రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

లిఖిత: ఒక మధ్యాహ్నం

రచన: శ్రీకాంత్
మార్చి 2016

ఇలా రాస్తాను ముందుగా: ఈ మధ్యాహ్నం, రెపరెపలాడే ఒక తెలుపు వస్త్రం –

నువ్వు పరాకుగా ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు, నీ ఇంటి పెరట్లోనో
         రద్దీ వీధులలోనో ఒక హస్తం నిన్ను తాకి వెళ్ళి పోతుంది. అప్పుడే ఉతికి
ఆరవేసిన వస్త్రం గాలికి కదిలి ఇంత తడిని నీ ముఖాన చిమ్మినట్టు-

మరి అప్పుడు ఉలిక్కిపడి చూస్తావు, నీ లోకాల లోంచి బయటకు వచ్చి
         ఆకుపచ్చని చెట్ల కింది నీడలనీ, ఎక్కడో కూసే పక్షులనీ, ప్రవహించే గాలినీ-
ఎవరో అలికినట్టు ఉన్న ప్రపంచాన్నీ, కారణం ఏమీ లేకుండా నవ్వుతున్న

పసిపిల్లల వంటి మనుషులనీ, పూవుల్లా విచ్చుకునే వాళ్ళ మాటలనీ. మరి

ఇంతకాలమూ ఇంత కాంతీ ఇంత శాంతీ ఎందుకు కనపడలేదా అని నువ్వు
         అబ్బురపడుతుంటే, మబ్బులు చుట్టుకుంటున్న ఆకాశం కింద
తీగలపైనుంచి దుస్తులను తొలగిస్తూ ఆ అమ్మాయి అంటుంది కదా

“గాలికి ఆగడం లేదు ఆ తెల్లటి దుప్పటి – కాస్త తొలగించి లోపలి తీసుకు వద్దూ-”
         అని. మరే: ఇక నువ్వు చక్కగా మధ్యాహ్నాన్ని మడత పెట్టి, బుద్ధిగా
తన వెనుకగా లోపలి వెడతావు ఇలా వ్రాసుకుంటో:

– ఈ మధ్యాహ్నం – రెపరెపలాడని ఒక తెలుపు వస్త్రం కింద ఒదిగిన – ఒకమ్మాయీ
         ఇంకా నిండైన తన శరీర దీపమూనూ. ఇక బయట పడటం ఎలా
ఇక్కడ నుంచి? ఈ వాన లోకాలలోంచీ, తన పరిమళ కాలాలలోంచీ?

         ఈ ఎర్రని మబ్బులలోంచీ?

(10-10-2013)

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • లిఖిత: నా చీకటి
  • Madre: Poems on M/other
  • మూడు కవితలు
  • స్పృహ
  • నువ్వొక్కదానివే అక్కడ

ఇటువంటివే…

  1. లిఖిత: నా చీకటి
  2. లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –
  3. లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
  4. వాన కడిగిన మధ్యాహ్నం …
  5. ఒక మధ్యాహ్నం

మార్చి 2016 సంచికలో ...

  • ఉద్యోగపర్వము – రాయబారాలు
  • ఏం జీవితం!
  • కోటిగాని కతలు: శ్రీశైలంలో సన్యాసి
  • తత్వం…
  • నాకు నచ్చిన పద్యం: ఒక ఉన్మాది మనస్సినీవాలి
  • పద్యంలో ఉప్పెన
  • మరి వేరే ఎవరు?
  • మార్చ్ 2016
  • రాగలహరి: శివరంజని
  • లిఖిత: ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం
  • లిఖిత: ఒక మధ్యాహ్నం
  • లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
  • లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –
  • లిఖిత: నా చీకటి
  • వల్లూరి జగన్నాథరావు
  • వాసకసజ్జిక, విరహోత్కంఠిత
  • విజయనగరం జ్ఞాపకాలు – పట్రాయని సంగీతరావు
  • సత్సంగం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

లిఖిత: ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం
లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.