గడినుడి-56 సమాధానాలు

అడ్డం

  1. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన పార్టీలు ఇది చేసుకుంటుంది. (2,5)
    సమాధానం: ఆత్మపరిశీలన
  2. ఇది చేస్తే పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. (4,3)
    సమాధానం: శివరాత్రిజాగారం
  3. గురవయ్య నేస్తుడు ఓ గృహస్థుడు (3)
    సమాధానం: గురస్తు
  4. రాజకీయ కెరటం (4)
    సమాధానం: ప్రభంజనం
  5. అపద్వారములో సంశయము (4)
    సమాధానం: ద్వాపరము
  6. అటునుండి వీచిన వడగాడ్పు (4)
    సమాధానం: లిగాడివే
  7. బూరకొమ్ము కోసం పాపం అడగవలసిందంతా అడిగినాడు. (4)
    సమాధానం: సింగినాదం
  8. డిప్రెషన్ చెంబు వీరిదే (3,6)
    సమాధానం: వేలూరిశివరామశాస్త్రి
  9. తాఖీదులో గౌరవం లేకుండా పోయింది. (2)
    సమాధానం: ముఖం
  10. ఆటంకములో ఆటంకము మొదట్లో చిన్నబోయింది (2)
    సమాధానం: అక
  11. రసాభాసంలో మెంతిపొడి (3)
    సమాధానం: సంభార
  12. మూడు స్వరాలతో సేతువు (3)
    సమాధానం: గనిమ
  13. అడ్డం 1లోని ఉత్తరువు (2)
    సమాధానం: ఆన
  14. బి.టి.నరసింహాచారి బజాయించిన పత్రిక (2)
    సమాధానం: ఢంకా
  15. కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌లో ఇటీవల ఇది జరిగింది. (5,4)
    సమాధానం: సుందరకాండపారాయణం
  16. ఏలూరి సుబ్బయ్యశాస్త్రిగారి తెలుగు సంతకం. (1,1,2)
    సమాధానం: ఏసుశాస్త్రి
  17. మొక్కలు నాటడమో, బాణం ఎక్కుపెట్టడమో ఏదైనా అటునుంచే. (4)
    సమాధానం: ణపరోఆ
  18. దంపుడు పాటలలోని కోరస్ (4)
    సమాధానం: సువ్వలాల
  19. చెప్పులు కుట్టే సూదితో భటిలుడి అతిశయము (4)
    సమాధానం: ఆరభటి
  20. కోయకుండా వున్నది వున్నట్టే కాల్చిన మాంసము (3)
    సమాధానం: బార్బెక్యూ
  21. రెండుసార్లు బొంకిన దరహాసము (7)
    సమాధానం: ముసిముసినగవు
  22. ఎంతైనా భర్తకు తోడబుట్టినవాడు కదా కొంచెం గౌరవమివ్వాలి (7)
    సమాధానం: బావమరదిగారు

నిలువు

  1. స్వీయపరిక్రమము (7)
    సమాధానం: ఆత్మప్రదక్షిణము
  2. వీరబొబ్బిలి సృష్టికర్త లేదా మహా భాష్యకారుడు. (4)
    సమాధానం: పతంజలి
  3. చెంగలించు (2)
    సమాధానం: నగు
  4. శిలువ నెక్కిన క్రీస్తు చెల్లించే పన్ను (2)
    సమాధానం: శిస్తు
  5. లోకగీతం (4)
    సమాధానం: జానపదం
  6. రంగము ముందుకురికిన టూరిజమ్ (3,4)
    సమాధానం: రంగముపర్యాటక
  7. అక్కినేని కుటుంబరావు నవల శీర్షాసనం వేసింది. (4)
    సమాధానం: నంగాణువే
  8. సమీక్షక సవ్యసాచి అని సి.నా.రె.చే బిరుదును పొందిన వారు (1,1,2)
    సమాధానం: ద్వానాశాస్త్రి
  9. చాటుపద్య మణిమంజరిని అందించిన పండితుడు. (3,6)
    సమాధానం: వేటూరిప్రభాకరశాస్త్రి
  10. అనంతపురం జిల్లా కథారచయితలలో ఎన్నదగినవాడు (5,4)
    సమాధానం: సింగమనేనినారాయణ
  11. వనరుహ లోచను రాణి కలిగిన శోభ (3)
    సమాధానం: హవణి
  12. ఖండవల్లి లక్ష్మీరంజనము గారి మందపిచ్చుక (3)
    సమాధానం: ఖంజన
  13. తెల్లాముదం చెట్టు (3)
    సమాధానం: అగూఢం
  14. కుందేటి కొమ్ము, గొడ్రాలి కొడుకు వంటిదే ఇది కూడా (3,4)
    సమాధానం: ఆకాశకుసుమము
  15. చుంబన క్రియకు దోహదపడే ఆర్బిక్యులారిస్ ఓరిస్ ఒక ___ .(3)
    సమాధానం: కండరం
  16. అమ్మను అమ్మననే పోతనగారి పద్యం (3,2,2)
    సమాధానం: కాటుకకంటినీరు
  17. రాయలసీమలోని తురాయి చెట్టు (4)
    సమాధానం: సుంకేసుల
  18. పంచప్రాణాలు కావు. క్రింది నుండి పైకి మరొకటి (4)
    సమాధానం: ణంప్రారోఆ
  19. ఏలా? ఈ ఆర్భాటము. చివరలతో పరిహాసం (4)
    సమాధానం: ఏలాటము
  20. ఋతువుల్లో శిశిరము (4)
    సమాధానం: ఆరవది
  21. ఉత్తరాంధ్రుల బాబు (2)
    సమాధానం: బావు
  22. అడ్డం 32లో నక్కిన దేశం (2)
    సమాధానం: క్యూబా