రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఒక మధ్యాహ్నం

రచన: బివివి ప్రసాద్
ఆగస్ట్ 2021

జీవితం తనతో తాను జీవిస్తోంది
కుదురుగా బొమ్మలతో ఆడుకొంటున్న పాపాయిలా

తనని తాను చూసుకొంటోంది
గాలికి ఎగురుతున్న పేపరు కొసల్లో
ఆమె వస్త్రాలపై వాలుతున్న ఎండలో

వింటోంది తనని తాను
టీవీలోంచి పొడిగా రాలుతున్న శబ్దాల్లో
వాహనాల తొందరలో, మనుషుల చప్పుళ్ళలో

పనిలేని గాలి తనని తానే తాకినట్టు
తీరికగా తనని తాకుతోంది జీవితం
ఆవు దూడని నాకినట్టు
ఎండ నాలుక చాపి లోకాన్ని నాకుతోంది

జీవించటం మినహా జీవితానికి మరేమీ తోచని
మాఘమాసపు మధ్యాహ్నపు వేళ
నదిలో మునగటమెలానో తెలియని నువ్వు
పైకి తేలి కాసిని అక్షరాలని పలవరిస్తావు

నిన్ను కుడుతూనే ఎర్రచీమలు చనిపోయినట్టు
జీవితాన్ని పట్టుకొంటూనే అక్షరాలు చనిపోతాయి

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • చూశావా
  • నీ ఏకాంతం
  • పునరుత్థానం
  • నువు
  • నువు కూడా

ఇటువంటివే…

  1. వాన కడిగిన మధ్యాహ్నం …
  2. లిఖిత: ఒక మధ్యాహ్నం
  3. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి
  4. మధ్యాహ్నం మాణిక్యం
  5. వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం

ఆగస్ట్ 2021 సంచికలో ...

  • D/o విజ్జి
  • ఆగస్ట్ 2021
  • ఊపిరి బొట్ల కానుక
  • ఊహల ఊట 3
  • ఒక మధ్యాహ్నం
  • కేతన ఆంధ్ర భాషాభూషణము-7
  • గడినుడి – 58
  • ఘోష
  • చల్ మోహనరంగా
  • తెగిన గొలుసులు
  • మూడిట్లో యేది?
  • వర్చువల్ రుతువు
  • విశ్వమహిళా నవల: 10అ. జేన్ ఆస్టిన్ నవలలు
  • శంభో తవారాధనం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 58
  • సాధన ఫలితం
  • సార్థకనామ వృత్తములు – 2
  • హరీన్ చటో
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఊపిరి బొట్ల కానుక
మూడిట్లో యేది?

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.