పండు అనుకుని ఆంజనేయుడు సూర్యుడి దగ్గరకి ఆకాశంలో ఎగిరి వెళ్ళేడు. మీదికి బాగా లేచేక బాగా వేడెక్కిపోతాడెమో! పొద్దున్నే అంత వేడిగా ఉండడేమోలే! కాస్త కాలితే కాలింది అనుకుందామంటే అందడు కదా! గాలికి పుట్టేడు కాబట్టి ఆంజనేయుడు ఎగిరివెళ్ళేడు. నేనెలా వెళ్తానూ? ఎగరలేనే! ఎలా సూరీడిని రాకుండా చెయ్యాలీ? తెల్లారకుండా ఎలా చెయ్యాలీ?
ఆగస్ట్ 2021
శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మిగారికి సాహిత్యాభివందనాలు!
నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, కమ్మని కలలకు రూపం వస్తే… అని ఒక సినీకవి ఆనాడు ఏసందర్భానికి రాశాడో కాని, ఆపాట ఈపూట ఈమాటలో మానోట పాడబడుతుందని ఆయన ఊహకు అందడం జరిగివుండదు. తెలుగు సాహిత్య అకాడెమీ కార్పొరేషన్ కో. & సన్స్ లిమిటెడ్‌కు శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మిగారిని ఓనరుగా రాష్ట్రప్రభుత్వం నియమించడం తెలుగు (సంస్కృతానికి కూడా) భాషకు, సాహిత్యానికి ఒక అనిదంపూర్వగౌరవంగా మేము భావించడం జరిగింది. సాహిత్యరంగేతర్ అని శ్రీలక్ష్మిగారి నియామకాన్ని కొందరు విమర్శించడాన్ని మేము ఖండిస్తున్నాం. అసలు తెలుగులో కవి, రచయితలు కాన్దెవరు? ఖర్వాటుడికి ఈర్పెనెందుకు? అని ప్రశ్నిస్తున్నాం. ప్రస్తుత సాహిత్యకారులు, కారకులలో ఎవరూ కూడా ఈ పదవికి అర్హులు కారని, ఇంతకుముందు ఓనరులైన కారుల వల్ల అకాడెమీ ఎక్కని ఎత్తులేమైనా అరాకొరా మిగిలివుంటే అవి ఎక్కించేయాలని, రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక నిజాలు నిజంగా ఇవీ అని మేము మనసుతో నమ్మడం జరిగింది. అచ్చతెలుగులో ఏదైనా చేయడం జరిపించగల శ్రీలక్ష్మిగారిని నియమించడం అనేది రాష్ట్రప్రభుత్వం తెలుగు లాంగ్వేజీ పట్ల ఎత్తూ లావూ తెలియని మమకారంతో, దానిని తెగబతికించాలన్న ఆవేదనతో, తెలుగు స్త్రీచెల్లెలి అభ్యుదయం కోసం ఒక అన్న తీసుకున్న నిర్ణయంగా కూడా గుర్తించి మేము సంతోషపడడం జరిగింది. శ్రీలక్ష్మిగారి భుజాలమీద, తల మీద, టేబుల్ మీద ఎంతో నమ్మకంతో పెట్టబడిన ఈ బాధ్యత బరువైనది. అయినా, ఎవరికీ అందనంత ఎత్తులో ఆండ్రోమెడా నక్షత్రమండలానికి ఇటు అంచుపై ఉన్న ప్రస్తుత తెలుగు సాహిత్యాన్ని అటు అంచుపైకి జరపడం చేయించగలరని వీరి శక్తిపై వంచన లేకుండా మేము నమ్మడం జరిగింది. ఇదే సమయంలో, 2పు లేదా 10ర, 5పు లేదా 25ర, 10పుస్తకాలు లేదా 50పైగా రచనలు స్వయంకృషితో, స్వార్థంతో (స్వ+అర్థంతో, స్వీయార్థంతో) ప్రచురించుకున్నవారికి వరుసగా బి.ఎ, ఎమ్.ఎ, డాక్టరేట్ గౌరవ పట్టాలతో పాటు, కులకవితాతిలక, మతకథాజాతిరత్న, సంప్రదాయసాహిత్యకాషాయసింధు, అభ్యుదయసాహిత్యఅరుణబిందు, అస్తిత్వసాహిత్యషాజహాన్, మైనారిటీసాహిత్యమోజెస్ వంటి బిరుదులు కూడా అకాడెమీ ఇవ్వాలన్న మా చిరకాల కోరికను శ్రీలక్ష్మిగారు తమ క్రియాశీలక పనిలో భాగంగా అమలు చేయడం జరిపించగలరని మాకు ఒక ఆశ కూడా పుట్టడం జరిగింది. ఎలాగైతే దేశస్థాయిలో వ్యక్తిస్వేఛ్ఛ, వాక్స్వాతంత్ర్యం వంటివి ప్రజ మంచి కోసం తుడిచిపెట్టబడుతున్నాయో అలాగే సాహిత్య మంచి కోసం, విమర్శ, విశ్లేషణ వంటివి కూడా సాహిత్య మినిమం రిక్వయిర్మెంట్లనుంచి తుడిచిపారేయాలని ఈ సందర్భంగా మేము బాధతో డిమాండ్ చేయడం జరుగుతోంది. తమ సరస్వతి సేవలో భాగంగా, శ్రీలక్ష్మిగారు ఫేస్బుక్, వాట్సాప్ వంటి వేదికలలో విస్తరించిన సాహిత్య కూటములు, తండాలు, గుంపులు, గ్రూపులు, సెల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషనులలో చేరాలని, అక్కడి సాహిత్య రాజకీ సేవలో తరించాలని మాకు తపన రావడం కూడా జరుగుతోంది. అంతే కాకుండా, జన్మతః ఉద్దండులై కూడా, అహర్నిశలు కథాకథనశైలీశిల్పాది లక్షణాలను మధిస్తూ సాధిస్తున్న తమ దైనందిన యూజ్లెస్ డ్రజరీకి దూరంగా, స్వల్పతెరపి కోసం మాసిక త్రైమాసిక వార్షికాలుగా, ఆహ్లాదకరమైన పరిసరాలలో వనభోజనాలతో, ఉల్లాసమైన తుళ్ళింతలతో ఉల్లాసంగా తుళ్ళిపడుతూ రెండురోజులు, పెళ్ళికిముందు సంగీత్ సెరిమొనీ వంటి ఎల్లలు లేని ప్రేమయికస్నేహసౌభ్రాతృసిస్టర్హుడ్ [ఇది తత్సంతద్బం తెలుగుపదం అని తెలియడం జరిగింది – సం.] వాతావరణంలో హర్షానందాతిరక్తతతో గడిపి, ఎన్నో మధుర యాదిలనూ తీపి మెమరీసునూ మనసులోను, ఇంకా ఎన్నో సెల్ఫీలనూ పికెఎఫ్సి తరహా గ్రూపు ఫోటోలనూ సెల్ఫోనులలోనూ నింపుకొని సేదతీరి, మండే మార్నింగుకల్లా మండే గుండెలతో తమ సామాజికబాధ్యతను భుజాలకెత్తుకుంటున్న ఫ్రంట్‌లైన్ సేవియర్స్ సాహిత్యకారసంగమాలడెక్లలో కూడా శ్రీలక్ష్మిగారు పేకముక్కల్లే కలిసిపోయి వాటిని మరింత దిగ్విజయం చేయాలని తెలుపుకుంటూ వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఇంటికి ఎవరెవరో వచ్చారు. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. బయటికేగాని లోపల ఎవరికీ డాలీని పట్టించుకోవాలని ఉన్నట్లు లేదు. నాకు సంతోషమేసింది, డాలీని నిజంగా ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ డాలీ కూడా ఎవరినీ పట్టించుకోవట్లేదు. ఆడుకొంటున్న పిల్లల దగ్గర ఉంది. ఎవరితో కలవకుండా అందరినీ పరిశీలనగా చూస్తున్నట్లు అనిపించింది. నిజంగానే డాలీ ప్రత్యేకమా?
స్త్రీపురుష సంబంధాల్లో భావోద్వేగాల కంటే ఇంగితజ్ఞానానికి, ప్రణయవేగం కంటే పరస్పరగౌరవానికి, ఆర్ధిక సమానతల కంటే బౌద్ధిక సమానతలకూ ప్రాధాన్యం ఇచ్చిన రచయిత్రి జేన్. ఆమె నవలల్లో స్త్రీపురుషులిద్దరూ విలువల్లో, జీవన విధానంలో, ప్రాపంచిక దృక్పథంలో సమవుజ్జీలుగా ఉన్నపుడే ‘ప్రేమ’ అనే పదానికి అర్థం ఉంటుంది.
“మీ ఈ తర్కం తప్పు. గురుదేవులు ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వద్దని చెప్పారు. ఎవరూ నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వడమే లేదు. భార్యని అడిగాను నేనెవర్ని? అని. ఆమె బదులిచ్చింది, నువ్వు నా భర్తవి. పెద్ద కొడుకుని అడిగాను నేనెవర్ని? అని వాడు బదులిచ్చాడు, నువ్వు నాన్నవి. ఆఫీసులో మా మేనేజర్ని అడిగాను సార్ నేనెవర్ని? అని. నువ్వు పిచ్చివాడివి, అని ఆయన జవాబు.”
కట్టిన పుట్టమేమి, కనకాంబరమా? కరితోలు! నెత్తిపై
బెట్టినదేమి, మత్త శిఖిపింఛమ? ఉమ్మెత గడ్డిపువ్వు, మై
దట్టిన దేమి, చందన కదంబరమా? తెలి బూది! నిన్ను జే
పట్టిన రాచ పట్టి చలువన్ పరమేశ్వరుడైతి ధూర్జటీ!
వెచ్చని సముద్రతలం మీద
చేపల చాపల కోసం
పడవ ప్రయాణం
లంగరేస్తే బట్ట నిలువదు
సహస్రాక్షుడి సహపంక్తి భోజనం
వేదాలు, హాలాహలము
మోసానికి మొదటి పాఠాలు
నీడల్ని పెకలించుకుని
శూన్యం ఊడ
ఇళ్ళల్లోకి ఎప్పుడు దిగబడిందో తెలీదు
బయటకి ఇళ్ళన్నీ ప్రశాంతంగా కనబడుతున్నా
లోపల గదులు గదులుగా శూన్యం
ఎప్పుడు విస్తరించిందో తెలీదు
బిడ్డకొచ్చిన కష్టంతో కుంగిపోయి వున్న కమలాంబాళ్ తనేం చేస్తున్నాననే స్పృహ లేకుండా, యింటి ముందుకెళ్ళి, ఆ మందులోడితో తన గోడు వెల్లబోసుకుంది. వాడు ఆమెకు కొంచెం విబూతి, కొన్ని మందు ఆకులు యిస్తూ చెప్పాడు. “విబూతి నుదుటిన రాయి. ఆకుపసురు చేతికి పూయి. కనికట్టు వేసినట్టు అంతా మాయమయిపోతుంది. కలత చెందకు అమ్మన్నీ, పళని స్వామి నిన్ను పరిరక్షిస్తాడు.”
తనని తాను చూసుకొంటోంది
గాలికి ఎగురుతున్న పేపరు కొసల్లో
ఆమె వస్త్రాలపై వాలుతున్న ఎండలో
వింటోంది తనని తాను
టీవీలోంచి పొడిగా రాలుతున్న శబ్దాల్లో
వాహనాల తొందరలో, మనుషుల చప్పుళ్ళలో
కళ్ళనో గుండెనో మెత్తగా తాకే క్షణాలైనా
సరదా సరాగాల చెలిమి సమయాలైనా
బంధాలు బంధనాల వంతెనపై
బహిరాంతర్లోకాల నడుమ
నిరంతర వాత్సల్య చలనాలవుతాయి
గుట్టలుగా రాలిపోతున్న క్షణాల మధ్య
బుట్టలుగా పోగుపడే జ్ఞాపకాల రాశులవుతాయి.
కట్టలు తెంచుకోలేని గొంతుకు
గంతలు కన్నీరు పెడుతుంటే
బరువును తూచలేని త్రాసుతో
విలువ తూలిపడుతుంటే
మళ్ళీ నల్ల కోట్ల
తెల్లని నటన
ఎర్రని వాదన
చక్కటి తెలుగు పదం ‘దీవెన’ అని కేతన వాడినా దీనిని సంస్కృతీకరించి ‘ఆశీరర్థకం’ అని వాడటం వల్ల తర్వాతి కాలంలో ఇంతకుముందే చెప్పినట్లు వ్యాకరణ పరిభాషలో క్లిష్టత ఏర్పడి సామాన్యులకు అర్థం కాకుండా పోయింది. తేలికైన మాటలలో, సులభమైన శైలిలో వ్యాకరణం ఎలా రాయవచ్చో కేతనను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది.
బడిలో చదువుకొనేటప్పుడు మనము ఉత్పలమాలకు గణములు భ/ర/న/భ/భ/ర/వ, శార్దూలవిక్రీడితమునకు గణములు మ/స/జ/స/త/త/గ, ఇలా చదువుకొని జ్ఞాపకములో పెట్టుకొనేవాళ్ళము. ఒక్కొక్కప్పుడు అనిపించేది మఱేదైనా సులభ మార్గము ఉంటే బాగుంటుందని. సార్థకనామ గణాక్షర వృత్తములలో ఈ ఇబ్బంది ఉండదు. గణముల పేరులు వృత్తముల పేరులో ఉంటాయి.
క్రితం సంచికలోని గడినుడి-57కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిది మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-57 సమాధానాలు.
ఈ పదిహేనేళ్ళలో సేకరించిన సమాచారం/పాటల-లో ‘చల్ మోహనరంగా’ అన్న నిడివైన పాట ఒకటి ముఖ్యమైనది. ఈ సంచికలో కేవలం ఆ పాట ఆధారంగా తయారయిన ఒక లఘు చిత్రం గురించిన వివరాలు చూద్దాం. దీన్ని వాలి సుబ్బారావు, పుష్పవల్లి పైన చిత్రీకరించారు.
శ్రీశ్రీ రాతలతో పరిచయం వున్నవారికి ‘హరీన్ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్స్పిరేషన్’ అన్న శ్రీశ్రీ మాట తెలుసు. శ్రీశ్రీ సప్తతి ఉత్సవాలు కాకినాడలో జరిపినప్పుడు హరీన్ చటోని ఆహ్వానించారు. ఈ సప్తతి సభకి ఆయనే అధ్యక్షుడు. మంచి నటుడు, గాయకుడు, హార్మోనియం బాగా వాయించేవాడు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.