రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

డిసెంబర్ 2020

సాహిత్యం ఒక ఆయుధం కాదు సమాజాన్ని ఖండించడానికి; సాహిత్యం మన వాదభావరాజకీయావసరాలు తీర్చే, తీర్చగలిగే ఒక పనిముట్టు కాదు-ప్రత్యేకించి వాటిని వాడటం చేతకాని చేతులలో. అలా కావాలి అంటే ముందు సాహిత్యం పట్ల, సమాజం పట్ల, ఆ రెంటి సంబంధం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. అది లేనప్పుడు, ఎన్ని వాదాలను సమర్థిస్తూ ఎన్ని నమూనా కథలు రాసినా వాటి ఫలితం శూన్యం. సమాజం ఒక అభాసరూపి; బహుముఖీన. నిర్వచనాలకు లొంగనిది. పాఠకులతో రచయిత జరిపే సాహిత్య సంభాషణ వ్యక్తిగతమైనది. సామూహికమైనది కాదు. అందువల్ల రచయిత చేయగలిగింది, చేయవలసింది తమ రచనల ద్వారా తమ ఆలోచనలను పాఠకులకు స్పష్టంగా చేర్చగలగడం, పాఠకులు తమ భావాలకు, ఆలోచనలకు స్పష్టతనిచ్చుకోవడంలో సహాయపడడం మాత్రమే. ఇలా తమ సాహిత్యం ద్వారా పాఠకులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న రచయితలు తెలుగులో ప్రస్తుతం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. కోట్లమంది తెలుగువారిలో సాహిత్యం చదివేవారు వేలమందిలోను, విమర్శనాత్మకంగా చదవగలిగినవారు వందల్లో మాత్రమే ఉన్నారనడం సత్యదూరం కాని విషయం. పాఠకుల సాహిత్యాభిరుచి ఈ స్థితికి రావడానికి కారణం రచయితలే. సాహిత్యం ఇలానే ఉండాలి, ఈ వాదాలనే సమర్థించాలి, ఈ రకమైన ముగింపులే ఇవ్వాలి అని నిర్బంధించి, సమాజంలోని ఎన్నో రంగుల జీవితాలను కేవలం నలుపు-తెలుపులలో చూపే ప్రయత్నాలను మాత్రమే రచయితలు, పత్రికలు కూడా సమర్థించడం వల్లనే. అందువల్ల, పట్టుమని పదిమంది కూడా చదవని తమ సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తెస్తున్నామనుకోవడం, వారి సాహిత్యానికి అంత శక్తి ఉందనుకోవడం కేవలం రచయితల పగటికల మాత్రమే. వైయక్తికస్థాయిలోనైనా మార్పు తేగలిగినంత ప్రభావంతో తెలుగులో ఎవరూ రాయటంలేదు. కారణం? పాఠకులకంటే కూడా ముఖ్యంగా రచయితలకు సాహిత్యస్వభావం గురించి లేశమాత్రమైనా అవగాహన లేకపోవడం. తమచుట్టూ తమలాంటి ఒక పదిమందిని కూడగట్టుకొని తాము చూసిందే ప్రపంచమని, దాన్ని తాము మారుస్తున్నామని, ప్రశ్నిస్తున్నామని, తమ గొంతు వినిపిస్తున్నామని అపోహపడడం, అలా కాని సాహిత్యాన్ని నిందించడం, ఆపై సాహిత్యవ్యాసంగాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకొనడం. ఇదీ నేటి పరిస్థితి రచయితలది, కొండొకచో పత్రికలదీ. సాహిత్యం ద్వారా తమ వాదపక్షపాతాన్ని ప్రకటించడం, దాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నించడంలో ఏ తప్పూ లేదు. కాని, సాహిత్యం కేవలం మనకు నచ్చినట్టే ఉండాలని, మన ఇష్టాయిష్టాలను, మన అభిప్రాయాలను, అపోహలనూ మాత్రమే ప్రతిబింబించాలని అనుకోవడం, అలా కాని సాహిత్యం ప్రమాదమని, హేయమని దాడి చేయడం కేవలం మూర్ఖత్వం. మనం నచ్చని, మనకు నచ్చని ప్రజలు ప్రపంచంలో ఉన్నట్టే, మనకు నచ్చని కథాంశాలు, పాత్రలు, వాటి ప్రవర్తనలు ఉన్న కథలుంటాయి. కథను కథలాగానే చదవాలి. అర్థం చేసుకోవాలి. కథగానే విమర్శించాలి. ఈ సాహిత్య సంస్కారం ప్రస్తుతం పాఠకులకంటే రచయితలకు ఒక ముఖ్యావసరం కావడం బాధించే విషయం. రచయితలు ముందు తమ దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి. నిష్పాక్షికంగా తమచుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా పరిశీలించాలి. అవధులు లేని దాని విస్తీర్ణతను బహురూపత్వాన్ని గుర్తించాలి. సాహిత్యసంస్కారంతో పాటు, భిన్నాభిప్రాయాల పట్ల నిరసనను కూడా గౌరవంగా తెలపగలిగే సాంఘిక సంస్కారమూ అలవర్చుకోవాలి. ఈ తక్షణావసరాన్ని గుర్తించకుంటే తెలుగు సాహిత్యం, రచయితలు కొత్తలోతులకు దిగజారగలరేమో కాని కొత్త ఎత్తులు ఎక్కలేరు.

విశ్వ మహిళా నవల: 5. సోఫీ ల ఱోష్

రచన: సి. మృణాళిని
ఈ ఈ నొక్కి చదవండి...

సంక్లిష్టమైన ఇతివృత్తాన్ని లేఖల ద్వారా కథనం చేయడంలో రచయిత్రి అపారమైన ప్రతిభ చూపింది. ఉత్తరాలనగానే కథకు మాత్రమే ఉపకరిస్తాయనిపిస్తుంది కాని, ఇందులో ఉత్తరాల ద్వారా అప్పటి సమాజం, ఆర్థిక వ్యత్యాసాలు, స్త్రీలను, పేదలను ధనవంతులు దోచుకునే విధానాలు, వాటికి వ్యవస్థ ఆమోదాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.

0

అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ

రచన: సూరపరాజు రాధాకృష్ణమూర్తి

రామాయణం రంకు, భారతం బొంకు అని ఒక నానుడి. భారతం విషయం నిర్వివాదం, అది ధర్మరాజు బొంకు కనుక. కాని రామాయణం విషయంలో ఆ నానుడి యీనాడు ఏమాత్రము నిర్వివాదం కాదు. ఆనాడు కానీ యీనాడు కానీ అన్ని అనర్థాలకు మూలం కామం. అది లేంది సృష్టిలేదు. కనుక, దాన్ని అదుపులో ఉంచుకోవడమే పురుషార్థసాధన. ఏ కావ్యవిషయమైనా ఆ విషయమే, ప్రాచ్యంగాని పాశ్చాత్యంగాని.

5

గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్

రచన: దాసరి అమరేంద్ర
ఈ ఈ నొక్కి చదవండి...

ఎడారిలో పూలు చూడటమన్నది వింతగొలపడం ఎప్పుడో మానేసిందిగానీ ఆ సాయంత్రం స్టేడియం మెట్రో స్టేషన్నుంచి ఇంటికి నడుస్తోన్నపుడు కురిసి గొడుగు తెరిచేలా చేసిన పది నిమిషాల వాన మాత్రం నాకు అపురూపమైన అనుభవాన్ని మిగిల్చింది. పూలను వికసింపజేయడం మానవ సాధ్యమే కావచ్చుగానీ ఆరుబయట వాన కురిపించటానికి దేవతలే కరుణించాలి.

9

ఆమె నవ్వు

రచన: శ్రీసుధ మోదుగు

పెళ్ళానికైనా ఇవన్నీ చేశానా? ఆమెకైనా ఎందుకు చేయాలి? ఎప్పుడైనా పెళ్ళాంగా ఉందా? పూర్తి స్వాతంత్య్రం ఇచ్చా కదా! దేనిలో ఇచ్చా? అంతకంటే చేసేదేంటి, ఏం కావాలో అవి చేశా. ఆమెనేమన్నా అబ్యూజ్ చేశానా? ‘తిట్టడం కొట్టడం ఒక్కటే అబ్యూజా, ఇంట్లో ఇంకో మనిషి ఉందన్న ధ్యాస లేకుండా, తనతో బతికే మనిషిని పట్టించుకోని నిర్లక్ష్యం కంటే పెద్ద అబ్యూజ్ ఏముంటుంది?’ అనేది ఆమె.

10

క్షణికాలు

రచన: ధీరజ్ కశ్యప్

ఎందుకో తెలీదు, వర్షంలో తడవనంటే చాలు మనస్సు ఎండిపోతుంది. తేలికపాటి జల్లుల్లో, ఏటవాలు రోడ్ల పైన పారుతున్న నీటి మీద స్ట్రీట్ లైట్ల వెలుతురు. వెలిసిపోయిన తెరపై నిజజీవితపు సినిమాని చూస్తున్నట్టు ఉంటుంది నాకు. అది చూస్తూ నడవాలని ఉంటుంది, ఆడాలని ఉంటుంది. డాన్స్ తప్ప నన్ను నేను మర్చిపోయే పని ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఇన్ని గుర్తొచ్చిన ప్రాణం ఊపిరిని కోరుకుంది.

0

స్వేచ్ఛ

రచన: అనూరాధ నాదెళ్ళ

తల్లిదండ్రులు పిల్లల చదువులు, కెరియర్లు వరకూ ఎంతైనా శ్రమపడతారు. వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వయసులో ఆ పిల్లల్లో మానసికంగా ఎలాటి భావనలు కలుగుతున్నాయో, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారేమో అనేవాటి గురించి మాత్రం పట్టించుకోరు. అయినా బిడియపడకుండా, భయపడకుండా పిల్లలు తమ సమస్యను అమ్మ, నాన్నలతో చెప్పుకునే వాతావరణం ఎంతవరకు ఉంది?

4

సత్యం

రచన: నౌడూరి సూర్యనారాయణ మూర్తి
మూలం: Robert G Ingersoll
ఈ ఈ నొక్కి చదవండి...

కొత్త నిబంధనల గ్రంథం ప్రకారం, నమ్మిన వాళ్ళకి క్రీస్తు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానమే ఋజువుగా చలామణీ అవుతోంది. క్రీస్తు ఈ వాగ్దానాన్ని చేస్తున్న సమయంలో, ఆత్మశుద్ధిగల, నిజాయితీ పరులైన, స్వేచ్ఛగా ఆలోచించగల వ్యక్తుల నైతిక ప్రవర్తనని మరిచిపోయైనా ఉండాలి, నిర్లక్ష్యం చేసి అయినా ఉండాలి, లేదా తిరస్కారభావంతో చూసైనా ఉండాలి.

1

Timeline

రచన: కాశి రాజు

ఒక పాత ఒళ్ళుని మనుషుల ముందు పాతరేసి
తవ్వుకు తినమంటావు.

పెదాలను స్వాగతించే దమ్ము నీకెప్పుడూ రాదు.
పుట్టడం, పొందడం మాత్రమే
నిఘంటువులో ఉన్నాయని ధైర్యంగా అబద్దాలాడతావు.

0

కిక్

రచన: అనిల్ అట్లూరి

కిక్‌లు కొట్టీ కొట్టీ చెమటతో తడిచిపోయి ఉంది ఆ మాస్క్ వేసుకున్నవాడి షర్టు. అతని పక్కనే బిక్కమొహం వేసుకుని వాడి ఫ్రెండ్ నిలబడి ఉన్నాడు. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్ ఊదుతూ స్కూటర్‌ని పక్కకు లాగమని దానిమీద లాఠీ పెట్టి కొడుతూ వాళ్ళను బెదరగొడుతున్నాడు. రుక్కు పక్కనే నెమ్మదిగా కదులుతున్న కారు ఫ్రంట్ సీట్‌లో ఉన్న పెద్దాయనకి రుక్కు ఎందుకు అలా తెరలుతెరలుగా నవ్వుకుంటుందో అర్థం కాలేదు.

4

లీలా లీలా…

రచన: శ్రీనివాస్ బందా

దాసోహమన్నా ఋషిలా మూలిగినా
చేతులూ గుండె కవాటాలూ అన్నీ అప్పగించినా
మెలికలు తిరగటం ఆపేస్తానని
పేగులు మెలియబెడుతూ చెప్పే పచ్చి ఎర్రటి క్షణం

వింజామరల రేకలు రాలే తనం.
చాచిన నాలుకల్లోకి చేరే తనం.

2

1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 1

రచన: దిగవల్లి వేంకట శివరావు
ఈ ఈ నొక్కి చదవండి...

చందులాల్‌గారిని గూర్చి ఆ కాలమున రెండు అభిప్రాయములుండెను. ఆయన కుటిలరాజ్యతంత్రజ్ఞుడనియు, లంచగొండియనియు, దుబారాఖర్చు చేయువాడనియు, దుర్మార్గుడనియు, కొందరాయనను గూర్చి చెప్పుచుండిరి. మరికొందరాయన చాలా మంచివాడనియు, కార్యదక్షుడనియు, స్నేహపాత్రుడనియు, దాతయనియు పొగడుచుండిరి.

1

మరి, సరి, లాగా!

రచన: పాలపర్తి ఇంద్రాణి

సూర్యునిలాగా
తల ఎగరేస్తూ
నిప్పులు విసిరేది
చంద్రునిలాగా
నవ్వులు పేల్చే
మల్లెలు విరిసేది
మబ్బు తునకలా
తల వంచుకుని
సాగీపోయేది

0

మాయలాంటి మనం

రచన: కాళ్ళకూరి శైలజ

నేను, నువ్వు తలో చోటా నడుస్తుంటాం
నీ దారిలో నేనుంటానో లేనో
నా దారిలో, నాలో నీవుంటావు.
ఈ దేహంలో, ఇదే మనసుతో
బ్రతకలేక బ్రతుకుతూ నేను
నైరూప్య లోకంలో నీవు
నేనే నీ వైపు నడిచి వస్తున్న భ్రమలాంటి సత్యం.

1

చివరికి అంతా తెలిసిపోతుంది!

రచన: సాంబమూర్తి లండ

పుస్తకం తెరిచివున్నట్టే ఉంటుంది
రాసుకోవడానికే ఏమీ మిగలదు
గాలి పాడుతున్నట్టే ఉంటుంది
స్వరాలేవీ సరిగా ధ్వనించవు

అంకం తర్వాత అంకంగా సాగిన
ప్రయాణమంతా
కళ్ళముందు కదలాడుతుంటుంది

0

తెరుచుకోవు

రచన: పద్మావతి రాంభక్త

నాలుగు గోడల నడుమ
పోగుపడిన దుఃఖాన్ని
చెదరగొడదామని
ఒంటరితనపు కిటికీలు తెరచి
ఒక్క వెలుగుకిరణాన్నైనా
బహూకరిద్దామని
దిగులుపొగను ఊదేసి
నులివెచ్చని ఓదార్పవుదామని
సున్నితంగానే మునివేళ్ళను తాకిస్తాను.

5

కాపరుల జీవిత దర్పణం: కొండపొలం

రచన: శాంతిశ్రీ బెనర్జీ
ఈ ఈ నొక్కి చదవండి...

ఏభై రోజుల కొండపొలం అనుభవాన్ని రచయిత వర్ణించిన తీరు అద్వితీయం! ఉత్కంఠభరితంగా, ముందుముందు ఏమవుతుందోనన్న ఆరాటంతో చివరివరకు చదివిస్తుంది. గొర్రెకాపరుల అనుభవాల్ని ఇంత చక్కగా వర్ణించి ఈ 21వ శతాబ్దంలో కూడా గొర్రెకాపరుల జీవితాలు ఇలా ఉంటాయా అన్న ఆశ్చర్యంలో మనల్ని ముంచెత్తుతుందీ నవల.

4

కవిత్వం: దోహదక్రియలు

రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు

సంస్కృత సాహిత్య సంప్రదాయములపై ఆధారపడి తెలుగుకవులు తమ ప్రబంధాలలో పాటించిన కవిసమయములు, దోహదక్రియలు. సాలంకృతపద్మినీజాత్యంగనలు అకాలంలో తరులతాదులు పుష్పింపజేయుటకు చేయవలసిన క్రియలే దోహదక్రియలు. విజ్ఞానశాస్త్రముద్వారా సమర్థనీయము గాని ఈ సంప్రదాయమును పాటించి కవులు అత్యంతమనోరంజకమైన వర్ణనలు చేసినారు.

1

గడినుడి – 50

రచన: కొల్లూరు కోటేశ్వరరావు
ఈ ఈ నొక్కి చదవండి...

క్రితం సంచికలోని గడినుడి-49కి మొదటి ఇరవై రోజుల్లో పధ్నాలుగు మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-49 సమాధానాలు.

0

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 50

రచన: శ్రీశ్రీ
ఈ ఈ నొక్కి చదవండి...

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

1

ఆహ్వానం: అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం వెబినార్

రచన: కె. ఆశాజ్యోతి, కె. గీత

తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ. సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020), 2021 జనవరి 19, 20 & 21 తేదీలలో జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు.

0

ఆహ్వానం: CPB-SPB తెలుగు పోటీ

రచన: దాసుభాషితం
ఈ ఈ నొక్కి చదవండి...

పోటీ డిసెంబర్ 13, 2020 ఆదివారం పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహింపబడుతుంది. ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఫలితాలను డిసెంబర్ 20, 2020 ఆదివారం ప్రకటిస్తారు. పోటీకి నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 10, 2020.

0
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.