రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఆహ్వానం: CPB-SPB తెలుగు పోటీ

రచన: దాసుభాషితం
డిసెంబర్ 2020

తెలుగు సాహిత్యాన్ని మొబైల్ ఆప్ ద్వారా శ్రవణ రూపంలో అందించే దాసుభాషితం సంస్థ, తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి విద్యార్థులకు, ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో శ్రీ సి. పి. బ్రౌన్ జయంతిని పురస్కరించుకుని తెలుగు పోటీని నిర్వహించి ‘దాసుభాషితం CPB బహుమతి’ పేరిట, ₹1,00,000 నగదు బహుమతి అందిస్తూంది.

సెప్టెంబర్‌లో దివంగతులైన శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గౌరవార్ధం, ఈ సంవత్సరం నుంచి ఆ పోటీని ‘CPB-SPB తెలుగు పోటీ’గా నామకరణం చేసి, అదనంగా ఇంకొక లక్ష రూపాయలతో దాసుభాషితం SPB బహుమతిని ప్రకటించింది దాసుభాషితం సంస్థ.

ఈ మార్పును దాసుభాషితం వ్యవస్థాపకులు శ్రీ కొండూరు తులసీదాస్ ఇలా వివరించారు: “గత సంవత్సరం నిర్వహించిన తెలుగు పోటీకి బాలుగారు ఒక వీడియో సందేశం ద్వారా విద్యార్థులను, తెలుగు ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. ఈసారి బహుమతిని ఆయన చేతుల మీదుగా అందజేద్దామనుకున్నాము. కానీ అది సాధ్యపడదు. పిల్లల పోటీ నిర్వహిస్తున్నప్పుడు, పెద్దలు కూడా పోటీపై ఆసక్తి కనబరిచారు. ఈ పోటీని అందరికీ విస్తరించి, ఆయన పేరు మీద ఒక బహుమతి ద్వారా తెలుగు భాషపై స్పృహను పెంచడం, తెలుగు ల్లి ముద్దుబిడ్డయిన బాలుగారికి మేము ఇవ్వగల సరైన నివాళి అనిపించింది.”

పోటీలో తెలుగు భాష, సాహిత్యం, సమాజంపై 30 ప్రశ్నలుంటాయని, 2018, 2019లలో నిర్వహించిన పోటీల అనుభవంతో, నిపుణుల సహకారంతో ఈ సంవత్సరం ఇంకా ఆసక్తికరంగా పోటీని రూపొందిస్తున్నామని దాసుభాషితం CEO శ్రీ కొండూరు కిరణ్ కుమార్ అన్నారు.

పోటీ డిసెంబర్ 13, 2020 ఆదివారం పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహింపబడుతుంది. ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఫలితాలను డిసెంబర్ 20, 2020 ఆదివారం ప్రకటిస్తారు.

పోటీకి నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 10, 2020.

Telugu Potee అని 99520 29498కు వాట్సాప్ సందేశం పంపి గాని, www.dasubhashitam.com దర్శించి గాని పోటీకి నమోదు చేసుకోవచ్చు.

పోటీ వెబ్‌సైట్: https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఆహ్వానం: CPB-SPB తెలుగు పోటీ

ఇటువంటివే…

  1. తెలుగు కథల పోటీ
  2. తెలుగు జ్యోతి ఆహ్వానం
  3. తానా జ్ఞాపిక ‘తెలుగు పలుకు’ – రచనలకు ఆహ్వానం
  4. డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ ఆహ్వానం
  5. డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సుకు ఆహ్వానం

డిసెంబర్ 2020 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 1
  • Timeline
  • అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ
  • ఆమె నవ్వు
  • ఆహ్వానం: CPB-SPB తెలుగు పోటీ
  • ఆహ్వానం: అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం వెబినార్
  • కవిత్వం: దోహదక్రియలు
  • కాపరుల జీవిత దర్పణం: కొండపొలం
  • కిక్
  • క్షణికాలు
  • గడినుడి – 50
  • గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్
  • చివరికి అంతా తెలిసిపోతుంది!
  • డిసెంబర్ 2020
  • తెరుచుకోవు
  • మరి, సరి, లాగా!
  • మాయలాంటి మనం
  • లీలా లీలా…
  • విశ్వ మహిళా నవల: 5. సోఫీ ల ఱోష్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 50
  • సత్యం
  • స్వేచ్ఛ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నవంబర్ 2020
ఆహ్వానం: అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం వెబినార్

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.