గడినుడి – 49

క్రితం సంచికలోని గడినుడి-48కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:
  1. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  2. అగడి ప్రతిభ
  3. సుభద్ర వేదుల
  4. భమిడిపాటి సూర్యలక్ష్మి
  5. వైదేహి అక్కిపెద్ది
  6. తల్లాప్రగడ మధుసూదనరావు
  7. బయన కన్యాకుమారి
  8. పడమట సుబ్బలక్ష్మి
  9. బండారు పద్మ
  10. సరస్వతి పొన్నాడ
  11. రంగావఝులశారద
  12. రవిచంద్ర ఇనగంటి
  13. పాల వరప్రసాద్
  14. ముకుందుల బాలసుబ్రహ్మణ్యం
  15. అనిత శిష్ట్లా
  16. జిబిటి సుందరి
  17. పొబ్బా ఉమామహేశ్వరి
  18. నీరజ కరణం
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-48 సమాధానాలు.

సూచనలు

spb
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
(1946-2020)

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఈ సంచికలోని గడినుడి ఈ మధ్యే పరమపదించిన ప్రముఖ గాయకుడు, తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయుడు అయిన ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి స్మృతికి నివాళి.


గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. బొట్టూ, కాటుక పెట్టిన చిలకమ్మ, బాలు గారు పాట కట్టాకా ఇది కట్టక తప్పదుగా (7)
  2. మందారాలు, గులాబీలూ, వానకారు సంపెంగలు… కృష్ణశాస్త్రిగారి రంగులమాయలు (7)
  3. గోము గోపెమ్మైతే ఇదే వ్రేపల్లె కదా (2)
  4. పుట్టేవాడికి చోటు వెతుకుతూ అటూ ఇటూ అయిన గీతరచయిత ఇంటిపేరు (3)
  5. అటుగావచ్చినా జాతీయ పురస్కారపు రచయిత ఇంటిపేరు (3)
  6. పదహారేళ్ళవయసులో పంటచేలో నవ్వినది (2)
  7. చెల్లాచెదురైన సినారె గారి పడతిబొమ్మ మందిరం (4)
  8. చుక్కల్లే తోచిన ప్రేయసికోసం బాలూ మహేంద్ర చేసినది (4)
  9. శంకరాభరణం, లాయర్ సుహాసిని, టాప్ హీరో, త్యాగరాజస్వామి ఏనుగు (3)
  10. ఇంకా ఇవి తెరవని చిన్నిపాపకి స్వాగతం చెప్పడానికి గూడుపుఠాణీ అక్కర్లేదు (2)
  11. ప్రేమకు లేదని ఆత్రేయ గారు చెప్పినది మొదలు కోల్పోయి అటుతిరిగింది (2)
  12. మాస్టారి పాట, బాలుగారి మాట, ఈ టీవి ఇంట (6)
  13. మనసారా గొంతు విప్పి మా టీవీ లోబాలుగారు చెప్పినమాట (6)
  14. జాతకరత్న గాడిదని చూపించమన్నది (2)
  15. తన తొలి సినిమా పేరున్న బాలుగారి పాట ఉన్న సినిమా (2)
  16. అన్నయ్యకు చిట్టిచెల్లెలు ఎప్పటికీ ఈ పాపే (2)
  17. అమరధామంలో నది ఇలా ఘోషించింది (2)
  18. దేవులపల్లి వారడిగిన క్షేమం, కాస్త అటూ ఇటూగా (4)
  19. జీవితంలో వసంతం కావాలంటే అటుగా తిరిగి వెళ్ళాల్సిన చల్లని చోటు (4)
  20. వీచే ప్రతిగాలి పైరగాలైతే వసంతాలు కురిసేది (2)
  21. బాలుగారితో కలిసి బాల యేసు పాటలు పాడిన గీత రచయిత ఇంటిపేరు (3)
  22. అనువాద సినీ గీతాల బ్రహ్మ (3)
  23. కొత్త దేవదాసుకు చెదిరినది (2)
  24. ధూళిపాళనోట బాలూ పాటా? ఉండమ్మా ఆలోచించనీ (7)
  25. మొదటి పాట కనక మొదలు కోల్పోయి అటు తిరిగింది (7)

నిలువు

  1. కళ్ళముందు కటికనిజం కనపడడానికి శాస్త్రిగారి పాఠం, చివరలోపించింది (7)
  2. యురేకా! అనగానే నవ్విన మల్లె _ _ (2)
  3. దేవత సింగారం వేటూరి కలంలోనూ, బాలూ గళంలోనూ అందమే (5)
  4. కవిత పొంగి పారాలంటే ఇక్కడ నీవుండాలి (5)
  5. అటునుంచైనా అదే ముద్దుపేరు (2)
  6. అటుగా మోగిన చెల్లెలికాపురపు సవ్వడులు (7)
  7. సగము మిగిలిన వాని మొగము నగవైపోయే (6)
  8. ఎప్పటికీ తప్పని ఆకలిరాజ్యపు తిప్పలు అటుగా (3)
  9. హరిలోరంగ _ _ (2)
  10. గురువుగారి స్వరానికి బాలు పాడిన కథ (2)
  11. _ _ మరిచిపోవాలని, అన్ని విడిచి వెళ్ళాలని (2)
  12. రజనీకాంత్ 50 వ చిత్రంలోని పాటకు పల్లవి (2)
  13. తానమే తనువుగా గలవాడు పరాయివాడా? (7)
  14. అణువణువునా అద్భుతమే, ఆనాదానికే జాతీయ పురస్కారం (6)
  15. ఎలా అడిగినా వినగానె గోకులం పక్కుమనే ప్రశ్నే (7)
  16. బాలు పాటలో ఎప్పుడూ తప్పనిది తిరగబడింది (2)
  17. మావిచిగురుతిన్న గండుకోయిల శుభం పలికినదెవరికి? (2)
  18. విరిజల్లు కమ్మని బాలుగారడిగిన పువ్వుమొదలు (2)
  19. కళాతపస్వి మువ్వగోపాలుడిపాట మొదలు, లెక్క కొద్దిగా తగ్గింది (2)
  20. చలంగారి కథ వినాలంటే ఈయన రావాల్సిందే (2)
  21. జేమ్స్ తంగదురై కొడుకు స్వప్నాలు ఫలించక ఏకవచనమైపోయింది (5)
  22. రాజన్, నాగేంద్ర, బాలు, సుశీల నాలుగు స్థంభాలది రాగమో? (5)
  23. తొలి రెండు అక్షరాలు లేని ఆంధ్ర జాతి అయోధ్యాపురి (2)
  24. బాలు పలికిన ఎన్నెన్నో తెలియని మమతమూటని ఒకసారి పిలవండి (2)
  25. తాటి చెట్టు తల్లికాకపోతే ఇల్లుకానిచెట్టేమిటి?తాగినోడు మాటాడితే తిరగబడింది మరి (2)