - చేతకాని కవికి అప్పుడప్పుడు తీరే తృప్తి (3)
సమాధానం: తనివి - బాగా వృద్ధుడైన వాడి తిథి (3)
సమాధానం: దశమి - బ్రాహ్మణులు ఉండే గ్రామం ముందు యుద్ధము (5)
సమాధానం: అగ్రహారము - వయసుమీద పడితే కనపడేది (3)
సమాధానం: ముడుత - శచీదేవి బంధించినది పులో, జమదగ్ని మునియో (4)
సమాధానం: పులోజమ - మహిషవాహనుడు ప్రాణనాథుడా? (6)
సమాధానం: లులాయధ్వజుడు - రాశి కూతురు దుర్గ (5)
సమాధానం: కన్యాకుమారి - కమలాప్తుడి పేరు పొందిన మణిపూస (4)
సమాధానం: దినమణి - తలచిక్కులు విప్పాలంటే ఇదుండాలి (4)
సమాధానం: కంకతిక - ఈ నవ్వు వెనుక బొంకు, అసత్యం దాగున్నాయి (4)
సమాధానం: ముసిముసి - జరిగినకథల్ని చెప్పే విద్య తెలిసిన కుబేరుని భార్య (3)
సమాధానం: యక్షిణి - మూడు కరిస్తే అయ్యే గాయం (2)
సమాధానం: కాటు